Harry Tector
-
SA vs IRE: సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్
సౌతాఫ్రికాతో మూడో వన్డేల్లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. సఫారీ జట్టును 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వన్డేల్లో సౌతాఫ్రికాపై ఐరిష్ టీమ్‌కు ఇది రెండో గెలుపు కావడం విశేషం. కాగా యూఏఈ వేదికగా ఐర్లాండ్- సౌతాఫ్రికా మధ్య అబుదాబి వేదికగా పరిమిత ఓవర్ల సిరీస్ జరిగింది.రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో ట్రోఫీని పంచుకున్నాయి. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి రెండింటిలో సౌతాఫ్రికా వరుసగా 139, 174 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ప్రొటిస్ జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది.పాల్ స్టిర్లింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో బల్బిర్నీ 45 పరుగులతో రాణించగా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 88 రన్స్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(34) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హ్యారీ టెక్టార్ 60 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ లోర్కాన్ టకర్ 26 పరుగులు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమైంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఐరిష్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. జేసన్ స్మిత్ పోరాటం వృథాఓపెనర్లు రియాన్ రెకెల్టన్(4), రీజా హెండ్రిక్స్(1), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(3) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో కైలీ వెరెన్నె 38, ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు చేయగా.. ఆరోస్థానంలో వచ్చిన జేసన్ స్మిత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 93 బంతుల్లో 91 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఐరిష్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 46.1 ఓవర్లలో 215 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో ఐర్లాండ్ విజయం ఖరారైంది. 69 పరుగుల తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలుపొందింది. ఐర్లాండ్ బౌలర్లలో గ్రాహం హ్యూమ్, క్రెయిగ్ యంగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్ అడేర్ రెండు, ఫియాన్ హ్యాండ్, మాథ్యూ హంఫ్రేస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూడో వన్డేకు ముందే... సిరీస్ కోల్పోయినా సౌతాఫ్రికా ఆధిక్యాన్ని ఐర్లాండ్ 2-1కు తగ్గించగలిగింది. ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది -
Zim Vs Ire: జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
Zimbabwe vs Ireland, 3rd T20: జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుకు గట్టి షాకిచ్చింది ఐర్లాండ్ క్రికెట్ జట్టు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో ఆరు వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే టూర్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి టీ20లో ఆఖరి బంతి వరకు ఆతిథ్య, పర్యాటక జట్ల మధ్య ఉత్కంఠ పోరు నడించింది. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఐరిష్ టీమ్‌పై ఒక వికెట్ తేడాతో నెగ్గి గట్టెక్కింది. ఈ క్రమంలో రెండో టీ20లో ఐర్లాండ్ గత మ్యాచ్ తాలుకు పొరపాట్లను పునరావృతం కానివ్వలేదు. అద్భుత ఆట తీరుతో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ చేసింది. హ్యారీ టెక్టర్, డాక్రెల్ అద్భుత అజేయ ఇన్నింగ్స్ జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ రియాన్ బర్ల్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు సాధించింది. ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలినా.. నాలుగో నంబర్లో వచ్చిన హ్యారీ టెక్టర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అతడికి తోడుగా జార్జ్ డాక్రెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హ్యారీ టెక్టర్ 45 బంతుల్లో 54, డాక్రెల్ 32 బంతుల్లో 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఐర్లాండ్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. వీరిద్దరు రాణించడంతో 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టపోయి ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సిరీస్ ఆసాంతం అద్భుతంగా ఆడిన హ్యారీ టెక్టర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఐర్లాండ్ తదుపరి.. జింబాబ్వేతో బుధవారం నుంచి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. చదవండి: Ind vs Pak: భారత క్రికెట్ జట్టుకు నిరాశ.. సెమీస్ చేరాలంటే.. Player of the Series: @harry_tector pic.twitter.com/BgOH82vK8o — Cricket Ireland (@cricketireland) December 10, 2023 -
బాబర్ ఆజమ్‌కు షాక్.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అనామక ప్లేయర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు షాక్ తగిలింది. బాబర్‌ను కాదని ఓ అనామక జట్టు ప్లేయర్ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారీ టెక్టార్ 2023 మే నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. మే నెలలో టెక్టార్‌తో పోలిస్తే బాబర్ ప్రదర్శనలే మెరుగ్గా ఉన్నప్పటికీ, అవార్డు టెక్టార్నే వరించింది. టెక్టార్, బాబర్‌తో పాటు బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉండగా.. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టెక్టార్కే అధిక ఓట్లు వేసి గెలిపించారు. పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుతో పాటు మహిళల విభాగంలోనూ ఈ అవార్డు విజేతను ప్రకటించారు. అవార్డు రేసులో శ్రీలంక ప్లేయర్స్ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ ఉండగా.. 19 ఏళ్ల థాయ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్‌ను ఈ అవార్డు వరించింది. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. మే నెలలో నామినీస్ ప్రదర్శనలు.. బాబర్ ఆజమ్: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు నజ్ముల్ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు హ్యారీ టెక్టార్: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు -
ICC Awards: రేసులో పాకిస్తాన్ కెప్టెన్
2023 మే నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్ 6) ప్రకటించింది. గడిచిన నెలలో వన్డేల్లో ప్రదర్శన ఆధారంగా నామినీస్ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. పురుషులతో పాటు మహిళల క్రికెట్ నుంచి చెరో ముగ్గురి పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ షాంటో, ఐర్లాండ్ ప్లేయర్ హ్యారీ టెక్టార్ రేసులో ఉండగా.. మహిళల కేటగిరి నుంచి శ్రీలంక ప్లేయర్స్ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ నామినీస్‌గా ఉన్నారు. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓట్లు వేసి విజేతలను నిర్ణయిస్తారు. వచ్చే వారం విజేతలను ఐసీసీ ప్రకటిస్తుంది. మే నెలలో నామినీస్ ప్రదర్శనలు.. బాబర్ ఆజమ్: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు నజ్ముల్ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు హ్యారీ టెక్టార్: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు చదవండి: WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..! -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్
ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్‌లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి. మే 12న బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్‌డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్‌కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్‌మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్.. 320 పరుగుల టార్గెట్ ఛేజ్
చెమ్స్‌ఫోర్డ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్ (140) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. డాక్రెల్ 74 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్, షోర్పుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో(117) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తౌహిద్ హృదయ్(68), రహీం(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, డాక్రల్ తలా రెండు వికెట్లు, లిటిల్, అదైర్, హ్యుమ్ ఒక్కో వికెట్ పడగొట్టాడు. కాగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 అధిక్యంలో బంగ్లాదేశ్ నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
5 వికెట్లతో చెలరేగిన తైజుల్.. ఐర్లాండ్ 214 ఆలౌట్
Bangladesh vs Ireland, Only Test 2023 Day 1 Score- మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్‌ను బంగ్లాదేశ్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/53), మీడియం పేసర్ ఇబాదత్ హుస్సేన్ (2/54), స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (2/43) దెబ్బ కొట్టారు. ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ (50; 6 ఫోర్లు, 1 సిక్స్), లొర్కాన్ టకెర్ (37; 3 ఫోర్లు), క్యాంఫెర్ (34; 6 ఫోర్లు) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అడేర్ ఒకటి, ఆండీ మెక్‌బ్రిన్ ఒక వికెట్ తీశారు. ఇక మొదటి రోజు ముగిసేసరికి ఆతిథ్య బంగ్లాదేశ్ ఐర్లాండ్ కంటే 180 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్ ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి కూడా -
శతకాలతో విరుచుకుపడిన ఐర్లాండ్ ఆటగాళ్లు
మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐర్లాండ్ క్రికెట్ టీమ్.. వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (137 బంతుల్లో 121 రిటైర్డ్ హర్ట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (13), స్టీఫెన్ డోహెనీ (3), జార్జ్ డాక్రెల్ (12), కర్టిస్ క్యాంఫర్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టగా.. బల్బిర్నీ, హ్యారీ టెక్టార్ అన్నీ తామై వ్యవహరించారు. జింబాబ్వే బౌలర్లలో విక్టర్ న్యాయుచి 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగర్వా, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిధ్య జింబాబ్వే 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20లో జింబాబ్వే నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్, నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో జింబాబ్వే గెలిచాయి. -
Zim Vs Ire: ఐర్లాండ్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సిరీస్ కైవసం
Zimbabwe vs Ireland, 3rd T20I: సొంతగడ్డపై జింబాబ్వే సత్తా చాటింది. ఐర్లాండ్‌తో మూడో టీ20లో విజయం సాధించింది. పర్యాటక జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకై ఐర్లాండ్ జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో జింబాబ్వే ఆఖరి వరకు పోరాడి ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది. టెక్టర్ ఒక్కడే ఐర్లాండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 47 పరుగులతో ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కర్టిస్ కాంఫర్ 27, డాక్రెల్ 23 పరుగులతో రాణించారు. సిరీస్ విజేత జింబాబ్వే (PC: Zimbabwe Cricket) చివరి వరకు పోరాడినా ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకం(54)తో రాణించి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నాడు. అయితే, ఐర్లాండ్ మాత్రం పట్టు సడలించలేదు. ఈ దశలో ఆల్‌రౌండర్ ర్యాన్ బర్ల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత రెండు మ్యాచ్‌లలోనూ రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మూడో టీ20 స్కోర్లు ఐర్లాండ్- 141/9 (20) జింబాబ్వే- 144/6 (19) చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? -
చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో
Zimbabwe vs Ireland, 1st T20I: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం ఐర్లాండ్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్లో గురువారం మొదటి టీ20 జరిగింది. టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ టాస్ ఛాయిస్‌కు సార్థకత చేకూరేలా ఆతిథ్య జట్టు బౌలర్లు.. ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ర్యాన్ బర్ల్ మూడు వికెట్లు కూల్చగా.. చటారా, నగరవ, మసకద్జ రెండేసి వికెట్లు తీశారు. బ్రాడ్ ఎవాన్స్‌కు ఒక వికెట్ దక్కింది. టీమిండియా వంటి పటిష్ట జట్లపై మెరుగ్గా ఆడగలిగిన ఐరిష్ కెప్టెన్ బల్బిర్నీ(5), హ్యారీ టెక్టార్(5) వంటి కీలక బ్యాటర్లు విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో డెలని టాప్ స్కోరర్ అనిపించుకున్నాడు. ఇలా జింబాబ్వే బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి ఐర్లాండ్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగినప్పటికీ జింబాబ్వే విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనింగ్ జోడీ ఎర్విన్, మరునణి చెరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో మధెవెరె 16 పరుగులకు అవుటయ్యాడు. టాపార్డర్ విఫలమైన వేళ నాలుగో స్థానంలో వచ్చిన గ్యారీ బ్యాలన్స్ 30 పరుగులు చేయగా , సీన్ విలియమ్స్(34) పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన జింబాబ్వే జయకేతనం ఎగురవేసింది. చదవండి: దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
Ire Vs Afg: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. ఏడు వికెట్లతో చిత్తు చేసి..
