Bangla Tigers Vs Team Abu Dhabi: No Leaving From Chris Gayle As Abu Dhabi Plunder Runs On T10 Opening Night - Sakshi
Sakshi News home page

chris gayle: క్రిస్‌ గేల్‌ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే..

Nov 20 2021 10:39 AM | Updated on Nov 20 2021 12:13 PM

No leaving from Chris Gayle as Abu Dhabi plunder runs on T10 opening night - Sakshi

Chris Gayle as Abu Dhabi plunder runs on T10 opening night : అబుదాబి టీ10లీగ్‌లో బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ చేలరేగి ఆడాడు. ఈ టోర్నీలో టీమ్‌ అబుదాబికు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనివర్సల్‌ బాస్‌.. కేవలం 23 బంతుల్లో 5 సిక్స్‌లు, 2ఫోర్లుతో 49 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఎట్టకేలకు గేల్‌ బ్యాట్‌ ఝలిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. గేల్‌కు తోడుగా ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ కూడా ఆర్ధసెంచరీ చేయడంతో టీమ్‌ అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలలో 4వికెట్ల నష్టానికి 145 పరుగుల భారీ  స్కోర్‌ సాధించింది.

146 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్‌ నిర్ణీత 10ఓవర్లలలో 8వికెట్లు కోల్పోయి 108 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్‌ అబుదాబి 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా దుబాయ్‌ టీ10లీగ్‌ శుక్రవారం(నవంబర్‌-19) నుంచి ప్రారంభంమైంది. ఈ లీగ్‌లో క్రిస్‌ గేల్‌, డుప్లెసెస్, మహ్మద్‌ హాఫీజ్‌, లివింగ్‌స్టోన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

చదవండి: IND Vs NZ 2nd T20 : రోహిత్‌ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement