
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయ ల్దేరి వెళ్లనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం సీఎం వెంట ఉంటారు. ఏప్రిల్ 16 నుండి 22 వరకు పర్యటన కొన సాగనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్య టించనుంది.
ఓసాకా వరల్డ్ ఎక్స్‌పో–2025లో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతిని ధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రా మిక, సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనుంది.