
వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(90), షకీబుల్ హసన్(82) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. బంగ్లా బౌలర్లలో మధుషంక మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ, మాథ్యూస్ రెండు వికెట్లు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది.
లంక బ్యాటర్లలో అసలంక(108) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నిస్సాంక(41), సమరవిక్రమ(41) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్, షోర్‌ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: #Timed Out: కనీవినీ ఎరుగని రీతిలో! మాథ్యూస్‌ను చూసి నవ్వుకున్న షకీబ్.. అలా అనుకున్న వాళ్లదే తప్పు!