ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక మలుపు | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక మలుపు

Published Fri, Apr 26 2024 12:43 PM

Telangana Phone Tapping Case: Red Corner Notices For Prabhakar Rao - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(SIB) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రణీత్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్‌ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్‌ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్‌ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement