ration card holders
-
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కష్టాలు
-
సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ.1000ని పండగ కానుకగా అందజేశారు. దీంతోపాటు చెరకు గడ, కిలో ముడి బియ్యం, చెక్కర, చీర, దోతీలను పంపిణీ చేశారు. వీరితో పాటు తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా ఈ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అళ్వార్‌పేటలో ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Tamil Nadu Chief Minister MK Stalin inaugurates state government's Pongal gift hamper scheme in Chennai; also distributes gift hampers to people pic.twitter.com/kC7AlW82oF — ANI (@ANI) January 9, 2023 రాష్ట్రంలో ఉన్న 2,19,71,113 మంది రేషన్ కార్డుదారులు, శిబిరాల్లో ఉన్న శ్రీలంక తమిళ శరణార్థులకు దాదాపు రూ. 2,436.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్రాంతి కానుకను అందజేశారు. ఈ పంపిణీలో జనం రద్దీని నివారించేందుకు టోకెన్ విధానాన్ని అమలుపరిచారు. 1.77 కోట్ల దోతి, చీరలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం -
ఉచిత రేషన్ మరో ఐదేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్ అందిస్తున్న ఆహార ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లు అందజేయాలని కూడా నిర్ణయించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీని లక్ష్యమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకాన్ని రెండేళ్ల పాటు కొనసాగిస్తాం. మహిళా సంఘాలకు డ్రోన్ల కొనుగోలు వ్యయంలో 80 శాతం దాకా ఆర్థిక సాయం అందిస్తాం. ఇందుకు ఏటా రూ.1,261 కోట్లు కేటాయిస్తున్నాం. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కలి్పస్తాం. ఈ డ్రోన్లను వ్యవసాయ సేవల నిమిత్తం రైతులకు మహిళా సంఘాలు అద్దెకిస్తాయి. తద్వారా ఒక్కో సంఘం ఏటా కనీసం రూ.లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు’’ అని వివరించారు. మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేస్తామని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఇక పీఎంజీకేఏవైను మరో ఐదేళ్లు కొనసాగించేందుకు రూ.11.8 లక్షల కోట్లు అవసరమని మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో 2020లో కేంద్రం ఈ పథకాన్ని మొదలు పెట్టడం తెలిసిందే. 2026 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ శాతం తదితరాలపై సలహాలు, సూచనలకు ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘం తాలూకు విధి విధానాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కమిషన్ 2025 అక్టోబర్ అంతానికల్లా నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జనజాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.45 కోట్లు గిరిజన జనాభా ఉంది. అందులో 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్‌లోని 75 గిరిజన సమూహాలను ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మూడేళ్లు కొనసాగించేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది. -
రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై ) కింద ఉచిత బియ్యం పంపిణీని మరో మూడునెలలు పొడిగించింది. పీఎంజీకేఏవై 7వ దశలో భాగంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా కార్డులోని ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున 122 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. వచ్చే మూడునెలలు పండుగలు ఉండటంతో పేదలకు ఆర్థిక బాధలు లేకుండా ఆహారధాన్యాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కోవిడ్–19 విజృంభణ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవైకు శ్రీకారం చుట్టింది. మొదటి రెండు దశల్లో ఎనిమిది నెలల పాటు (ఏప్రిల్ 2020 నుంచి నవంబర్ 2020), మూడు నుంచి ఐదు దశల్లో 11 నెలలు (మే 2021 నుంచి మార్చి 2022), ఆరోదశలో ఆరునెలలు (ఏప్రిల్ 2022 నుంచి సెప్టెంబర్ 2022) వరకు.. మొత్తం 25 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. 88 లక్షల కార్డులకే ఉచిత బియ్యం రాష్ట్రంలో ఉన్న 1.45 కోట్ల రేషన్ కార్డుల్లో 88 లక్షల కార్డులనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కింద పరిగణిస్తోంది. 88 లక్షల ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకే ప్రతినెలా కేంద్రం బియ్యం 5 కిలోల చొప్పున (నాన్–సార్టెక్స్) ఇస్తుండగా మిగిలిన 57 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మొత్తం అందరికి సార్టెక్స్ బియ్యం అందిస్తోంది. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ఏ, నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులందరూ దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉండగా కేంద్రం మాత్రం కొన్ని కార్డులకే బియ్యం ఇస్తోంది. కోవిడ్ సమయంలో ప్రారంభించిన పీఎంజీకేఎవై కింద ఉచిత బియ్యాన్ని కూడా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకే పరిమితం చేయడంతో రాష్ట్రంలో 88 లక్షల కార్డులకు మాత్రమే ఉచిత బియ్యం దక్కనున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని అన్ని కార్డులను ఎన్ఎఫ్ఎస్ఏ కింద పెట్టి మొత్తం అందరికీ కేంద్రమే బియ్యం ఇస్తుండటం గమనార్హం. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోవడంలేదు. -
ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే
సాక్షి, అమరావతి: కొత్తగా పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిన వారికి.. ఆ కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ పేరు నమోదు సమయంలో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు కూడా నమోదు చేసుకుంటారు. సచివాలయాల్లో నమోదయ్యే ఈ వివరాలను ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా వ్యక్తులు సంబంధిత కుటుంబంలో సభ్యులుగా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. వ లంటీర్లు ఆయా కుటుంబసభ్యులుగా పేరు నమోదు చేసిన అనంతరం రేషన్‌కార్డులో కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ, వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా, పట్టణాల్లో 70–100 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా వర్గీకరించి, ఒక్కొక్క క్లస్టర్‌కు ఒక్కొక్కరి చొప్పున వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1.65 కోట్ల కుటుంబాల్లో 4.67 కోట్ల మంది తమ పేర్లు నమోదుచేసుకోగా, ఆయా కుటుంబాల ను 2.65 లక్షల వలంటీరు క్లస్టర్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాల ప్రకారమే అర్హులను గుర్తిస్తోంది. -
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలుపర్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ‘4 జీ’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేసేందుకు చర్యలు చేపట్టింది. బ్లూటూత్ సాయంతో ఈ– పాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మే నెల నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ చౌకదుణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందుకోసం æసరికొత్త యంత్రాలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసింది. తప్పుడు తూకాలకు చెక్ చౌక ధరల దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్ పడనుంది. లబ్ధిదారులు తీసుకునే సరుకులు మాత్రమే డ్రా కానున్నాయి. వాస్తవంగా ఇప్పటి వరకు బయోమెట్రిక్‌కు సంబంధించిన ఈ–పాస్ యంత్రం, తూకం వేసే వెయింగ్ మెషీన్ వేర్వేరుగా ఉండేవి. లబ్ధిదారుడి బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం మెషీన్ ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు నొక్కేయడం ఆనవాయితీగా మారింది. తూకంలో సైతం తేడా ఉండేది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ– పాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారు వేలి ముద్ర నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్‌తో తూనికల యంత్రానికి సిగ్నల్ వెళ్తుంది. లబ్ధిదారుడి కుటుంబంలో ఎన్ని యూనిట్లు, రేషన్, ఇతర కోటా సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. సేవలు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారుకు హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ పంపిణీ అవుతుంది. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
మరో ఆరు నెలలు ఉచితమే..
సాక్షి, ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు మరోసారి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఒకటి, రెండు నెలలు కాదు మళ్లీ ఆరు నెలల పాటు లబ్ధిదారులందరికీ ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా, గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పొడిగింపు.. కరోనా కేసులు మొదలైన సమయాన పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో అప్పట్లో వారిని ఆదుకునేందుకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా గత నెలతో ప్రక్రియ ముగిసింది. దీంతో తాజాగా ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించాయి. పంపిణీ వివరాలిలా.. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్ధిదారుడిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు బియ్యం కేటాయింపులు చేశాయి. ఆహారభద్రత లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది కేజీలు, అంత్యోదయ కార్డుకు 35కేజీలు ఇస్తుండగా... అదనంగా ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కేజీల బియ్యం ఇవ్వనున్నారు. ఇక అన్నపూర్ణ కార్డుదారులకు మాత్రం యథావిధిగా పది కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. కాగా, జిల్లాలో 669 రేషన్‌షాపులు, 4,16,826 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 3,89,765, అంత్యోదయ కార్డులు 27,058తో పాటు అన్నపూర్ణ కార్డులు మూడు ఉన్నాయి. నేటి నుంచి పంపిణీ చేస్తారు... ఏప్రిల్ నెలకు సంబంధించి ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో రేషన్‌కార్డు ఉన్న వారందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నేటి నుంచి బియ్యం అందించాలని రేషన్ డీలర్లను ఆదేశించాం. – రాజేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
రేషన్ బియ్యం పంపిణీ 4నుంచి
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఈనెల నాలుగో తేదీ నుంచి పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని ఈ విషయాన్ని రేషన్‌దారులు గమనించాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఈ-కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఈ–కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని ఆయన వెల్లడించారు. ఈ-కేవైసీ చేసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ-కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించామని, ప్రజలు.. ఆధార్, మీ–సేవ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున తరలివెళ్లడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో కోన శశిధర్ ఈ మేరకు స్పందించారు. చదవండి: లోకేశ్ హైడ్రామా.. పథకాలు పక్కదోవ పట్టించడానికే -
రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. నవంబర్ వరకు కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా నుంచి పేదలు పూర్తిగా కోలుకోని దృష్ట్యా ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార చట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకు అందించనున్న 5 కిలోల బియ్యానికి అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తంగా 10 కిలోల ఉచిత బియ్యాన్ని నవంబర్ వరకు అందించనుంది. జూలై ఒకటి నుంచి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై కనీసంగా రూ.700 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. చదవండి: కోటి 30 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం -
బయోమెట్రిక్ నిలిపివేత.. పూర్తిగా ఓటీపీ ద్వారానే
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల కోసం ఈ– పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టాల్సిన అవసరం లేదిక. ఆహార భద్రత (రేషన్) కార్డు నంబర్ చెప్పి.. దాని ఆధారంగా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుంది. సరుకులను డ్రా చేసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా వచ్చే ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఆదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో పరిశీలించి లింక్ లేకుంటే మీ– సేవ, ఈ– సేవలకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని డీలర్లు చెబుతున్నారు. ఈ– పోస్ ద్వారా సరుకుల పంపిణీలో ఓటీపీ పద్ధతి రెండు నెలల నుంచి ప్రయోగాత్మకంగా అమలవుతున్నా తప్పనిసరి లేకుండా పోయింది. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిగా ఓటీపీ పద్ధతి ద్వారా సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటేనే రేషన్ సరుకులు తీసుకునేందుకు సాధ్యపడనుంది. చదవండి: కొత్త కోడళ్లకు నో రేషన్.. తప్పనిసరి.. ► కరోనా నేపథ్యంలో రేషన్ సరుకుల డ్రాకు ఓటీపీ వెసులుబాటు తప్పనిసరిగా మారింది. వాస్తవంగా కరోనా కష్టకాలంలో వరుసగా అయిదు నెలల పాటు థర్ట్ పార్టీ ఐడెంటిఫికేషన్ ద్వారా సబ్సిడీ సరుకులు పంపిణీ చేసిన పౌరసరఫరాల శాఖ నాలుగు నెలలుగా తిరిగి బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. ► గత ఏడాది నవంబర్ నుంచి బయోమెట్రిక్‌తో పాటు ఓటీపీ పద్ధతి కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తాజాగా వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. 30 శాతం దూరం.. ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల్లో సుమారు 30 శాతం ఆధార్‌తో మొబైల్ నంబర్ల లింక్ లేనట్లు తెలుస్తోంది. కేవలం రేషన్ కార్డుదారుల్లో సుమారు 70 శాతం మాత్రమే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధార్ నంబర్లు మొబైల్ ఫోన్లను అనుసంధామైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ► ఆహార భద్రత కార్డు లబ్ధిదారుల్లో హెడ్ ఆఫ్ ప్యామీలితో పాటు సరుకుల కోసం దుకాణాలకు వచ్చే లబ్ధిదారుల ఫోన్ నంబర్లు కూడా ఆధార్‌తో లింక్ చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు. ► వాస్తవంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధార్‌తో రేషన్ కార్డు నంబర్ల అనుసంధానంతోనే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆధార్‌తో మొబైల్ నంబర్లు కూడా అనుసంధానమయ్యాయి. ► ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్లకు వచ్చే ఓటీపీ ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ►కొందరు లబ్ధిదారులకు మొబైల్ నంబర్లు లేకపోవడం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు పనిచేయకపోవడంతో సమస్యగా తయారైంది. లింక్ చేసుకునేందుకు ఈ నెలాఖరులోగా వెసులుబాటు కల్పించారు. ఓటీపీ ఇలా.. ► ప్రభుత్వ చౌకధరల దుకాణానికి సబ్సిడీ సరుకులు కోసం వెళ్లే లబ్ధిదారులు డీలర్‌కు తమ ఆహార భద్రత కార్డుకు సంబంధించిన నాలుగు చివరి నంబర్లు చెప్పాలి. ► ఈ– పాస్ యంత్రంపై కార్డు నంబర్లు ఫీడ్ చేస్తే సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పగానే డీలర్ దానిని ఫీడ్ చేస్తే సరుకుల పంపిణీకి ఆమోదం లభిస్తుంది. -
తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కొక్కరుగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా.. డీఎంకే ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త పార్టీపై ప్రకటన చేసేశారు. డిసెంబర్ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈపీఎస్ పళనిస్వామి తన స్వస్థలం ఎడప్పాడిలోని సేంద్రయ్య పెరుమాళ్ల కోయిల్ ఆలయంలో పూజల అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు లబ్దిదారులకు సంక్రాంతి కానుకగా రూ.2500 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో తమిళనాడులోకి 2.06 కోట్ల రేషన్‌కార్డు దారులు లబ్ది పొందనున్నారు. దాంతోపాటు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక చెరుకు గడ, 20 గ్రాముల కిస్మిస్, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాములుయాలకులు కూడా ఉచితంగా అందివ్వనున్నట్టు సీఎం తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ప్రకటనపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. వరదల సమయంలో ప్రజలు కష్టాల్లోఉన్నప్పుడు ఎటువంటి సాయం అందించని సీఎం, ఎన్నికలు సమీపిస్తుండటంతో వరాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. లాక్డౌన్, వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు రూ.5000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, స్టాలిన్ విమర్శలపై స్పందించిన సీఎం పళనిస్వామి.. రేషన్ కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా 2014లో రూ.100, కిలో బియ్యం, కిలో చక్కెర ఇచ్చామని, 2018లో ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచామని తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పుడు రూ.2500 ఇస్తున్నామని తెలిపారు. -
కార్డు లేని వారికీ రేషన్
న్యూఢిల్లీ: రేషన్ కార్డు లేని వారికి సైతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే నిత్యావసరాలను సరఫరా చేసే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డు అయినా యావత్ దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇది విధానపరమైన విషయమనీ, భారత ప్రభుత్వం ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ‘సెంట్రల్ విస్టా’పై స్టేకు నో సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్, కేంద్రప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ‘కోవిడ్ సంక్షోభ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు’అంటూ వ్యాఖ్యానించింది. -
బ్యాంక్ ఖాతా లేకుంటే ‘పోస్టల్’ నగదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలు లేని రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1,500 సాయాన్ని పోస్టాఫీస్‌ల ద్వారా అందించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు లేని 5,21,641 కుటుం బాలకు రూ.78,24,55,500ను అందించనుంది. ఈ మేరకు ఆ మొత్తాన్ని పోస్టు మాస్టర్ జనరల్, హైదరాబాద్ ఖాతాలో పౌర సరఫరాల శాఖ శనివారం జమ చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు మొత్తం 87.54 లక్షలు ఉండగా, 79.57 లక్షల కుటుంబాలకు ఉచి తంగా 12 కిలోల చొప్పున 3.13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేసింది. బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల కోసం ఒక్కో కుటుంబానికి రూ.1,500 చొప్పున 74 లక్షల కుటుంబాలకు రూ. 1,112 కోట్లు సైతం జమ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరికి సాంకేతిక సమస్యలతో జమ కాకపోగా, మరికొందరికి బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో జమకాలేదు. అయితే ఖాతాలు లేని వారికి పోస్టల్ సర్వీసుల ద్వారా సాయం అందించనుండటంతో సగం సమస్య తీరనుంది. మిగతా వారికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటోంది. చదవండి: కరోనాతో కుదేల్..! మరో 3.12 లక్షల మందికి... ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ఉన్న వలస కార్మికులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందిస్తోందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలి విడతలో 3.35 లక్షల మంది కార్మికులను గుర్తించి రూ.13 కోట్లు విలువ చేసే 4,028 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశామన్నారు. అలాగే రూ.500 చొప్పున రూ.17కోట్లు సాయమందించామన్నారు. రెండో విడతలో కొత్తగా 3.12 లక్షల మంది వలస కార్మికులను గుర్తించామని, వీరికి రూ.12 కోట్లు విలువ చేసే 3,746 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. వీరికి కూడా రూ.500 చొప్పున రూ.15.60 కోట్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 91శాతం మందికి బియ్యం పంపిణీ పూర్తయిందని, 15.63 లక్షల మంది రేషన్ పోర్టబులిటీని వినియోగించుకొని బియ్యం తీసుకున్నారని వెల్లడించారు. -
రేషన్ షాపుల వద్దే ఈ–కేవైసీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఈ–కేవైసీ నమోదు చేయించుకోవాలన్ననిబంధనపై ప్రతిపక్షాలు, మీడియా తప్పుడు ప్రచారానికి దిగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడువు అయిపొతుందన్న పుకార్లతో ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే 15 ఏళ్లు దాటిన వారికి వచ్చేనెల ఐదు వరకూ, 15ఏళ్ల లోపు పిల్లలకు వచ్చేనెల 15 వరకూ గడువు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. సాక్షి, తూర్పుగోదావరి(ఏలూరు) : ఈ–కేవైసీ అనేది ఆయా రేషన్ షాపుల్లో డీలర్ల వద్ద వేలిముద్ర ద్వారా చేసుకునే కార్యక్రమం మాత్రమే. ఇంటింటికీ రేషన్ సరఫరా సమయంలో ఆయా కుటుంబాల్లో వేలిముద్రలు లేనివారు ఉంటే వారికి ఇబ్బందులు తలెత్తుతాయని, కుటుంబ యజమాని వచ్చేంత వరకూ వేచి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. రేషన్ షాపుల వద్దే ఈ–కేవైసీ మన జిల్లా విషయానికి వస్తే నాలుగు లక్షల 85 వేల మంది ఈ–కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆయా రేషన్ షాపుల వద్దే ఈపాస్ మిషన్ ద్వారా దీన్ని నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఈ–కేవైసీ లేకపోయినా ఎవరి రేషన్ కట్ చేయడం జరగదు. అయితే కొత్త రేషన్ కార్డు కావాలన్నా, డ్వాక్రా గ్రూపు సభ్యులుగా నమోదు అవ్వాలన్నా, అమ్మ ఒడి, పింఛన్లు, ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా ఈ–కేవైసీతోపాటు ప్రజాసాధికార సర్వేలో నమోదు కావాలని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు పనులు మానుకుని, పిల్లలను స్కూల్ ఎగ్గొట్టించి మరీ మీ సేవ, ఆధార్ కేంద్రాలకు తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో నిర్వహించిన సాధికార సర్వేలో నమోదు కానివారు ఇంకా 1.75 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరందరి దగ్గరకు ఆయా గ్రామాలు, పట్టణాల్లోని సర్వే బృందం వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుంది. ఇలా నమోదు చేసుకోవచ్చు.. ఆధార్ కార్డు ఉండి బయోమెట్రిక్ లేదా ఓటీపీ ఆధారంగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఈకేవైసీ నమోదు సమయంలో 101 ఎర్రర్ అని వస్తే వారు తప్పని సరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లి తమ వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి. రేషన్ షాపులో ప్రతినెలా వేలి ముద్రలు వేసి రేషన్ తీసుకునే వారు వివిధ, పింఛన్లు పథకాల్లో బయోమెట్రిక్ పడే వాళ్ళకు ఈ–కేవైసీ వెంటనే పూర్తవుతుంది. ప్రస్తుతం రేషన్ డీలర్లకు డిపో పరిధిలో ఉన్న కార్డుదారులలో ఈకేవైసీ నమోదు చేసుకోని వారి పేర్ల జాబితాను డీలర్లకు ఇచ్చారు. ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వాళ్ళు ముందుగా వెళ్లి రేషన్ డీలర్ వద్దకు వెళ్లి వేలి ముద్రను వేసి ఈ–కేవైసీని ఉచితంగా చేసుకోవచ్చు. అయితే డీలర్లు ఈకేవైసీ చేయకుండా అందరినీ ఆధార్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు పంపుతుండటంతో సమస్య మొదలైంది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని ఆధార్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు తిప్పుకుంటున్నారు. ఆధార్ సెంట ర్లో ఆధార్ నమోదుకు రూ.50, ఈకేవైసీ నమోదుకు రూ.15 చెల్లిస్తే సరి. అయితే ప్రజల నుంచి నిర్వాహ కులు భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 8,913 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
ఒకరి పొరపాటు.. ఇంకొకరికి గ్రహపాటు
శేఖర్‌బాబు, సరోజిని, చినవెంకటరెడ్డి కుటుంబాలే కాదు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఇలాంటి ఎందరో బాధితులు అధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూలి పనులు చేసుకుని పొట్ట పోసుకునే పేదలు ఉద్యోగుస్తులంటూ రేషన్ సరుకులు కోల్పోవడంతో పాటు పింఛన్ పోతుందనే భయంతో తహశీల్దార్ కార్యాలయాలకు తరలివస్తున్నారు. సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రజాపంపిణీ వ్యవస్థలో అధికారులు చేస్తున్న తప్పుల కారణంగా కూలీనాలి చేసుకునే అమాయకులు బలవుతున్నారు. కూలి పనులు చేసుకునే వారు ఉద్యోగులుగా ప్రజా సాధికార సర్వేలో నమోదు కావడంతో వారికిప్పుడు రేషన్ సరుకులు అందడం లేదు. ప్రస్తుతం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల ఆధార్ సంఖ్యను రేషన్ కార్డుల జాబితాతో సరిపోల్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తెల్లరేషన్‌కార్డున్న వారి వివరాలు బయటపడడంతో ఆయా కార్డులను ఈనెలలో తొలగించే జాబితాలో చేర్చారు. గతంలో రేషన్ కార్డులకు ఆధార్‌కార్డు అనుసంధానం చేసిన సమయంలో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఆధార్ నంబర్లు సేకరించి రెవెన్యూ కార్యాలయంలో సమర్పించారు. ఆయా కార్డులకు ఆధార్ సంఖ్యలను అనుసంధానం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి ఆధార్ నంబర్లు రేషన్‌కార్డులకు తప్పుగా అనుసంధానమయ్యాయి. ప్రజాసాధికార సర్వేలో పలువురు నిరక్షరాస్యులు తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేరుగా ఉన్నా తెలియక తమ కుటుంబంలోనే ఉన్నట్లు నమోదు చేయించారు. ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగం అంటూ రేషన్ కార్డు తొలగించిన వాటిలో పలువురు పేద ప్రజలు కూడా ఉన్నారు. దీంతో ఈనెల రేషన్ షాపుల్లో నిత్యవసర సరుకులు వారు తీసుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో కార్డులు చేతపట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. తాము కూలి పనులు చేసుకునే వారమని, ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెబుతూ ఆధార్ కార్డు అందించినా ప్రయోజనం ఉండడం లేదు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపడం వలన రేషన్ సరుకులు తీసుకోలేకపోయామని వాపోతున్నారు. అధికారులు చేస్తున్న లోపాల కారణంగా అర్హులైన వారు కూడా రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారు. కూలి పనులు చేసుకుంటూ పొట్ట నింపుకునే పేదలు, చిన్నా చితక పనులు చేసుకుంటూ రోజువారీ జీతం తీసుకునే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు తీసుకుంటూ పొట్టనింపుకునే వారు. అయితే సాధికార సర్వేలో జరిగిన తప్పిదాల వలన వారంతా రేషన్ సరుకులను అందుకోలేని పరిస్థితి. ఈ సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకుని సరిదిద్దుకునే లోపు ప్రజలు రేషన్ సరుకులు అందుకోలేకపోయారు. ఈ తప్పును ఎలా సరిదిద్దుతారో అధికారులే చెప్పాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు మాత్రం అర్హులైన వారి కార్డులు ఇన్ యాక్టివేట్‌లో ఉన్నప్పటికీ వాటిని యాక్టివేషన్ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తప్పిదాలు ఎన్నెన్నో.. ► చీరాల శాంతినగర్ నివాసి కోలా శేఖర్‌బాబు. ఇతనికి భార్య రత్నకుమారి, శిరీష, అనూష అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఉద్యోగం చేస్తున్నాడంటూ ఈనెలలో రేషన్ సరుకులు ఇవ్వలేదు. ఇదేమని డీలర్‌ను ప్రశ్నిస్తే నువ్వు ఉద్యోగస్తుడవు అని సర్వేలో తేలిందని బదులిచ్చాడు. కూలి పని చేసే తాను ఎప్పుడు ఉద్యోగి అయ్యానంటూ లబోదిబోమన్నాడు. సోమవారం స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. ► చీరాల 8వ వార్డుకు చెందిన ఆట్ల సరోజినికి భర్త లేడు. కొడుకు, కోడలు కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి ఉద్యోగం ఉందంటూ రేషన్ కట్ చేశారు. డీలర్ మాటలకు నోరెళ్లబెట్టిన వీరు కూడా స్పందనలో అధికారులను ఆశ్రయించారు. ► పొదిలి మండలం ఈగలపాడు మారం చినవెంకటరెడ్డి దంపతులు వ్యవసాయ కూలీలు. కుమార్తెలు పెళ్లిళ్లయి మెట్టినింటికి వెళ్లిపోగా దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెలలాగే ఈ సారి కూడా రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు చౌకధరల దుకాణానికి వెళ్లారు. కార్డు ఆగిపోయిందని రేషన్ ఇవ్వడం కుదరదని డీలర్ చెప్పడంతో కంగుతిన్నారు. ఉన్నట్టుండి తమ కార్డు ఎందుకు పనిచేయడం లేదో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. అర్జీ పెడితే డీఎస్వోకు పంపుతాం.. అర్హులైన కొందరి రేషన్ కార్డులు తొలగింపు జాబితాలోకి వెళ్లాయి. తాము ప్రస్తుతం ఏ సర్వే చేపట్టలేదు. ఎవరివైనా రేషన్ కార్డులు ఇన్ యాక్టివ్‌లో ఉన్నట్టు గుర్తిస్తే అర్జీ పెట్టుకుంటే వాటిని డీఎస్ఓకు పంపి వాటిని యాక్టివ్ అయ్యేలా చేస్తాం. – విజయలక్ష్మి, తహశీల్దార్, చీరాల -
ఆకలిరాజ్యం!
