
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా నుంచి పేదలు పూర్తిగా కోలుకోని దృష్ట్యా ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార చట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకు అందించనున్న 5 కిలోల బియ్యానికి అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తంగా 10 కిలోల ఉచిత బియ్యాన్ని నవంబర్ వరకు అందించనుంది. జూలై ఒకటి నుంచి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై కనీసంగా రూ.700 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది.
చదవండి: కోటి 30 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం