2024 ఏడాదికి మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. భారత్‌లో గత 12 నెలలలో అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత క్రికెట్‌కు బాగా కలిసొచ్చిందేనే చెప్పుకోవాలి.
టీ20 వరల్డ్‌కప్ విజయం నుంచి ఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎంపిక వరకు భారత క్రికెట్‌కు ఎన్నో అపురూప క్షణాలు ఉన్నాయి. అయితే అన్నీ తీపి గుర్తులే కాకుండా టీమిండియాకు కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలో భారత క్రికెట్‌లో చోటుచేసుకున్న కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.
11 ఏళ్ల నిరీక్షణకు తెర..
జూన్ 13 2024.. ఆ రోజు భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీ20 వరల్డ్‌కప్-2024ను సొంతం చేసుకున్న భారత జట్టు.. తమ 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి రెండో వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది.
ఓటమి తప్పదనకున్న చోట సూర్యకుమార్ యాదవ్ తన అద్బుతక్యాచ్‌తో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ రోజు అతడు పట్టిన క్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ధోని సారథ్యంలో చివరగా(2013 ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు.. మళ్లీ రోహిత్ శర్మ సారథ్యంలో
విరాట్, రోహిత్, జడ్డూ రిటైర్మెంట్..
వరల్డ్‌కప్ గెలిచిన అనందంలో అందరూ మునిగి తెలుతున్న వేళ భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఓ బాంబు పేల్చారు. ఈ సీనియర్ త్రయం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. అంతేకాకుండా ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం కూడా ముగిసింది.
వరల్డ్‌కప్‌తో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. భారత ఆటగాళ్లకు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
కెప్టెన్‌గా సూర్య, కోచ్‌గా గంభీర్..
ఇక టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అప్పటివరకు తత్కాలిక కెప్టెన్‌గా కొనసాగిన హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు జట్టు పగ్గాలు అప్పగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా భారత హెడ్ కోచ్ బాధ్యతలను మాజీ క్రికెటర్ గౌతం గంబీర్ చేపట్టాడు.
క్రికెట్ చరిత్రలో తొలిసారి..
టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత స్వదేశంలో భారత్‌కు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో వైట్ వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సొంతగడ్డపై టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.
చరిత్ర సృష్టించిన పంత్..
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.
కొత్త కుర్రాళ్లు అరంగేట్రం..
ఇక ఈ ఏడాది భారత క్రికెట్ తరపున చాలా మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. టెస్టుల్లో రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా డెబ్యూ చేయగా.. టీ20ల్లో రమణదీప్ సింగ్, మయాంక్ యాదవ్, తుషార్ దేశ్‌పాండే, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ అడుగుపెట్టారు.
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. 2024 డిసెంబరు 1 నుంచి ఆయన పదవీకాలం మొదలైంది. అతడి నేతృత్వంలోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగకరీంచింది.
అశ్విన్ విడ్కోలు..
ఈ ఏడాది ఆఖరిలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. అశ్విన్‌తో పాటు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment