సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలుపర్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ‘4 జీ’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేసేందుకు చర్యలు చేపట్టింది. బ్లూటూత్ సాయంతో ఈ– పాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మే నెల నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ చౌకదుణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందుకోసం æసరికొత్త యంత్రాలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసింది.
తప్పుడు తూకాలకు చెక్
- చౌక ధరల దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్ పడనుంది. లబ్ధిదారులు తీసుకునే
- సరుకులు మాత్రమే డ్రా కానున్నాయి.
- వాస్తవంగా ఇప్పటి వరకు బయోమెట్రిక్‌కు సంబంధించిన ఈ–పాస్ యంత్రం, తూకం వేసే వెయింగ్ మెషీన్ వేర్వేరుగా ఉండేవి. లబ్ధిదారుడి బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం మెషీన్ ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు నొక్కేయడం ఆనవాయితీగా మారింది. తూకంలో సైతం తేడా ఉండేది.
- కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ– పాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారు వేలి ముద్ర నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్‌తో తూనికల యంత్రానికి సిగ్నల్ వెళ్తుంది. లబ్ధిదారుడి కుటుంబంలో ఎన్ని యూనిట్లు, రేషన్, ఇతర కోటా సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. సేవలు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారుకు హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ పంపిణీ అవుతుంది.
(చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి)
Comments
Please login to add a commentAdd a comment