Afghanistan tour of Ireland, 2022- Ireland Vs Afghanistan 1st T20: ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తూ క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్న ఐర్లాండ్ జట్టు.. అఫ్గనిస్తాన్‌కు గట్టి షాకిచ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ టూర్‌కు వెళ్లింది. శుభారంభమే అయినా.. ఈ క్రమంలో బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది అఫ్గనిస్తాన్. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్(26), ఉస్మాన్ ఘని(59) శుభారంభం అందించారు. కానీ ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మహ్మద్ నబీ(5) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ఇబ్రహీం జద్రాన్ 29 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 168 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో జోషువా లిటిల్‌కు ఒకటి, బ్యారీ మెకార్తీకి మూడు, గరెత్ డెలనీకి ఒకటి, జార్జ్ డాక్రెల్కు రెండు వికెట్లు దక్కాయి. కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ బ్యాటర్లు ఆది నుంచి దంచికొట్టారు. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 31 పరుగులు చేయగా.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ అర్ధ శతకం(38 బంతుల్లో 51 పరుగులు)తో మెరిశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్ సైతం హాఫ్ సెంచరీ(32 బంతుల్లో 50 పరుగులు) చేశాడు. 50 partnership up between the two openers! SCORE: https://t.co/iHiY0U5y7J#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/6oVMBS8LU3 — Cricket Ireland (@cricketireland) August 9, 2022 హ్యారీ టెక్టర్ 15 బంతుల్లో 25, జార్జ్ డాక్రెల్ 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించిన ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. Two half-centuries in three T20I innings for Lorcan Tucker 👏 SCORE: https://t.co/iHiY0U5y7J#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/qcF2DXbses — Cricket Ireland (@cricketireland) August 9, 2022 హాఫ్ సెంచరీ హీరో, కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో టీమిండియా, న్యూజిలాండ్ జట్లకు ఐర్లాండ్ గట్టి పోటీనిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సేనతో రెండో టీ20లో.. కివీస్‌తో మూడో వన్డేలో ఆఖరి వరకు అద్భుతంగా పోరాడింది. చదవండి: Nitu Ghanghas: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘బంగారం’తో మెరిసి.. Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
Ire Vs NZ: పాపం ఐర్లాండ్.. టీ20 సిరీస్‌లోనూ..!
Ireland Vs New Zealand T20 Series 2022: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బెల్ఫాస్ట్ వేదికగా సోమవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇప్పటికే వన్డే సిరీస్‌లో కివీస్ చేతిలో వైట్‌వాష్(3-0)కు గురైన ఆతిథ్య ఐర్లాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టాస్ గెలిచి.. న్యూజిలాండ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సాంట్నర్ బృందానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గప్టిల్ 24 పరుగులు చేసి నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి పెవిలియన్ చేరాడు. ఇక క్లీవర్ సైతం 5 పరుగులకే అవుటయ్యాడు. ఈ క్రమలో గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి 69 పరుగుఉలు చేశాడు. నీషమ్(29), బ్రాస్‌వెల్(21) అతడికి సహకారం అందించడంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. Mark Adair is still fighting 👊 We need 44 runs off the last four overs. SCORE: https://t.co/nImk9IyGSm#BackingGreen | #EXCHANGE22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/JZuZxaRNRV — Cricket Ireland (@cricketireland) July 18, 2022 టాప్ స్కోరర్ అతడే.. లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ వరుసగా 13,12 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక డెలనీ 5 పరుగులే చేయగా.. హిట్టర్ హ్యారీ టెక్టర్ సైతం ఐదు పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో కర్టిస్ కాంఫర్ 29 పరుగులతో రాణించి ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఎనిమిదో స్థానంలో మార్క్ అడేర్ 25 పరుగులు చేయగా.. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో 31 పరుగుల తేడాతో బల్బిర్నీ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది. Our first six of the innings - just about! SCORE: https://t.co/nImk9IyGSm#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/ffwOUEKdwQ — Cricket Ireland (@cricketireland) July 18, 2022 కాగా న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్‌కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కాయి. జేమ్స్ నీషమ్ రెండు, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. డఫ్పీ, ఇష్ సోధి చెరె వికెట్ తీశారు. ఇక కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Glenn Phillips has been awarded: ➡️ Multibagger of the Match ➡️ Player of the Match#BackingGreen #IREvNZ #Exchange22 pic.twitter.com/gh4DsgvXtk — Cricket Ireland (@cricketireland) July 18, 2022 ఐర్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టీ20: ►వేదిక: సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్, బెల్ఫాస్ట్ ►టాస్: ఐర్లాండ్- బౌలింగ్ ►న్యూజిలాండ్ స్కోరు: 173/8 (20) ►ఐర్లాండ్ స్కోరు: 142 (18.2) ►విజేత: 31 పరుగుల తేడాతో పర్యాటక న్యూజిలాండ్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ ఫిలిఫ్స్(52 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్) ►ఆధిక్యం: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0తో ముందంజ చదవండి: Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! -
మొన్న టీమిండియా.. ఇప్పుడు కివీస్‌ను వణికించారు! అట్లుంటది మాతోటి!
Ireland Vs New Zealand ODI Series 2022: ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో టీమిండియాకే చెమటలు పట్టించింది ఐర్లాండ్. ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి నాలుగు పరుగుల తేడాతో హార్దిక్ పాండ్యా సేన చేతిలో ఓడింది. అయినా.. ప్రత్యర్థి జట్టుతో పాటు అభిమానుల ప్రశంసలు అందుకుంది. అదే తరహాలో శుక్రవారం నాటి మూడో వన్డేలోనూ చివరి వరకు ఐర్లాండ్ జట్టు పోరాడిన తీరు అద్భుతం. అట్లుంటది మాతోని ఇప్పటికే కివీస్‌కు సిరీస్ సమర్పించుకున్న ఐర్లాండ్.. డబ్లిన్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 361 పరుగుల భారీ స్కోరు ఛేదించే దిశగా పయనించి న్యూజిలాండ్ ఆటగాళ్లను వణికించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 120 పరుగులతో అదరగొడితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ టెక్టార్ 108 పరుగులు సాధించాడు.కానీ ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. బై రూపంలో ఒక పరుగు మాత్రమే లభించడంతో ఆండ్రూ బృందం పర్యాటక కివీస్ ముందు తలవంచక తప్పలేదు. పసికూన కాదు! ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ఓడినా అసాధారణ ఆట తీరుతో మనసులు మాత్రం గెలుచుకుందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా, కివీస్ వంటి మేటి జట్లకే వణుకు పుట్టించింది ఇకపై ఐర్లాండ్ పసికూన కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ సైతం ఐర్లాండ్ పోరాట పటిమను కొనియాడాడు. A special moment for Paul Stirling. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/Tyg4ykcTcW — Cricket Ireland (@cricketireland) July 15, 2022 మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా ఇలాంటి పిచ్ రూపొందించినందుకు గ్రౌండ్స్‌మెన్‌కు క్రెడిట్ ఇవ్వాలి. మేము బ్యాటింగ్ చేసే సమయంలో హార్డ్‌గా ఉంది. ఐర్లాండ్ బ్యాటర్లు సైతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. అయితే, వారు ఆడిన విధానం అమోఘం. మేము ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారు పోరాడిన తీరు అద్భుతం. ఐర్లాండ్ జట్టు రోజురోజుకీ తమ ఆటను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆకట్టుకుంటోంది’’ అని కొనియాడాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ.. ‘‘ఇదొక అద్భుతమైన మ్యాచ్. మేము చాలా బాగా ఆడాము. కానీ ఓటమి పాలయ్యాం. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఐరిష్ జెర్సీలోని ఆటగాళ్లు రెండు సెంచరీలు నమోదు చేయడం సూపర్. టెక్టర్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. రెండు వారాల వ్యవధిలో రెండు శతకాలు బాదాడు. ఈ ఏడాది మాకు ఇదే ఆఖరి వన్డే అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అయితే, మరిన్ని టీ20 మ్యాచ్‌లు ఆడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ వరుసగా ఒక వికెట్, మూడు వికెట్లు, ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. Harry Tector has only been dismissed once before reaching 50 in his last nine ODI innings. What a talent. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/LlFUkf0Xe3 — Cricket Ireland (@cricketireland) July 15, 2022 ఐర్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే వేదిక: ది విలేజ్, డబ్లిన్ టాస్: న్యూజిలాండ్- బ్యాటింగ్ న్యూజిలాండ్ స్కోరు: 360/6 (50) ఐర్లాండ్ స్కోరు: 359/9 (50) విజేత: ఒక పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్టిన్ గప్టిల్(126 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు) -
Ire Vs NZ: టీమిండియాకే చుక్కలు చూపించారు.. మళ్లీ అదే జట్టుతో కివీస్‌తో పోరుకు సై!
Ireland Vs New Zealand T20 Series: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య ఐర్లాండ్ బోర్డు వన్డేలకు జట్టును ప్రకటించగా.. తాజాగా టీ20 టీమ్ వివరాలు కూడా వెల్లడించింది. కివీస్‌తో టీ20 సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియాతో ఇటీవల పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆడిన జట్టునే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కూడా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కాగా ఇరు జట్ల మధ్య జూలై 10 నుంచి వన్డే సిరీస్, జూలై 18 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా చేతిలో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఓడినా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేవలం 4 పరుగులతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టు: ఆండ్రూ బల్బెర్నీ(కెప్టెన్), మార్క్ అడేర్, కర్టిస్ కాంఫర్, గరెత్ డెలనీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహ్నీ, లోర్కాన్ టకర్, జాషువా లిటిల్, ఆండీ మెక్‌బ్రిన్, బ్యారీ మెకార్టీ, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు: ఆండ్రూ బల్బెర్నీ(కెప్టెన్), మార్క్ అడేర్, కర్టిస్ కాంఫర్, గరెత్ డెలనీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహ్నీ, గ్రాహమ్ హ్యూమ్, జాషువా లిటిల్, ఆండ్రూ మెక్‌బ్రిన్, సిమీ సింగ్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టార్, లోర్కాన్ టకర్, క్రెయిగ్ యంగ్. చదవండి: IND Vs IRE 2nd T20: ఐర్లాండ్ అద్భుత పోరాటం.. సరికొత్త రికార్డు! భారత జట్టుపై! IND VS ENG: తొలి టీ20కి కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు ఏమైంది..? -
'అతడు అద్భుతమైన ఆటగాడు.. త్వరలోనే ఐపీఎల్లో ఆడుతాడు'
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిడియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐర్లాండ్ యువ ఆటగాడు హ్యారీ టెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. టెక్టర్ అద్భుతమైన ఆటగాడని, భవిష్యత్తులో ఐపీఎల్ కాంట్రక్ట్ పొందే అవకాశం ఉందని పాండ్యా తెలిపాడు. ఇక వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో 22 ఏళ్ల టెక్టర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. పోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా టెక్టర్ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. టెక్టెర్ 33 బంతుల్లో 64 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. "ఈ మ్యాచ్‌లో టెక్టర్ అద్భుతమైన షాట్లు ఆడాడు. అతడికి కేవలం 22 ఏళ్లు మాత్రమే. టెక్టర్కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అతడు రాబోయే రోజుల్లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఖచ్చితంగా ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందుతాడు. అతడికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడికి సరైన గైడెన్స్ ఇవ్వండి. అతడికి ఎల్లప్పడూ మేనేజేమెంట్ సపోర్ట్‌గా ఉంటే.. ఐపీఎల్‌లోనే కాదు, ప్రపంచంలోని అన్ని లీగ్‌లలో కూడా ఆడుతాడు" అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు: టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు ఐర్లాండ్ స్కోరు: 108/4 (12) టీమిండియా స్కోరు: 111/3 (9.2) విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి:IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? 🎥 That moment when @hardikpandya7 revealed his conversations with Ireland's Harry Tector while handing over a bat after the first #IREvIND T20I. 👍 👍#TeamIndia pic.twitter.com/fB4IG6xHXN — BCCI (@BCCI) June 27, 2022