అంగన్‌వాడీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు | Biometric and CC cameras in Anganwadi centers: Revanth Reddy | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు

Published Sun, Mar 3 2024 4:28 AM | Last Updated on Sun, Mar 3 2024 7:03 PM

Biometric and CC cameras in Anganwadi centers: Revanth Reddy - Sakshi

సమీక్షలో సీంఎ రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క

నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి

అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం

ఆరేళ్లలోపు పిల్లలకు వాటిలో ప్రీప్రైమరీ విద్య అందించేలా ఏర్పాట్లు

మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్‌ హాజరు చేపట్టాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని అంగన్‌ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూడాలని, అవసర మైనచోట కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. శనివారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సీఎం సమీక్షించారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించడ మే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 35వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారు లకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

‘ఉపాధి హామీ’ లింకేజీతో సొంత భవనాలు
రాష్ట్రంలో 12,315 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి శాశ్వత ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్‌వాడీ భవన నిర్మాణాలు చేçపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్‌వాడీ కేంద్రాల బ్రాండింగ్‌ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక డిజైన్‌ రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

ఆరు నెలలకోసారి వారోత్సవాలు..
మహిళా శిశుసంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇక దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్‌ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్‌ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement