టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఆరు శతకాలు.. 522 వికెట్లు
ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాదిరి ఇన్నింగ్స్ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.
రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే
అయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం.
అయితే, భారత క్రికెట్ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లి మాదిరే అతడూ టాప్ ప్లేయరేనని తమీమ్ ఇక్బాల్ ఈ సందర్భంగా అశ్విన్‌ను ప్రశంసించాడు.
చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!
📽️ WATCH
The dismissal that completed five-wicket haul number 37 in Test Cricket for @ashwinravi99 👏👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/tDKMeNn33O— BCCI (@BCCI) September 22, 2024
Comments
Please login to add a commentAdd a comment