
షకీబ్ అల్ హసన్ (PC: BCB)
WC 2023- I Won't Lead In ODIs After That: Shakib al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ సారథిగా వైదొలుగుతానని స్పష్టం చేశాడు. మేనేజ్‌మెంట్ కోరినందు వల్లే వన్డే జట్టు పగ్గాలు చేపట్టానని.. ఇది కేవలం టీమ్ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నాడు.
తన స్వార్థం కోసం సారథిగా రాలేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ వన్డే కెప్టెన్సీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్-2023లో జట్టును ముందుండి నడిపిన షకీబ్ అల్ హసన్.. ప్రపంచకప్ టోర్నీలోనూ సారథిగా వ్యవహరించనున్నాడు.
వరల్డ్‌కప్ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్ అప్పుడే
ఈ నేపథ్యంలో టీ- స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వన్డే కెప్టెన్సీ, రిటైర్మెంట్ గురించి తన ప్రణాళికలు వెల్లడించాడు. ‘‘అంతర్జాతీయస్థాయిలో నేను 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్ చాంపియన్స్ ట్రోఫీలో భాగమవ్వాలనుకుంటున్నాను.
ఇక టీ20 ఫార్మాట్‌లో టీ20 ప్రపంచకప్-2024 వరకు జట్టుతో ఉండాలనుకుంటున్నా. టెస్టుల విషయంలోనూ వరల్డ్‌కప్ తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. బహుశా ఒకేసారి అన్ని ఫార్మాట్లకు ఒకేసారి వీడ్కోలు పలుకుతానేమో.
భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కదా! ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ విషయంలో నా ఆలోచన ఇదీ’’ అని 36 ఏళ్ల షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 11 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు 600 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు': తమీమ్ ఇక్బాల్