కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ వార్నింగ్
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మళ్లీ తమిళ జపాన్ని తెరమీదకు తెచ్చారు. జాతీయ రహదారులపై హిందీ సైన్ బోర్డులను తమిళంలోకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మరో ఉద్యమం తప్పదని స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. హిందీ ప్రాధాన్యత ఇచ్చి తమిళ భాషను తక్కువ చేసి చూస్తే సహించేది లేదని ఆయన అన్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. బలవంతంగా తమపై హిందీ రుద్దితే ఊరుకునేది లేదన్నారు.
కాగా హిందీ పట్ల తమిళనాడు ఇంకా తన వ్యతిరేకతను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దేశమంతా త్రిభాషా సూత్రం అమలు చేయాలన్న కేంద్రం ఉత్తర్వులను అమలు చేయని ఏకైక రాష్ట్రం తమిళనాడు. అక్కడ హిందీ భాషను నేర్పించరు. అంతేకాకుండా ఆకాశవాణిలో వచ్చే హిందీ వార్తలను మిగిలిన కేంద్రాలన్నీ ప్రసారం చేస్తాయి కానీ తమిళనాడులో మాత్రం ప్రసారం కావు.