
PC: BCCI/IPL.com
క్రిస్ గేల్.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తన పేరును సువర్ణక్షారలతో లిఖించుకున్నాడు. ఈ వెస్టిండీస్ దిగ్గజం విధ్వంసానికి పెట్టింది పేరు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లు హడలెత్తించాల్సిందే. ఐపీఎల్-2013లో ఆర్సీబీ తరుపున ఒక ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసి గేల్ చరిత్ర పుటలకెక్కాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు ఇప్పటికీ గేల్(175) పేరిటే ఉంది. అతడు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. గేల్ ఐపీఎల్‌లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తరుపన ఆడాడు. అయితే తాజాగా ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గేల్.. ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. యూనివర్స్ బాస్ తన ఎంచుకున్న బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏడుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.
అయితే ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం. గేల్ ఎంచుకున్న జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్‌కు చోటు దక్కింది. అదేవిధంగా విదేశీ ప్లేయర్ల కోటాలో గేల్ తనతో పాటు ఏబీ డివిలియర్స్,సునీల్ నరైన్, బ్రావోలకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి గేల్ అవకాశమిచ్చాడు.
గేల్ ఎంచుకున్న బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఏబీ డివిలియర్స్,సునీల్ నరైన్, బ్రావో