
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(PC: Ireland Cricket Twitter)
టీమిండియాకే చుక్కలు చూపించారు.. మళ్లీ అదే జట్టుతో కివీస్‌తో పోరుకు సై అంటున్న ఐర్లాండ్
Ireland Vs New Zealand T20 Series: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య ఐర్లాండ్ బోర్డు వన్డేలకు జట్టును ప్రకటించగా.. తాజాగా టీ20 టీమ్ వివరాలు కూడా వెల్లడించింది.
కివీస్‌తో టీ20 సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియాతో ఇటీవల పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆడిన జట్టునే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కూడా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కాగా ఇరు జట్ల మధ్య జూలై 10 నుంచి వన్డే సిరీస్, జూలై 18 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా చేతిలో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఓడినా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేవలం 4 పరుగులతో ఓటమి పాలైంది.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టు:
ఆండ్రూ బల్బెర్నీ(కెప్టెన్), మార్క్ అడేర్, కర్టిస్ కాంఫర్, గరెత్ డెలనీ, జార్జ్ డాక్‌రెల్, స్టీఫెన్ డోహ్నీ, లోర్కాన్ టకర్, జాషువా లిటిల్, ఆండీ మెక్‌బ్రిన్, బ్యారీ మెకార్టీ, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు:
ఆండ్రూ బల్బెర్నీ(కెప్టెన్), మార్క్ అడేర్, కర్టిస్ కాంఫర్, గరెత్ డెలనీ, జార్జ్ డాక్‌రెల్, స్టీఫెన్ డోహ్నీ, గ్రాహమ్ హ్యూమ్, జాషువా లిటిల్, ఆండ్రూ మెక్‌బ్రిన్, సిమీ సింగ్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టార్, లోర్కాన్ టకర్, క్రెయిగ్ యంగ్.
చదవండి: IND Vs IRE 2nd T20: ఐర్లాండ్ అద్భుత పోరాటం.. సరికొత్త రికార్డు! భారత జట్టుపై!
IND VS ENG: తొలి టీ20కి కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు ఏమైంది..?