Tamim Iqbal
-
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ రెండోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఇక్బాల్ అందుబాటులో ఉంటాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ అంతలోనే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించి బంగ్లా క్రికెట్‌కు షాకిచ్చాడు. 34 ఏళ్ల తమీమ్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు."నేను గత కొంతకాలంగా ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. చాలా గ్యాప్ వచ్చింది. దీంతో నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం చాలా రోజుల కిందటే తీసుకున్నాను. నా నిర్ణయం ప్రకటించడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ ముందు నాపై చర్చలు ఉండకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడో బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాను. కానీ మీడియా మాత్రం నాపై అనవసర చర్చలు పెట్టింది.కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నన్ను జట్టులోకి తిరిగి రావాలని అభ్యర్థించాడు. నేను సెలక్షన్ ప్యానెల్‌తో కూడా మాట్లాడాను. నాలో ఇంకా సత్తువ తగ్గలేదని నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. కానీ నేను నా మనసు చెప్పిన మాటే వింటాను. అంతర్జాతీయ క్రికెట్లో నా అధ్యాయం ముగిసింది" అని తన రిటైర్మెంట్ నోట్లో తమీమ్ పేర్కొన్నాడు.రెండో సారి.. కాగా తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం రెండోసారి. గతంలో 2023 జూలైలో తొలిసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా సూచన మెరకు తన ఇక్భాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 దృష్ట్యా అతడు తన మనసును మార్చుకున్నాడు.కానీ అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులో తమీమ్‌కు జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి అతడు తిరిగి జట్టులోకి రాలేదు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.చదవండి: అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్ -
తమీమ్ ఇక్బాల్, అలెక్స్ హేల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం.. కొట్టుకున్నంత పని చేశారు..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. రంగ్‌పూర్ రైడర్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య నిన్నటి రసవత్తర మ్యాచ్ అనంతరం తమీమ్ ఇక్బాల్ (ఫార్చూన్ బారిషల్ కెప్టెన్), అలెక్స్ హేల్స్ (రంగ్‌పూర్ రైడర్స్) కొట్టుకున్నంత పని చేశారు. మ్యాచ్ అనంతరం జరిగే హ్యాండ్ షేక్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా మీడియా కథనాల మేరకు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు ఎదురెదురుపడ్డాడు.ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్, హేల్స్ మధ్య మాటామాటా పెరిగింది. తొలుత హేల్స్ తమీమ్‌ను రెచ్చగొట్టాడు. తమీమ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హేల్స్ అగౌరవంగా ప్రవర్తించాడు. హేల్స్ ప్రవర్తనను అవమానంగా భావించిన తమీమ్ తొలుత నిదానంగా సమాధానం చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని తమీమ్ హేల్స్‌ను అడిగాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పు. ఇలా ప్రవర్తించడం సరికాదు. మగాడిలా ప్రవర్తించు అని తమీమ్ హేల్స్‌తో అన్నాడు.తమీమ్ తన అసంతృప్తిని వెలిబుచ్చుతుండగానే హేల్స్ ఏదో అన్నాడు. ఇందుకు చిర్రెతిపోయిన తమీమ్ సహనాన్ని కోల్పోయి హేల్స్ మీదకు వచ్చాడు. హేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరికి సర్ది చెప్పేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నించారు. గొడవ వద్దని వారు ఎంత వారిస్తున్నా తమీమ్, హేల్స్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.అయితే ఈ గొడవపై హేల్స్ మరోలా స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని అన్నాడు. గొడవను తొలుత తమీమే స్టార్ట్ చేశాడని చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంగా తమీమ్ తనను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. డ్రగ్స్ కారణంగా నిషేధించబడినందుకు (ఇంగ్లండ్) సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఇలా మాట్లాడుతూనే చాలా దరుసుగా ప్రవర్తించాడని హేల్స్ చెప్పుకొచ్చాడు.కాగా, ఫార్చూన్ బారిషల్‌తో నిన్న జరిగిన రసవత్తర సమరంలో రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్‌పూర్ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు. మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు. -
‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్‌ను చూస్తారు’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్ స్టైల్ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.ద్రవిడ్ తర్వాతటీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సేన చాంపియన్‌గా నిలిచిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమించింది బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(రెండుసార్లు ప్లే ఆఫ్స్) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మెంటార్‌గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.తన దూకుడు వైఖరికి విరుద్ధంగాశ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం రోహిత్ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయింది. రెండో ప్రయత్నంలోనే గంభీర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు.. రోహిత్ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గంభీర్ విశ్వరూపం చూస్తారుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. మీరు ఎప్పుడైతే ఓ సిరీస్ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్ స్టైల్‌పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. గంభీర్ మరీ అంత కూల్ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.గంభీర్ ముందున్న సవాళ్లువరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడం సహా చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్‌కప్-2027 రూపంలో గంభీర్‌కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
‘రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఆరు శతకాలు.. 522 వికెట్లుఈ క్రమంలో టెస్టు క్రికెట్లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాదిరి ఇన్నింగ్స్ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమేఅయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం. అయితే, భారత క్రికెట్ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లి మాదిరే అతడూ టాప్ ప్లేయరేనని తమీమ్ ఇక్బాల్ ఈ సందర్భంగా అశ్విన్‌ను ప్రశంసించాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!📽️ WATCHThe dismissal that completed five-wicket haul number 37 in Test Cricket for @ashwinravi99 👏👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/tDKMeNn33O— BCCI (@BCCI) September 22, 2024 -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం
బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ 2005లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు 90 టెస్టులు, 271 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 5892, వన్డేల్లో 7792, టీ20లలో 1500 పరుగులు సాధించాడు. అయితే, టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముష్ఫికర్ పెద్దగా రాణించలేకపోయాడు.తమీమ్ ఇక్బాల్‌ను అధిగమించితొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 13 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, మొత్తంగా 21 పరుగులు చేయగలిగిన ముష్ఫికర్.. తన అంతర్జాతీయ కెరీర్లో 15,196 రన్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్(15192)ను అధిగమించి.. బంగ్లాదేశ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.ఇంకో 357 పరుగులు అవసరంఇదిలా ఉంటే.. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందాలంటే ఇంకో 357 పరుగులు అవసరం. టీమిండియా బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకటి, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించడం గమనార్హం. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు15196- ముష్ఫికర్ రహీం *15192- తమీమ్ ఇక్బాల్14696- షకీబ్ అల్ హసన్10694- మహ్మదుల్లాచదవండి: భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం! -
పాక్ పరాభవంపై బంగ్లాదేశ్ ఓపెనర్ ట్వీట్.. షాకివ్వనున్న పీసీబీ
గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. టీ20 ప్రపంచకప్-2024లోనూ ఘోర పరాభవం చవిచూసింది.గ్రూప్-ఏలో టీమిండియా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలతో కలిసి ఉన్న పాక్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి టీమిండియాతో పాటు పసికూన, ఆతిథ్య అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కోచ్‌లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో తరచూ మార్పుల కారణంగానే తీరూ తెన్నూ లేకుండా పోయిందని.. అందుకు నిదర్శనమే ఈ వరుస వైఫల్యాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఫ్గన్, బంగ్లాదేశ్ కూడా ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో పాక్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టగా.. ఆసియా నుంచి టీమిండియాతో పాటు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్-8కు చేరుకున్న విషయం తెలిసిందే. నాలుగింట మూడు విజయాలతో గ్రూప్-సి నుంచి అఫ్గన్.. గ్రూప్-డి నుంచి నాలుగింట మూడు గెలిచి బంగ్లా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదే వెటరన్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ వైఫల్యాలపై సానుభూతి వ్యక్తం చేసిన ఈ బంగ్లా బ్యాటర్.. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వంటి వాళ్లు ప్రస్తుత జట్టుకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందని హితవు పలికాడు.‘‘టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం విచారకరం. వచ్చేసారి వాళ్లు గొప్పగా రాణించాలని ఆశిస్తున్నా. షాహిద్ ఆఫ్రిది వంటి సీనియర్లే వారికి సరైన మార్గం చూపాలి’’ అని తమీమ్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక్బాల్ ట్వీట్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా.. ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.కఠిన చర్యలకు సిద్ధంవన్డే వరల్డ్‌కప్‌లో అవమానం తర్వాత పాకిస్తాన్ వరుసగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లో పరాజయాలు చవిచూసింది.తాజాగా ప్రపంచకప్ రేసు నుంచి లీగ్ దశలోనే వైదొలిగింది. అంతేగాక సీనియర్లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.సెంట్రల్ కాంట్రాక్టులు, జీతాల విషయంలో సమీక్ష నిర్వహించి.. కోతలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల తీరుపై గుర్రుగా ఉన్న పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ విజేతగా తమీమ్ జట్టు..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)– 2024 సీజన్ ఛాంపియన్‌గా ఫార్ట్యూన్ బరిషల్ నిలిచింది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో కొమిలియా విక్టోరియన్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బరిషల్ జట్టు.. తొలిసారి బీపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బరిషల్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (30 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ (26 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మెహిది హసన్ మిరాజ్ (26 బంతుల్లో 29, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కొమిలియా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొమిలియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ మహిదుల్ ఇస్లామ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆండ్రూ రసెల్ (14 బంతుల్లో 27, 4 సిక్సర్లు) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరిషల్ బౌలర్లలో జేమ్స్ ఫుల్లర్ 2 వికెట్లు పడగొట్టగా.. మైర్స్,సైఫుద్దీన్, మెకాయ్ తలా వికెట్ సాధించారు. 2012 నుంచి జరుగుతున్న బీపీఎల్‌లో కొమిలియా విక్టోరియన్స్ నాలుగు సార్లు (2015, 2019, 2022, 2023)టైటిల్ విజేతగా నిలవగా.. ఢాకా గ్లాడియేటర్స్ మూడు సార్లు( 2012, 2013, 2016) ఛాంపియన్స్‌గా నిలిచింది. అదే విధంగా రంగాపూర్ రైడర్స్ (2017), రాజ్షాహి రాయల్స్ (2020)లు తలా ఒకసారి టైటిల్‌ను ముద్దాడాయి. ఇప్పుడు పదో సీజన్లో తమీమ్ ఇక్భాల్ సారథ్యంలోని ఫార్ట్యున్ బరిషల్ సరి కొత్త ఛాంపియన్స్‌గా అవతరిచింది. -
WC 2023: వరల్డ్‌కప్ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్ అప్పుడే!
WC 2023- I Won't Lead In ODIs After That: Shakib al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ సారథిగా వైదొలుగుతానని స్పష్టం చేశాడు. మేనేజ్మెంట్ కోరినందు వల్లే వన్డే జట్టు పగ్గాలు చేపట్టానని.. ఇది కేవలం టీమ్ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నాడు. తన స్వార్థం కోసం సారథిగా రాలేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ వన్డే కెప్టెన్సీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్-2023లో జట్టును ముందుండి నడిపిన షకీబ్ అల్ హసన్.. ప్రపంచకప్ టోర్నీలోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. వరల్డ్‌కప్ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్ అప్పుడే ఈ నేపథ్యంలో టీ- స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వన్డే కెప్టెన్సీ, రిటైర్మెంట్ గురించి తన ప్రణాళికలు వెల్లడించాడు. ‘‘అంతర్జాతీయస్థాయిలో నేను 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్ చాంపియన్స్ ట్రోఫీలో భాగమవ్వాలనుకుంటున్నాను. ఇక టీ20 ఫార్మాట్లో టీ20 ప్రపంచకప్-2024 వరకు జట్టుతో ఉండాలనుకుంటున్నా. టెస్టుల విషయంలోనూ వరల్డ్‌కప్ తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. బహుశా ఒకేసారి అన్ని ఫార్మాట్లకు ఒకేసారి వీడ్కోలు పలుకుతానేమో. భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కదా! ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ విషయంలో నా ఆలోచన ఇదీ’’ అని 36 ఏళ్ల షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 11 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు 600 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు': తమీమ్ ఇక్బాల్ -
'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు'
వన్డే ప్రపంచకప్-2023కు తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్భాల్‌కు చోటు దక్కపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు, ఇక్భాల్‌కు మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరినట్లు తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న తమీమ్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే టోర్నీ నుంచి తప్పుకుంటానని బీసీబీని షకీబ్ బెదిరించినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా వెన్ను గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్ సిరీస్‌తో తమీమ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతకంటే ముందు అన్నిఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకోవడంతో అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఆడాలని నిర్ణయించకున్నాడు. కానీ అనుహ్యంగా అతడికి ఏకంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. అవన్నీ రూమర్సే ఇక తమీమ్- షకీబ్ విభేదాల వార్తలపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్ర్ మిన్షాజుల్ అబేదిన్ అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశాడు. "తమీమ్ ఇక్బాల్ చాలా కాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. అతను న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఒకే మ్యాచ్ ఆడి, ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అతడి గాయాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ ఎంపిక చేయలేదని అబేదిన్ తెలిపాడు. అంతేకాకుండా తమీమ్‌ను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకన్నామని ఆయన అన్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై తమీమ్ ఇక్భాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెత్త ఆటలో తను బాగం కాకూడదనుకుంటానని తమీమ్ తెలిపాడు. కావాలనే నన్ను తప్పించారు.. "వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ముందు బంగ్లా క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వరల్డ్‌కప్ కోసం జట్టుతో కలిసి నేను భారత్‌కు వెళ్తానని ఆయన చెప్పారు. నా ఫిట్నెస్ను మరోసారి ఆయన నిరూపించుకోమన్నారు. అదేవిధంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అందుకు బదులుగా వరల్డ్‌కప్‌కు ఇంకా 10 నుంచి 15 రోజుల సమయం ఉంది, అయినా నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ తొలి మ్యాచ్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాను. దీంతో ఒక వేళ మీరు జట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఒక్కసారిగా అతను ఏమి మాట్లాడాతున్నారో నాకు అర్ధం కాలేదు. వెంటనే నేను పూర్తిగా పాజిటివ్ మైండ్‌తో ఉన్నా. కొన్ని రోజుల తర్వాత న్యూజిలాండ్‌పై మంచి ఇన్నింగ్స్ ఆడాను. ఒక్కసారిగా నా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంటని ఆయనతో అన్నాను. నేను గత 17 ఏళ్లగా ఓపెనింగ్ స్ధానంలోనే ఆడుతున్నాను. ఎప్పుడూ మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేయలేదు. అటువంటి అప్పుడు నా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా మారుస్తారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకు లేదు. ఫిజియో రిపోర్ట్ ప్రకారం.. నా ఫిట్నెస్ లెవల్స్ నాకు తెలుసు. కివీస్ తొలి వన్డే, రెండో వన్డే తర్వాత నేను కాస్త నొప్పితో బాధపడ్డా. అది వాస్తవం. కానీ రెండు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆఖరి వన్డేకు జట్టు సెలక్షన్‌కు నేను అందుబాటులోకి వచ్చా. కానీ జట్టు వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని సూచించారు. వరల్డ్‌కప్‌లో ప్రతీ మ్యాచ్‌కు దాదాపు రెండు రోజుల విశ్రాంతి లభిస్తోంది. నాకు అది చాలు . ఇప్పటికే నేను దాదాపు 10 వారాల పాటు రిహాబిలేటేషన్లో ఉన్నా. ఉద్దేశ్వపూర్వకంగానే నన్ను జట్టు నుంచి తప్పించారు అని తమీమ్ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్చేశాడు. చదవండి: IND Vs AUS 3rd ODI: అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడికి దక్కని చోటు
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 కోసం బంగ్లాదేశ్ సెలెక్టర్లు తమ జట్టును ఇవాళ ప్రకటించారు. షకీబ్ అల్ హసన్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో స్టార్ ఆటగాడు, బంగ్లాదేశ్ లెజెండరీ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్‌కు చోటు దక్కలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా తమీమ్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోలేదని తెలుస్తుంది. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా గాయం కారణంగా అసౌకర్యంగా ఫీలైన తమీమ్ అప్పుడే సెలెక్టర్లతో వరల్డ్‌కప్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపాడు. తమీమ్ వర్షన్‌ను పరిగణలోకి తీసుకున్న ఆ దేశ సెలెక్షన్ కమిటీ మొత్తానికే అతన్ని వరల్డ్‌కప్ జట్టు నుంచి తొలగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాగా, తమీమ్ ఇటీవల వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఆతర్వాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పిలుపు మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే తమీమ్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటివ్వకుండా సెలక్టర్లు అవమానించారు. తమీమ్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోకపోవడానికి బంగ్లా ప్రస్తుత కెప్టెన్ షకీబ్‌తో ఉన్న విభేదాలే కారణమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు తమమత జట్లను ప్రకటించిన అనంతరం బంగ్లాదేశ్ ఆఖర్లో తమ జట్టును ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో బంగ్లా టీమ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొంటుంది. దీనికి ముందు ఆ జట్టు సెప్టెంబర్ 29న శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం అక్టోబర్ 2న ఇంగ్లండ్‌తో మరో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. మెగా టోర్నీలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబర్ 19న పూణేలో జరుగనుంది. బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిది హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్ భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమ్‌జీత్ సింగ్, సకీబ్ జుల్ఫికర్, సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్, కొలిన్ అకెర్‌మ్యాన్, బాస్ డీ లీడ్, తేజ నిడమనూరు, షరీజ్ అహ్మద్, మ్యాక్స్ ఔడౌడ్, రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్, వెస్లీ బర్రెసీ, లొగన్ వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక -
బంగ్లాదేశ్‌కు గుడ్‌న్యూస్! కెప్టెన్‌గా లిటన్ దాస్..
Bangladesh vs New Zealand ODI Series: ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ ఈవెంట్‌కు ముందు పటిష్ట కివీస్ జట్టుతో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది. సెప్టెంబరు 21 నుంచి ఈ వన్డే సిరీస్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా రియాద్ పునరాగమనం చేయడం ఖాయమైంది. గుడ్‌న్యూస్.. అతడు వచ్చేశాడు వెన్నునొప్పితో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన తమీమ్ రాక బంగ్లాకు శుభవార్తగా పరిణమించింది. ఇక అక్టోబరు 5 నుంచే వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న తరుణంలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. కివీస్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా లిటన్ దాస్ దీంతో సొంతగడ్డపై లిటన్ దాస్ కివీస్‌తో సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఇక ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడిన బ్యాటర్ నజ్ముల్ హొసేన్ షాంటో పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. మేజర్ టోర్నీ ముందున్న దృష్ట్యా అతడికి కూడా రెస్ట్ ఇచ్చారు. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్ల ఎంపిక ఇక మహ్మద్ నయీం, ఆఫిఫ్ హొపేస్, షమీమ్ హొసేన్లను తప్పించిన మేనేజ్మెంట్.. అన్క్యాప్డ్ ప్లేయర్లు జాకీర్ హసన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, రిషద్ హుస్సేన్‌కు న్యూజిలాండ్‌తో ఆడే జట్టులో చోటిచ్చింది. అందుకే షకీబ్ దూరం జట్టు ప్రకటన సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెలక్టర్ మిన్హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్ తమకు సన్నాహకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇక మెగా ఈవెంట్‌కు ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకే కెప్టెన్ సహా ఇతర ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు పేర్కొన్నాడు. టీమిండియా గెలుపొందిన జోష్‌లో బంగ్లా ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023లో షకీబ్ అల్ హసన్ బృందం మెరుగ్గా ఆడకపోయినప్పటికీ.. సూపర్-4 చివరి మ్యాచ్‌లో ఏకంగా టీమిండియానే ఓడించింది. అనూహ్య రీతిలో అద్భుత ఆటతీరుతో రోహిత్ సేనకు షాకిచ్చి 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది జోష్‌లో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో 3-1తో న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు లిటన్ దాస్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, అనముల్ హక్ బిజోయ్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, నురుల్ హసన్ సోహన్, మెహీది హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్, తాంజిద్ హసన్ తమీమ్, జాకీర్ హసన్, రిషద్ హుస్సేన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్. చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన Ind vs SL: అభిమానులకు చేదువార్త! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక! -
వన్డే ప్రపంచకప్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి ఆ జట్టు స్టార్ఆటగాడు తమీమ్ ఇక్భాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో జరిగే ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు సారధిగా స్టార్ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ధృవీకరించింది. అదే విధంగా ఈ రెండు మెగా ఈవెంట్లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు. "ఆసియా కప్, ప్రపంచకప్‌లో మా జట్టు కెప్టెన్‌గా షకీబ్‌ను నియమించాము. రేపు(ఆగస్టు 12)న ఈ రెండు ఈవెంట్లకు మా జట్టును ప్రకటిస్తాము. సెలక్టర్లు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు" అని విలేకురల సమావేశంలో నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. కాగా షకీబ్ ప్రస్తుతం టీ20ల్లో బంగ్లా జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు 2011లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బంగ్లా కెప్టెన్‌గా షకీబ్ అల్ హసనే వ్యవహరించాడు. ఇక ఆసియాకప్-2023లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. అదే విధంగా ఆక్టోబర్ 7న ఆఫ్గానిస్తాన్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని బంగ్లా ప్రారంభించనుంది. చదవండి: CPL 2023: అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు -
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. కెప్టెన్సీకి తమీమ్ ఇక్బాల్ గుడ్‌బై!
ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లా జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తమీమ్ ఇక్భాల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్, క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్‌లతో చర్చలు జరిపిన తర్వాత తమీమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తమీమ్ తెలిపాడు. "నేను బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా. ఇకపై ఒక ఆటగాడిపై నా ఆటపై దృష్టిసారిస్తాను. అవకాశం వచ్చినప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను" అని విలేకురల సమావేశంలో తమీమ్ పేర్కొన్నాడు. కాగా వెన్ను గాయం, ఫామ్ లేమితో బాధపడుతున్న ఇక్బాల్.. ఆసియాకప్-2023కు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. అతడు తిరిగి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డేలకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లా నూతన సారథిగా లిట్టన్ దాస్‌ను ఎంపిక చేయాలని బీసీబీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యంతో తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. ఇక కేవలం ఆటగాడిగా మాత్రమే తమీమ్ కొనసాగనున్నాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: IPL 2024: ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ -
దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వివరించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్‌కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: Tamim Iqbal Retirement: స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటన -
స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్! వరల్డ్‌కప్‌కు ముందు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరాడు. తమీమ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. నిన్న (జులై 5) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన తమీమ్.. తన సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. తమీమ్ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 34 ఏళ్ల తమీమ్ తన 16 ఏళ్ల కెరీర్‌ను అర్ధంతరంగా ముగించడంతో బంగ్లాదేశ్ అభిమానులు అవాక్కవుతున్నారు. బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడిన తమీమ్.. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్
స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయల నడుమ 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 83/2 (21.4 ఓవర్లు) స్కోర్ వద్ద ఉండగా వర్షం మరోసారి పలకరించింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఎంపైర్లు ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. సత్తా చాటిన ఆఫ్ఘన్ బౌలర్లు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హాక్ ఫారూఖీ (3/24), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/23), రషీద్ ఖాన్ (2/21), మహ్మద్ నబీ (1/25), అజ్మతుల్లా (1/39) బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హ్రిదోయ్ (51) అర్ధసెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (13), లిటన్ దాస్ (26), షాంటో (12), షకీబ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. అలసట లేకుండా గెలుపొందిన ఆఫ్ఘనిస్తాన్.. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. వరుణుడి పుణ్యమా అని అలసట లేకుండా గెలుపొందింది. 21.4 ఓవర్ల వద్ద (83/2) మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికగా జులై 8న జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. -
ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్.. 320 పరుగుల టార్గెట్ ఛేజ్
చెమ్స్‌ఫోర్డ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్ (140) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. డాక్రెల్ 74 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్, షోర్పుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో(117) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తౌహిద్ హృదయ్(68), రహీం(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, డాక్రల్ తలా రెండు వికెట్లు, లిటిల్, అదైర్, హ్యుమ్ ఒక్కో వికెట్ పడగొట్టాడు. కాగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 అధిక్యంలో బంగ్లాదేశ్ నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
అరుదైన క్లబ్లో చేరిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశీగా రికార్డు
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్ ఈ మైలురాయిని అధిగమించాడు. Congratulation Tamim Iqbal on becoming the first Bangladeshi batsman to complete 15000 runs in International Cricket. 🔥🏏#BCB | #Cricket pic.twitter.com/J4mj5W8k9T — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తమీమ్.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు. తమీమ్ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 383 మ్యాచ్‌లు ఆడిన తమీమ్ 15009 పరుగులు చేశాడు. తమీమ్.. 69 టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో రెండో వన్డేలో ముష్ఫికర్ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్), లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్‌కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ
బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ తస్కిన్ అహ్మద్ వేశాడు. ఆ ఓవర్లో తస్కిన్ వేసిన యార్కర్ బంతిని ఆదిల్ రషీద్ సమర్థంగా అడ్డుకున్నాడు. బంతి రషీద్ ప్యాడ్‌కు దూరంగా బ్యాట్ అంచున తాకింది. అయితే బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. రిప్లేలో బంతి ఎక్కడా ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించలేదు కదా బంతి ప్యాడ్లకు చాలా దూరంగా ఉన్నట్లు చూపించింది. దీంతో అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. వాస్తవానికి బంతి ప్యాడ్లను తాకలేదని క్లియర్‌గా కనిపిస్తుంది. మ్యాచ్ చూసే చిన్న పిల్లాడిని అడిగినా నాటౌట్ అని చెప్పేస్తాడు. బంతి ఎక్కడ పడిందన్న కనీస పరిజ్ఞానం లేకుండా తమీమ్ ఇక్బాల్ డీఆర్ఎస్ కోరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. ఒక రకంగా ఔట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రివ్యూకు వెళ్లి బంగ్లా పరువు తీసుకుంది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. బంగ్లా క్రికెట్ జట్టుపై అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూకు కాల్ ఇచ్చిన బంగ్లా జట్టుకు ఏ ప్రైజ్ ఇవ్వాలో కాస్త చెప్పండి''.. ''ఏ కోశానా అది ఔట్ చెప్పండి.. బంగ్లా కెప్టెన్‌కు కళ్లు మూసుకుపోయినట్లున్నాయి''.. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జేసన్ రాయ్ (132 పరుగులు) సెంచరీతో కదం తొక్కడంతో పాటు బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్ మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. What prize do Bangladesh get for making the worst LBW review call in the history of cricket? pic.twitter.com/SfJWRdCpXc — Jon Reeve (@jon_reeve) March 3, 2023 Worst DRS review for LBW ever by Bangladesh! #ecb #BANvsENG pic.twitter.com/kBdX5bvPBs — Ralph Rimmer (@razorr69) March 3, 2023 Bangladesh went for a review! 😭 pic.twitter.com/bF8sHDTQ8e — Faiz Fazel (@theFaizFazel) March 3, 2023 చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం; సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
మలాన్ వీరోచిత శతకం.. పసికూనపై అతికష్టం మీద గెలిచిన ఇంగ్లండ్
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను.. డేవిడ్ మలాన్ (145 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడి గెలిపించాడు. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్.. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు అనుకున్న దశలో మలాన్ తన అనుభవాన్ని అంతా రంగరించి, టెయిలెండర్ల సాకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ (29 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్)ను సమన్వయం చేసుకుంటూ మలాన్ పోరాడిన తీరు అమోఘం. మలాన్- రషీద్ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, మరో 8 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మలాన్, రషీద్ మినహా జేసన్ రాయ్ (4), ఫిలిప్ సాల్ట్ (12), జేమ్స్ విన్స్ (6), జోస్ బట్లర్ (9), క్రిస్ వోక్స్ (7), మొయిన్ అలీ (14), విఫలం కాగా.. విల్ జాక్స్ (26) కాస్త పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహదీ హసన్ మిరాజ్ 2, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (23), షాంటో (58), మహ్మదుల్లా (31) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 3న ఇదే వేదికపై జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్‌ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు.. విధ్వంసం సృష్టించిన హోప్, తమీమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్‌లో భారత్ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (29 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ స్కోర్ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్!
స్వదేశంలో టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమీమ్‌కు గజ్జ గాయమైంది. అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యలు సూచించారు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్‌కు తమీమ్ దూరమయ్యాడు. అయితే డిసెంబర్ 14న జరిగే తొలి టెస్టుకు కూడా తమీమ్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. అయితే వన్డే సిరీస్‌కు తమీమ్ ఇక్బాల్ స్థానంలో ఆ జట్టు వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తొలి వన్డేకు ఆ జట్టు స్టార్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్ కూడా వెన్ను నొప్పితో దూరమయ్యాడు. కాగా తమీమ్,టాస్కిన్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడం కచ్చితంగా బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: ENG Vs PAK: 'యార్..నెంబర్ వన్ బౌలింగ్'.. పాక్ జట్టును ఆడేసుకున్నారు -
భారత్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు
స్వదేశంలో భారత్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ షోరిఫుల్ ఇస్లాంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మొసద్దెక్ హొస్సేన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. గత మరోవైపు జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్‌కు దూరమైన షకీబ్ ఆల్ హసన్ తిరిగి భారత్ సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఇక హోం సిరీస్‌లో భాగంగా బంగ్లా జట్టు టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: IND vs NZ 1st ODI:తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్ -
బంగ్లాదేశ్‌కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కాపాడకోలేకపోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో జింబాబ్వే కైవసం చేసుకుంది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికందర్ రజా, కెప్టెన్ చక్‌బావ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా (80), కెప్టెన్ తమీమ్(50), అఫీఫ్ హుస్సేన్(41) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు, మాధేవేరే రెండు, న్యాచి, చివంగా తలా వికెట్ సాధించారు. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రజా, చక్‌బావ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను జింబాబ్వే వైపు మలుపు తిప్పింది. అనంతరం జింబాబ్వే కెప్టెన్ చక్‌బావ 75 బంతుల్లో 102 పరుగులు చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఔటైనప్పటికీ రజా(127 బంతుల్లో 117పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జింబాబ్వేకు మరుపురాని విజయాన్ని అందించాడు. రజా, చక్‌బావ అద్భుమైన ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా రజాకు ఈ సిరీస్‌లో ఇదే వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. తొలి వన్డేలో కూడా జింబాబ్వే విజయంలో రజా తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం హరారే వేదికగా జరగనుంది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు!