దంబుల్లా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (127; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ (72; 4 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ రహమాన్ (54; 10 ఫోర్లు) రాణించారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 45.1 ఓవర్లలో 234 పరుగుల వద్ద ఆలౌటైంది. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఈనెల 28న జరుగుతుంది.