Stalin
-
ఉదయనిధికి ప్రమోషన్ అందుకే: స్టాలిన్ వివరణ
చెన్నై: తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే ఉదయనిధికి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని క్లారిటీ ఇచ్చారు. క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ప్రశంసలు కురిపించారు. డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్ సూచించారు. ఆదివారం(సెప్టెంబర్29) డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా ప్లానింగ్, డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: సిద్ధూపై ఈడీ కేసు -
నిర్మలాసీతారామన్‌పై స్టాలిన్ మండిపాటు
చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఆమెది అహంకారమని,ఆమె తీరు సరిగా లేదని విమర్శించారు. ఇటీవల కోయంబత్తూరులో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ఓ రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్ నిర్మలాసీతారామన్‌ను ప్రశ్నించారు.జీఎస్టీలోని లోపాలను ఎత్తి చూపేందుకు బన్, క్రీమ్, క్రీమ్ బన్‌లపై విధిస్తున్న జీఎస్టీ పన్నును సోదాహరణంగా వివరించారు.ఇది అక్కడ సమావేశంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. దీంతో అక్కడున్నవారంతా విరగబడి నవ్వారు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన ప్రైవేట్ భేటీలో శ్రీనివాసన్ నిర్మలకు క్షమాపణ చెబుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతో సహా దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు నిర్మలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి.. ఆకాశవీధిలో రోజు 4.3లక్షల మంది -
ఉదయనిధి ప్రమోషన్‌పై స్టాలిన్ క్లారిటీ
చెన్నై: తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు డిప్యూటీ సీఎం చేసేందుకు ఇంకా టైమ్ రాలేదని సీఎం స్టాలిన్ అన్నారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీలో డిమాండ్ మాత్రం గట్టిగా ఉందని చెప్పారు. ఈ విషయమై సోమవారం(ఆగస్టు5) స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధికి ప్రమోషన్ ఇచ్చేందుకు సరైన సమయం రావాల్సి ఉందన్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంలో క్రీడా, యువజన సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాల అమలు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
డీఎంకే మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..
సాక్షి, చైన్నె: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా డీఎంకే మెగా కూటమి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలకు పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 19 స్థానాలను అధికార డీఎంకే కేటాయించింది. మిగిలిన 21 స్థానాలలో తమ అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా బుధవారం తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాను సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కనిమొళి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను స్టాలిన్ మీడియాకు వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలే కాదు. అధికారంలోకి వచ్చినానంతరం ఇవ్వని వాగ్దానాలనూ కూడా అమలు చేసిన ఘనత ద్రవిడ మోడల్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకునే తమ మేనిఫెస్టోను రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో రూపొందించామని వివరించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు ● రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే విధంగా చట్ట సవరణకు తొలి ప్రాధాన్యత. ● అనవసరంగా ఉన్న గవర్నర్ పదవి వ్యవహారంలో మార్పులు, సీఎం సలహాలను తప్పని సరిగా స్వీకరించాలనే నిబంధన రూపకల్పనకు కృషి. గవర్నర్‌కు ప్రత్యేక అధికారులు కల్పించే సెక్షన్ 361 రద్దు. ● చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పనకు ప్రణాళిక. ● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలన్నీ తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో నిర్వహణ. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో తమిళం తప్పనిసరి. అన్ని భాషల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. జాతీయ గ్రంథంగా తిరుక్కురల్ ప్రకటన. ● శ్రీలంక నుంచి తమిళనాడులోకి వచ్చి స్థిరపడ్డ తమిళులకు భారత పౌరసత్వం కేటాయింపు. ● రైల్వే శాఖకు ప్రత్యేక బడ్జెట్, చైన్నెలో మూడవ అతిపెద్ద రైల్వే టెర్మినల్ ఏర్పాటు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులలో అల్పాహార పథకం అమలు చేసేందుకు చర్యలు. ● దేశవ్యాప్తంగా గృహిణులకు నెలకు రూ. 1000 నగదు పంపిణీ పథకం అమలు. ● నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు. అన్ని రాష్ట్రాలలో సీఎంల నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి మండలి ఏర్పాటు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం పంపిణీ. ● బీజేపీ తీసుకొచ్చిన కొన్ని అసంబద్ధ కార్మిక చట్టాలు, ఇతర చట్టాలు, పథకాలు రద్దు, మరికొన్నింటిపై పునర్ సమీక్ష. జమిలీ ఎన్నికల రద్దు. జాతీయ రహదారులలో టోల్గేట్ల ఎత్తివేత. బ్యాంక్‌లలో కనీస నగదు నిల్వ నిబంధన ఎత్తివేత. సీఏఏ చట్టం రద్దు. దేశవ్యాప్తంగా కులగణన. రైతులకు మద్దతు ధర కల్పన, దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యారుణాల రద్దు. కొత్తగా రూ. 4 లక్షలు రుణాల పంపిణీ. తమిళనాడులో జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు. విమాన చార్జీల క్రమబద్ధీకరణ. ● ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 500, లీటరు పెట్రోల్ రూ. 75, లీటరు డీజిల్ ధర రూ. 65గా నిర్ణయం. ఉపాధి హామీ పథకం 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు. రోజు వారీ కూలి రూ. 400కు పెంపు. 21 మంది అభ్యర్థుల ప్రకటన మేనిఫెస్టో విడుదల తర్వాత తమ పార్టీ పోటీ చేసే స్థానాలలో 21 మంది అభ్యర్థుల జాబితాను స్టాలిన్ ప్రకటించారు. ఇందులో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. మరో 11 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎంపీలలో ధర్మపురి సెంథిల్‌కుమార్, కళ్లకురిచ్చి సీనియర్ నేత పొన్ముడి వారసుడు గౌతం శిఖామణి, సేలం పార్తీబన్, తంజావూరు నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యం, తెన్కాశి ధనుష్‌కుమార్, పొల్లాచ్చి షణ్ముగసుందరం తదితరులకు ఈసారి సీటు కేటాయించలేదు. పొన్ముడి వారసుడిపై కోర్టులలో కేసులు ఉండటం ఓ కారణమైనా, నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యంకు సీటు ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. తంజావూరులో పోటీ చేసే మురసోలి అనే అభ్యర్థి పేరును పలుమార్లు సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈరోడ్‌లో కొత్తగా పోటీ చేస్తున్న కె. ప్రకాష్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్నిహితుడు కాగా, పెరంబలూరులో పోటీ చేయనున్న అరుణ్ నెహ్రూ, సీనియర్ నేత, మంత్రి కేఎన్ నెహ్రూ వారసుడు కావడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి సెల్వ గణపతికి ఈసారి సేలం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా 21 మంది అభ్యర్థుల్లో 19 మంది పట్టభద్రులు, ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. -
‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్ యాత్ర’ నిర్వహించింది. డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. కాగా డీఎంకే సారధ్యలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్‌ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్‌ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. -
ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్ఎన్ఎమ్ పార్టీ చీఫ్ కమల్‌హాసన్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్‌కు చెందిన డీఎంకే పార్టీతో కమల్‌హాసన్ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్‌హాసన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఇదీ చదవండి.. గగన్‌యాన్‌పై ఇస్రో కీలక అప్డేట్ -
TN: తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ఆర్.ఎన్ రవి అసెంబ్లీకి వచ్చారు. ప్రారంభించిన కొద్ది నిమిషాలకే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం స్టాలిన్, స్పీకర్, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పి అనంతరం తాను ప్రసంగం చదవడం లేదని తెలిపారు. ప్రసంగంలోని అంశాలు సరిగా లేవని, ప్రసంగం ప్రారంభించే ముందు, పూర్తయిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఇందుకే తాను ప్రసంగం చదవ లేదని గవర్నర్ తెలిపారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7 — ANI (@ANI) February 12, 2024 ప్రసంగంలోని చాలా అంశాలపై తనకు అభ్యంతరాలున్నాయని గవర్నర్ చెప్పారు. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబింబించడం లేదని గవర్నర్ చెప్పారు. ఇటీవలే కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ప్రసంగంలోని కేవలం లాస్ట్ పేరా చదవి గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. ఇదీ చదవండి.. నేడు బీహార్‌లో ఏం జరగనుంది.. ఎవరి బలం ఎంత -
సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ.1000ని పండగ కానుకగా అందజేశారు. దీంతోపాటు చెరకు గడ, కిలో ముడి బియ్యం, చెక్కర, చీర, దోతీలను పంపిణీ చేశారు. వీరితో పాటు తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా ఈ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అళ్వార్‌పేటలో ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Tamil Nadu Chief Minister MK Stalin inaugurates state government's Pongal gift hamper scheme in Chennai; also distributes gift hampers to people pic.twitter.com/kC7AlW82oF — ANI (@ANI) January 9, 2023 రాష్ట్రంలో ఉన్న 2,19,71,113 మంది రేషన్ కార్డుదారులు, శిబిరాల్లో ఉన్న శ్రీలంక తమిళ శరణార్థులకు దాదాపు రూ. 2,436.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్రాంతి కానుకను అందజేశారు. ఈ పంపిణీలో జనం రద్దీని నివారించేందుకు టోకెన్ విధానాన్ని అమలుపరిచారు. 1.77 కోట్ల దోతి, చీరలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం -
విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి
-
నా వ్యాఖ్యలను బీజేపీ తప్పుదారి పట్టించింది: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తన వ్యాఖ్యలను పెద్దవిగా చేసి దేశమంతా విస్తరించేలా చేశారని ఆరోపించారు. మారణహోమానికి పిలుపునిచ్చానని పేర్కొంటూ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలను మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్.. “నేను మారణహోమానికి పిలుపునిచ్చానని మోదీ అన్నారు. కానీ నేను చెప్పని విషయాలను ఆయన అన్నారు. నేను ఒక సమావేశంలో పాల్గొని మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాను. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంలో వివక్షను రూపుమాపాలి అని మాత్రమే నేను మాట్లాడాను. కానీ దాన్ని వక్రీకరించి పెద్దది చేసి యావత్ భారతదేశం నా గురించి మాట్లాడుకునేలా చేశారు." అని ఉదయనిధి అన్నారు. “ఓ సాధువు నా తలపై 5-10 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టులపై నమ్మకం ఉంది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు. క్షమాపణ చెప్పలేనని చెప్పాను. నేను స్టాలిన్ కొడుకుని, కలైంజ్ఞర్ మనవడిని, నేను వారి భావజాలాన్ని కొనసాగిస్తాను." అని ఉదయనిధి తెలిపారు. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’.. ‘సనాతన నిర్మూలన’ పేరుతో సెప్టెంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కరోనాతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇదీ చదవండి: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి?
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయ నిధి స్టాలిన్ సోమవారం 46వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇదే సమయంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే నినాదం తెర మీదకు వచ్చింది. డిసెంబరులో జరిగే యువజన మహానాడు అనంతరం ఆయనకు ప్రమోషన్ ఖాయం అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ జన్మదినాన్ని డీఎంకే యువజన విభాగం వాడవాడలా సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయ నిధి అందుకున్నారు. అదే సమయంలో డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయ నిధి కోసం ఎంగల్ అన్న ( మా అన్న)పేరిట ఓ పాటల సీడీని సిద్ధం చేసింది. అలాగే ఉదయ నిధి నటించి విజయవంతమైన మామన్నన్ చిత్రంలోని ఓ పాట ఆధారంగా మరో ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. వీటిని మంత్రి అన్బిల్ మహేశ్ విడుదల చేశారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయ నిధి సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. తండ్రి బాటలోనే.. తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి వారసుడిగా డీఎంకే రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. తండ్రి సీఎంగా ఉన్న కాలంలో ఆయన డిప్యూటీ సీఎంగా అధికార వ్యవహారాల్లో దూసుకెళ్లారు. తండ్రి మరణంతో డీఎంకే పగ్గాలు చేపట్టి ప్రస్తుతం సీఎంగా ద్రవిడ మోడల్ పాలన నినాదంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తన వారసుడు ఉదయ నిధి స్టాలిన్‌ను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సినీ నటుడిగా డీఎంకే రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి ప్రజాకర్షణలో ఫలితం సాధించారు. 2021 లోక్ సభ ఎన్నికలలో తండ్రి స్టాలిన్‌తో సమానంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లడమే కాదు, చేపాక్కం ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్నారు. ఏడాది తర్వాత ఆయనకు మంత్రి పదవి అప్పగించాలని పలువురు సినీయర్లు నినాదించడంతో క్రీడల శాఖను కేటాయించారు. ప్రస్తుతం డిప్యూటీ నినాదం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ ఉంటుందా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన
చెన్నై: సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని డీఎంకే చీఫ్ స్టాలిన్ పార్టీ నేతలకు తెలిపారు. బీజేపీ అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు. 'సనాతన ధర్మం అంశంపైనే తరచూ మాట్లాడటానికి కేంద్ర మంత్రులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ లోపాల నుంచి ప్రజలను దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు. నేతలందరూ ఈ విశయాన్ని గమనించి సనాతన అంశానికి దూరంగా ఉండాలి.' అని స్టాలిన్ తమ పార్టీ వర్కర్లకు తెలిపారు. మతపరమైన, నిరంకుశ బీజేపీ పాలనను అంతం చేయడానికి నడుం బిగించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని, హక్కులను కాపాడాలని సూచించారు. కేంద్ర పథకాలలోని అమలులో లోపాలపై స్పందించాలని చెప్పారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో మతపరమైన వ్యాఖ్యలకు తావివ్వకూడదని సూచించారు. ఇదీ చదవండి: Hindi Diwas: దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు? -
అధికారం కోల్పోయినా పర్వాలేదు
సాక్షి, చైన్నె : సనాతన ధర్మం నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినా పర్వాలేదని క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వివరాలు.. సనాతన ధర్మం గురించి ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు, కేసుల మోత మోగుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం రాయపేటలో ఉదయనిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్, పెరియార్, అన్నా వంటి మహానేతలు సనాతనం గురించి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలను తలదన్నే విధంగా తానేదో గొప్పగా మాట్లాడేసినట్టు కొందరు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మం వ్యవహారంలో పదవి నుంచి తప్పించినా, తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినా తగ్గేది లేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారం కోల్పోయినా బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ సిద్ధాంతం ద్రవిడ మార్గం అని అధికారం తమకు ముఖ్యం కాదని, సిద్ధాంతాలే కీలకం అని వ్యాఖ్యలు చేశారు. -
అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..
బెంగళూరు: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఇండియా కూటమిని రాజకీయంగా విమర్శలకు గురిచేస్తున్న క్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. చొక్కా తీసేయాలని అడిగినందుకు కేరళలోని దేవాలయానికి తాను వెళ్లలేదని చెప్పారు. ' ఒకానొకసారి కేరళలో ఓ దేవాలయానికి వెళ్లాను. ఆలయంలోకి ప్రవేశించాలంటే తాను చొక్కా తీసేయాలని కోరారు. నేను దేవాలయంలోకి వెళ్లడమే మానేశాను. గుడి బయట నుంచే ప్రార్థించాలని వారు నాకు చెప్పారు. నన్ను ఒక్కడినే చొక్కా తీసేయాలని కోరారు తప్పా అక్కడ ఉన్న ఎవ్వరినీ అడగలేదు. దేవుడి ముందు ఇది చాలా అమానవీయమైన పద్ధతి. భగవంతునికి అందరూ సమానమే.' అని సిద్ధరామయ్య చెప్పారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న నారాయణ గురు 169వ జన్మదిన ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 'Didn't enter temple when...': #Siddaramaiah sparks controversy amid #Sanatana row | @sagayrajp https://t.co/UuDEVMPAsd — IndiaToday (@IndiaToday) September 7, 2023 దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయంలోకి ప్రవేశించే ముందు చొక్కా తీసివేయడం ఆనవాయితీగా వస్తోంది. శరీరంపై చొక్కాకు బదులు భుజాల మీదుగా అంగవస్త్రాన్ని ధరిస్తారు. సాంప్రదాయంగా ఈ విధానం అమలులో ఉంది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనం వీడిన స్టాలిన్.... మోదీతో సహా బీజేపీ నేతలకు కౌంటర్ -
పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి : సివిల్స్ విజేతలతో సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలే మన బాసులు, వారికోసం నిరంతరం అంకిత భావం, బాధ్యతతో పని చేయాలి’’ అని సివిల్ సర్వీసు ఉత్తీర్ణులకు సీఎం స్టాలిన్ సూచించారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 33 మంది అభ్యర్థులను గురువారం ఆయన అభినందించారు. అనంతరం ఘనంగా సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వివరాలు.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్(యూపీఎస్సీ) పరీక్షలలో రాణించాలన్న తపనతో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులలో 33 మంది 2022 సంవత్సరం సివిల్ సర్వీసు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. మంచి ర్యాంకులతో వివిధ పోస్టులను చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. వీరందరినీ గురువారం సచివాలయంలో సీఎం స్టాలిన్ కలిశారు. వారిని అభినందించి, సత్కరించడంతోపాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, తమిళనాడు గర్వపడే విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నారని అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న లక్షలాది మందిలో విజయాన్ని దక్కించుకున్న అభ్యర్థుల్లో అనేక మంది గ్రామీణులు, మధ్య తరగతి కుటుంబాల వారు కావడం మరింత ఆనందం కలిగిస్తోందన్నారు. తల్లిదండ్రులను మరవొద్దు.. పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేయడంలో తల్లిదండ్రుల శ్రమ ఎంతో ఉందని, ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకు రావడంతో తల్లిదండ్రుల పాత్ర మరవలేనిదిగా పేర్కొన్నారు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు, బాధ్యత గల పోస్టుల్లో చేరినాంతరం తల్లిదండ్రులను మరవొద్దని, గ్రామీణ ప్రజల జీవితాలలో వెలుగు నింపే విధంగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. ప్రజలే బాసులు అని, వారికి అంకిత భావం, బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను దరి చేర్చాలని సూచించారు. గొప్ప అధికారులుగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే విధంగా పయనం ఉండాలన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సెప్టెంబరు 15న అమలు కాబోతున్న కలైంజ్ఞర్ మహిళ హక్కు పథకం (రూ.1000 నగదు పంపిణీ) మీదే ఉందన్నారు. ఎందుకంటే ఇది మహిళలకు ఆర్థిక బలానికి ఉపయోగకరంగా ఉండబోయే పథకం అవని వివరించారు. ఈ పథకం అమలు పూర్తి బాధ్యతలు జిల్లాల కలెక్టర్ల భుజాన వేశానని గుర్తు చేస్తూ, అప్పగించిన పనిని ప్రజలి జిల్లాలో సక్రమంగా నిర్వర్తిస్తారనే నమ్మకం ఉందన్నారు. పేద ప్రజల అవసరాలను తీర్చడం, పేద ప్రజల పట్ల దయ చూపించడం ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ సేవ చేయడాన్ని ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా అలవాటు చేసుకోవాలని సూచించారు. శిక్షణలో చక్కగా రాణించాలని, త్వరలో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవాలు.. అనంతరం సచివాలయం నుంచి పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రూ.13.07 కోట్లతో నిర్మించిన రెండు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, రూ. 3.42 కోట్లతోపునరుద్ధరించిన 7 హాస్టళ్లు ఇందులో ఉన్నాయి. అలాగే కార్మిక సంక్షేమం, స్కిల్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో సిద్ధం చేసిన 45 ప్రభుత్వ వృత్తి శిక్షణ, విద్యా కేంద్రాలను, రూ. 1,559 కోట్ల 25 లక్షల వ్యయంతో 4. ఓ ప్రాజెక్టు మేరకు పరిశ్రమలను సీఎం ప్రారంభించారు. ఈ వృత్తి శిక్షణ కేంద్రాల్లో అదనంగా 5,140 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నారు. -
బీజేపీకి పతనం తప్పదు! : తమిళనాడు సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రానున్న ఎన్నికల్లో గెలవచ్చన్న ధీమాతో ఉన్న బీజేపీకి జాతీయ స్థాయిలో పతనం తప్పదని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో ప్రజలు పెద్ద గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. గురువారం డీఎంకే కార్యాలయం అన్నాఅరివాలయంలో పార్టీ నాయకుడు గుమ్మిడిపూండి వేణు ఇంటి శుభకార్య వేడుకలో సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. డీఎంకే అంటే ఓ కుటుంబం అన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. మహానాడులైనా సరే, పార్టీ కార్యక్రమాలైనా సరే కుటుంబ సమేతంగా నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చే ఒకే ఒక్క పార్టీ డీఎంకే అని గుర్తు చేశారు. డీఎంకేలో ఉన్న ప్రతి ఒక్కర్ని దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి తన కుటుంబంలోని వ్యక్తులుగానే భావిస్తారని పేర్కొన్నారు. డీఎంకేకు ఓటు వేస్తే అది కరుణానిధి కుటుంబ ప్రయోజనానికే ఉపయోగకరం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. డీఎంకే అంటే కుటుంబం, డీఎంకే అంటే తమిళనాడు, తమిళనాడు ప్రయోజనాలే డీఎంకేకు ముఖ్యం అన్న విషయాన్ని ఆయన బాగానే గ్రహించినట్టున్నారని హితవు పలికారు. ఓటమి తప్పదు.. గత 50 ఏళ్లుగా తమిళనాడు అనే కుటుంబం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా డీఎంకే శ్రమిస్తున్న విషయాన్ని మోదీ గుర్తెరగాలని సూచించారు. ఆధునిక తమిళనాడు రూపకర్త దివంగత నేత కరుణానిధి అని, ఆయన అడుగుజాడల్లో ద్రావిడ మోడల్ పాలన తమిళనాట సాగుతోందన్నారు. కలైంజ్ఞర్ శత జయంతి ఉత్సవాల వేళ గత రికార్డుల గురించి చెబుతూ పోతే సమయం చాలదని పేర్కొన్నారు. మీసా చట్టంలో తాను అరెస్టయిన సమయంలో జైల్లో ముందుగా తనను కాకుండా ఇతర నాయకులు, కార్యకర్తలను దివంగత నేత పరామర్శించారని గుర్తు చేశారు. ఆయనకు కుమారుడి కంటే డీఎంకే కుటుంబం ముఖ్యం అని గుర్తు చేస్తూ, ఇవన్నీ మోదీకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీలో భయం పెరిగిందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల మధ్య మత చిచ్చులు పెట్టి, ఆ నీడలో 2024 ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహ రచనలో ఉన్నారని ఆరోపించారు. ఆయన పాచికలు ఇక పారబోవని, ప్రజలు మోదీ గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ఓడించడం లక్ష్యంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మణిపూర్ ఘటనలను గుర్తు చేస్తూ, ఈ వ్యవహారంలో మోదీ అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. అల్లర్లు బయలుదేరిన నెలన్నర రోజుల తర్వాత హోంమంత్రి అమిత్‌షా ద్వారా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం శోచనీయమని విమర్శించారు. ఈసారి ఎన్ని కుట్రలు చేసినా మోదీకి ఓటమి తప్పదని, ప్రజలు ఆయనకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు.. ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటాం... అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టే పనిలో విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి మద్దతు కోరగా అయన సానుకూలంగా స్పందించినందుకు కేజ్రీవాల్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం... ఢిల్లీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించిన కేంద్రానికి సుప్రీం కోర్టులో చుక్కెదురవడంతో ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తోన్న కేంద్రానికి లోక్ సభలో బిల్లు ఆమోదింప చేయడం పెద్ద కష్టం కాదు. కానీ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడాలంటే మాత్రం 93గా ఉన్న వారి బలం సరిపోదు. ప్రతిపక్షాల మద్దతు కూడా కావాలి. కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా కేంద్రానికి అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరినీ కలుపుకుంటూ... ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల మద్దతును కూడగట్టిన కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యి మద్దతివ్వాలని కోరారు. అందుకు స్టాలిన్ కూడా సుముఖంగా స్పందించడంతో కేజ్రీవాల్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. తర్వాతి ప్రయత్నంలో ఢిల్లీ సీఎం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను కూడా కలిసి మద్దతు కోరనున్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. -
హీరో రేంజ్ లో సీఎం స్టాలీన్
-
తమిళనాడు: స్టాలిన్ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి 50 ప్రాంతాల్లో బృందాలుగా సోదాలు నిర్వహించారు. ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యుల ఇళ్లలో, అధికార డీఎంకే నేతలు, జీ స్వ్కేర్ కంపెనీ రియల్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తమిళనాట హైలైట్ ట్విస్ట్.. స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్
గతకొద్దిరోజులుగా తమిళనాడులో సీఎం స్టాలిన్ వర్సెస్ గవర్నర్‌్ ఆర్ఎన్ రవి అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. సీఎం స్టాలిన్, గవర్నర్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. అయితే, అంతకుముందు.. సీఎం స్టాలిన్ సోమవారం రెండోసారి గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాము ప్రజల కోసం తీసుకొచ్చిన బిల్లును బహిరంగ వేదికపై గవర్నర్ విమర్శించారని, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కోరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి.. గవర్నర్ గైడ్‌గా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కానీ తమిళనాడు గవర్నర్ మాత్రం ప్రజలకు మంచి చేసేందుకు సిద్ధంగాలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రవి దిగి వచ్చారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద మరో 20 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలన్న బిల్లు కూడా ఇందులో ఉన్నది. ఇదిలా ఉండగా.. ఆన్లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తమిళనాడులో 40 మందికిపైగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆమోదించిన ఈ తరహా బిల్లును కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ బిల్లుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో, తొలిసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన 131 రోజుల తర్వాత గవర్నర్ గత నెలలో ఈ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి ఆమోదించి గవర్నర్‌కు రెండోసారి ఈ బిల్లును ప్రభుత్వం పంపింది. -
సీఎం స్టాలిన్ కు ఖర్గే ఫోన్..!
-
ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిషేధించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్ఎల్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చి న కెమికల్ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్‌ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ)శాంపిల్స్‌ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. -
లంక నావికాదళం ఓవరాక్షన్.. సీఎం స్టాలిన్ ఫైర్
సాక్షి, చైన్నె: శ్రీలంక సేనలు తగ్గడం లేదు. మళ్లీ తమిళ జాలర్లపై దాడి చేశారు. ఈ ఘటన తమిళ జాలర్లలో ఆగ్రహాన్ని రేపింది. ఈనెలలో ఇప్పటికే రెండుసార్లు తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీఎం స్టాలిన్ సైతం తీవ్రంగా పరిగణించారు. దాడులు కట్టడి చేయాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయ శంకర్‌కు లేఖ కూడా రాశారు. అలాగే శ్రీలంక నావికాదళంపై వేదారణ్యం మైరెన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినా, తాము తగ్గేది లేదన్నట్టు శ్రీలంక సేనలు వ్యవహరిస్తున్నారు. కారైక్కాల్‌కు చెందిన అంజప్పర్ పడవలో మైలాడుతురైకు చెందిన 11 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారు. శనివారం రాత్రి కోడికరై వద్ద వేటలో ఉన్న వీరిపై శ్రీలంక సేనలు విరుచుకుపడ్డారు. వలలు, జీపీఎస్ తదితర పరికరాలను స్వాఽధీనం చేసుకున్నారు. అలాగే, సముద్రంలో దూకమని చెప్పి జాలర్లను చిత్రహింసలకు గురిచేశారు. సముద్రంలో ఈదుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జాలర్లు వేదనపడగా, శ్రీలంక సేనలు అనందించి వెళ్లారు. ఆ సేనలు వెళ్లడంతో అతి కష్టంపై ఒడ్డుకు చేరుకున్న జాలర్లు మత్స్యశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడిని జాలర్ల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. శ్రీలంక సేనలు రోజురోజుకు విరుచుకుపడుతుండడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. -
ఉప ఎన్నికల వేళ తమిళనాడులో ట్విస్ట్.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం!
ఎడతెగని వ్యూహాలు.. ఎత్తులకు పైఎత్తులతో ప్రధాన పార్టీలన్నీ ఈరోడ్ ఉప సమరానికి సిద్ధమయ్యాయి. బుధవారం నామినేషన్లను ఎన్నికల అధికారి ఆమోదించడంతో ప్రచార పర్వానికి తెరలేపాయి. ముఖ్యంగా నాలుగు ప్రధాన పారీ్టలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో నువ్వా..నేనా అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చిల అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారి శివకుమార్ బుధవారం ఆమోదించారు. పరిశీలనలో మరో 76 నామినేషన్లు కూడా ఓకే అయ్యాయి. ఈ ఎన్నికల రేసుల నుంచి తాము తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రకటించడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. రసవత్తరంగా.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక అన్నాడీఎంకే రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. ఆ పార్టీ శిబిరాల అభ్యర్థులుగా తెన్నరసు, సెంథిల్ మురుగన్, ఆ పార్టీలో చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ నామినేషన్లు వేశారు. చివరకు సర్వసభ్య సభ్యుల మెజారిటీ మద్దతుతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తన అభ్యర్థి సెంథిల్ మురుగన్‌ను పోటీ నుంచి తప్పించారు. అదే సమయంలో తాజాగా తమకు కుక్కర్ గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడాన్ని నిరసిస్తూ అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం కూడా ఎన్నికల నుంచి తప్పుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఏ విధంగా పన్నీరు సెల్వం తలొగ్గారో, అదే తరహాలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ కూడా వెనక్కి తగ్గినట్టు చర్చ సాగుతోంది. క్షణంలో ఎన్నికల రేసులో నుంచి తప్పుకున్నా, తాము ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేదని, తమకు అనుకూలమైన గుర్తు కేటాయించక పోవడం వల్లే బరిలో నుంచి తప్పుకున్నట్లు టీటీవీ స్పష్టం చేశారు. దుష్ట శక్తి డీఎంకే, ద్రోహ శక్తి అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శిబిరం అభ్యర్థి తెన్నరసు మాత్రమే అధికారికంగా ఆ పార్టీ తరపున పోటీలో మిగిలారు. 121లో 80 నామినేషన్లకు ఆమోదం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద గత నెల 31 నుంచి ఈనెల 7వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించారు. మొత్తంగా 121 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు. ఇందులో ఇద్దరు వెనక్కి తగ్గారు. బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఎన్నికల పర్యవేక్షకుడు రాజ్ మోహన్ యాదవ్, ఎన్నికల అధికారి శివకుమార్ అన్ని నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 121 నామినేషన్లు దాఖలు కాగా, 80 ఆమోదం పొందాయి. ఇందులో తొలి ఆమోదం ఎన్నికల వీరుడు, స్వతంత్ర అభ్యర్థి పద్మరాజన్ది కావడం విశేషం. ఆ తర్వాత కోవైకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్ మహ్మద్ నామినేషన్‌ను ఆమోదించారు. మూడో నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్. అలాగే అన్నాడీఎంకే డీఎంకే అధికారిక అభ్యర్థి తెన్నరసు, డీఎండీకే అభ్యర్థి ఆనంద్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనక నామినేషన్లకు కూడా ఆమోదం లభించింది. ఇక ఎన్నికల నుంచి తప్పుకున్న పన్నీరు సెల్వం వర్గం అభ్యర్థి సెంథిల్ మురుగన్, టీటీవీ అభ్యర్థి శివ ప్రశాంత్ నామినేషన్లు ఆమోదం పొందినా, వారు గురువారం ఉప సంహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్సా.. డీఎంకేనా..? ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే సమరం కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థులు ఈవీకేఎస్, తెన్నరసు మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు చీల్చే ఓట్లే కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఆయా కూటమి పక్షాలైన బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్ తదితర పారీ్టలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. బుధవారం పళని స్వామి నేతృత్వంలో మిత్ర పక్షాల నాయకులు సమావేశమయ్యారు. ఈనెల 12వతేదీ నుంచి నియోజకవర్గంలో పళని స్వామి ఇంటింటా సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు కోసం తమ శిబిరం తరపున కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే డీఎంకే మంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కూడా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈనెల 24, 25 తేదీల్లో ఈరోడ్‌లో 10 చోట్ల సీఎం ప్రసంగించనున్నారు. అలాగే సీఎం తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ కూడా ఈనెల 19, 20 తేదీల్లో ఇలంగోవన్ కోసం ప్రచారం చేయనున్నారు.