ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లా జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తమీమ్ ఇక్భాల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్, క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్‌లతో చర్చలు జరిపిన తర్వాత తమీమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తమీమ్ తెలిపాడు. "నేను బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా. ఇకపై ఒక ఆటగాడిపై నా ఆటపై దృష్టిసారిస్తాను. అవకాశం వచ్చినప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను" అని విలేకురల సమావేశంలో తమీమ్ పేర్కొన్నాడు.
కాగా వెన్ను గాయం, ఫామ్ లేమితో బాధపడుతున్న ఇక్బాల్.. ఆసియాకప్-2023కు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. అతడు తిరిగి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డేలకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లా నూతన సారథిగా లిట్టన్ దాస్‌ను ఎంపిక చేయాలని బీసీబీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యంతో తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. ఇక కేవలం ఆటగాడిగా మాత్రమే తమీమ్ కొనసాగనున్నాడు.
ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.
చదవండి: IPL 2024: ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment