Paul Stirling
-
SA vs IRE: సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్
సౌతాఫ్రికాతో మూడో వన్డేల్లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. సఫారీ జట్టును 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వన్డేల్లో సౌతాఫ్రికాపై ఐరిష్ టీమ్‌కు ఇది రెండో గెలుపు కావడం విశేషం. కాగా యూఏఈ వేదికగా ఐర్లాండ్- సౌతాఫ్రికా మధ్య అబుదాబి వేదికగా పరిమిత ఓవర్ల సిరీస్ జరిగింది.రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో ట్రోఫీని పంచుకున్నాయి. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి రెండింటిలో సౌతాఫ్రికా వరుసగా 139, 174 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ప్రొటిస్ జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది.పాల్ స్టిర్లింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో బల్బిర్నీ 45 పరుగులతో రాణించగా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 88 రన్స్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(34) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హ్యారీ టెక్టార్ 60 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ లోర్కాన్ టకర్ 26 పరుగులు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమైంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఐరిష్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. జేసన్ స్మిత్ పోరాటం వృథాఓపెనర్లు రియాన్ రెకెల్టన్(4), రీజా హెండ్రిక్స్(1), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(3) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో కైలీ వెరెన్నె 38, ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు చేయగా.. ఆరోస్థానంలో వచ్చిన జేసన్ స్మిత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 93 బంతుల్లో 91 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఐరిష్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 46.1 ఓవర్లలో 215 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో ఐర్లాండ్ విజయం ఖరారైంది. 69 పరుగుల తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలుపొందింది. ఐర్లాండ్ బౌలర్లలో గ్రాహం హ్యూమ్, క్రెయిగ్ యంగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్ అడేర్ రెండు, ఫియాన్ హ్యాండ్, మాథ్యూ హంఫ్రేస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూడో వన్డేకు ముందే... సిరీస్ కోల్పోయినా సౌతాఫ్రికా ఆధిక్యాన్ని ఐర్లాండ్ 2-1కు తగ్గించగలిగింది. ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది -
చెలరేగిన ఓపెనర్.. సౌతాఫ్రికా ఘన విజయం
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్ స్టిర్లింగ్ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్‌తో తొలుత రెండు టీ20లు ఆడింది.పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.చెలరేగిన ఓపెనర్ఓపెనర్ రియాన్ రికెల్టన్.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్ తెంబా బవుమా(4), వాన్ డెర్ డసెన్(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ రికెల్టన్‌తో కలిసి ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.మిగతా వాళ్లలో జోర్న్ ఫార్చూన్ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదేర్ నాలుగు, క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.132 పరుగులకు ఆలౌట్ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్ పేసర్లలో లిజాడ్ విలియమ్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ కూల్చారు. స్పిన్నర్ జోర్న్ ఫార్చున్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ రెకెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.చదవండి: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే? -
IRE Vs PAK: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. డబ్లిన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఐర్లాండ్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ అయూబ్(45), ఇఫ్తికర్ ఆహ్మద్(37 నాటౌట్) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో క్రెగ్ యంగ్ రెండు వికెట్లు, డెలానీ,అడైర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బల్బర్నీ(77) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఆఖరిలో కాంఫ్హెర్(15), డెలానీ(10) ఆజేయంగా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా, షాహీన్ అఫ్రిది, వసీం తలా వికెట్ సాధించారు. Babar Azam is a cursed captain #IREvPAK IRELAND PROVE TO BE TOOO MIGHTY FOR 🇵🇰 😪💀 MOYE MOYE pic.twitter.com/LBNvtAd0Q6— Shehryar Sajid Khan (@Sskwrites) May 10, 2024IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we've just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏..#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024 -
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఐరీష్ జట్టుకు పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్‌కప్‌తో పాటు స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్, నెదర్లాండ్స్ ,స్కాట్లాండ్తో జరిగే ట్రై-సిరీస్‌కు ఐర్లాండ్ కూడా తమ జట్టును ప్రకటించింది.టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గోనే జట్టునే ఈ రెండు సిరీస్‌లకు కూడా ఐరీష్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐరీష్ పేసర్ జాషువా లిటిల్.. పాక్, డచ్, స్కాట్లాండ్తో ట్రై-సిరీస్‌కు దూరం కానున్నాడు.ఇక ఐరీష్ వరల్డ్‌కప్ జట్టులో మాజీ కెప్టెన్ బల్బర్నీ, హ్యారీ టెక్టార్, కాంఫ్హెర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న టీమిండియాతో తలపడనుంది. ఐర్లాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు:పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.పాక్, పాక్, డచ్, స్కాట్లాండ్తో ట్రై-సిరీస్‌కు ఐరీష్ జట్టు:పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్. -
263 పరుగులకే ఆలౌటైన ఐర్లాండ్.. అయినా 108 పరుగుల ఆధిక్యం
అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ పైచేయి సాధించింది. ఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే ఆలౌటైనా.. 108 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో వెటరన్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కర్టిస్ క్యాంఫర్ (49), లోర్కాన్ టక్కర్ (46), ఆండీ మెక్‌బ్రైన్ (38), హ్యారీ టెక్టార్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్లు మూర్ (12), బల్బిర్నీ (2), వాన్ వోర్కోమ్ (1), అదైర్ (15), మెక్‌కార్తీ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ పతనాన్ని శాశించిన రెహ్మాన్.. ఆఫ్ఘన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్ (5/64) ఐర్లాండ్ పతనాన్ని శాశించగా.. నవీద్ జద్రాన్ 3, నిజత్ మసూద్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ చేసిన 53 పరుగులే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా ఉంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ కరీం జనత్ (41 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (20), నవీద్ జద్రాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఐదేసిన అదైర్.. రహ్మత్ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్ (5), నసీర్ జమాల్ (0), జియా ఉర్ రెహ్మాన్ (6), నిజత్ మసూద్ (0), జహీర్ ఖాన్ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్ అదైర్ (5/39) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించగా.. కర్టిస్ క్యాంఫర్, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్‌కార్తీ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం. -
సంచలన రికార్డుపై రోహిత్ శర్మ కన్ను..
India vs Afghanistan, 2nd T20I - Rohit Sharma Eyes On Rare Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టీ20లలో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేయడానికి అడుగుదూరంలో ఉన్నాడు. దాదాపు పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో పునరాగమనం చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సెమీస్‌లో భారత జట్టు ఓటమి తర్వాత.. మళ్లీ తాజాగా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో మరోసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. రీఎంట్రీలో డకౌట్ అయినా వరల్డ్ రికార్డు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సమన్వయలోపం కారణంగా డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేయడంతో సారథిగా రోహిత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. తద్వారా.. అంతర్జాతీయ టీ20లలో 100 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక పురుష క్రికెటర్‌గానూ హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అదే జరిగితే ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్‌గా ఇదిలా ఉంటే.. ఇప్పటికే అఫ్గన్‌తో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇండోర్ వేదికగా ఆదివారం (జనవరి 14) రెండో మ్యాచ్‌లో తలపడనుంది. రోహిత్ శర్మ కెరీర్లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. ఏ ఆటంకాలు లేకుండా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్ పూర్తి చేస్తే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. అదండీ విషయం..!! అంతర్జాతీయ టీ20లలో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-5 క్రికెటర్లు 1. రోహిత్ శర్మ(ఇండియా)- 149 2. పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్)- 134 3.జార్జ్ డాక్రెల్(ఐర్లాండ్)- 128 4. షోయబ్ మాలిక్(పాకిస్తాన్)- 124 5. మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)- 122. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్‌లలోనూ గెలుపు
అంతర్జాతీయ వన్డేల్లో ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0 తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20, మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఐరిష్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా.. డిసెంబరు 7న మొదలైన టీ20 సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న ఐర్లాండ్.. వన్డేల్లోనూ సత్తా చాటింది. బుధవారం (డిసెంబరు 13) నాటి తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గిన ఐర్లాండ్.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాల్ స్టిర్లింగ్ బృందం జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐరిష్ పేసర్లు గ్రాహం హ్యూమ్, కర్టిస్ కాంఫర్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో 40 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ జాయ్‌లార్డ్ గుంబీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వన్‌డౌన్ బ్యాటర్ కైటానో 13 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగారు. అయితే, వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ టార్గెట్‌ను 201గా నిర్దేశించారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మొత్తంగా 102 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(8) నిరాశపరచగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కర్టిస్ కాంఫర్ 40, హ్యారీ టెక్టార్ 33 పరుగులు సాధించారు. బల్బిర్నీతో కలిసి లోర్కాన్ టకర్ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో సొంతం చేసుకుంది. బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. కర్టిస్ కాంఫర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్? -
IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. టాప్ స్కోరర్‌గా రుతురాజ్.. కాగా, ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్‌ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్‌గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్‌ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
ఐర్లాండ్‌తో మూడో టీ20.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 23) జరుగనున్న నామమాత్రపు మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఇదివరకే కైవసం చేసుకున్న భారత్, నేటి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ముకేశ్ కుమార్, జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్లు మూడో టీ20 బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో ఈ నలుగురు బరిలోకి దిగవచ్చు. పై పేర్కొన్న నలుగురికి అవకాశం ఇస్తే ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు మొత్తానికి కనీసం ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సైతం విశ్రాంతి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆసియా కప్‌కు ముందు అనవసర రిస్క్ ఎందుకుని మేనేజ్మెంట్ భావిస్తే.. బుమ్రా రెస్ట్ తీసుకుని, అర్షదీప్‌కు అవకాశం ఇస్తాడు. అప్పుడు జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడు. ఆసియా క్రీడల్లో రుతు ఎలాగూ టీమిండియాకు నాయకత్వం వహించాల్సి ఉంది కాబట్టి, అతనికి ఈ మ్యాచ్ ప్రాక్టీస్ అయినట్లవుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రిజర్వ్ బెంచ్‌కు పరీక్షగా మారనుంది. మరోవైపు ఐర్లాండ్ సైతం ఒకటిరెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ జట్టు కూడా రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే భారత్‌లా భారీ ప్రయోగాలు కాకుండా ఒకటి, రెండు మార్పులకు ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల విషయానికొస్తే.. ముగ్గురు టీమిండియా బౌలర్లు 4 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్‌లు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌తో మూడో టీ20కి టీమిండియా (అంచనా): జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)/అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్/కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ -
ఐర్లాండ్ కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్తరికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా స్టిర్లింగ్ నిలిచాడు. ఇప్పటివరకు 13 సార్లు స్టిర్లింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో డకౌటైన స్టిర్లింగ్.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఓబ్రియన్‌ను స్టిర్లింగ్ అధిగమించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో జింబాబ్వే క్రికెటర్ చకాబ్వా(11), సౌమ్య సర్కార్(11) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఐరీష్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్ చతికిలపడింది. లక్ష్యఛేదనలో ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆగస్టు 23న జరగనుంది. చదవండి: IND vs IRE: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో -
ఐర్లాండ్‌తో రెండో టీ20.. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్ ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్ 39 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రుతురాజ్‌కు జతగా రింకూ సింగ్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 129/3గా ఉంది. యశస్వి (18), తిలక్ వర్మ (1), సంజూ శాంసన్ (40) ఔటయ్యారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ -
భారత బౌలర్ల విజృంభణ.. అతడు ఆదుకున్నాడు!
Ireland vs India, 1st T20I: టీమిండియాతో తొలి టీ20లో ఆరంభంలో తడబడ్డా ఐర్లాండ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యారీ మెకార్తీ అజేయ అర్ధ శతకం(51 పరుగులు)తో జట్టును ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 139 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు, ప్రసిద్ కృష్ణ రెండు, రవి బిష్ణోయి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌నకు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల దెబ్బ తొలి టీ20లో భారత బౌలర్ల ధాటికి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమవుతోంది. 35 పరుగులకే ఐర్లాండ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బుమ్రా తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి టీమిండియాకు శుభారంభం అందించాడు. అనంతరం టీ20 అరంగేట్ర బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్లోనే (5వ ఓవర్) వికెట్ తీశాడు. టెక్టార్ను పెవిలియన్‌కు పంపాడు. ఇక ఆ మరుసటి ఓవర్లోనే టీమిండియాకు రవి బిష్ణోయ్ మరో వికెట్ అందించాడు. ఐరిష్ జట్టు సారథి పాల్ స్టిర్లింగ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక 7వ ఓవర్లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. దీంతో ఏడు ఓవర్లలోనే ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 18) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్-2023 స్టార్, సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. రింకూతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ మ్యాచ్‌తో టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ -
Ind vs Ire: ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే ఎవరు చూస్తారు? హౌజ్‌ఫుల్..
India tour of Ireland, 2023: టీమిండియా- పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్.. అదే విధంగా భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి మేటి జట్లతో పోటీ పడుతుందంటే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. మరి ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే.. అది కూడా ఒకరిద్దరు మినహా మిగతా అంతా యువ ఆటగాళ్లతో కూడిన దాదాపు ద్వితీయ శ్రేణి జట్టు అంటే మ్యాచ్ చూసేందుకు వచ్చే వారెవరుంటారు? ఇలా అనుకుంటే మాత్రం పొరపాటే! ఐర్లాండ్‌లో ఉన్న మన వాళ్లకు, స్థానికులకు ఇలాంటపుడే టీమిండియా ఆటగాళ్లను నేరుగా చూసే అవకాశం వస్తుంది కదా! అందుకే పోటీపడి మరి టీమిండియా- ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు కొనుగోలు చేశారు. హౌజ్‌ఫుల్! తొలి రెండు మ్యాచ్‌ల కోసం ఇప్పటికే మొత్తం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు. మూడో టీ20కి సంబంధించి కూడా త్వరలోనే టిక్కెట్ల విక్రయ ప్రక్రియ ఆరంభిస్తామని తెలిపింది. టీమిండియాతో మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారని హర్షం వ్యక్తం చేసింది. బుమ్రా- ఎక్స్‌ప్రెస్‌కు పరీక్ష! కాగా ఆగష్టు 18- 23 వరకు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటికే ఐర్లాండ్‌లో అడుగుపెట్టింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లు ఐరిష్ టీమ్‌తో తలపడనున్నారు. ఏడాది కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా ఫిట్‌నెస్‌కు సంబంధించి ఈ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడనుంది. చిన్న జట్లకు మేలు ఇక ఐర్లాండ్ వంటి చిన్న జట్లతో పటిష్ట భారత జట్టు ఇటీవలి కాలంలో ఎక్కువగా సిరీస్‌లు ఆడటం ఆయా జట్లకు మేలు చేస్తోంది. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టుతో పోటీ పడుతూ.. ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల మంచి ఆదాయం ఆర్జించేందుకు దోహదం చేస్తోంది కూడా! ఇదే తొలిసారి కాగా 2018, 2022లో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సందర్భాల్లో తలపడ్డాయి. టీ20 వరల్డ్‌కప్-2009లో భాగంగా ఐర్లాండ్ టీమిండియాను ఢీకొనగా.. మిగతా నాలుగుసార్లు ద్వైపాక్షిక సిరీస్‌లో ముఖాముఖి పోటీపడింది. అయితే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. చదవండి: IND VS IRE 1st T20: చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా -
ఇండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన
ఇండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ 15 మంది సభ్యుల జట్టును ఇవాళ (ఆగస్ట్ 4) ప్రకటించింది. ఈ జట్టుకు పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఐర్లాండ్ 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో పటిష్టమైన పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేసింది. విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20 జరుగనున్నాయి. మరోవైపు ఈ పర్యటన కోసం భారత జట్టును కూడా ఇటీవలే ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతనికి డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ -
వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు..!
ఐర్లాండ్ వన్డే వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఏడో స్థానం కోసం నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించిన అనంతరం బల్బిర్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు. బల్బిర్నీ తప్పుకోవడంతో క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) పాల్ స్టిర్లింగ్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. 32 ఏళ్ల బల్బిర్నీ మూడు ఫార్మాట్లలో కలిపి 89 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బల్బిర్నీ 2019లో ఈ బాధ్యతలు చేపట్టాడు. బల్బిర్నీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గెలుపుతో ముగింపు పలకడం విశేషం. కాగా, జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్ కనీసం సూపర్ సిక్స్ దశకు కూడా చేరలేకపోయింది. ఆ జట్టు గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీలో అజేయంగా ఉన్న శ్రీలంక ఇదివరకే వన్డే వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించగా.. మరో బెర్త్ కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొంది. నిన్న జరిగిన కీలక సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓటమితో జింబాబ్వే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. -
గెలిచినా లాభం లేదు; క్వాలిఫయింగ్ రేసులో లంక, జింబాబ్వే
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోరులో భాగంగా ఐర్లాండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. గ్రూప్-బిలో మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 138 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ గెలిచినా ఐర్లాండ్‌కు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐర్లాండ్, ఒమన్‌లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక స్కాట్లాండ్పై గెలిచిన శ్రీలంక నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌లో అడుగుపెట్టగా.. ఆరు పాయింట్లతో స్కాట్లాండ్ రెండో స్థానంలో, ఒమన్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో సూపర్‌సిక్స్‌కు అర్హత సాధించాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 134 బంతుల్లో 162 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ ఆండ్రూ బాల్బర్ని 66 పరుగులు, హ్యారీ టెక్టర్ 57 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 39 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంచిత్ శర్మ 44 పరుగులు, బాసిల్ హమీద్ 39 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, జార్జ్ డొక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్ జోషువా లిటిల్‌లు తలా రెండు వికెట్లు తీశారు. ఇక క్వాలిఫయింగ్ టోర్నీలో ఇవాళ్టితో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. సూపర్ సిక్స్‌కు వెళ్లిన ఆరుజట్లలో లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా సాధించిన పాయింట్లను ఐసీసీ పేర్కొంది. సూపర్‌సిక్స్ స్టాండింగ్స్ ప్రకారం శ్రీలంక నాలుగు, జింబాబ్వే నాలుగు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చెరో రెండు పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్, ఒమన్ జట్లు సున్నా పాయింట్లతో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచాయి. సూపర్ సిక్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే శ్రీలంక, జింబాబ్వేలు నాలుగేసి పాయింట్లతో ఉండడంతో.. ఈ రెండు జట్లకు అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 హోదాలో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప! The race for the final two #CWC23 spots is heating up 🔥 How the Super Six standings look at the end of the Qualifier group stages 👀 pic.twitter.com/B2xTVFb72V — ICC (@ICC) June 27, 2023 చదవండి: క్లియరెన్స్ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ' -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్
ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్‌లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి. మే 12న బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్‌డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్‌కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్‌మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
శ్రీలంకకు చుక్కలు చూపించిన ఐర్లాండ్.. టెస్టుల్లో అత్యధిక స్కోర్!
గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య శ్రీలంకకు పసికూన ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 492 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టెస్టుల్లో ఐర్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 2018లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఐర్లాండ్ 339 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఐర్లాండ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐరీష్ బ్యాటర్లలో పాల్ స్టిర్లింగ్(103), కర్టిస్ కాంఫర్(111) సెంచరీలతో చెలరేగారు. అదే విధంగా ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ(95) పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో ప్రబాత్ జయసూర్య ఐదు వికెట్ల హాల్ సాధించగా.. విశ్వా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో రోజు ఆటను వెలుతురు లేమి కారణంగా నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. క్రీజులో నిషాన్ మదుష్కా(41), దిమిత్ కరుణరత్నే(39) ఉన్నారు. చదవండి: Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్! -
శతక్కొట్టిన పాల్ స్టిర్లింగ్.. అత్యంత అరుదైన జాబితాలో చోటు
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (103) శతక్కొట్టాడు. తద్వారా ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 23 ఆటగాడిగా, ఈ ఘనత సాధించిన రెండో ఐరిష్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. స్టిర్లింగ్‌కు ముందు కెవిన్ ఓబ్రెయిన్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను తొలుత విండీస్ విధ్వంకర వీరుడు క్రిస్ గేల్ సాధించగా.. భారత్ తరఫున సురేశ్ రైనా సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 121 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. స్టిర్లింగ్‌తో పాటు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (95), లోర్కన్ టక్కర్ (80), కర్టిస్ క్యాంఫర్ (68 నాటౌట్) సత్తా చాటారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 2 వికెట్లు, విశ్వ ఫెర్నాండో, రమేశ్ మెండిస్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఐర్లాండ్ బ్యాటర్ల ఆధిపత్యం.. తేలిపోయిన లంక బౌలర్లు, మరో 20 పరుగులు చేస్తే రికార్డు
గాలె: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో ఐర్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (163 బంతుల్లో 95; 14 ఫోర్లు) ఐదు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాల్ స్టిర్లింగ్ (133 బంతుల్లో 74 రిటైర్డ్‌హర్ట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), లొర్కాన్ టకర్ (102 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. బాల్బిర్నీ, స్టిర్లింగ్ నాలుగో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. టెస్టుల్లో ఐర్లాండ్ జట్టుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మరో 20 పరుగులు సాధిస్తే ఐర్లాండ్ టెస్టుల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేస్తుంది. టకర్‌కు జతగా ప్రస్తుతం కాంఫెర్ (27 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టాడు. -
బంగ్లాదేశ్‌కు బిగ్ షాకిచ్చిన ఐర్లాండ్.. 14 ఏళ్ల తర్వాత!
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 7వికెట్ల తేడాతో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న బంగ్లా ఆశలకు ఐరీష్ జట్టు కళ్లెం వేసింది. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. మూడు వికెట్లు కోల్పోయి కేవలం 14 ఓవర్లలోనే చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో పాల్ స్టిర్లింగ్ విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న స్టిర్లింగ్ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో షమీమ్ హొస్సేన్(51) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. మాథ్యూ హంఫ్రీస్ రెండు, హాండ్, హ్యారీ టెక్టర్, వైట్, డెలానీ తలా వికెట్ సాధించారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఐర్లాండ్‌కు బంగ్లాదేశ్‌పై 14 ఏళ్ల తర్వాత ఇదే తొలి టీ20 మ్యాచ్ విజయం. బంగ్లాదేశ్‌పై చివరగా 2009 టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ విజయం సాధించింది. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం -
పార్ల్ రాయల్స్ జట్టులోకి ఐర్లాండ్ విధ్వంసకర ఆటగాడు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023కు వెస్టిండీస్ స్టార్ పేసర్ ఒబెడ్ మెకాయ్ గాయం కారణంగా దూరమై సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో మెకాయ్ను పార్ల్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా అతడు ఆడలేదు. ఈ క్రమంలో మెకాయ్ స్థానాన్ని ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్‌తో పార్ల్ రాయల్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాయల్స్ మెనేజెమెంట్ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 7న ప్రిటోరియా క్యాపిటల్స్లతో పార్ల్ రాయల్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ జట్టు సెలక్షన్‌కు స్టిర్లింగ్ అందుబాటులో ఉండనున్నాడు. ఇక స్టిర్లింగ్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో కూడా భాగమయ్యాడు. ఈ టోర్నీలో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 మ్యాచ్‌ల్లో 168 పరుగులు చేశాడు. అయితే ప్లే ఆఫ్స్‌కు నైట్‌రైడర్స్ అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక ఓవరాల్‌గా తన కెరీర్లో 120 టీ20లు ఆడిన అతడు 3181 పరుగులు చేశాడు. చదవండి: IND vs AUS: భారత్ గెలవాలంటే.. రాహుల్ ఓపెనర్‌గా వద్దు! అతడే సరైనోడు -
ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా
ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఎప్పటిలాగే అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. అయితే పేరు మోసిన ఆటగాళ్లలో రాసీ వాండర్ డసెన్, వేన్ పార్నెల్, పాల్ స్టిర్లింగ్, జేమ్స్ నీషమ్, డేవిడ్ మలాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ వేలంలో ఇంగ్లండ్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడయ్యారు. సామ్ కరన్(18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(రూ. 16.25 కోట్లు- సీఎస్కే)తో పాటు బ్యాటర్ హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు- ఎస్ఆర్హెచ్) కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయారు. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే.. ► కుశాల్ మెండిస్ ► టామ్ బాంటన్ ► క్రిస్ జోర్డాన్ ► ఆడమ్ మిల్నే ► పాల్ స్టిర్లింగ్ ► రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ► షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ► ట్రెవిస్ హెడ్ ► డేవిడ్ మలన్ ► డారిల్ మిచెల్ ► మహమ్మద్ నబీ ► వేన్ పార్నెల్ ► జిమ్మీ నీషమ్ ► దాసున్ షనక ► రిలే మ్రెడిత్ ► సందీప్ శర్మ ►తబ్రైజ్ షమ్సీ ►ముజీబ్ రెహమాన్ ►చేతన్ ఎల్ఆర్ ►శుభమ్ ఖజురియా ►రోహన్ కున్నుమ్మల్ ► హిమ్మత్ సింగ్ ► ప్రియం గార్గ్ ► సౌరభ్ కుమార్ ► కార్బిన్ బాష్ ► అభిమన్యు ఈశ్వరన్ ► శశాంక్ సింగ్ ► సుమిత్ కుమార్ ► దినేష్ బానా ► మహ్మద్ అజారుద్దీన్ ► ముజ్తబా యూసుఫ్ ► లాన్స్ మోరిస్ ► చింతన్ గాంధీ ► ఇజారుల్హుక్ నవీద్ ► రేయాస్ గోపాల్ ► ఎస్ మిధున్ ► తస్కిన్ అహ్మద్ ► దుష్మంత చమీర ► ముజారబానీ దీవెన ► సూర్యాంశ్ షెడ్జ్ ► జగదీశ సుచిత్ ► బాబా ఇంద్రజిత్ ► కిరంత్ షిండే ► ఆకాష్ సింగ్ ►పాల్ వాన్ -
ఔట్ కాదనుకుంటా.. పాల్ స్టిర్లింగ్ మోసపోయాడు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ను థర్డ్ అంపైర్ మోసం చేశాడు. స్టిర్లింగ్ ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ రిప్లేని మరోసారి చెక్ చేయకపోవడం ఐర్లాండ్ ఓపెనర్‌ను ముంచింది. ఫలితంగా పాల్ స్టిర్లింగ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఇది జరిగింది. ఆ ఓవర్లో ధనుంజయ డిసిల్వా వేసిన నాలుగో బంతిని పాల్ స్టిర్లింగ్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన వద్ద ఉన్న బానుక రాజపక్స ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ముందుకు వచ్చి పట్టడంతో క్యాచ్‌పై క్లియర్ విజన్ కనిపించలేదు. అయితే తర్వాత రిప్లేలో రాజపక్స క్యాచ్ తీసుకున్న తర్వాత బంతిని గ్రౌండ్‌పై పెట్టినట్లు కనిపించింది. ఇది చూసిన పాల్ స్టిర్లింగ్ కాసేపు అలాగే నిలబడినప్పటికి థర్డ్ అంపైర్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏం చేయలేక పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి స్టిర్లింగ్ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Virat Kohli: పాక్‌తో మ్యాచ్.. కోహ్లి ముంగిట అరుదైన రికార్డు దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు NOT OUT! Paul Stirling should have been not out. Rajapaksa slid the ball on the ground before completing the catch. @FOXSports @ICC_CricInfo @cricketireland pic.twitter.com/0i4Bp9nRpJ — Jazz Vic AU (@JazzVicAU) October 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్ ఇలా అవమానకర రీతిలో వెనుదిరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అరె రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ ఇలా నాకౌట్ కావడం ఏంటని సగటు అభిమాని బాధపడుతున్న వేళ ఆ జట్టు బౌలర్ చేసిన కవ్వింపు చర్య ఆగ్రహం తెప్పించింది. విషయంలోకి వెళితే.. ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ ఒక బంతిని స్ట్రెయిట్ డెలివరీగా వేశాడు. అయితే పాల్ స్టిర్లింగ్ మిస్ చేయడంతో బంతి అతని గజ్జల్లో బలంగా తాకింది. దీంతో స్టిర్లింగ్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత బాధను ఓర్చుకుంటూనే తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఒక బ్యాటర్‌కు తగలరాని చోట తగిలి నొప్పితో బాధపడుతుంటే బౌండరీ లైన్ వద్ద ఉన్న విండీస్ ఆటగాడు ఒబెద్ మెకాయ్ మాత్రం చప్పట్లు కొడుతూ ''వెల్డన్ జోసెఫ్ గుడ్ బౌలింగ్'' అంటూ అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో అందరు మెకాయ్ చర్యను తప్పుబట్టారు. ''ఒక బ్యాటర్ గాయపడి నొప్పితో బాధపడుతుంటే ఇలా చప్పట్లు కొట్టడం ఏంటని''.. '' ఓడిపోతున్నామని ముందే తెలిసిందా.. అందుకే ఇలా చేశాడా''..'' ఓడిపోయారని సానుభూతి చూపించాలనుకుంటే మెకాయ్ చర్యతో అది రివర్స్ అయింది.. పాల్ స్టిర్లింగ్‌కు ఏం కాకూడదని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ టి20 ప్రపంచకప్‌లో వాస్తవానికి విండీస్‌పై పెద్దగా ఎవరికి అంచనాలు లేవు.. అయినప్పటికి రెండుసార్లు చాంపియన్ కావడంతో కాస్త ఆశలు ఉన్నాయి. కానీ ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం వెస్టిండీస్‌కు అంత సీన్ లేదన్న విషయం అర్థమయింది. 147 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడంలో చేతులెత్తేసిన వెస్టిండీస్ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అటు ఐర్లాండ్ మాత్రం 147 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా జట్టు ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ ఈ ప్రపంచకప్‌లో తొలిసారి తన బ్యాట్‌కు పదును చెప్పాడు. 48 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనితో పాటు కెప్టెన్ ఆండ్రూ బాల్బర్నీ 37 పరుగులు, లోర్కాన్ టక్కర్ 45 నాటౌట్ రాణించారు. #T20WorldCup #IREvsWI #WIvsIRE #T20worldcup22 pic.twitter.com/H129vR6UC1 — The sports 360 (@Thesports3601) October 21, 2022 చదవండి: WI Vs IRE: పేరుకే రెండుసార్లు చాంపియన్.. మరీ ఇంత దారుణంగా..