livingston
-
పంజాబ్ కు షాక్ ఇచ్చిన విధ్వంసకర ఆల్ రౌండర్..
-
చెన్నైపై ఆల్‌రౌండ్ పంజా
ముంబై: పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 54 పరుగులతో ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్యాట్‌తో బాల్‌తో లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు; 2 వికెట్లు) చెలరేగాడు. తర్వాత చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఈ లీగ్‌లో వరుసగా మూడో ఓటమి చవిచూసింది. శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. రాహుల్ చహర్ 3 వికెట్లు పడగొట్టాడు. లివింగ్‌స్టోన్ సిక్సర్లతో... ఇన్నింగ్స్ రెండో బంతికే పంజాబ్ కెప్టెన్ మయాంక్ (4) వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్లో భానుక రాజపక్స (9) రనౌటయ్యాడు. కింగ్స్ స్కోరు 14/2. ఇలాంటి దుస్థితిలో ఉన్న పంజాబ్‌ను లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ మార్చేసింది. ముఖ్యంగా ముకేశ్ చౌదరి బౌలింగ్‌ను చితగ్గొట్టాడు. ముకేశ్ ఐదో ఓవర్లో 6, 0, 4, వైడ్, వైడ్, 4, 4, 6లతో 26 పరుగుల్ని పిండుకున్నాడు. ఓవర్‌కు పది పైచిలుకు రన్‌రేట్‌తో పంజాబ్ 9.1 ఓవర్లోనే 100 పరుగులు దాటేసింది. 11వ ఓవర్లో లివింగ్‌స్టోన్ తుఫాన్ ఇన్నింగ్స్‌ను జడేజా ముగించడంతో పంజాబ్ జోరు తగ్గింది. జితేశ్ (17 బంతుల్లో 26; 3 సిక్సర్లు) విరుచుకుపడినా... షారుక్ (6), స్మిత్ (3) నిరాశపరిచారు. చెన్నై చతికిల... పంజాబ్ పేస్‌కు చెన్నై బ్యాటర్స్ చతికిలబడ్డారు. టాపార్డర్ సహా ఐదో వరుస బ్యాట్స్‌మన్ వరకు ఎవరూ నిలువలేకపోయారు. సీమర్లు వైభవ్ అరోరా (2/), రబడ (1/28), స్మిత్ (1/14), అర్శ్‌దీప్ (1/13) పవర్ ప్లేలోనే చెన్నైకి చెక్ పెట్టారు. ఇంకా 14 ఓవర్లు ఉన్నా కూడా ఏంచేయలేని స్థితిలోకి పడేశారు. శివమ్ దూబే మెరుపులు కాసేపు ప్రేక్షకుల్ని అలరించాయే తప్ప జట్టును కష్టాల ఊబి నుంచి గట్టెక్కించలేకపోయాయి. ఉతప్ప (13), రుతురాజ్ (1), మొయిన్ అలీ (0), రాయుడు (13), జడేజా (0) నిప్పులు చెరిగే బౌలింగ్ ముందు మోకరిల్లారు. ధోని (23), దూబే కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
బౌలర్లకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్.. కేవలం 23 బంతుల్లోనే..
Chris Gayle Smashed 52 Runs In Just 23 balls 58 In Abu Dhabi T10 league: అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో క్రిస్‌గేల్ మరోసారి చెలరేగాడు. శుక్రవారం బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ కేవలం 23 బంతుల్లో అజేయంగా 53 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో యూనివర్సల్ బాస్ టీమ్ అబుదాబికు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అయితే క్రిస్ గేల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ అబుదాబి ఆరంభంనుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గేల్ ఒక్క సారిగా మ్యాచ్‌పై ఆశలు పెంచాడు. సిక్స్‌లు, ఫోర్లు తో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అఖరి ఓవర్లో 19 పరుగుల కావల్సిన నేపథ్యంలో గేల్ కేవలం ఒక్క సిక్స్ మాత్రమే బాదాడు. దీంతో 11 పరుగుల తేడాతో టీం అబుదాబిపై బంగ్లా టైగర్స్ విజయం సాధించింది. చదవండి: Ban Vs Pak Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి డైవ్ చేశారు.. ఆఖరికి -
ఇంగ్లండ్ విజయం
లీడ్స్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ 45 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. లివింగ్‌స్టోన్ (23 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (16 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసి ఓడింది. రిజ్వాన్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. సకీబ్ మొహమూద్ 3 వికెట్లు దక్కించుకోగా.. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. మూడో టి20 రేపు జరుగుతుంది. -
లివింగ్‌స్టోన్ సెంచరీ వృథా
నాటింగ్‌హామ్: లివింగ్‌స్టోన్ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 9 సిక్స్ లు) పోరాటం వృథా అయింది. ఇంగ్లండ్ తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్న లివింగ్‌స్టోన్ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. దాంతో పాకిస్తాన్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో ఓడింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. టి20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 85; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిజ్వాన్ (41 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లండ్‌ను పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది (3/30) దెబ్బతీశాడు. రెండో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. -
పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్
భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పర్యటన మూడో దశకు చేరింది. తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా... హోరాహోరీగా సాగిన టి20ల్లోనూ ముందు వెనుకబడ్డా ఆ తర్వాత చెలరేగి విజేతగా నిలిచింది. ఇక వరల్డ్ చాంపియన్‌తో వన్డే సమరంలోనూ గెలిస్తే విజయం సంపూర్ణమవుతుంది. మరోవైపు ఈ ఫార్మాట్లోనైనా సిరీస్ అందుకొని గౌరవంగా స్వదేశం వెళ్లాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్, టి20 ప్రపంచకప్ కారణంగా ఈ ఏడాది వన్డేలకు అంత ప్రాధాన్యత కనిపించకపోయినా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. పుణే: స్ఫూర్తిదాయక ప్రదర్శనతో టి20 సిరీస్‌ను గెలుచుకున్న మూడు రోజుల విరామం తర్వాత మరో వేదికపై భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. వరుసగా రెండు టెస్టులు, ఐదు టి20ల తర్వాత మ్యాచ్‌లు జరిగే వేదిక మారినా... కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్ నిర్వహించనున్నారు. 2016–17లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో గెలుచుకుంది. ధావన్‌కు మరో అవకాశం! టి20 సిరీస్ ఆడిన భారత జట్టే దాదాపుగా వన్డేల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టి20లో విఫలమై ఆ తర్వాత బెంచీకే పరిమితమైన శిఖర్ ధావన్ వన్డేలో ఓపెనర్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఎప్పటిలాగే రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని కెప్టెన్ ఇప్పటికే ప్రకటించాడు. చివరి టి20కు దూరమైన కేఎల్ రాహుల్‌కు కూడా మరో చాన్స్ లభించవచ్చు. అయితే అది మిడిలార్డర్లోనే. సూర్యకుమార్ లాంటి కొత్త ఆటగాళ్ల నుంచి తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో తన స్థానం నిలబెట్టుకోవాలంటే రాహుల్ సత్తా చాటాల్సిందే. తనకే సొంతమైన మూడో స్థానంలో ఆడే కోహ్లి, అయ్యర్ తర్వాత రాహుల్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో వ్యూహం మారితే అతనికంటే ముందు పంత్ బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఖాయం కాగా... ముగ్గురు పేసర్లుగా భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్, నటరాజన్ సిద్ధంగా ఉన్నారు. కొత్తగా ఎంపికైన ప్రసిధ్ కృష్ణకు తొలి మ్యాచ్‌లోనే అవకాశం రాకపోవచ్చు. స్పిన్నర్లలో చహల్, కుల్దీప్లలో ఒక్కరే బరిలోకి దిగుతారు. రెండో స్పిన్నర్‌గా సుందర్‌ను ఆడించాలని భావిస్తే శార్దుల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. లివింగ్‌స్టోన్‌కు చాన్స్! వన్డేల్లో రెగ్యులర్ ఆటగాళ్లు రూట్, వోక్స్‌లకు సిరీస్ నుంచి ఇంగ్లండ్ విశ్రాంతినివ్వగా... ఆర్చర్ గాయంతో వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కవచ్చు. ఇటీవల ఇంగ్లండ్ దేశవాళీ వన్డేల్లో ఆకట్టుకున్న లివింగ్‌స్టోన్ తన అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. లెగ్‌స్పిన్నర్ పార్కిన్సన్ కూడా అవకాశాన్ని ఆశిస్తుండగా, రషీద్‌ను పక్కన పెట్టి ఇంగ్లండ్ ఆ మార్పు చేయగలదా అనేది చూడాలి. ఓపెనర్లుగా రాయ్, బెయిర్‌స్టో బరిలోకి దిగనుండగా, కీపర్ బట్లర్ మిడిలార్డర్లో ఆడతాడు. టి20ల్లో ఆకట్టుకోని కెప్టెన్ మోర్గాన్ తనకు అచ్చొచ్చిన ఫార్మాట్లో చెలరేగాల్సి ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేల్లోనూ మ్యాచ్‌ను శాసించగలడు. లార్డ్స్‌లో జరిగిన చిరస్మరణీయ 2019 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత అతను ఆడనున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. పేసర్ మార్క్ వుడ్ మరోసారి తన వేగాన్ని నమ్ముకోగా, టాప్లీ కొత్త బంతిని పంచుకుంటాడు. మూడో పేసర్‌గా అన్నదమ్ములు స్యామ్, టామ్ కరన్‌ల మధ్య పోటీ ఉంది. పిచ్, వాతావరణం మొదటి నుంచి పుణే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు వన్డేలు జరగ్గా మూడుసార్లు 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షం సమస్య లేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, అయ్యర్, పంత్, రాహుల్, హార్దిక్, భువనేశ్వర్, శార్దుల్, చహల్/కుల్దీప్, నటరాజన్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, బిల్లింగ్స్, లివింగ్‌స్టోన్, స్యామ్/టామ్ కరన్, రషీద్, టాప్లీ, వుడ్. చిన్నారితో... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి తన రెండు నెలల పాపతో కలిసి మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చాడు. పుణే విమానాశ్రయంలో భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి ఉన్న చిత్రాలు ప్రధాన ఆకర్షణగా మారాయి. అనుష్క చేతుల్లో అమ్మాయి ఉండగా... కోహ్లి చేతుల్లో మొత్తం లగేజీ కనిపించడం కూడా సోషల్ మీడియాలో ‘మీమ్’లకు పని పెట్టాయి! -
ఫెడరల్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి
సిడ్నీ : భారత సంతతికి చెందిన లివింగ్స్టన్ చెట్టిపల్లి ఆస్ట్రేలియాలో జరగబోయే ఫెడరల్ ఎన్నికల్లో చిఫ్లే నుంచి లిబరల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. హైదరాబాద్‌కు చెందిన లివింగ్స్టన్ ఆస్ట్రేలియాలోని డూన్సైడ్లో భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. లివింగ్స్టన్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని మిషనరీ స్కూల్లో ఉపాధ్యాయులగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సేఫ్మ్యాఫ్ ఐఎన్సీలో సీఈఓగా పనిచేస్తున్నారు. గతంలో కమ్యూనిటీ రీసోర్స్ నెట్‌వర్క్‌లో ఎగ్జీక్యూటీవ్ ఆఫీసర్‌గా, ఎస్ఈఆర్పీ ప్రాజెక్టు మేనేజర్‌గా, స్మాల్ అండ్ ఎమర్జింగ్ కమ్యూనిటీస్ వర్కర్‌గా మెట్రో అసిస్ట్‌లో పనిచేశారు. బ్లాక్‌టౌన్ మల్టీకల్చరల్ అడ్వెజరీ కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్నారు. -
అమెరికాలో హత్యచేసి హైదరాబాద్‌లో దొరికిపోయాడు
హైదరాబాద్: అమెరికాలో హత్య చేసి పారిపోయిన ఓ నిందితుడు హైదరాబాద్ లో దొరికిపోయాడు. అమెరికాకు చెందిన లివింగ్టన్ అక్కడ హత్యచేసి పారిపోయి భారత్‌కు వచ్చాడు. అతనిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఎఫ్‌బీఐ రెడ్‌కార్నర్ నోటీసు మేరకు సీఐడీ అధికారులు లివింగ్‌టన్‌ను ఈ రోజు ఇక్కడ అరెస్ట్ చేశారు. రెడ్‌కార్నర్ నోటీసు: ఇంటర్‌పోల్‌లో 190 దేశాలకు సభ్యత్వం వుంది. ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి మరో దేశానికి పారిపోతే ఆచూకీ కనుగొనేందుకు ఇంటర్‌పోల్ తన సభ్యదేశాలకు రెడ్‌కార్నర్ నోటీసు జారీచేస్తుంది. భారత తరపున ఇంటర్‌పోల్‌లో సీబీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. అందువల్ల ఆ నోటీస్ ఆధారంగా లివింగ్‌టన్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది.