CT 2025: షెడ్యూల్‌, జట్లు, టైమింగ్స్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు | CT 2025: Full schedule All Squads Match Timings Venues Live Streaming Details | Sakshi
Sakshi News home page

CT 2025: షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ ఆరంభ సమయం.. లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

Published Tue, Feb 18 2025 6:42 PM | Last Updated on Tue, Feb 18 2025 7:30 PM

CT 2025: Full schedule All Squads Match Timings Venues Live Streaming Details

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్‌ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్‌ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.

ఇందులో భాగంగా గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌(India), పాకిస్తాన్‌(Pakistan), న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌, వేదికలు,జట్లు, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర వివరాలు తెలుసుకుందామా?!

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్‌, వేదికలు, మ్యాచ్‌ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)
👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌, గ్రూప్‌-ఎ, దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్‌(మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా, గ్రూప్‌-బి, నేషనల్‌ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌, గ్రూప్‌-బి, గడాఫీ స్టేడియం, లాహోర్‌(మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌, గ్రూప్‌-ఎ, దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్‌(మధ్యాహ్నం 2:30 గంటలకు)

👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌, గ్రూప్‌-ఎ, రావల్పిండి క్రికెట్‌ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా, గ్రూప్‌-బి, రావల్పిండి క్రికెట్‌ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌, గ్రూప్‌-బి, గడాఫీ స్టేడియం, లాహోర్‌(మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌, గ్రూప్‌-ఎ, రావల్పిండి క్రికెట్‌ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, గ్రూప్‌-బి, గడాఫీ స్టేడియం, లాహోర్‌(మధ్యాహ్నం 2:30 గంటలకు)

👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్‌ ఇంగ్లండ్‌, గ్రూప్‌-బి, నేషనల్‌ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉12. మార్చి 2- ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌, గ్రూప్‌-ఎ, దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్‌(మధ్యాహ్నం 2:30 గంటలకు)
👉సెమీ ఫైనల్‌ 1: మార్చి 4- దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 
👉సెమీ ఫైనల్‌ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్‌(పాకిస్తాన్‌ క్వాలిఫై అయితే)
👉ఫైనల్‌ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్‌ లేదా దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).

లైవ్‌ టెలికాస్ట్‌, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..
భారత్‌లో స్టార్‌ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, స్పోర్ట్స్‌ 18లో లైవ్‌ టెలికాస్ట్‌. అదే విధంగా.. జియోహాట్‌స్టార్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌. స్టార్‌ స్పోర్ట్స్‌ సోషల్‌ మీడియా(ఎక్స్‌) హ్యాండిల్‌లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్‌, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 జట్లు
గ్రూప్‌-ఎ
ఇండియా 
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
నాన్‌ ట్రావెలింగ్‌ సబ్‌స్టిట్యూట్స్‌: యశస్వి జైస్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌, శివం దూబే.

పాకిస్తాన్‌
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్‌), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.

న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్‌, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్‌.

బంగ్లాదేశ్‌
సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్‌ శాంటో (కెప్టెన్‌), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్‌, తాంజిమ్‌ హసన్‌ సకీబ్‌, నహీద్‌ రాణా, నసూమ్‌ అహ్మద్‌.

గ్రూప్‌-బి
ఆస్ట్రేలియా
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), మార్నస్ లబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్‌ డ్వార్షూయిస్‌, స్పెన్సర్‌ జాన్సన్‌.
ట్రావెలింగ్‌ రిజ్వర్స్‌: కూపర్‌ కొనొలి.

సౌతాఫ్రికా
టెంబా బావుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్‌, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్‌, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్‌ షంసీ, కార్బిన్‌ బాష్‌
ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.

ఇంగ్లండ్‌
జోస్ బట్లర్ (కెప్టెన్‌), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్‌టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.

అఫ్గనిస్తాన్‌
ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్‌ మాలిక్‌, నంగ్యాల్‌ ఖరోటీ, నవీద్‌ జద్రాన్‌
రిజర్వ్‌ ప్లేయర్లు: డార్విష్‌ రసూలీ, బిలాల్‌ సమీ.

చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్‌ కోరుకుంటేనే అతడికి ఛాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement