
క్రికెటర్ మ్యాచ్ ఫీజులో భారీ కోత
చిట్టగాంగ్ : దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మ్యాచ్ ఫీజులో భారీ కోత పడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను తన భుజంతో గుద్దినందుకు డికాక్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విదించినట్లు ఐసీసీ ప్రకటించింది. చిట్టగాంగ్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో తమీమ్ ను ఢీకొట్టిన కారణంగా అతనికి జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. క్రికెట్ మైదానంలో ఇటువంటి వాటిని తావుండకూడదని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో తమీమ్ 57 పరుగులు చేసి బంగ్లా వికెట్లకు అడ్డుకట్ట వేయడంతో అతనితో డికాక్ గొడవకు దిగాడు.
అయితే, ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్లో 2-1 తో బంగ్లా చేతిలో సఫారీలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో ఇదే ఆటగాడిని రోసౌ భుజంతో గుద్దడంతో 50 ఫైన్ జరిమానా విధించారు. తాజాగా అదే బంగ్లా ఆటగాడితో గొడవ పడినందుకు సఫారీల వికెట్ కీపర్కు మ్యాచ్ ఫీజులో భారీగా కోత పడటం గమనార్హం.