హైదరాబాద్: అమెరికాలో హత్య చేసి పారిపోయిన ఓ నిందితుడు హైదరాబాద్ లో దొరికిపోయాడు. అమెరికాకు చెందిన లివింగ్‌టన్ అక్కడ హత్యచేసి పారిపోయి భారత్కు వచ్చాడు. అతనిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఎఫ్‌బీఐ రెడ్‌కార్నర్ నోటీసు మేరకు సీఐడీ అధికారులు లివింగ్‌టన్‌ను ఈ రోజు ఇక్కడ అరెస్ట్ చేశారు.
రెడ్‌కార్నర్ నోటీసు: ఇంటర్‌పోల్‌లో 190 దేశాలకు సభ్యత్వం వుంది. ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి మరో దేశానికి పారిపోతే ఆచూకీ కనుగొనేందుకు ఇంటర్‌పోల్ తన సభ్యదేశాలకు రెడ్‌కార్నర్ నోటీసు జారీచేస్తుంది. భారత తరపున ఇంటర్‌పోల్‌లో సీబీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. అందువల్ల ఆ నోటీస్ ఆధారంగా లివింగ్‌టన్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది.
అమెరికాలో హత్యచేసి హైదరాబాద్లో దొరికిపోయాడు
Published Sat, May 10 2014 5:46 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement