Biometric
-
మట్టి పలకల నుంచి... మైక్రోచిప్పుల దాకా...!
మైక్రోచిప్పులు, హోలోగ్రామ్‌లు, బయోమెట్రిక్ ఫోటోలు, బార్ కోడ్లతో నిండిన నేటి పాస్‌పోర్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అద్భుతాలు. ఇప్పుడు మనం చూస్తున్న పాస్ పోర్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తయారైంది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. కానీ దాని మూలాలు సహస్రాబ్దాల నాటివి. మానవ చరిత్ర ప్రారంభ యుగాల్లో ఎలాంటి సరిహద్దులు లేవు. స్వేచ్ఛా వలసలు ఉండేవి. తర్వాత ఉద్భవించిన నాగరికతలు భూమిని విభజించడమే గాక అన్వేషణ, పరిశోధనల సారాన్ని మార్చేశాయి. ఆ క్రమంలో సురక్షితంగా దేశాలు దాటేందుకు అధికారిక పత్రంగా పాస్‌పోర్టు పుట్టుకొచ్చింది.క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో మెసపొటేమియాలో ప్రయాణ అనుమతులకు మట్టి పలకలు వాడారు. ఒకరకంగా వీటిని అత్యంత పురాతన పాస్‌పోర్టులుగా చెప్పవచ్చు. పురాతన ఈజిప్టులో ప్రయాణికులు, వ్యాపారుల భద్రత కోసం అధికారిక లేఖలను ఉపయోగించారు. భారత ఉపఖండంలో ప్రయాణాలను మౌర్య సామ్రాజ్య కాలం నుంచి డాక్యుమెంట్ చేసినట్టు ఆనవాళ్లున్నాయి. అవి నేటి ప్రయాణ అనుమతుల వంటివి కావు. కేవలం ప్రయాణికుల ప్రవర్తన తదితరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలుగా మన్నన పొందేవి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుని పాలనలో ప్రయాణాలను సులభతరం చేయడానికి, రక్షణ, అధికారిక ఆమోదాన్ని తెలపడానికి శాసనాలు జారీ చేశారు.మొదటి ప్రపంచ యుద్ధంతో..యూరప్ వలసవాదులు ప్రస్తుత పాస్‌పోర్ట్ వ్యవస్థ రూపశిల్పులని చెప్పవచ్చు. అన్వేషణలో భాగంగా వారు ప్రపంచవ్యాప్తంగా కలియదిరిగి భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్లారు. 20వ శతాబ్దపు తొలినాళ్ల ప్రయాణాల్లో కొన్ని పద్ధతులు వచ్చి చేరాయి. ఆరోగ్య పరీక్షలు, కొన్ని ప్రశ్నలతో సరిహద్దులు దాటనిచ్చేవారు. అప్పటికి ప్రయాణ పత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత ప్రమాణమంటూ లేదు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పాస్‌పోర్ట్ నియంత్రణ స్వరూపం నాటకీయంగా మారింది. సంఘర్షణ నేపథ్యం నుంచి పుట్టిన నానాజాతి సమితి శాంతి, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ ప్రయాణానికి ప్రామాణిక వ్యవస్థను రూపొందించింది. 1921 నాటికి కఠినమైన వలస నియంత్రణలను విధించడానికి అమెరికా నాటి రాజకీయ అవకాశాలను ఉపయోగించుకుంది. ఎమర్జెన్సీ కోటా చట్టం, 1924 ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచి్చంది. ఇవి వలసల ప్రవాహాన్ని తగ్గించాయి. ఒకప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఉన్న పాస్‌పోర్టు ఆ తరువాత పాశ్చాత్య కేంద్రీకృత శక్తులు ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించే నియంత్రణ సాధనంగా మారింది.మొగలుల కాలంలో.. మధ్యయుగానికి వచ్చే నాటికి ప్రయాణ డాక్యుమెంటేషన్ ప్రగతి సాధించింది. ప్రయాణాల పర్యవేక్షణ, నియంత్రణకు భారత ఉపఖండమంతటా పలు రకాల చట్టబద్ధత, ఆమోదంతో కూడిన పత్రాలు జారీ చేసేవారు. మొగల్ చక్రవర్తులతో పాటు ప్రాంతీయ పాలకులుం కూడా ప్రయాణికులకు, వ్యాపారులకు, యాత్రికులకు, దౌత్యవేత్తలకు ‘సనద్’లు, సురక్షిత ప్రవర్తన లేఖలు జారీ చేశారు. వాణిజ్య, సాంస్కృతిక మారి్పడిని ప్రోత్సహించి వారు సురక్షితంగా ప్రయాణించేలా చూశారు. శతాబ్దాల క్రితంం వెలుగు చూసిన ‘సౌఫ్ కండిక్ట్’ (సేఫ్ కండక్ట్) పాస్‌ను ప్రాథమిక ప్రయాణ పత్రంగా చెప్పవచ్చు. అయితే ఇది ప్రధానంగా పాలకుల మధ్య లిఖితపూర్వక ప్రతిజ్ఞ. యుద్ధ భయం లేకుండా సరిహద్దులు దాటి సురక్షితంగా ప్రయాణించేలా చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం వంటిది.1920 నాటి ‘పాస్‌పోర్ట్ తీర్మానం’ అంతర్జాతీయ ప్రయాణాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూనే, అసమానతలకు పునాది వేసిందంటారు. ఎందుకంటే అప్పట్లో అమెరికాలో కూడా మహిళలకు ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ ఉండేది కాదు. భర్తల పాస్పోర్టులోనే ఫుట్ నోట్సులో భార్య పేరు పేర్కొనేవారు. దాంతో వారు స్వతంత్రంగా సరిహద్దులను దాటలేకపోయారు. ఇవన్నీ నాటి సమాజ లింగ అసమానత, మహిళలపై వివక్షకు అద్దం పట్టేవే. ఇటీవలి దశాబ్దాల్లో పాస్‌పోర్ట్ ప్రపంచ రాజకీయాలు, మార్కెట్ శక్తుల ఇష్టాలకు లోబడి డిమాండ్ ఉన్న వస్తువుగా మారిపోయింది. 2016లో అమెరికాలోనే ఏకంగా 1.86 కోట్ల పాస్‌పోర్టులు జారీ అయ్యాయంటే వాటి డిమాండ్ ఎంతటిదో అర్థమవుతోంది. ప్రపంచానికి ప్రవేశ ద్వారమైన పాస్‌పోర్ట్ కొందరికి అధికార చిహ్నం. మరికొందరికి మినహాయింపులకు సాధనం. మనం పుట్టిన దేశాన్ని బట్టి, పాస్ పోర్ట్ మనకు అత్యంత సౌలభ్యాన్ని ఇవ్వొచ్చు. లేదా విపరీతమైన బాధను కలిగించవచ్చు. -
యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్‌ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
నకిలీ ఇన్వాయిస్ల కట్టడికి బయోమెట్రిక్ అథెంటికేషన్
నకిలీ ఇన్వాయిసింగ్ కేసులను అరికట్టడానికి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ లను ఎదుర్కోవడానికి ఆధార్ ఆథెంటికేషన్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆలిండియా ప్రాతిపదికన బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను అరికట్టడంలో సహాయపడటంతో పాటు, జీఎస్టీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
'ఫేస్ స్కాన్ చేసి.. టైమ్ సేవ్ చేస్తుంది': బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెక్నాలజీ
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA)ను నిర్వహిస్తున్న.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) దేశంలోనే మొట్ట మొదటి బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని పరిచయం చేసింది. ఇంతకీ ఈ 'బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సర్వీస్ అంటే ఏమిటి? ఇదెలా పనిచేస్తుంది? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో..గతంలో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్క్‌ల వద్ద బోర్డింగ్ పాస్‌ను ప్రింట్ చేసి, బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి దానిని స్కాన్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పింది.ఇప్పుడు ఫేస్ స్కాన్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులు ఎక్కువసేపు అక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇటువంటి టెక్నాలజీ ప్రస్తుతం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పా ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడంతో.. బెంగుళూరు విమానాశ్రయానికి సాంకేతిక అభివృద్ధిలో అగ్రగామి అని పేరు వచ్చింది.ఇదెలా పనిచేస్తుందంటే?ప్రయాణికులు సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాఫ్ట్ మెషన్‌లో బ్యాగేజ్ డ్రాఫ్ట్ కోసం స్కాన్ ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకోవాలి.ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకుని కొనసాగించడానికి డిజియాత్ర ఐకాన్ ఎంచుకోవాలి. తరువాత ప్రయాణీకులను వారి బయోమెట్రిక్ ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు నేరుగా కెమెరాలోకి చూడమని నిర్దేశిస్తుంది.ఇది పూర్తయిన తరువాత మెషన్ ఫ్లైట్ వివరాలను చూపిస్తుంది. ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళుతున్నారో లేదో ప్రకటించమని వారిని ప్రాంప్ట్ చేస్తుంది. ప్రయాణికులు ప్రకటించిన తర్వాత.. మెషన్ ప్రయాణికుడికి బ్యాగ్‌ను కన్వేయర్‌పై ఉంచమని నిర్దేశిస్తుంది. ఇది బ్యాగేజ్ ట్యాగ్‌ను జత చేయమని వారిని అడుగుతుంది.బ్యాక్ వెయిట్ వేయడం కూడా పూర్తి చేసి మెషన్ స్కాన్ చేస్తుంది. బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఫీడ్ అవుతుంది. ఆ తరువాత బ్యాగేజీ సంబందించిన రసీదు కూడా అందిస్తుంది.నిర్దేశించిన లగేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు.. చెల్లింపును పూర్తి చేయడానికి ప్రయాణికులు కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి. బయోమెట్రిక్‌లను ఎంచుకోకూడదనుకునే వారు తమ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయడం కొనసాగించవచ్చు, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ఎంచుకోవచ్చు.బెంగుళూరు విమానాశ్రయంలో ఆటోమేటెడ్ 'సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సిస్టమ్ 2018లోనే అమలులోకి వచ్చింది. ఆ తరువాత ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండటానికి 2019లో డిజియాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని తీసుకువచ్చారు.🚨 Bengaluru airport launches India's first biometric-enabled self-bag drop facility. pic.twitter.com/qm1qhzJc1E— Indian Tech & Infra (@IndianTechGuide) June 6, 2024 -
అంగన్వాడీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ హాజరు చేపట్టాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూడాలని, అవసర మైనచోట కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. శనివారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సీఎం సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించడ మే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 35వేల అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారు లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఉపాధి హామీ’ లింకేజీతో సొంత భవనాలు రాష్ట్రంలో 12,315 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి శాశ్వత ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేçపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఆరు నెలలకోసారి వారోత్సవాలు.. మహిళా శిశుసంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆరి్టఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కారి్మకులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దురి్వనియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కారి్మకులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కారి్మకులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగి్నషన్ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కారి్మకులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కారి్మకుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహా్వనించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
అయ్యో పాపం అబ్మాయి!
‘ప్రేమా మజాకా!’ అని మరోసారి అనిపించే సంఘటన ఇది. పంజాబ్‌కు చెందిన ఆంగ్రేజ్ సింగ్, పరమ్‌జిత్ కౌర్ ప్రేమికులు. కౌర్ ‘బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ నిర్వహించే మల్టీ–పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంది. అయితే తన ప్రియురాలు కష్టపడడాన్ని ఆంగ్రేజ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ‘నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను. ఆ కష్టమేదో నేను పడతాను’ అంటూ రంగంలోకి దిగాడు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు కష్టపడ్డాడో లేదో తెలియదుగానీ మీసాలు, గెడ్డాలు గీయించి, పెదాలకు లిపిస్టిక్ పూసి, సల్వర్ కమిజ్ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే కనబడడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే బయోమెట్రిక్ దగ్గర ఫింగర్‌ప్రింట్స్ ఫెయిల్ కావడంతో ఆంగ్రేజ్ సింగ్ పట్టుబడ్డాడు. దీంతో సోషల్ మీడియాలో ఆంగ్రేజ్సింగ్పై మీమ్సే మీమ్స్. అయ్యో పాపం అబ్మాయి! -
నేటి నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్–2024 తొలి విడత దేశవ్యాప్తంగా బుధ వారం నుంచి మొదలవుతుంది. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. తొలి మూడు రోజులు బీఆర్క్ (పేపర్–1) నిర్వహిస్తారు. తర్వాత రోజుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ఉంటుంది. ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను ముందే వెల్లడించారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే బాగుంటుందని ఎన్టీఏ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపడుతున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించరు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తు న్నారు. మధ్యలో బయటకు వెళ్లి వచ్చినా ఇది తప్పనిసరి. విద్యార్థులు ముందే డిజి లాకర్లో రిజి స్టర్ అవ్వాలి. ఈ సందర్భంగా ఎన్టీఏ విద్యార్థుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ♦ ఎ–4 సైజ్‌లో అడ్మిట్ కార్డును కలర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లో అంటించిన పాస్‌పోర్టు ఫొటో ఒకటి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, రేషనల్ కార్డు, ఆధార్, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. గుర్తింపు కార్డు లేకుంటే కేంద్రంలోకి అనుమతించరు. దివ్యాంగులు విధిగా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలను వెంట తెచ్చుకోవాలి. వీరికి అదనంగా 20 నిమిషాలు పరీక్ష రాసేందుకు కేటాయిస్తారు. ♦ మీడియం, సబ్జెక్టుతో కూడిన ప్రశ్నపత్రంలో తప్పులుంటే తక్షణమే ఇన్విజిలేటర్ దృష్టికి తేవా లి. బీఆర్క్ పరీక్ష రాసే వారు అవసరమైన జామె ట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్, క్రెయాన్స్‌ను సొంతంగా సమకూర్చుకోవాలి. ♦ ఎలాంటి టెక్ట్స్ మెటీరియల్, పెన్సిల్స్‌ను భద్ర పరిచే బాక్సులు, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, తెల్ల పేపర్లు అనుమతించరు. సెల్ఫోన్లు, మైక్రో ఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, వాచీలను హాళ్లలోకి తీసుకెళ్లే వీల్లేదు. పరీక్ష గదిలో అవ సరమైన తెల్ల పేపర్‌ను కేంద్రం నిర్వహకులే అందజేస్తారు. దీనిపై అభ్యర్థి రోల్ నంబర్ వేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత దీన్ని చెత్త బుట్టలో పడేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ సహా అత్యవసర వైద్యానికి వాడే మందులను వెంట తెచ్చుకొనేందుకు మాత్రం అనుమతి ఉంది. -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
గ్రూప్-1 ఫలితాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
-
మెడికల్ కాలేజీలో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ హాజరు
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మూడు బయోమెట్రిక్ మిషన్లు, ఒక్కొక్క ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌తోపాటు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే హాజరు నమోదు చేస్తుండగా, వీటిని నేరుగా డీఎంఈకి అనుసంధానం చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇకపై వీరి పర్యవేక్షణను జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) కమాండ్ కంట్రోల్ నుంచే చేసేలా చర్యలు తీసుకుంటోంది. నేరుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఉద్యోగుల హాజరును పరిశీలించనున్నారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు హాజరైనప్పుడు ఒకసారి, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేసి, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. గత నెలలోనే ఇందుకు సంబంధించిన అధునాతన బయోమెట్రిక్ పరికరాలను బిగించి, సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేశారు. ఉద్యోగుల వివరాలన్నింటినీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి వినియోగిస్తున్నారు. ఏ సమయానికి హాజరు అవుతున్నారు అనే దానితోపాటు పనితీరు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరుకు చెక్ మంచిర్యాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత ఏడాది 100 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. ఇటీవల నీట్ పరీక్ష నిర్వహించగా, ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది మరో 100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు పొంది చేరనున్నారు. ప్రతియేటా పెరుగుతున్న మెడిసిన్ విద్యార్థులకు అనుగుణంగా, అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను నియమిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల మెడికల్ కాలేజీకి అనుబంధంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం 130 పడకలతో కొనసాగుతోంది. నె లలో 400కు పైగా ప్రసవాలు జరుగుతుండగా, ప్రతీ రోజు 150 మందికి పైగా గర్భిణులు ఓపీకి వస్తున్నా రు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 280 పడకలతో వైద్య సేవలు అందిస్తుండగా, అన్ని విభాగాల్లో అ సోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యులను నియమిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ప్రొఫెసర్లు 11 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆరుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 49 మంది, సీనియర్ రెసిడెంట్లు 44, ట్యూటర్లు 4, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 16 మంది ఉండగా, ఇతర వైద్య సిబ్బంది 20 మందికి పైగా ఉన్నారు. బయోమెట్రిక్ పరికరాలతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హాజరు సరిగ్గా పాటించని ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకునేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సమయపాలన పాటిస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేందుకు ఇప్పటికే మూడు చోట్ల బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నాం. డీఎంఈ నుంచి హాజరును పర్యవేక్షిస్తున్నారు. ఎన్ఎంసీకి అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం లాగిన్‌ఐడీ వస్తే, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదును డీఎంఈతోపాటు ఢిల్లీలోని ఎన్ఎంసీ పరిశీలిస్తారు. – డాక్టర్ ఎండీ సులేమాన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఎంసెట్‌కు బయోమెట్రిక్ తప్పనిసరి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, వైద్య, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఎంసెట్–2023 ఈ నెల 10వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 10, 11 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరుగుతుంది. 12 నుంచి 14 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుంది. రెండు సెషన్లుగా ఉండే ఈ పరీక్ష, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఒక విడత, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకూ రెండో విడత జరుగుతుంది. 2 రాష్ట్రాల పరిధిలో ఇంజనీరింగ్ ఎంసెట్ 2,05,405 మంది, అగ్రి, మెడికల్ ఎంసెట్ 1,15,361 మంది రాస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా 104, ఆంధ్రప్రదేశ్‌లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే రోజుల్లో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు. పరీక్ష రాసేవారికి జేఎన్టీయూహెచ్ కొన్ని సూచనలు చేసింది. బయోమెట్రిక్ తప్పనిసరి.. ► ఎంసెట్ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి. ఈ కారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కుంటే బయో మెట్రిక్ హాజరుకు ఇబ్బంది ఉండదు. ► ఉదయం పూట ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే వారు 7.30కే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యా హ్నం 3 గంటలకు జరిగే పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలి. ఒక్క నిమిషం దాటినా పరీక్షకు అనుమతించరు. ► విద్యార్థులు బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ (రిజర్వేషన్ కేటగిరీ కుల ధ్రువీకరణ) పత్రాలతో మాత్రమే పరీక్ష హాలులోకి రావాల్సి ఉంటుంది. ► కాలుక్యులేటర్లు, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, పేజీలు, సెల్ఫోన్లు, రిస్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించరు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలొస్తే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి. అవసరమైన పక్షంలో వేరే కంప్యూటర్ అందిస్తారు. ► అభ్యర్థులు ఫొటో గుర్తింపు (జిరాక్స్ కాకుండా)తో పరీక్షకు హాజరవ్వాలి. కాలేజీ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌పై, ఆన్లైన్ ఫైల్ చేసిన అప్లికేషన్‌పై ఇన్విజిలేటర్ ఎదురుగా సంతకం చేయాలి. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
అడ్డగోలు అడ్మిషన్లుచెల్లవ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు మరింత దృష్టి పెట్టింది. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా చేపట్టే అడ్మిషన్లు చెల్లవని స్పష్టంచేసింది. అలాంటి కాలేజీల వివరాలు సేకరించి తమకు పంపాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించింది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటు ఈ ఏడాది సకాలంలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈలోగా ఎక్కడా ఏ కాలేజీ అడ్మిషన్లు తీసుకోవడానికి వీల్లేదని, కాలేజీకి గుర్తింపు రాకపోతే బోర్డు బాధ్యత వహించదని స్పష్టంచేసింది. ప్రతీ ప్రైవేటు కాలేజీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను పొందుపరుస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏటా బోర్డు నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై గట్టి నిఘా ఉంచాలని, వాటి వివరాలను తమకు పంపాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మెరుగైన బోధన ఉండాల్సిందే.. ఎక్కడైతే అనుబంధ గుర్తింపు పొందుతారో, అక్కడే కాలేజీ నిర్వహించాలని, ఒకచోట అనుమతి, వేరొకచోట కాలేజీ ఉంటే పర్మిషన్ రద్దు చేస్తామని ప్రైవేటు ఇంటర్ కాలేజీలను బోర్డు హెచ్చరించింది. ఈ దిశగా వివరాలు సేకరించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బోధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ఒక క్యాంపస్‌కే పరిమితం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేటప్పుడు వారి వివరాలను ఈ ఏడాది నుంచి బోర్డు ఆన్లైన్లో నమోదు చేయబోతోంది. విద్యాసంవత్సరం మొదట్లో నియమించిన అధ్యాపకులే చివరి వరకూ ఉండాలనే నిబంధన విధించింది. ఒకవేళ అధ్యాపకుడిని మారిస్తే ఆ విషయాన్ని బోర్డు అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల బోధన ఏ స్థాయిలో జరుగుతుందనేది అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఈ ఏడాది నుంచి సిబ్బంది బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయనున్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు విధిగా పీజీ చేసి ఉండాలి. వారి వివరాలు, ఆధార్, బయోమెట్రిక్‌కు అవసరమైన వివరాలను ఆన్లైన్ ద్వారా ఫీడ్ చేస్తారు. విద్యా సంవత్సరం ముగిసే వరకూ వారి బయోమెట్రిక్ కొనసాగేలా చూస్తారు. ప్రతీ కాలేజీలో ప్రత్యేక మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలని, ఇది జిల్లా ఇంటర్ విద్యాధికారికి తెలపాలని సూచించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్ణయించిన తేదీల్లోనే ప్రవేశాలు, తరగతులు జరగాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. -
టాటూలు.. మెహందీలు వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొలువు కోసం కలలుకంటున్న యువత కీలక ‘పరీక్ష’కు సమయం ఆసన్నమైంది. శనివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎస్సై తుదిరాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సివిల్ ఎస్సై, కమ్యూనికేషన్ ఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ తుది రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల సమయంలో నమోదైన వేలిముద్రలతో సరిపోలితేనే పరీక్షకు అనుమతిస్తారు. ఒకరికి బదులు వేరొక అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకత కోసం ఈ విధానాన్ని పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గత రెండు రిక్రూట్మెంట్ల నుంచి అమల్లోకి తెచ్చారు. అభ్యర్థులు చేతులకు మెహందీ(గోరింటాకు), టాటూలు వేసుకోవద్దని, వాటి కారణంగా బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది తలెత్తితే పరీక్షకు అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి విధిగా హాల్‌టికెట్ ఏ 4 సైజులో ప్రింటవుట్ తీసుకోవడంతోపాటు దానిలో సూచించిన ప్రాంతంలో పాస్‌పోర్ట్ సైజు ఫొటో(ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసింది) అతికించి తేవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించకుండా వచ్చే అభ్యర్థులను పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ... సివిల్ ఎస్సై పోస్టుకు 1,01,052 మంది, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టుకు 11,151 మంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సైకి 2,762 మంది, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుకు 4,820 మంది పార్ట్–2 దరఖాస్తులు(తుది రాతపరీక్ష కోసం దరఖాస్తు) పూర్తి చేశారు. వీరంతా శని, ఆదివారాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల్లో జరిగే తుది రాతపరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి సాంకేతికత.. పక్కాగా ఏర్పాట్లు లక్షకుపైగా యువత నెలలుగా తుది రాతపరీక్షకు సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పక్కాగా ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు పోలీస్ నియామక మండలి పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. పరీక్షకేంద్రాల్లో అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షపత్రాల లీకేజీల నేపథ్యంలో ఎస్సై తుది రాతపరీక్షలో పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షకేంద్రాలున్న హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలున్నాయి: డీజీపీ ఎస్సై తుది రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, చాలా రూట్లలో శనివారం ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకునేలా జాగ్రత్తపడాలని సూచించారు. -
ఆధార్ తీసుకుని ఎన్ని రోజులవుతోంది? కేంద్రం కొత్త నిబంధన తెలుసా?
సాక్షి, అమరావతి: ‘ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయి.. ఇప్పటికీ అదే అడ్రస్‌లో ఉన్నా మీరు విధిగా మీ ఆధార్ కార్డును అదే అడ్రస్ ప్రూఫ్‌తో అప్డేట్ చేసుకోవాల్సిందే’.. అంటూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ స్పష్టంచేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు సైతం రాసింది. ఈ మేరకు ఆధార్ కార్డు జారీ చట్టంలోనూ మార్పులు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా ఇచ్చింది. ‘ఆధార్‌ను ఇప్పుడు అనేక ప్రభుత్వ సేవలు పొందేందుకు ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ ప్రామాణీకంతోనే సంబంధిత వ్యక్తి గుర్తింపు రుజువుగానూ మారింది. ఎలాంటి సేవలను పొందాలన్నా ప్రతి ఒక్కరూ తమ తాజా వివరాలను యూఐడీఏఐకు సమర్పించాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్‌ను పొందిన వారు, ఇప్పటికీ అదే చిరునామాలో నివసిస్తున్నందునో, లేదా వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో దానిని అప్డేట్ చేయకపోవచ్చు. కానీ, సరైన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి చిరునామాను మళ్లీ ధృవీకరించుకోవాలి’.. అంటూ ఆధార్ కార్డు జారీలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అలెక్స్ కుమార్ శర్మ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టంచేశారు. ఆధార్ అప్డేట్ సమయంలో ప్రతి ఆధార్ కార్డుదారుడు తమ చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫొటో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్డేట్ కాని కార్డులు 1.65 కోట్లు.. 2022 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 5,19,98,236 మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. అయితే, వీరిలో 1,65,47,906 మంది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన మేరకు ఆధార్‌కార్డు పొందిన పదేళ్లలో కనీసం ఒక్కసారి తమ అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకోని వారుగా యూఏఐడీఏ గుర్తించింది. రాష్ట్రంలో ఈ కొత్త నిబంధన ప్రకారం ఆధార్ అప్డేట్ చేసుకోని వారు అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18 లక్షల మందికి పైగా ఉండగా, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.78లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. ప్రత్యేక క్యాంపులు ఆధార్ కార్డుల జారీలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఆధార్ సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు లేదా ప్రత్యేక ఆధార్ కార్డు జారీ కేంద్రాలు ఉండే పట్టణాలతో పాటు ఎంపిక చేసుకున్న 2,377 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఆ ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. ఇప్పటి 15 ఏళ్లలోపు, 15–17 ఏళ్ల మధ్య వయస్సున్న వారి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రతినెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. అయితే, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం అన్ని వయస్సుల వారు తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవడానికి వీలుగా ఆయా సచివాలయాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గ్రామాల వారీగా పదేళ్ల పూర్తయినా ఆధార్ అప్డేట్ చేసుకోని వారి వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఇప్పటికే యూఐడీఏఐ నుంచి సేకరించి, ఆ వివరాలను కూడా జిల్లాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. -
డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా!
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రయాణం మరింత సులభతరం కానుంది. దేశీయ ప్రయాణాల కోసం ఇక టెర్మినల్‌లోని సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాయింట్ల వద్ద వేచి చూడాల్సిన అవసరం ఉండదు. తమ ఫోన్ నుంచే బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేసి నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోర్టు ఆవరణలో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డిజి యాత్ర’ పేరుతో రూపొందించిన బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ తరహా సేవలు ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి విజయవాడతో పాటు హైదరాబాద్, కోల్‌కతా, పూణే విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయంలో డిజి యాత్ర కోసం నాలుగు కియోస్క్‌లను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ కూడా ప్రారంభించారు. డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా... ► డిజి యాత్ర యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ యాప్‌లో వినియోగదారులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్, చిరునామా, ఫొటో, ఆధార్ ఆధారిత ధ్రువీకరణపత్రం అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారునికి డిజి యాత్ర ఐడీ వస్తుంది. దానిని వినియోగదారులు నమోదు చేసుకోవాలి. ► విమాన టికెట్ బుకింగ్ సమయంలో డిజి యాత్ర ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలి. విమాన ప్రయాణానికి సంబంధించి బోర్డింగ్ పాస్‌ను కూడా యాప్‌లో స్కాన్ చేయాలి. దీంతో ప్రయాణికుడి వివరాలు సదరు విమానాశ్రయానికి చేరుతాయి. ► ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత టెర్మినల్ బయట ఈ–గేట్ వద్ద డిజి యాత్ర యాప్‌ను ఉపయోగించి బోర్డింగ్ పాస్ బార్‌కోడ్‌ను స్కాన్‌చేసి, ఫేషియల్ రికగ్నైజేషన్ చేయించుకోవాలి. దీంతో విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వ్యక్తిగత, ప్రయాణ వివరాలు సంబంధిత ఎయిర్‌లైన్స్ ఆన్లైన్లో ధ్రువీకరించుకుంటుంది. దీనివల్ల ప్రయాణికులు సెక్యూరిటీ చెక్ వద్ద గుర్తింపు కార్డు చూపించకుండానే, బోర్డింగ్ పాయింట్ల వద్ద నిరీక్షించకుండా సులభంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోకి ప్రవేశించవచ్చు. ట్రయల్ రన్ దశలో... ప్రస్తుతం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజి యాత్ర బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం ట్రయల్ రన్ దశలో ఉంది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సంబంధించి డిజి యాత్రలో నమోదైనవారి వివరాలతో ఈ సిస్టం పనితీరును పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ప్రయాణికులకు మరింత అవగాహన కలిగించేందుకు టెర్మినల్ ఆవరణలో డిజి యాత్ర యాప్‌కు సంబంధించిన స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు. మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో డిజి యాత్రను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
విద్యార్థుల కోసం ఆధార్ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి 4రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,485 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నుంచి నిర్వహించనుంది. కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదేళ్ల వ్యవధిలో ఒక్కసారి కూడా తమ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోనివారు దాదాపు 80 లక్షల మంది ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ 15 ఏళ్లలోపు వయసు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చింది. ఈ నెలలో 15నుంచి 17 ఏళ్ల వయసులోపు విద్యార్థులకు జూనియర్ కాలేజీల్లో క్యాంపులు నిర్వహిస్తోంది. సచివాలయాల్లో నిర్వహించే ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ సేవలను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్ణీత రుసుంతో అదనంగా మరో 10 రకాల ఆధార్ సేవలను పొందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బయోమెట్రిక్ (ఫొటో, ఐరిస్, ఫింగర్ ప్రింట్) అప్డేట్, పేరు మార్పు, పుట్టిన తేదీ వివరాల మార్పు, జెండర్, చిరునామా మార్పు సేవలతో పాటు కొత్తగా ఆధార్ వివరాల నమోదు, ఆధార్ కార్డు డౌన్లోడ్ సేవలను కూడా ఆ క్యాంపుల్లో పొందవచ్చు. -
AP: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..
సాక్షి, అమరావతి: ఆధార్‌లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్మోహన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్నారు. నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 35 సంక్షేమ పథకాలకూ ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తోంది. పారదర్శకత కోసం ప్రభుత్వ లబ్ధిని అందజేసే ముందు, అందజేసిన తర్వాత కూడా లబ్ధిదారుల నుంచి వలంటీర్లు బయోమెట్రిక్ తీసుకొంటున్నారు. బయోమెట్రిక్ వివరాల్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక క్యాంపుల ద్వారా రాష్ట్ర ప్రజలందరి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేస్తోంది. చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య) -
30 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ‘ఆధార్’ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఈ నెల 30 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజులు పాటు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ ఆధార్ కార్డులో తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి దాకా ఆధార్ వివరాలు అసలు నమోదు చేసుకోని పాఠశాలల విద్యార్థులు ఈ క్యాంపులో తమ వివరాలు పూర్తి ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్! తనిఖీల్లో బండారం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయతి్నంచగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నిషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్‌లో హాజరుకోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచి్చనట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. (చదవండి: సీబీఐ ఛాయ్ బిస్కెట్ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్) -
రబ్బర్ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్ హాజరు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వ వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యే విధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దొడ్డిదారులు వెతుక్కుంటూ డుమ్మా కొడుతున్నారు. హాజరు పట్టీలో సంతకాలు పెట్టడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని బయోమెట్రిక్ విధానం తీసుకువస్తే దానికి కూడా కొందరు వైద్యులు అడ్డదారులు వెతికారు. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని 12 మంది వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ఇతరులచే బయోమెట్రిక్ వేయించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వేలిముద్రలతో రబ్బర్ తొడుగులను తయారు చేయించి విధులకు హాజరు కాకుండా ఇతరులచే బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించినట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. దొడ్డి దారిన హాజరు వేసిన 12 మంది వైద్యులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. వీరిపై శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: (ప్రధానితో పవన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారంటే..!) -
రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఆధార్‌కు బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు ఈ నెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోటి మంది ఆధార్‌కు బయోమెట్రిక్ నమోదు కాలేదని, డిసెంబర్ నెలాఖరులోపు వారందరి బయోమెట్రిక్‌ను సేకరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,950 ఆధార్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా డిసెంబర్ నెలాఖరుకు నూరు శాతం ఆధార్‌కు బయోమెట్రిక్ సేకరించడం సాధ్యం కాదని, పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ మొబైల్ క్యాంపుల సమాచారాన్ని ముందుగా వలంటీర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలని సూచించింది. విద్యా శాఖ భాగస్వామ్యంతో పాఠశాలల పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌ను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో భాగంగా ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 200 బయోమెట్రిక్‌ను సేకరించాలని స్పష్టం చేసింది. ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణకు మండల, డివిజన్ వారీగా అధికారులను ఇన్చార్జిలుగా నియమించాలని తెలిపింది. పాఠశాలలు, సచివాలయాల్లో రోజు వారీగా ఆధార్ బయోమెట్రిక్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు సూచించింది. -
‘ఫేషియల్ అథంటికేషన్’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, ఉద్యోగుల హాజరు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధార్ అనుసంధానంతో కూడిన ‘ఫేషియల్ అథెంటికేషన్’ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దేశంలో ఇలా ఆమోదం పొందిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్) ద్వారా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగిస్తున్నారు. నిజానికి.. మన రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వోద్యోగుల హాజరులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. అయితే.. ఈ విధానంలో లబ్దిదారుల వేలిముద్రలు సేకరించడానికి, ఉద్యోగుల హాజరు నమోదుకు మొబైల్ ఫోన్లు, యాప్‌లకు తోడు ప్రత్యేక వేలిముద్రల నమోదు యంత్రాలను ఉపయోగిస్తారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటోంది. ఇందుకు ఏటా రూ.10–12 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. మరోవైపు.. వేలిముద్ర సరిపోక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫేíషియల్ అథంటికేషన్ విధానంలో అయితే అదనంగా ఎలాంటి పరికరాలు అక్కర్లేదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగానే అది ఆధార్‌కు అనుసంధానమై లబి్ధదారుణ్ణి గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. 80 వేల మందికి పింఛన్ల పంపిణీకి రూ.కోటి ఖర్చు.. ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో ప్రతినెలా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసుకునే వాళ్ల వేలిముద్రలు అరిగిపోవడంతో బయోమెట్రిక్ సమయంలో ఇచ్చే వేలిముద్రలకు ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బయోమెట్రిక్ స్థానంలో ఐరిస్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితోనూ సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతినెలా 80 వేల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతోంది. ఇలాంటి వారి ఫొటోలను స్థానిక సిబ్బందే ముందుగా యాప్‌లో నమోదుచేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబి్ధదారుని ఫొటో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. నిజానికి.. ఒక లబి్ధదారునికి ఒక విడత పంపిణీ చేస్తే రూ.10 చొప్పున సాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు పింఛన్ల పంపిణీలో ఆధార్ ఫేషియల్ విధానాన్ని ప్రవేశపెడితే మధ్యలో స్టాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆధార్ బేస్డ్ ‘ఫేషియల్ అథంటికేషన్’లో కొద్దిపాటి అవినీతికీ ఆస్కారముండదని అధికార వర్గాలు వివరించాయి. ప్రయోగాత్మకంగా అమలుచేశాకే పూర్తిస్థాయిలో.. ఈ రెండు విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందులన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు యూఐడీఏఐ విభాగం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్రంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుకు కేంద్ర ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ అనుమతిని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోరింది. ఆయా సంస్థల సూచనల మేరకు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో అమలుచేశారు. ఆ తర్వాతే ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగానికి ఆమోదం లభించింది. సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్’ ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి ఆధార్ అనుసంధానంతో కూడిన ఫేషియల్ (ముఖం గుర్తింపు) ద్వారా కూడా హాజరు నమోదుచేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొబైల్ యాప్‌లో శుక్రవారం కొత్తగా ఈ సౌకర్యాన్ని కలి్పంచారు. ఇక నుంచి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంతోపాటు ఐరిస్ (కళ్లు గుర్తింపు) విధానం, కొత్తగా ఫేషియల్ విధానంలోనూ హాజరు నమోదుకు వీలు కల్పించారు. ఈ మూడింట్లో దేని ద్వారానైనా హాజరు నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. -
నేరస్తుల చుట్టూ ముద్రావలయం
సాక్షి, అమరావతి: సమర్థంగా, సమగ్రంగా, త్వరగా కేసుల దర్యాప్తు దిశగా దేశం కీలక ముందడుగు వేయబోతోంది. అందుకోసం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించే వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. కంటిపాప (రెటీనా) నుంచి కాలివేళ్ల దాకా మొత్తం బయోమెట్రిక్ డేటాను సేకరించనుంది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ఐడింటిఫికేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించమని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ని ఆదేశించింది. ఇప్పటివరకు ఖైదీల చేతి వేలిముద్రల సేకరణకే అధికారం నేరస్తులు, అనుమానితుల సమగ్ర డేటాను భద్రపరచడం నేర పరిశోధనకు అత్యంత అవసరం. ఆ కీలక డేటా అందుబాటులో ఉంటే కేసుల దర్యాప్తు, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, సాక్ష్యాధారాల సేకరణ, నేరాన్ని నిరూపించడం సులభసాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరస్తులు కొత్తకొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదం, తీవ్రవాద బెడద పొంచి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో 1920లో రూపొందించిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టాన్ని ఇంకా అనుసరిస్తుండటం సరికాదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖైదీల చేతి వేలిముద్రలను మాత్రమే సేకరించే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కాలానుగుణంగా మారుతున్న నేరాల నిరూపణకు వేలిముద్రలు సరిపోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్–1920 స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం–2022ను పార్లమెంటు ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించింది. ఈ చట్టం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలను కట్టబెట్టింది. ప్రాథమిక విధానం ఖరారు నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు ఎన్సీఆర్బీ విధివిధానాలను రూపొందిస్తోంది. అందుకోసం ఇటీవల అన్ని రాష్ట్రాల నేరగణాంక సంస్థ (ఎస్సీఆర్బీ)లతో సమావేశం నిర్వహించింది. బయోమెట్రిక్ ఆధారాల కింద వేటిని సేకరించాలి, ఎలా భద్రపరచాలి, అమలులో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించి ప్రాథమికంగా ఓ విధానాన్ని ఖరారు చేశారు. న్యాయస్థానాల నుంచి మినహాయింపు ఉన్న కేసుల్లో మినహా అన్ని కేసులకు సంబంధించిన నేరస్తులు, ఖైదీల పూర్తి బయోమెట్రిక్ డేటాను సేకరించాలని నిర్ణయించారు. సీఆర్పీసీ సెక్షన్లలోని చాప్టర్ 9ఏ, చాప్టర్ 10 కింద అరెస్టయి రిమాండులో ఉన్న ఖైదీల బయోమెట్రిక్ డేటాను కనీసం ఎస్పీ ర్యాంకుకు తక్కువకాని పోలీసు అధికారి లిఖితపూర్వక అనుమతితో సేకరిస్తారు. నేరస్తులు, ఖైదీల కంటిపాప, రెండుచేతుల వేలిముద్రలు, రెండు అరచేతులు, రెండు అరిపాదాలు, రెండుకాళ్ల వేలిముద్రలు, ఫొటోలు, సంతకం, చేతిరాత.. ఇలా అన్నీ సేకరిస్తారు. వాటి స్కాన్ కాపీలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. కేవలం నిషేధ ఆజ్ఞల ఉల్లంఘన, ముందస్తు అరెస్టుల కింద అదుపులోకి తీసుకున్నవారి బయోమెట్రిక్ ఆధారాలు సేకరించరు. వాటితోపాటు ఇతర నేరాలు ఏమైనా ఉంటే మాత్రం బయోమెట్రిక్ ఆధారాలు సేకరిస్తారు. ఎవరైనా నేరస్తులు, ఖైదీలు తమ బయోమెట్రిక్ ఆధారాలు ఇచ్చేందుకు సమ్మతించకపోతే అది మరో నేరంగా పరిగణిస్తారు. నేర ఆధారాలను ధ్వంసానికి పాల్పడిన నేరంగా కేసు నమోదు చేసేందుకు పోలీసులకు అధికారం ఉంది. ఆమేరకు న్యాయస్థానం అనుమతితో బలవంతంగా అయినా సరే బయోమెట్రిక్ ఆధారాలు సేకరించే అధికారం పోలీసులకు ఉంది. డిజిటల్ రూపంలో భద్రం నేరస్తులు, ఖైదీల బయోమెట్రిక్ ఆధారాలను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర భద్రతా బలగాలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు సేకరించిన డేటాను డిజిటల్ రూపంలో అందులో భద్రపరుస్తారు. వాటిని అన్ని రాష్ట్రాల ఫోరెన్సిక్ విభాగాలకు అనుసంధానిస్తారు. దీంతో కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు చేపట్టే కేసుల దర్యాప్తు కోసం ఆ డేటా అందుబాటులో ఉంటుంది. ఒక్కో నేరస్తుడు, ఖైదీ నుంచి సేకరించే డేటాను కనీసం 75 ఏళ్లు భద్రపరచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం ఇక అవసరంలేదని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తే న్యాయస్థానం అనుమతితో ఆ డేటాను ధ్వంసం చేస్తారు. అందుకోసం కూడా ఓ విధానాన్ని రూపొందించనున్నారు. త్వరలోనే సమగ్ర బయోమెట్రిక్ డేటా సేకరణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. -
బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు!
దేశంలో ఆధార్ అనేది సామాన్యుని గుర్తింపుగా ప్రాచుర్యం పొందింది. గత 8 సంవత్సరాలుగా ఆధార్ భారతీయులకు గుర్తింపు పరంగా ముఖ్యంగా మారిందనే చెప్పాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించగా తాజాగా ఈ గుర్తింపు కార్డ్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రజలు.. ఆధార్‌లో వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేసుకోవాలనే రూల్స్ రావొచ్చని నివేదికలు చెప్తున్నాయి. సమాచారం ప్రకారం.. ఆధార్ కార్డు దారులు వారి ఫేస్, ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ డేటాను ప్రతీ 10 ఏళ్లకు అప్డేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుందట. అయితే ఇందులో 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, ఐదు నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటే.. వాళ్లు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్‌లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లకు లోపు ఉన్న పిల్లలకు వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు లేనిపక్షంలో వారి సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా ఆ పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు. UIDAI తాజాగా గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇది నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు, నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తుంది. దీంతో ప్రజల డబ్బును ఆదా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. చదవండి: మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం..