చెమ్స్‌ఫోర్డ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్ (140) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. డాక్రెల్ 74 పరుగులతో రాణించాడు.
బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్, షోర్‌పుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో(117) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తౌహిద్ హృదయ్(68), రహీం(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, డాక్రల్ తలా రెండు వికెట్లు, లిటిల్, అదైర్, హ్యుమ్ ఒక్కో వికెట్ పడగొట్టాడు. కాగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 అధిక్యంలో బంగ్లాదేశ్ నిలిచింది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment