టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు రిటైరయ్యారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే వీడ్కోలు పలుకగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. 2024లో ఇప్పటివరకు (డిసెంబర్ 18) 32 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్‌లకు వీడ్కోలు పలికారు.
ఈ ఏడాది తొలి వారంలోనే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, ఆసీస్ దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పారు. మధ్యలో శిఖర్ ధవన్.. జేమ్స్ ఆండర్సన్.. తాజాగా అశ్విన్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.
ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు..
1. సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)
2. వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)
3. దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)
4. కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)
5. విరాట్ కోహ్లి (టీ20లు)
6. రోహిత్ శర్మ (టీ20లు)
7. రవీంద్ర జడేజా (టీ20లు)
8. శిఖర్ ధవన్ (అన్ని ఫార్మాట్లు)
9. బరిందర్ స్రాన్ (అన్ని ఫార్మాట్లు)
10. వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)
11. సిద్దార్థ్ కౌల్ (భారత క్రికెట్)
12. రవిచంద్రన్ అశ్విన్ (అంతర్జాతీయ క్రికెట్)
ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెటర్లు..
1. డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా, అన్ని ఫార్మాట్లు)
2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)
3. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా, టెస్ట్‌లు)
4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)
5. కొలిన్ మున్రో (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)
6. డేవిడ్ వీస్ (నమీబియా, అన్ని ఫార్మాట్లు)
7. సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (నెదర్లాండ్స్, అన్ని ఫార్మాట్లు)
8. బ్రియాస్ మసాబా (ఉగాండ, టీ20లు)
9. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)
10. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)
11. షాన్నోన్ గాబ్రియెల్ (వెస్టిండీస్, అన్ని ఫార్మాట్లు)
12. విల్ పుకోవ్‌స్కీ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)
13. మొయిన్ అలీ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)
14. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, టెస్ట్‌లు, టీ20లు)
15. మహ్మదుల్లా (బంగ్లాదేశ్, టీ20లు)
16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)
17. టిమ్ సౌథీ (న్యూజిలాండ్, టెస్ట్ క్రికెట్)
18. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)
19. ఇమాద్ వసీం (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)
20. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)
Comments
Please login to add a commentAdd a comment