ఇరవై రోజుల్లో దేశమంతా 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతుండగా, ఎక్కడో మారుమూల కాదు... దేశ రాజధాని నగరంలో ముగ్గురు చిన్నారులు పట్టెడన్నం దొరక్క ఆకలికి మాడి మృత్యువాత పడ్డారు. ఈ దుర్వార్త చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇంతగా అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా ఇలాంటి చావులా అని దిగ్భ్రాంతికలగొచ్చు. కానీ న్యూఢి ల్లీలో జరగటం వల్లా... ఒకే కుటుంబంలో ముగ్గురు పసివాళ్లు ప్రాణాలు కోల్పోవటంవల్లా ఈ ఉదంతానికి ప్రాధాన్యత వచ్చిందిగానీ దేశంలో ఈ తరహా మరణాలు సంభవించని రోజంటూ లేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్న మాట. నిరుడు అక్టోబర్‌లో విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జాబితా ఉంటే అందులో మన స్థానం 100. మనకన్నా పొరుగునున్న బంగ్లా దేశ్(88), శ్రీలంక(84), మయన్మార్(77), నేపాల్(72) ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఒక్క పాకిస్తాన్ మాత్రం మనకంటే కాస్త వెనకబడి ఉంది. ఎక్కడైనా ఆకలిచావులు సంభవించాయని వార్తలొస్తే మన ప్రభుత్వాలు చాలా నొచ్చుకుంటాయి. ఆకలితో కాదు... అనారోగ్యంతో మరణించారని తేల్చ డానికి ప్రయాసపడతాయి. నిరుడు జార్ఖండ్‌లో పదకొండేళ్ల బాలిక సంతోషి చనిపోయినప్పుడు, ఆ రాష్ట్రంలోనే అంతక్రితం 58 ఏళ్ల సావిత్రిదేవి మరణించినప్పుడు అక్కడి ప్రభుత్వం అవి ఆకలి చావులు కాదు... అనారోగ్యం చావులని వాదించింది. అందుకు పోస్టుమార్టం నివేదికలను సాక్ష్యా లుగా చూపింది. ఒక్క జార్ఖండే కాదు... ఏ రాష్ట్రమైనా ఆ పనే చేస్తోంది. కానీ నిండా పదేళ్లు కూడా లేని ముగ్గురు పిల్లలూ న్యూఢిల్లీలో ప్రభుత్వాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. రెండోసారి పోస్టుమార్టం చేయించినా వారి కడుపులు, పేగులూ పూర్తిగా ఖాళీగా ఉన్నాయని తేలింది. తన నలభైయ్యేళ్ల సర్వీసులో ఈ మాదిరి కేసుల్ని ఎప్పుడూ చూడలేదని పోస్టుమార్టం చేసిన వైద్యుడు అన్నాడంటే ఆ పిల్లలు మృత్యువాత పడేముందు అనుభవించిన వేదన ఎటువంటిదో ఊహించుకోవచ్చు. కనీసం ఎనిమిది రోజులనుంచి వారికి తిండి నీళ్లూ లభించలేదని చెబుతున్నారు. తాను అద్దెకు తెచ్చుకున్న రిక్షాను ఎవరో దొంగిలించుకపోవడంతో వారి తండ్రి దిక్కుతోచక, పూట గడవటానికి పని వెతు క్కుంటూ ఎటో వెళ్లాడని స్థానికులు అంటున్నారు. ఆ పిల్లల్ని సాకి కాపాడాల్సిన అమ్మ మతి స్థిమితం తప్పి తన లోకంలో ఉండిపోయింది. పిల్లల మృతదేహాలను తరలిస్తూ ఆసుపత్రి సిబ్బంది తల్లిని కూడా వెంటబెట్టుకు వెళ్తుంటే ‘ఇంత అన్నముంటే పెట్టండ’ంటూ ఆ పిచ్చితల్లి ప్రాథేయ పడింది. పెద్ద పాప వయసు ఎనిమిదేళ్లు దాటలేదు. రెండో పాపకు నాలుగేళ్ల వయసుంటే ఆఖరి చిన్నారికి రెండేళ్లు. మనం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నామని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వాలు తరచుగా వృద్ధి రేటును ఉదహరిస్తాయి. ఇంతమందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి బయటపడేశామని ఏటా లెక్కలు ఏకరువు పెడతాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే తామెంత సాధించామో ఘనమైన వాణిజ్య ప్రకటనలతో సమ్మోహనపరిచే ప్రయత్నం చేస్తాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక లెక్క ప్రకారం మన దేశ జనాభాకంతటికీ ఏడాది పొడవునా కడుపు నిండాలంటే దాదాపు 23 కోట్ల టన్నుల ఆహారం అవసరం. కానీ నిరుడు మన ఆహార దిగుబడి దాదాపు 27.5 కోట్ల టన్నులు. అంటే నాలుగున్నర కోట్ల టన్నుల మిగులు సాధిస్తున్నాం. అయినా ఈ దేశంలో ఆకలిచావులు నిత్యకృత్యమవుతు న్నాయి. రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంభవిస్తున్న ఆకలిచావుల్లో చాలా భాగం లెక్కకు రావు. మీడియా దృష్టి పడి హడావుడి జరిగినప్పుడు వ్యాధుల కారణంగా మరణించారని చెప్ప డానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. సాధారణంగా ఆకలికి తాళలేనప్పుడు ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు విజృంభించే వ్యాధులు ప్రభుత్వాలకు అక్కరకొస్తాయి. మన దేశంలో అంతా బాగానే ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేసుకున్నాయి. బడికొచ్చే పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఆరేళ్లలోపు పిల్లలకు, గర్భిణులకు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీలున్నాయి. ఇవిగాక బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు వగైరాలు చవగ్గా అందించడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ఉంది. వీటిన్నిటికీ మించి అయిదేళ్ల క్రితం మన దేశం ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన ఆహార భద్రతా చట్టం ఉంది. ఇన్ని ఉండగా తలాబ్ చౌక్ ప్రాంతానికి వీటిలో ఏ ఒక్కటీ ఎందుకు పోలేదు? ఆ పిల్లల కుటుంబానికి మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ఉండే చాలా కుటుంబాలకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. కార్డు కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఏదైనా బిల్లు తీసుకురమ్మంటున్నారని అక్కడివారు ఫిర్యాదు చేస్తున్నారంటే మన ప్రభుత్వాలు ఏరకంగా పనిచేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సమస్త అవసరాలకూ పనికొస్తుందని నమ్మించి ఆధార్‌ను తీసుకొచ్చినా అది ఉంటే చాలదు... బిల్లులు కావాలని ప్రభుత్వ కార్యా లయాలన్నిటా అడుగుతారు. ఎక్కడో బెంగాల్నుంచో, బిహార్నుంచో పొట్టపోసుకోవడానికొచ్చిన కుటుంబాలకు ఇవన్నీ అసాధ్యం గనుక ఏ పథకంలోనూ వారు చేరే అవకాశం ఉండదు. ఏతావాతా సంక్షేమ పథకాలన్నీ కాగితాల్లో నిక్షిప్తమై ఉంటే... సాధారణ పౌరులు ఆకలితో నకనకలాడతారు. ప్రపంచంలో ఇంత అసంబద్ధంగా, ఇంత అన్యాయంగా నడిచే వ్యవస్థలు మరెక్కడా ఉండవు. అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవించే సగం మరణాలకు ప్రధాన కారణం పౌష్టికాహారలోపమేనని ఈమధ్యే యునిసెఫ్ నివేదిక తెలిపింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల మరణానికి కారణం మీరంటే మీరని ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వాదించుకుంటున్నాయి. కానీ నిరుపేద కుటుంబాలకు తగిన గుర్తింపు కార్డులిచ్చి వారికి మెరుగైన ఆహారం, వసతి, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటం ఎలా అన్న అంశంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నిరర్ధకమైన వాగ్యుద్ధాలకు స్వస్తి చెప్పి సామాజిక సంక్షేమ పథకాలు లక్షిత వర్గాలకు చేరేందుకు అవసరమైన కార్యాచరణ రూపొం దించటం తక్షణావసరమని పాలకులు గుర్తించాలి. -
ఈ–పాస్ కష్టాలు ఇంతింత కాదయా..
రామాయంపేట(మెదక్): రేషన్ దుకాణాల్లో అమర్చిన ఈ–పాస్ మిషన్లతో లబ్ధిదారులు నానా కష్టాలు పడుతున్నారు. ఓ వైపు వేలి ముద్రలు గుర్తించక ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు సిగ్నల్ కష్టాలూ వెంటాడుతున్నాయి. మండల పరిధిలోని దంతేపల్లి గ్రామంలో సిగ్నల్ రాకపోవడంతో ఆ రేషన్ డీలర్ ఈ–పాస్ మిషన్‌ను పొలాల వద్దకు తీసుకెళ్లి లబ్ధిదారులతో వేలి ముద్రలు వేయిస్తున్నాడు. దీంతో లబ్ధిదారులు రేషన్‌షాపుకు బదులుగా పొలాల వద్దకూ వెళ్లక తప్పని దుస్థితి నెలకొంది. -
కేజ్రీవాల్ నిర్ణయం.. ప్రజల ఆకలి తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రజలను పస్తులు ఉంచుతూ.. విమర్శలకు తావునిస్తోంది. ఆధార్ డేటా ఆధారంగా రేషన్ కోసం ప్రవేశపెట్టిన బయో మెట్రిక్ విధానం విఫలం కావటంతో .. ఐరిష్ స్కాన్, ఓటీపీల ద్వారా రేషన్ సరుకులు అందిస్తామని ప్రకటించించింది. అయితే రెండువారాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు దిగింది. బయో మెట్రిక్ విధానం... అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న ఓ కొత్త నిర్ణయం ప్రకటించింది. ఆధార్ కార్డులోని డేటాతో వేలి ముద్రలు సరిపోతేనే రేషన్ అందిస్తామని స్పష్టం చేసింది. రేషన్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి.. అర్హులైనవారికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సర్కార్ ప్రకటించింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవేం పట్టించుకోని ప్రభుత్వం ఢిల్లీలోని 2,255 రేషన్‌షాపులకు ఈ-పీవోఎస్(e-PoS.. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను అందించింది. అయితే ఆధార్డేటాతో కొందరు లబ్ధిదారుల వేలిముద్ర మ్యాచ్ కాలేదు. దీంతో రేషన్ ఇచ్చేందుకు డీలర్లు నిరాకరించగా.. లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేశారు. విషయం అధికారుల దృష్టికి రావటంతో తక్షణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా కంటిపాపల్ని స్కాన్ చేసి కొత్తగా పాస్వర్డ్లు ఇస్తామని, తద్వారా రేషన్ పొందొచ్చని ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 15న తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తీరా కార్యాలయానికి వెళ్లిన లబ్ధిదారులు మళ్లీ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులెవరూ అక్కడ లేరని, ఉన్నవారు కూడా స్పందించటం లేదని, తాము పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివరణ... విమర్శలపై ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పందించారు. వైఫై కనెక్టివిటీ మూలంగానే సమస్య ఉత్పన్నమైందని.. పునరుద్ధరించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం 15 లక్షల మంది రేషన్ లబ్ధిదారుల్లో 98 శాతం మంది రేషన్ తీసేసుకున్నారని.. 2 శాతం(26, 650 మంది) మాత్రం అందుకోలేకపోయారని ఆయన చెబుతున్నారు. ఖండించిన రేషన్ డీలర్లు... అయితే రేషన్ డీలర్లు మాత్రం మంత్రి వాదనను కొట్టిపడేస్తున్నారు. రేషన్ డీలర్ల సంఘం సెక్రెటరీ సౌరభ్ గుప్తా స్పందిస్తూ... ‘‘ నా సొంత వైఫైతో కనెక్ట్ చేసినా మెషీన్లు పని చేయటం లేదు. బేల్(BEL) నుంచి వచ్చిన ఇంజనీర్లు యాంటీనాలు ఇచ్చారు. కానీ, అవి కూడా ఇప్పుడు పని చేయటం లేదు’’ అని తెలిపారు. అంతేకాదు 98 శాతం మందికి రేషన్ అందుతుందా? అన్న ప్రశ్నకు గుప్తా నుంచి సరైన సమాధానం అందలేదు. ఈ గొడవలేమీ లేకుండా మాన్యువల్‌గా రేషన్ సరుకులు ఇవ్వాలని షాపులకు ఆదేశాలు అందినప్పటికీ.. అవి కూడా సక్రమంగా అమలు కావటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. బీజేపీ విమర్శలు.. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న వ్యవస్థను కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయోగాలతో చెడగొట్టి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని తివారీ విమర్శించారు. (ఎన్డీటీవీ సర్వే కథనం ప్రకారం...) -
‘రేషన్’ పాట్లు..
ఇల్లెందు(అర్బన్) : మండల పరిధిలోని పూబెల్లిలో ఎటువంటి సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో చౌకదుకాణానికి పంపిణీ చేసిన ఈపాస్ యంత్రాలు పనిచేయడంలేదు. పదిహేను రోజులుగా డీలర్ వివిధ ప్రయత్నాలు చేసినా ఎంతకీ ఫలితం లేకుండా పోయింది. 1వ తేదీ నుంచి 15 లోపు సరుకుల పంపిణీ చేయాల్సిన డీలర్ 15నాటికి ఒక్కరికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. ఈ దుకాణం పరిధిలో సుమారు 378 తెల్ల రేషన్, అంత్యోదయ కార్డు వినియోగదారులు ఉన్నారు. విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. సిగ్నల్స్ పని చేయకపోతే తాము సరుకులు పంపిణీ చేసేదేలాని అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఇటీవల రెండు రోజుల క్రితం రికార్డుల్లో వినియోగదారుల వివరాలను నమోదుచేసుకొని పరుకుల పంపిణీ ప్రక్రియను షురూ చేశారు. ఈ విషయం చాలా మంది వినియోగదారులకు తెలియకపోవడంతో సరుకులు తీసుకోలేదు. స్టాక్ దుకాణంలోనే నిల్వ ఉంది. ఎలా పంపిణీ చేయాలో తెలియక డీలర్ సతమతమవుతున్నారు. అధికారులు మాత్రం మూడు రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తి చేయాలని డీలర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బయో మెట్రిక్ ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ప్రతి నెలా ఇలాగైతే తాము సకాలంలో సరుకులు తీసుకోవడం సాధ్యం కాదని గ్రామస్తులు అంటున్నారు -
చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్రాంతి కానుకగా ఇస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి బయటపడింది. కానుకల పేరుతో రేషన్ కార్డుదారులకు రేషన్ డీలర్లు నాశిరకం, నీరుగారిన బెల్లం పంపిణీ చేస్తున్నారు. కిలో రూ. 48 చొప్పున 70 లక్షల కిలోల బెల్లాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏపీలో కిలో బెల్లం రూ.37కు దొరుకుతున్న రేషన్ షాపుల్లో కిలో రూ. 48 చెల్లించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ ధర చెల్లించినా నాశిరకపు వస్తువు పంపిణీ చేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండి నెయ్యి కూడా దుర్వాసన వస్తుందని వినియోగదారులు మండిపడుతున్నారు. అదేవిదంగా కురుపాం మండలం శివన్నపేటలో చంద్రన్న కానుకల్లో పంపిణీ చేసిన బెల్లం లో పురుగులు.. నీరుగారిన బెల్లం... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు. -
ఈ–పాస్.. రేషన్ ఫెయిల్!
- వేలి ముద్రలు పడలేదని 19.92 లక్షల మందికి అందని సరుకులు - పేదల కడుపు కొడుతున్న సాంకేతికత - బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే రేషన్.. - సర్కారు నిర్ణయాలతో వృద్ధుల్లో తీవ్ర ఆందోళన సాక్షి, అమరావతి వేలి ముద్రలు సరిగా లేక ఈ–పాస్ మెషిన్ వాటిని స్వీకరించక పోవడం, కొత్త రేషన్‌కార్డుల్లో తప్పుల తడకలు తదితర కారణాల వల్ల ఈ నెలలో 19.92 లక్షల మంది పేదలు రేషన్ సరుకులు పొందలేకపోయారు. బియ్యం, చక్కెర, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్ తదితర రేషన్ సరుకులపై ఆధారపడి బతుకీడుస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఏ పనీ చేసుకోలేని వారి పరిస్థితి సాంకేతికత పుణ్యమా అని దయనీయంగా మారింది. రాష్ట్రంలో 1.38 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉంటే ఇలాంటి సమస్యలతో ప్రతి నెలా లక్షలాది మంది పేదలు రేషన్‌కు దూరం అవుతున్నారు. వేలి ముద్రలు సరిగా పడని వారికి గ్రామ రెవెన్యూ కార్యదర్శి (వీఆర్వో) సర్టిఫికెట్ ఇస్తే రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న మాట లు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. రేషన్‌షాపు వరకు నడవలేని వృద్ధులకు వారి ఇంటికే వెళ్లి రేషన్ ఇవ్వాలన్న ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. దీనికి తోడు నగదు రహితంగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకోవడం కూడా పలు ఇబ్బందులకు కారణమ వుతోంది. కృష్ణా జిల్లాలో 85 శాతం పైగా నగదు రహితం గానే సరుకులు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఇటు లబ్ధిదా రులు, అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో ఒక వ్యక్తి రేషన్ కోసం వెళ్తే నగదు రహిత విధానంలో సరుకులు ఇస్తామని చెప్పారు. చేసేదిలేక ఆ వ్యక్తి బ్యాంకుకు ఆటోలో వెళ్లి ఖాతాలో సరుకులకు అయ్యే మొత్తం జమ చేసి వచ్చారు. ఇందుకు తనకు రూ.30 ఖర్చు అయ్యిందని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి నెలా బ్యాంకులో డబ్బు జమ చేసి ఆ తర్వాత సరుకులు తీసుకోవాలంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ–పాస్ మెషిన్లు సరిగా పనిచేయక గంటల తరబడి రేషన్ షాపులవద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 1.66 లక్షల కొత్తకార్డులు జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చామని చెబుతున్నా అందులో సగానికి పైగా కార్డులకు రేషన్ నిలిపివేశారనే ఆరోపణలున్నాయి. ఇలాగైతే ఎలా? తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందిన అడపా సత్యవతికి కుష్టువ్యాధి ఉంది. నగదు రహిత రేషన్ తీసుకోవాలంటే ఈ–పాస్ లో వేలి ముద్రలు వేయడం తప్పనిసరి. ఆమె వేలి ముద్రలు సరిగా లేనందున ఈ–పాస్ స్వీకరించలేదు. ఈ విషయమై డీలర్.. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ల డంతో ఆమెకు మాత్రం రేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారే కాకుండా వయసు మీరి వేలి ముద్రలు సరిపోలక లక్షలాది మంది రేషన్ అందుకోలేకపోతున్నారు. పైగా బ్యాంకులో వారి ఖాతాల్లో డబ్బులుండేలా చూసుకుంటేనే ఇకపై రేషన్ అందుతుంది. లేదంటే లేదు.