Chris Gayle Smashed 52 Runs In Just 23 balls In Abu Dhabi T10 league - Sakshi
Sakshi News home page

Chris Gayle: బౌలర్లకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్‌.. కేవలం 23 బంతుల్లోనే..

Published Sat, Nov 27 2021 2:41 PM | Last Updated on Sat, Nov 27 2021 3:17 PM

Chris Gayle Smashed 52 Runs In Just 23 balls In Abu Dhabi T10 league - Sakshi

Chris Gayle Smashed 52 Runs In Just 23 balls 58 In Abu Dhabi T10 league:  అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో క్రిస్‌గేల్‌ మరోసారి చెలరేగాడు. శుక్రవారం బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ కేవలం 23 బంతుల్లో అజేయంగా 53 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో యూనివర్సల్‌ బాస్‌ టీమ్‌ అబుదాబికు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లో  5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అయితే  క్రిస్‌ గేల్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ తన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టైగర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ అబుదాబి ఆరంభంనుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గేల్‌ ఒక్క సారిగా మ్యాచ్‌పై ఆశలు పెంచాడు. సిక్స్‌లు, ఫోర్లు తో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అఖరి ఓవర్‌లో 19 పరుగుల కావల్సిన నేపథ్యంలో గేల్‌ కేవలం​ ఒక్క సిక్స్‌ మాత్రమే బాదాడు. దీంతో 11 పరుగుల తేడాతో టీం అబుదాబిపై బంగ్లా టైగర్స్ విజయం సాధించింది.

చదవండి: Ban Vs Pak Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి డైవ్‌ చేశారు.. ఆఖరికి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement