నెదర్లాండ్స్‌ చేతిలో బం‍గ్లా ఓటమి.. షూతో కొట్టుకున్న ఫ్యాన్‌! వీడియో వైరల్‌ | fan slaps himself with shoe after Bangladesh lose to Netherlands | Sakshi
Sakshi News home page

World Cup 2023: నెదర్లాండ్స్‌ చేతిలో బం‍గ్లా ఓటమి.. షూతో కొట్టుకున్న ఫ్యాన్‌! వీడియో వైరల్‌

Published Sun, Oct 29 2023 12:37 PM | Last Updated on Sun, Oct 29 2023 12:49 PM

fan slaps himself with shoe after Bangladesh lose to Netherlands - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం కోల్‌కతా వేదికగా నెదర్లాండ్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఓటమి పాలైంది. 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌ విఫలమైంది.

230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షకీబ్‌ సేన కేవలం 142 పరుగులకే కుప్పకూలింది. డచ్‌ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లతో బంగ్లా టైగర్స్‌ పతనాన్ని శాసించాడు. బంగ్లా బ్యాటర్లలో మెహాదీ హసన్‌ మీరాజ్‌(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

షూతో కొట్టుకున్న ఫ్యాన్‌..
కాగా నెదర్లాండ్స్‌ వంటి పసికూన చేతిలో తమ జట్టు ఓటమి పాలవ్వడం బంగ్లా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంగ్లా జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో స్టేడియంకు వచ్చిన ఓ బంగ్లా అభిమాని ఆటగాళ్లు ప్రదర్శరను విమర్శిస్తూ షూతో తనను తాను కొట్టుకున్నాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ను కూడా దారుణంగా ట్రోలు చేస్తున్నారు. షకీబ్‌ ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు బిగ్‌ షాక్‌! రోహిత్‌కు గాయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement