Red Corner Notice
-
రెడ్ కార్నర్ నోటీస్ జారీ సులువు కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసు జారీ ప్రక్రియ సీబీఐ వద్ద ప్రాసెస్‌లో ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు. రెడ్ కార్నర్ నోటీసు జారీకి సమయం పట్టొచ్చన్నారు. ‘రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అందులో అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇంటర్‌పోల్ గైడ్‌లైన్స్ పాటించాలి. దేశాల మధ్య ఒప్పందాలనూ పరిశీలించాలి. ఇలా ఎన్నో స్థాయిల్లో ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. స్థానికంగా ఒక పోలీస్‌స్టేషన్ నుంచి నోటీసులు ఇచ్చినట్టుగా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయలేం. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది’అని జితేందర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ సీపీ, వెస్ట్‌జోన్ డీసీపీల పర్యవేక్షణలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకుమించి మాట్లాడలేనన్నారు. ఇటీవల గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై జితేందర్ మంగళవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డీజేల వాడకాన్ని తగ్గిస్తున్నాం..: ‘ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలు ఇంకా ఉన్నాయి. తెలంగాణలో మావోయి స్టుల ప్రభావం లేదు. పోలీసుల పట్టు కొనసాగుతోంది. తమ ఉనికి చాటుకునేందుకు కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతంలోకి వచి్చనా.. పోలీసు బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగుతోంది’అని డీజీపీ చెప్పారు. జైనూర్‌లో ఇటీవల ఓ గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, తదనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 38 మందిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పండుగలు, ఉత్సవాల్లో డీజేల ను వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, వీలైనంత వరకు డీజేల వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యే అరికెపూడి గాందీ.. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. సివిల్ తగాదాల్లో ఉన్నట్టుగా చిక్కడపల్లి ఏసీపీపై వచి్చన ఆరోపణలపై హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఐజీలు రమేశ్, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్‌పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. -
ప్రభాకర్‌రావును రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్‌లు ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావుల మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐ సాయంతో తెలంగాణ సీఐడీ ఈ నోటీసుల్ని జారీ చేయించింది. తద్వారా ఇంటర్‌పోల్ ద్వారా వాళ్లను స్వదేశానికి రప్పించాలని చూస్తోంది.ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావు అరెస్ట్ అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక బృందం(సిట్).. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్‌రావు కనుసైగల్లోనే ట్యాపింగ్ వ్యవహారమంతా జరిగిందని నిర్ధారించుకుంది. ఏ1గా ప్రభాకర్‌రావు పేరును చేర్చింది. అటుపై ఆయన అమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే..ఈలోపు ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుక్ అవుట నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్‌రావు బదులు పంపించారు. కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ప్రభాకర్‌రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌ను కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ ఆచూకీని గుర్తించలేకపోయామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఏపీ సీఐడీ సాయంతో సీబీఐ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్ మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించింది సిట్. ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావును విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎలాగైనా ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయం కోరే ప్రయత్నాల్లో ఉంది. త్వరలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం అమెరికాకు వెళ్లే అవకాశం కూడా ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. గతంలోనే ప్రభాకర్‌రావు మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ టైంలో అధికారులు అదంతా ఉత్తదేనని తేల్చారు.రెడ్ కార్నర్ నోటీసులు.. ఇతర దేశాలకు పరారైన నిందితుల్ని కోర్టు విచారణ కోసం రప్పించేందుకు లేదంటే దోషుల శిక్ష అమలు కోసం రప్పించేందుకు జారీ చేసే నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు. ప్రపంచంలో ఉన్న 195 దేశాల జాతీయ దర్యాప్తు సంస్థల ఒప్పందం మేరకే ఈ వ్యవహారం నడుస్తుంది. ఇందుకోసం ఇంటర్‌పోల్ మధ్యవర్తితత్వం వహిస్తుంది. భారత్‌లో సీబీఐ సంస్థ రెడ్ కార్నర్ నోటీసుల జారీ, నిర్వహణను చూసుకుంటుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు. -
పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం
సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్‌నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్ చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి తొలగించారు. లియోన్-హెడ్‌క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్‌లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్‌పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా మోదీ సర్కార్‌ను ప్రశ్నించింది. PM मोदी का चहेता मेहुल 'भाई' चोकसी अब वांटेड नहीं रहा। भगोड़े मेहुल चोकसी के खिलाफ इंटरपोल ने रेड कॉर्नर नोटिस हटा लिया है। PM मोदी जवाब दें कि आपके 'मेहुल भाई' को देश वापस कब लाया जाएगा। 5 साल से फरार है, अब और कितना वक्त चाहिए? — Congress (@INCIndia) March 20, 2023 రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 2018లో డిసెంబరు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. నాలుగేళ్ల తరువాత మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్‌పోల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. ఇంటర్‌పోల్‌లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్‌తో సమానం కాదు. అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో నిందితుడిని కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. కాగా పీఎన్బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది. సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్‌పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్‌పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
చైనాకు పరారైన లోన్‌యాప్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : రుణాలు తీర్చినా తీవ్ర వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలు తీసుకునేలాగా చేసిన లోన్ యాప్స్ నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే వారు పోలీసులకు చిక్కకుండా స్వదేశం చైనాకు పరారయ్యారు. చైనాకు వెళ్లిన లోన్ యాప్స్ కంపెనీల రెక్టర్లను తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో డైరెక్టర్లను పట్టుకునే ప్రయత్నాలు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఆ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారం నడిపించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసే వారు కూడా భారత్‌కు చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. ఆ విధంగా డైరెక్టర్లను నియమించుకున్న చైనా కంపెనీలు ఇప్పుడు వారి నేరాలు బహిర్గతమవడంతో వారు చైనాకు పారిపోయారు. చైనాకు చెందిన కంపెనీలు భారత్‌కు చెందిన వారితో కంపెనీ నడిపిస్తున్న విషయం కేసుల నమోదు అనంతరం బయటపడింది. ఆ కంపెనీల భారీ ఆఫర్లు ఇవ్వడంతో భారత్‌కు చెందిన చాలామంది ఆశ పడి డైరెక్టర్లుగా చేరారు. ఇలాంటి 16 కంపెనీలపై ఇప్పటివరకు దాడులు చేసి పోలీసులు మూసివేశారు. అయితే చైనాకు పారిపోయిన ఈ కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా చైనాకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రుణాల యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక దాదాపు 5 మంది బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
నీరవ్‌కు మరో దెబ్బ, నేహాల్‌పై రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఇప్పటికే నీరవ్ సోదరి పూర్వి మోదీ మెహతాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగా తాజాగా సోదరుడు నేహాల్ దీపక్ మోదీ(40) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ నోటీసు జారీ చేసింది. నీరవ్ విదేశాలకు పారిపోవడంలో నేహాల్ పాత్రకీలకమైందని ఆరోపిస్తూ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఈడీ ఇటీవల ఇంటర్ పోల్‌ను అభ్యర్థించింది.మనీలాండరింగ్, సాక్ష్యాలను నాశనం చేసేందుకు, నేహాల్ ఉద్దేశపూర్వకంగా సహాయపడ్డాడని ఈడీ ఆరోపించింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్బ్యాంకులో ఎల్ఓయుల ద్వారా రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికే నీరవ్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు ఆస్తులను ఎటాచ్ చేశాయి. అటు నీరవ్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. అతనిని తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
చోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్
సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,000 కోట్ల పీఎన్బీ బ్యాంకు స్కామ్ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు మెహుల్ చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. సీబీఐ అభ్యర్ధనపై ఇంటర్‌పోల్ చోక్సీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులను మోసగించిన కేసులో చోక్సీపై దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీలు ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయడంతో అమెరికా అధికారులు చోక్సీని గుర్తించి అతడి సమాచారాన్ని భారత్‌కు చేరవేయనున్నారు. బ్యాంకు స్కామ్ వెలుగుచూసినప్పటి నుంచి అమెరికాలో వైద్య చికిత్సల కోసం వెళ్లిన చోక్సీ తిరిగి భారత్‌కు చేరుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చోక్సీ కదలికలను పసిగట్టి ఆయనను దేశం విడిచివెళ్లకుండా అమెరికా అధికారులు జల్లెడపట్టనున్నారు. కాగా చోక్సీ ప్రస్తుతం తన స్టేట్మెంట్ను రికార్డు చేసే పరిస్ధితిలో లేరని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితేనే భారత్‌కు తిరిగివస్తారని ఆయన న్యాయవాది గత నెలలో పేర్కొఆన్నరు. నకిలీ గ్యారంటీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల మేర టోకరా వేసిన చోక్సీ, ఆయన మేనల్లుడు జ్యూవెలర్ నీరవ్ మోదీ కోసం దర్యాప్తు సంస్ధలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీ సోదరికి రెడ్ కార్నర్ నోటీసులు
-
పీఎన్బీ స్కాం: నీరవ్ సోదరికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో మరో కీలకపరిణామం చేసుకుంది. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిన ఈ కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పీఎన్బీ స్కాం కేసులో ఇంటర్ పోల్ అధికారులు బెల్గావ్లో ఉంటున్న మోదీ సోదరి పుర్వీ దీపక్ మోదీ (44) వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు మనీ లాండరింగ్ చట్టం కింద ఈ నోటీసులిచ్చినట్టు అధికారులు వెల్లడించారు. స్పెషల్ ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం కింద ముంబైకోర్టు ఈ నోటీసులిచ్చింది. మోదీ సోదరి, సోదరుడు నిశాల్ సెప్టెంబర్ 25న, లేదా అంతుకుమందు గానీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాని పక్షంలో భారీ ఆర్థిక సంక్షోభాలను నిరోధించేందుకు ఉద్దేశించిన నూతన చట్టం కింద వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు గత వారం నీరవ్ మోదీ సన్నిహితుడు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మోహిర్ ఆర్ బన్సాలికి (40) ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. కాగా రూ.14వేల కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మరో డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వీరి పాస్‌పోర్టులను రద్దు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇరువురికి చెందిన పలు ఆస్తులను ఎటాచ్ చేసింది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
నీరవ్‌మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ
-
నీరవ్ మోదీకి షాక్, ఏ క్షణంలోనైనా అరెస్ట్!
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఇంటర్‌పోల్ షాకిచ్చింది. భారత అభ్యర్థన మేరకు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ రెడ్-కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీతో విదేశాల్లో నక్కిన నీరవ్ మోదీని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంటర్‌పోల్‌కు చెందిన 192 దేశాల పోలీసులు ఎవరైనా ఇతన్ని అరెస్ట్ చేయవచ్చు. ఒక్కసారి నీరవ్ మోదీ అరెస్ట్ అయితే, అతన్ని తమకు అప్పగించమని భారత్ కోరవచ్చు. ఈ ప్రక్రియ విజయవంతమవడానికి భారత్ ఆ దేశాలతో ఉన్న ఒప్పందాలు, సంబంధాలు సహకరిస్తాయి. నీరవ్ మోదీతో పాటు మోదీ సోదరుడు నిశాల్, సుభాష్ పరబ్‌లకు వ్యతిరేకంగా కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయ్యాయి. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులను ఏజెన్సీ తన వెబ్సైట్లో పెట్టింది. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా జారీచేసిన నోటీసులను ప్రజల ముందుకు తీసుకురావాలని సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ఈ నోటీసులను తన వెబ్సైట్లో పొందుపరించింది. నీరవ్‌కు వ్యతిరేకంగా జారీ అయిన నోటీసుల్లో అతని ఫోటోగ్రాఫ్, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, అతనికి వ్యతిరేకంగా మనీ లాండరింగ్ ఛార్జస్ నమోదైనట్టు ఉన్నాయి. నీరవ్ మోదీ, అతని సన్నిహితులు కలిసి పీఎన్బీలో దాదాపు రూ.13 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా స్కాం చేసి దక్కించుకున్న నగదును, మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించాడు. పీఎన్బీ ఈ కేసును వెలుగులోకి బట్టబయలు చేస్తుందనే క్రమంలో మోదీ, అతని సన్నిహితులు జనవరిలో దేశం విడిచి పారిపోయారు. ఇప్పటి వరకు నీరవ్ ఎక్కడ ఉన్నాడన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఈ కేసుపై విచారణ చేపట్టిన దర్యాప్తు ఏజెన్సీలు సీబీఐ, ఈడీలు ఈ-మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినప్పటికీ, అతని నుంచి సరియైన స్పందన రాలేదు. భారత్‌కు వచ్చేది లేదంటూ చెప్పుకొచ్చాడు. తానేమీ తప్పు చేయలేదని వాదిస్తున్నాడు. -
నీరవ్‌కు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం పాల్పడిన నీరవ్ మోదీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని సీబీఐ కోరుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసిందని అధికారులు చెప్పారు. నీరవ్ కేసును విచారిస్తున్న మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా ఆయనకు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను మార్చిలోనే కోరింది. ఒక్కసారి రెడ్‌కార్నర్ నోటీసు జారీచేస్తే, లియోన్ ఆధారిత అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశముంటుంది. పీఎన్బీ కుంభకోణానికి సంబంధించిన కేసులో నీరవ్, చోక్సీపై కొద్ది రోజుల క్రితమే సీబీఐ విడివిడిగా చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిందితులను విచారణ కోసం తిరిగి భారత్‌కు రప్పించాలన్న లక్ష్యంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలోనే పీఎన్బీ కుంభకోణం అతిపెద్దది. ఈ బ్యాంకులో దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి చాలా రోజుల ముందే తన భార్య అమీ (అమెరికా పౌరురాలు), సోదరుడు నిశాల్ మోదీ (బెల్జియం పౌరుడు)తో పాటు నీరవ్ మేనమామ, గీతాంజలి గ్రూపు సంస్థల ప్రమోటర్ మెహుల్ చోక్సీతో కలసి భారత్ నుంచి జారుకున్నారు. -
ముంబై తరహా దాడికి పాక్ ఉగ్ర కుట్ర
జాతీయ దర్యాప్తు సంస్థ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ) మొట్టమొదటి సారిగా అమిర్ జుబేర్ సిద్ధిఖీ అనే పాకిస్థానీ దౌత్యవేత్త పేరును ‘మోస్ట్ వాంటెడ్ లిస్ట్’లో చేర్చడంతో పాటు తొలిసారిగా పాక్‌కు చెందిన ఈ స్థాయి అధికారిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ కోసం ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేయనుంది. పదేళ్ల క్రితం నవంబర్‌లో ముంబైలో జరిపిన ఉగ్ర మారణకాండ తరహాలో మరోసారి భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై, దక్షిణ భారత్‌లోని ఆర్మీ, నేవీ కమాండ్లపై దాడికి ఈ రాయబారి కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ తేల్చింది. సిద్ధిఖీ ఫోటోను కూడా విడుదల చేయడంతో పాటు అతడికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా కోరింది. ఈ రాయబారితో పాటు మరో ముగ్గురు పాకిస్థానీ అధికారులు కూడా ఈ కుట్ర భాగస్వాములని, వారిలో ఇద్దరి పేర్లను కూడా ఈ లిస్ట్‌లో చేర్చినట్టు పేర్కొంది. వీరిని అదుపులోకి తీసుకోవడం కోసం అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌పై ‘రెడ్ కార్నర్ నోటీస్’ జారీకి ఇంటర్‌పోల్‌ను విజ్ఞప్తి చేసేందుకు కూడా ఎన్ఐఏ సిద్ధమవుతోంది. 2008 నవంబర్ 26న ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌తో పాటు తాజ్, ట్రైడెండ్ హోటల్, తదితర ప్రాంతాల్లో పాక్ ప్రేరేపిత లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు బాంబులు, అధునాతన తుపాకులతో దాడి చేసి నాలుగు రోజుల పాటు మారణహోమాన్ని సృష్టించి 166 మంది (9 మంది ఉగ్రవాదులతో సహా)ని పైగా పొట్టనబెట్టుకున్నారు. ప్రాణాలతో దొరికిన అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదిని ఆ తర్వాత కోర్టులో విచారించి ఉరి తీసిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలోనే సిద్ధిఖీ, మరో ముగ్గురు అధికారులపై ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసినా వారిని గుర్తించడం సాధ్యం కాలేదు. అదేనెలలో వివిధ సెక్షన్లపై సిద్ధిఖీతో పాటు బాలసుబ్రహ్మణ్యం, నూరుద్దీన్లపై అదనపు చార్జిషీటు కూడా దాఖలు చేసింది. వీరిలో సిద్ధిఖీ శ్రీలంక కోలంబోలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో వీసా కౌన్సెలర్‌గా పనిచేశారు. ఇక మిగతా వారి విషయానికొస్తే... ‘వినీత్’ అనే మారుపేరుతో చెలామణి అవుతున్న పాక్ నిఘాసంస్థ అధికారితో పాటు బోస్ అలియాస్ షా అనే కోడ్‌నేమ్ కలిగిన అధికారి ఇంకా శ్రీలంకలోని పాక్ హైకమిషన్ అధికారి కూడా ఈ కుట్రలో భాగస్వామి అని ఎన్ఐఏ స్పష్టంచేసింది. కుట్ర ఎప్పుడు... ఎలా... ఎక్కడ ? 2009–2016 మధ్యకాలంలో ఈ అధికారులంతా కొలంబోలో పనిచేస్తున్న సందర్భంగా తమ ఏజెంట్ల ద్వారా దక్షిణ భారత్‌లోని చెన్నై, తదితర ప్రాంతాల్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులకు కుట్రపన్నారు. 2014లోనే దేశంలోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలతో పాటు, దక్షిణాదిలోని ఆర్మీ,నేవి స్థావరాలపై ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టుగా ఎన్ఐఏ నిర్థారించింది. దీని కోసం సిద్ధిఖీ శ్రీలంక పౌరుడు మహ్మద్ సాకిర్ హుస్సేన్‌తో పాటు అరుణ్ సెల్వరాజ్, శివబాలన్, తమీమ్ అన్సారీలను రిక్రూట్ చేశారు. భారత్‌లో దాడులు చేయాలనుకుంటున్న రక్షణ సంస్థలు, అణు స్థావరాలు, ఆయుధాల తరలింపునకు సంబంధించిన ఫోటోలు తీయాల్సిందిగా ఈ ఏజెంట్లను సిద్ధిఖీ, ఇతర అధికారులు పురమాయించారు. ఆర్మీ అధికారుల లాప్‌టాప్‌లు దొంగిలించడంతో పాటు విçస్తృతంగా భారత నకిలీ కరెన్సీ చెలామణిలోకి తేవాలని వారికి సూచించారు. చెన్నైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం, బెంగళూరులోని ఇజ్రాయెల్ కాన్సులేట్, విశాఖపట్టణంలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్, దేశంలోని వివిధ నౌకాశ్రయాలపై దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఎన్ఐఏ భావిస్తోంది. వీరందరినీ కూడా ఆ తర్వాత మనదేశ దర్యాప్తు, భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ఇలాంటి భారీ కుట్రకు సంబంధించిన కీలకసమాచారాన్ని భారత్‌తో అమెరికా పంచుకుంది. దీంతో ఈ పాకిస్థానీ అధికారుల అక్రమ కార్యకలాపాలను మన దర్యాప్తు అధికారులు గుర్తించే వీలు ఏర్పడింది. చెన్నై దాడికి కోడ్‌నేమ్ ‘వెడ్డింగ్ హాల్... చెన్నైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయంపై పాల్పడాలనుకుంటున్న దాడికి ‘వెడ్డింగ్ హాల్’ గా, దానిని చేపట్టే వారికి వంటవాళ్లు (కుక్స్)గా కోడ్‌నేమ్ పెట్టారు. ఈ కార్యాలయంలో పెట్టే బాంబులకు ‘మసాలాలు’ (స్పైస్) అనే కోడ్‌నేమ్ ఫైనల్ చేశారు. ఈ కోడ్‌నేమ్‌లతో ఉగ్రవాదులు మాల్దీవుల మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తారు. ఈ దాడులకు సంబంధించిన ప్రణాళికలపై పాకిస్థాన్ అధికారులతో తాను జరిపిన అంతర్గత సమావేశాల పూర్తి వివరాలను శ్రీలంక ఏజెంట్ హుస్సేన్ దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. అంతేకాకుండా భారత్‌లో దాడులకు పాల్పడే ఇద్దరు ఆత్మార్పణ దళ సభ్యుల (ఫిదాయిన్లు) ను తాను బ్యాంకాక్ లో కలుసుకున్నట్టు తెలియజేశాడు. దాడులకు పాల్పడే ప్రదేశాల ఫోటోలను సిద్ధిఖీకి హుస్సేన్ అందించినట్లు ఎన్ఐఏ చెబుతోంది. 2014లో హుస్సేన్ అరెస్ట్‌తోనే భారత్‌లో దాడులకు పాక్ ప్రణాళిక బట్టబయలైంది. అతడిని ఎన్ఐఏ విచారించిన సందర్భంగానే సిద్ధిఖీ పేరు బయటకు వచ్చింది. అమెరికా అందించిన ‘డిజిటల్ సాక్ష్యాల’తో సిద్ధిఖీ ప్రమేయాన్ని ఎన్ఐఏ నిర్థారించింది. శ్రీలంకపై భారత్ ఒత్తిడి పెంచడంతో సిద్ధిఖీని పాకిస్థాన్‌కు తిప్పి పంపించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నీరవ్, చౌక్సిలకు అరెస్ట్ వారెంట్
పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వేగంగా కదులుతోంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలంటూ ఈడీ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. మనీ లాండరింగ్ కేసులో కోర్టు జారీచేసిన నాన్-బెయిలబుల్ వారెంట్లను ఆధారం చేసుకుని ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీచేయాలని ఈడీ కోరుతున్నట్టు అధికారులు చెప్పారు. సీబీఐకి కూడా ఈడీ తన అభ్యర్థనను పంపింది. క్రిమినల్ కేసు విచారణలో విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి వెనక్కి రప్పించడానికి ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేస్తుంటారు. ఒక్కసారి రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా.. వారి అరెస్ట్‌ను ఇంటర్‌పోల్ కోరవచ్చు. వారిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సంబంధిత దేశాలను వారిని కస్టడీలోకి తీసుకోమని ఆదేశించవచ్చు. ఈడీ అభ్యర్థన మేరకు ఈ నెల మొదట్లో ముంబై స్పెషల్ కోర్టు నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలకు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్లను జారీచేసింది. ఈడీ కూడా వీరిద్దరికీ సమన్లు పంపింది. అయితే విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే అవసరం ఉన్నందున తిరిగి దేశానికి రాలేమని వింతైన సమాధానమిచ్చారు. పీఎన్బీలో చోటు చేసుకున్న రూ.12,700 కోట్ల స్కాంలో వీరు ప్రధాన సూత్రధారులుగా ఉన్న సంగతి తెలిసిందే. -
మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయండి..
ఇంటర్‌పోల్‌ను కోరిన ఈడీ న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్(ఆర్సీఎన్)ను జారీ చేయాల్సిన బాధ్యత ఇంటర్‌పోల్‌కు ఉందని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) పేర్కొంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ఆర్సీఎన్ను జారీ చేయడానికి అన్ని చట్టపరమైన పద్ధతులను అనుసరించామని ఇంటర్‌పోల్‌కు ఈడీ సవివరమైన సమాచారాన్ని అందించింది. విజయ్ మాల్యాకు ప్రొక్లెయిమ్డ్ ఆఫెండర్ స్టేటస్‌ను ఇవ్వాలని ముంబై కోర్టును కోరామని, ఈ విషయమై నేడు(సోమవారం) నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఇంటర్‌పోల్‌కు ఈడీ సమాచారమిచ్చింది. ఐడీబీఐకు సం బంధించిన రూ.900 కోట్ల రుణ మోసం కేసులో విజయ్ మాల్యా, ఆయన కంపెనీల్లో ఒకదానికి చెందిన రూ.1,411 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు శనివారం అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
మాల్యా వ్యవహారంలో ఈడీకి షాక్
బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కు భారీ ఊరట లభించింది. ఉద్దేశ పూర్వకంగా రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ ను ఎలాగైనా దేశానికి రప్పించాలని చూస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ తగిలింది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసుల జారీ చేసే వ్యూహంలో ఈడీకి భారీ నిరాశ ఎదురైంది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనపై ప్రాథమికంగా విచారణ చేపట్టిన సంస్థ ఈడీ సమర్పించిన సాక్ష్యాలు సరిపోవని ఇంటర్ పోల్ తేల్చి చెప్పింది. అతనికి ఇప్పటికిపుడు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేమని చెప్పింది. భారత ప్రభుత్వం మాల్యాపై నేరారోపణలను రుజువు చేయలేకపోయిందని ఇంటర్ పోల్ పేర్కొంది. మరోవైపు భారత ప్రభుత్వ అభ్యర్థన పై మాల్యా వివరణను ఇంటర్ పోల్ కోరనుంది. అనంతరం ఈ మొత్తం వ్యవహారాన్ని సమక్షించనుంది. దీనికి మరో మూడు నెలలుపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి పారిపోయిన విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నాలపై బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నీళ్లు చల్లింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు రెడ్ కార్నర్ నోటీస్
న్యూఢిల్లీ : బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కొత్త చిక్కు ఎదురు కాబోతుంది. మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి, మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. గత మంగళవారమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై మే20 తేదీ వరకు స్పందించాలని ఆదేశించింది. మరోవైపు విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ‘1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని మేము ఆదేశించలేము’ అని బ్రిటన్ ప్రభుత్వం తెలిపిందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. గత నెలే అతనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసి భారత్ కు రప్పించాలని, విచారణకు తోడ్పడాలని ఇంటర్ పోల్ ను ఈడీ కోరనుంది. -
దిల్సుఖ్నగర్ కేసులో నూ అబిదీన్
► ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్లో కీలక పాత్రధారి ► నాటి జంట పేలుళ్లకు పేలుడు పదార్థం సరఫరా ► సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై ముంబయికి.. ► పీటీ వారెంట్‌పై తెచ్చేందుకు ఎన్ఐఏ సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్‌లో 2013, ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ళ కేసులో మరో కీలక నిందితుడు జైనుల్ అబిదీన్ ఎట్టకేలకు చిక్కాడు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్ ఇస్మాయిల్ అఫాఖీకి ఇతడు ప్రధాన అనుచరుడు. గత ఏడాది అఫాఖీ అరెస్టు నేపథ్యంలోనే ఇతడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర నిఘా వర్గాలు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించాయి. దీని ఆధారంగా సౌదీ అరేబియా ఏజెన్సీలు గత అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నాయి. చట్టపరమైన అంశాలు పూర్తయిన తర్వాత మంగళవారం డిపోర్టేషన్‌పై ముంబైకి పంపించాయి. అఫాఖీ ద్వారా రియాజ్‌తో సంబంధాలు... హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో కుట్రపన్నిన ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భ త్కల్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన, బెంగళూరులో హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్తో సంప్రదింపులు జరిపాడు. రియాజ్ స్వస్థలం కూడా భత్కల్ కావడంతో వీరి పరిచయం పెరిగింది. 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీని (దిల్‌సుక్‌నగర్ బ్లాస్ట్స్ నిందితుడు) సంప్రదించిన రియాజ్ హైదరాబాద్‌లో విధ్వంసాలకు పాల్పడాలనే విషయం చెప్పి, దీనికి అవసరమైన పే లుడు పదార్థాలు అందించే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. అమ్మోనియం’ సేకరించిన అఫాఖీ గ్యాంగ్... ఐఎం మాడ్యుల్‌కు సంబంధించి తొలి అరెస్టులు 2008లో జరిగాయి. ఈ పరిణామంతో దేశం దాటేసిన రియాజ్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పేలుడు పద్దార్థాలను తానే స్వయంగా సమీకరించి విధ్వంసాలు సృష్టించాడు. పాక్‌కు పారిపోయిన తర్వాత ఆ బాధ్యతల్ని అఫాఖీకి అప్పగించాడు. దీంతో 2009 నుంచి జరిగిన పేలుళ్లకు అవసరమైనా ఎక్స్‌ప్లోజివ్ (అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ) అఫాఖీనే తన గ్యాంగ్ ద్వారా సమీకరిం సరఫరా చేడయం ప్రారంభించాడు. అలా ఈ ‘డాక్టర్ సాబ్’ ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్ చీఫ్‌గా మారాడు. రోటీన్‌కు భిన్నంగా సమీకరణ... ఎక్స్‌ప్లోజివ్స్ సమీకరణలో నిఘా, పోలీసులు అనుమానం రాకుండా అఫాఖీ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే ‘మీన్ తూటా’ల నుంచే పేలుడు పదార్థం సేకరణ అనువైన మార్గమని ఎంచుకున్నాడు. ఎక్స్‌ప్లోజివ్‌ను జాగ్రత్తలతో సముద్రంలో పడిపేల్చడం ద్వారా చేపలు పట్టే విధానాన్ని అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూ టా’ అంటారు. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని ఎక్స్‌ప్లోజివ్స్ డీలర్లు అక్రమంగా మత్స్యకారులకు ఈ స్లర్రీని అమ్మేస్తుంటారు. ఈ విధానాలు అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. సద్దాం, అబిదీన్ల ద్వారానే ‘స్మగ్లింగ్’... మీన్ తూటా’ల పేరుతో పేలుడు పదార్థం సేకరించే బాధ్యతల్ని అఫాకీ భత్కల్కే చెందిన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌తో పాటు జైనుల్ అబిదీన్లకు అప్పగించాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్ళాలని చెప్తూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్ళు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించి తయారు చేసిన బాంబుల్నే ఉగ్రవాదులు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ సహా అనేక చోట్ల పేల్చారు. 2013 హైదరాబాద్ పేలుడు తరవాత సౌదీ అరేబియా వెళ్ళిపోయిన అబిదీన్ అక్కడ ఓ దుకాణంలో నెలకు 1200 రియాల్స్ వేతనానికి సేల్స్‌మెన్‌గా ఉద్యోగంలో చేరాడు. ఐఎం ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్‌గా ఉన్న అఫాఖీతో పాటు సద్దాం తదితరుల్ని బెంగళూరు పోలీసులు గత ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. అఫాఖీ విచారణలోనే తమ ముఠాలో అబిదీన్ కూడా ఉన్నాడని బయటపడింది. గతేడాది సౌదీలో అదుపులోకి... అబిదీన్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడని అఫాఖీ ద్వారా తెలుసుకున్న నిఘా వర్గాలు అతడి పాస్‌పోర్ట్ నెంబర్ ఆధారంగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. దీంతో అబిదీన్పై రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. సౌదీ ఏజెన్సీలు గతేడాది అక్టోబర్‌లో అబిదీన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. డిపోర్టేషన్‌కు చట్టపర అంశా లు పూర్తయ్యాక మంగళవారం ముంబై కి పంపాయి. 2011 జూలైలో అక్కడి దాదర్, జవేరీ బజార్, ఓప్రా హౌస్ వద్ద జరిగిన పేలుళ్లలో వాంటెడ్ కావడంతో ఈ కేసులో ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులోనూ వాంటెడ్‌గా ఉన్న అబిదీన్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సన్నాహాలు చేస్తోంది. -
హెలికాప్టర్ల అవినీతికి మధ్యవర్తి ఈయనే
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల డీల్‌లో అవినీతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వెస్ట్ ల్యాండ్‌తో డీల్ వ్యవహారం అనంతరం భారతీయ మీడియాతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అగస్టా వెస్ట్ ల్యాండ్ మధ్యవర్తికి ఆరు మిలియన్ పౌండ్లను ఇచ్చినట్లు తెలిసింది. 2010-2012 మధ్య కాలంలో హెలికాప్టర్ల కొనుగోలు గురించి ఎటువంటి దుష్ర్ఫచారం లేకుండా చేయడానికి అగస్టా కంపెనీ క్రిష్టియన్ మైఖేల్ అనే వ్యక్తి డబ్బును సమకూర్చింది. మొత్తం 3,546 వేల కోట్ల రూపాయల ఈ డీల్‌లో 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ 101 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందించేందుకు 2010లో ఒప్పందం జరిగింది. స్కామ్‌తో సంబంధం ఉన్న మైఖేల్‌ను పట్టుకోవడానికి ఈడీ ఇంటర్‌పోల్‌కు ఫిబ్రవరి 4న లేఖను రాసింది. ప్రస్తుతం మైఖేల్ దుబాయ్‌లో ఉన్నట్లు కనుగొన్న ఈడీ, సీబీఐలు అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాయి. 2013లో బయటపడిన ఈ స్కామ్‌లో దేశ కీలక రాజకీయ నేతలతో పాటు మిలటరీ అధికారులు అగస్టా వెస్ట్ ల్యాండ్‌కి 610మిలియన్ డాలర్లకు బిడ్ దక్కేలా చేసేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్‌పై కుట్ర, మోసం, అవినీతికి మధ్యవర్తిత్వం నిర్వర్తించడం తదితర చట్టాలపై కేసులు నమోదు చేశారు. -
బలమైన కేసు ఎందుకు పెట్టలేదు?
జైపూర్/డెహ్రడూన్: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వనున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లలిత్ ను తమకు అప్పగించాలని బ్రిటన్ ను కోరనున్నామని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే లలిత్ మోదీని స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సవాల్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. లలిత్ ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాథోడ్ తెలిపారు. రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. లలిత్ మోదీ విదేశాలకు పారిపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆయనపై బలమైన కేసు పెట్టివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. ఫెమా కేసు మాత్రమే పెట్టి యూపీఏ ప్రభుత్వం చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదని, ఎక్కువ శిక్ష కూడా పడదని తెలిపారు. లలిత్ గేట్ వివాదంపై ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. -
లలిత్ మోదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న మోదీని భారత్ రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేశారు. మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఈడీ.. సీబీఐని కోరింది. ఈ విషయంపై సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించనుంది. త్వరలో మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఇదే కేసులో ఇటీవల ప్రత్యేక పీఎమ్ఎల్ఏ కోర్టు మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాక 2010లో మోదీ లండన్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత్‌కు తిరిగి రాని మోదీ ఈడీ విచారణకు సహకరించడం లేదు. -
గోవింద్ చుట్టూ బిగుస్తున్నఉచ్చు
విజయవాడ సిటీ : జిల్లాలోని ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన భూతం గోవింద్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో తలదాచుకున్న గోవింద్‌ను రప్పించేందుకు ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గోవింద్ ఆచూకీ కోసం ‘రెడ్‌కార్నర్’ నోటీసు జారీ చేసి విదేశీ మీడియా ద్వారా ఫొటోలను విస్తృత ప్రచారం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, పగిడి మారయ్య, గుంజుడు మారయ్య గత నెల 24న ఏలూరు కోర్టు వాయిదాకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రైవే ట్ వాహనంలో వెళుతుండగా పెదఅవుటుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కిరాయి హంతకులు కాల్చి చంపారు. ఈ ఘటనపై నమోదైన కేసులో 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏడుగురు సభ్యుల ఢిల్లీ గ్యాంగ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. మరో 10మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీరిలో భూతం గోవింద్‌ను ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. తన సోదరుడు భూతం దుర్గారావు హత్య కేసులో నిందితులను చంపాలని గోవింద్ నిర్ణయించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం విదేశంలోనే పథకం రూపొందించాడని వారు పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తన అనుచరుల ద్వారా ఢిల్లీ కిల్లర్ గ్యాంగ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుని హత్యలు చేయించినట్లు వారు నిర్ధారించుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గోవిందు పాత్ర కీలకమని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న గోవింద్‌ను రప్పించేందుకు సీఐడీ విభాగం ద్వారా సీబీఐకి లేఖ రాయనున్నారు. తద్వారా సీబీఐ వర్గాలు ఇంటర్పోల్సాయంతో నిందితుణ్ణి విదేశాల నుంచి రప్పించే అవకాశాలున్నాయి. విదేశాల్లో సాధారణ జీవితం గడుపుతున్న గోవింద్‌ను దేశానికి రప్పించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంటర్‌పోల్ సాయంతో త్వరలోనే పట్టుకుంటామని వారు పేర్కొంటున్నారు. -
అమెరికాలో హత్యచేసి హైదరాబాద్‌లో దొరికిపోయాడు
హైదరాబాద్: అమెరికాలో హత్య చేసి పారిపోయిన ఓ నిందితుడు హైదరాబాద్ లో దొరికిపోయాడు. అమెరికాకు చెందిన లివింగ్టన్ అక్కడ హత్యచేసి పారిపోయి భారత్‌కు వచ్చాడు. అతనిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఎఫ్‌బీఐ రెడ్‌కార్నర్ నోటీసు మేరకు సీఐడీ అధికారులు లివింగ్‌టన్‌ను ఈ రోజు ఇక్కడ అరెస్ట్ చేశారు. రెడ్‌కార్నర్ నోటీసు: ఇంటర్‌పోల్‌లో 190 దేశాలకు సభ్యత్వం వుంది. ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి మరో దేశానికి పారిపోతే ఆచూకీ కనుగొనేందుకు ఇంటర్‌పోల్ తన సభ్యదేశాలకు రెడ్‌కార్నర్ నోటీసు జారీచేస్తుంది. భారత తరపున ఇంటర్‌పోల్‌లో సీబీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. అందువల్ల ఆ నోటీస్ ఆధారంగా లివింగ్‌టన్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది. -
నోటీసులపై హైకోర్టులో కేవీపీ పిటిషన్
అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వండి.. సోమవారంనాడు విచారణ! హైదరాబాద్: టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్‌పోల్ తనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడాన్ని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నోటీసు ఆధారంగా తనపై అరెస్టు సహా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను ఆదేశించాలని కోరుతూ లంచ్ మోషన్ రూపంలో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారం అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిందని, దీనిపై లోతుగా వాదనలు వినాల్సింది ఉందని, ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేనని జస్టిస్ నూతి రామ్మోహనరావు స్పష్టంచేశారు. లంచ్ మోషన్ కాకుండా రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొంటూ కేవీపీ రెగ్యులర్ పిటిషన్ వేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది. నాకెలాంటి సంబంధం లేదు...‘‘టైటానియం తవ్వకాల వ్యవహారంతో నాకెలాంటి సంబంధం లేదు. మీడియా ద్వారానే నాకీ విషయం తెలిసింది. అమెరికా ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు కూడా కథనాలొస్తున్నాయి. అమెరికా కోర్టు మోపిన అభియోగాలకూ, నాకూ సంబంధం లేదు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయి. నాపై వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2006కు సంబంధించిన వ్యవహారంగా పత్రికా కథనాల్లో వస్తోంది. మరి ఇప్పటికిప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? అమెరికా చట్టాలు ఇక్కడ నాకు వర్తించవు. ఇంటర్‌పోల్ నోటీసు ఆధారంగా సీఐడీ అధికారులు చర్యలు తీసుకుంటే నా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్లే. 1977 నాటి భారత్-అమెరికా ఒప్పందం ప్రకారం ఇక్కడి అధికారులు చట్ట ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పూర్తి చేసి, బాధితుడి వాదనలు విన్నాకే నోటీసు జారీ చేయాలి. అవేవీ లేకుండానే ఇంటర్‌పోల్ నోటీసులిచ్చింది కనక వీటి ప్రకారం సీఐడీ అధికారులు చర్యలు తీసుకోవటానికి వీల్లేదు. ఈ మేరకు సీఐడీని ఆదేశించండి’’ అని పిటిషన్లో కేవీపీ అభ్యర్థించారు. కేవీపీపై సీఐడీకి అందిన ఇంటర్‌పోల్ నోటీసు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందింది. ఆయనపై ఈ నోటీసుల్ని ఇంటర్‌పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైమ్ బ్యూరో పంపిన లేఖ (నం. ఏ-2828/4-2014) బుధవారం సీబీఐకి అందిన విషయం విదితమే. దీని ద్వారా రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ సీఐడీకి శుక్రవారం చేరింది. ఈ నోటీసుల్లో ఎక్కడా ప్రొవిజినల్ అరెస్టుకు సంబంధించిన వారెంట్ లేదని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని విదేశాన్ని కోరడాన్నే ప్రొవిజినల్ అరెస్టు అంటారు. ఈ అంశం ఎక్కడా రెడ్‌కార్నర్ నోటీసుల్లో ప్రస్తావించలేదని, దీనిపైనే సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని కృష్ణప్రసాద్ మీడియాకు వెల్లడించారు. వారి జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.