చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ.1000ని పండగ కానుకగా అందజేశారు. దీంతోపాటు చెరకు గడ, కిలో ముడి బియ్యం, చెక్కర, చీర, దోతీలను పంపిణీ చేశారు. వీరితో పాటు తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా ఈ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అళ్వార్‌పేటలో ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Tamil Nadu Chief Minister MK Stalin inaugurates state government's Pongal gift hamper scheme in Chennai; also distributes gift hampers to people pic.twitter.com/kC7AlW82oF
— ANI (@ANI) January 9, 2023
రాష్ట్రంలో ఉన్న 2,19,71,113 మంది రేషన్ కార్డుదారులు, శిబిరాల్లో ఉన్న శ్రీలంక తమిళ శరణార్థులకు దాదాపు రూ. 2,436.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్రాంతి కానుకను అందజేశారు. ఈ పంపిణీలో జనం రద్దీని నివారించేందుకు టోకెన్ విధానాన్ని అమలుపరిచారు. 1.77 కోట్ల దోతి, చీరలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం
Comments
Please login to add a commentAdd a comment