Lookback Sports
-
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్‌వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి చేతిలో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్‌తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్‌తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్‌గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్‌కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్‌గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్‌లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్‌బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్‌ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్‌లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
Rewind 2024: విండీస్‌లో ‘విన్’.. మనూ సూపర్... చెస్‌లో పసిడి కాంతులు
ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!చాంపియన్‌కు, టైటిల్‌కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ విజయం. ‘పారిస్’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్‌లో అయితే పతకాల తోరణం!చెస్‌లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్‌లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం! పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం... మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. విండీస్‌లో ‘విన్ ఇండియా’ కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్ గడ్డపై రెండో టీ20 కప్‌ను అందించింది.ప్రతీ మ్యాచ్‌లో భారత్ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్ అప్పటికే ఐపీఎల్‌తో దంచికొట్టిన ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్‌ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్‌ను హార్దిక్ అవుట్ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బుమ్రా, యువ పేసర్ అర్ష్‌దీప్ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్ చరిత్రలో నిలిచే క్యాచ్... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.మను భాకర్... సూపర్పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్‌లో పసిడి పట్టేదేమో! షూటర్ మను భాకర్(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్ ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకుంది.ఒకే ఒలింపిక్స్‌లో ‘హ్యట్రిక్’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్ కుసాలే (షూటింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) కాంస్యాలు నెగ్గారు.హాకీ ఆటకు ఒలింపిక్స్‌లో పునర్వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్‌లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్ లక్ష్యసేన్, లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్‌గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్‌ను ముగించింది. ‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్‌కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.అవని లెఖరా, సుమిత్ అంటిల్, మరియప్పన్ తంగవేలు, శీతల్ దేవి, నితీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవ్‌దీప్ సింగ్, హర్విందర్ సింగ్, ధరంవీర్ తదితరులు పతకాల పంట పండించారు. చదరంగంలో ‘పసిడి ఎత్తులు’భారత్‌లో చెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.చెస్ ఒలింపియాడ్, క్యాండిడేట్స్ టోర్నీ (ప్రపంచ చాంపియన్‌తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్), ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ వీటన్నింటా మనదే జేగంట! ఓ రకంగా 2024 భారత చెస్ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్(D Gukesh) ఇటీవల క్లాసికల్ ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్ కొత్త రాత రాశాడు. న్యూయార్క్‌లో తెలుగుతేజం, వెటరన్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగం -
Indian Cricket In 2024: టీ20 వరల్డ్ కప్ టూ అశ్విన్ రిటైర్మెంట్..
2024 ఏడాదికి మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. భారత్‌లో గత 12 నెలలలో అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత క్రికెట్‌కు బాగా కలిసొచ్చిందేనే చెప్పుకోవాలి.టీ20 వరల్డ్‌కప్ విజయం నుంచి ఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎంపిక వరకు భారత క్రికెట్‌కు ఎన్నో అపురూప క్షణాలు ఉన్నాయి. అయితే అన్నీ తీపి గుర్తులే కాకుండా టీమిండియాకు కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలో భారత క్రికెట్లో చోటుచేసుకున్న కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.11 ఏళ్ల నిరీక్షణకు తెర.. జూన్ 13 2024.. ఆ రోజు భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీ20 వరల్డ్‌కప్-2024ను సొంతం చేసుకున్న భారత జట్టు.. తమ 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి రెండో వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఓటమి తప్పదనకున్న చోట సూర్యకుమార్ యాదవ్ తన అద్బుతక్యాచ్తో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ రోజు అతడు పట్టిన క్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ధోని సారథ్యంలో చివరగా(2013 ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు.. మళ్లీ రోహిత్ శర్మ సారథ్యంలోవిరాట్, రోహిత్, జడ్డూ రిటైర్మెంట్..వరల్డ్‌కప్ గెలిచిన అనందంలో అందరూ మునిగి తెలుతున్న వేళ భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఓ బాంబు పేల్చారు. ఈ సీనియర్ త్రయం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. అంతేకాకుండా ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం కూడా ముగిసింది.వరల్డ్‌కప్‌తో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. భారత ఆటగాళ్లకు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.కెప్టెన్‌గా సూర్య, కోచ్‌గా గంభీర్..ఇక టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అప్పటివరకు తత్కాలిక కెప్టెన్‌గా కొనసాగిన హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు జట్టు పగ్గాలు అప్పగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా భారత హెడ్ కోచ్ బాధ్యతలను మాజీ క్రికెటర్ గౌతం గంబీర్ చేపట్టాడు.క్రికెట్ చరిత్రలో తొలిసారి..టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత స్వదేశంలో భారత్‌కు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో వైట్ వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సొంతగడ్డపై టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.చరిత్ర సృష్టించిన పంత్..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.కొత్త కుర్రాళ్లు అరంగేట్రం.. ఇక ఈ ఏడాది భారత క్రికెట్ తరపున చాలా మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. టెస్టుల్లో రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా డెబ్యూ చేయగా.. టీ20ల్లో రమణదీప్ సింగ్, మయాంక్ యాదవ్, తుషార్ దేశ్‌పాండే, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ అడుగుపెట్టారు.ఐసీసీ ఛైర్మన్‌గా జై షాఐసీసీ ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. 2024 డిసెంబరు 1 నుంచి ఆయన పదవీకాలం మొదలైంది. అతడి నేతృత్వంలోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగకరీంచింది.అశ్విన్ విడ్కోలు..ఈ ఏడాది ఆఖరిలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. అశ్విన్‌తో పాటు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. -
ఈ ఏడాది రిటైరైన స్టార్ క్రికెటర్లు వీరే..!
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకం ముగిసినట్లనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు రిటైరయ్యారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే వీడ్కోలు పలుకగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. 2024లో ఇప్పటివరకు (డిసెంబర్ 18) 32 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్లకు వీడ్కోలు పలికారు.ఈ ఏడాది తొలి వారంలోనే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, ఆసీస్ దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పారు. మధ్యలో శిఖర్ ధవన్.. జేమ్స్ ఆండర్సన్.. తాజాగా అశ్విన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు..1. సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)2. వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)3. దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)4. కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)5. విరాట్ కోహ్లి (టీ20లు)6. రోహిత్ శర్మ (టీ20లు)7. రవీంద్ర జడేజా (టీ20లు)8. శిఖర్ ధవన్ (అన్ని ఫార్మాట్లు)9. బరిందర్ స్రాన్ (అన్ని ఫార్మాట్లు)10. వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)11. సిద్దార్థ్ కౌల్ (భారత క్రికెట్)12. రవిచంద్రన్ అశ్విన్ (అంతర్జాతీయ క్రికెట్)ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెటర్లు..1. డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా, అన్ని ఫార్మాట్లు)2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)3. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా, టెస్ట్‌లు)4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)5. కొలిన్ మున్రో (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)6. డేవిడ్ వీస్ (నమీబియా, అన్ని ఫార్మాట్లు)7. సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (నెదర్లాండ్స్, అన్ని ఫార్మాట్లు)8. బ్రియాస్ మసాబా (ఉగాండ, టీ20లు)9. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)10. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)11. షాన్నోన్ గాబ్రియెల్ (వెస్టిండీస్, అన్ని ఫార్మాట్లు)12. విల్ పుకోవ్స్కీ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)13. మొయిన్ అలీ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)14. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, టెస్ట్‌లు, టీ20లు)15. మహ్మదుల్లా (బంగ్లాదేశ్, టీ20లు)16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)17. టిమ్ సౌథీ (న్యూజిలాండ్, టెస్ట్ క్రికెట్)18. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)19. ఇమాద్ వసీం (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)20. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు) -
గిల్‌కు ఎంతో ప్రత్యేకం: బ్రిస్బేన్‌లో సారా టెండుల్కర్, ఇతర సెలబ్రిటీల సందడి
-
హ్యాపీ 9 బేబీ.. అన్నింటిలోనూ నువ్వు బెస్ట్: రోహిత్ శర్మపై భార్య రితిక పోస్ట్(ఫొటోలు)