Bangladesh Cricket Team
-
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. 44 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సెల్హాట్ వేదికగా వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో యస్తికా భాటియా(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్(30), షెఫాలీ వర్మ(31) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్ రెండు, త్రిష్నా, ఫాతిమా ఖాటూన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో కెప్లెన్ సుల్తానా(51) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పూజా రెండు, శ్రేయంకా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఏప్రిల్ 30న జరగనుంది. -
చెన్నై స్టార్ బౌలర్ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలకు గాయమైంది. ముస్తాఫిజుర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం(ఫిబ్రవరి 19)న సిల్హెట్ స్ట్రైకర్స్‌తో కొమిల్లా తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సెషన్లో కొమిల్లా జట్టు పాల్గోంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో కొమిల్లా కెప్టెన్ లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతి.. బౌలింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ముస్తాఫిజుర్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. వెంటనే నుంచి అతడి తల నుంచి రక్తం కారింది. అక్కడే ఉన్న ఫిజియోలు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ముస్తాఫిజుర్‌ను స్థానికంగా ఉన్న ఇంపీరియల్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే ముస్తాఫిజుర్ గాయంపై కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఫిజియో జహిదుల్ ఇస్లాం అప్డేట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సమయంలో ఓ బంతి నేరుగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తల ఎడమ బాగంలో బలంగా తాకింది. మేము వెంటనే స్పందించి కంప్రెషన్ బ్యాండేజ్‌తో రక్తస్రావం కాకుండా చూశాము. ఆ తర్వాత ఇంపీరియల్ ఆసుపత్రికి తరిలించి ‘సిటీ స్కాన్ చేయంచాము. అయితే అదృష్టవశాత్తూ తల పై భాగంలో మాత్రమే గాయమైంది. ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ లేదు. అతడికి తలపై కొన్ని కుట్లు పడ్డాయి. ముస్తఫిజుర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు’ అని ప్రకటనలో జహిదుల్ ఇస్లాం పేర్కొన్నాడు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్ శ్రీలంక పర్యటనకు వెళ్ల నుంది. ఈ పర్యటనకు ముందే స్టార్ బౌలర్ గాయపడటం బంగ్లా జట్టును కలవరపెడుతోంది. అదే విధంగా ఐపీఎల్-2024 వేలంలో రూ. 2 కోట్లకు ముస్తాఫిజుర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ⚠️ MUSTAFIZUR RAHMAN GOT HIT BALL ON HIS HEAD During practice session of Comillael Victorians a shot from Matthew Ford, the ball hit on Mustafizur's head then start bleeding . Instantly he has taken into the hospital.#BPL2024 pic.twitter.com/sY3HaLtEc8 — bdcrictime.com (@BDCricTime) February 18, 2024 -
నెదర్లాండ్స్ చేతిలో బంగ్లా ఓటమి.. షూతో కొట్టుకున్న ఫ్యాన్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం కోల్‌కతా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ విఫలమైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షకీబ్ సేన కేవలం 142 పరుగులకే కుప్పకూలింది. డచ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లతో బంగ్లా టైగర్స్ పతనాన్ని శాసించాడు. బంగ్లా బ్యాటర్లలో మెహాదీ హసన్ మీరాజ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షూతో కొట్టుకున్న ఫ్యాన్.. కాగా నెదర్లాండ్స్ వంటి పసికూన చేతిలో తమ జట్టు ఓటమి పాలవ్వడం బంగ్లా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంగ్లా జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో స్టేడియంకు వచ్చిన ఓ బంగ్లా అభిమాని ఆటగాళ్లు ప్రదర్శరను విమర్శిస్తూ షూతో తనను తాను కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా కెప్టెన్ షకీబుల్ హసన్‌ను కూడా దారుణంగా ట్రోలు చేస్తున్నారు. షకీబ్ ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్! రోహిత్‌కు గాయం! #BANvNED This Is Really Really Sad Bangladesh Fans Lost Cool At Eden After Shameful Performance . Slap Themselves With Shoe. Some Are Saying " We Dont Mind Loosing To Big Teams. But How Can U Lose To Netherlands? Shakib, Mushfiq And All Should Be Sl*** Shoes. On Behalf Im… pic.twitter.com/RZLGLaWqiK — বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) October 28, 2023 -
మొమినల్ గుడ్ బై.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా వెటరన్ ఆల్‌రౌండర్!
Bangladesh New Test Captain: వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి డిప్యూటీగా లిటన్ దాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ మొమినల్ హక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షకీబ్ మరోసారి బంగ్లాదేశ్ టెస్టు పగ్గాలు చేపట్టాడు. కాగా 2019లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించినా ఆ విషయాన్ని అతడు దాచిపెట్టాడు. అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో అతడిపై రెండేళ్ల పాటు వేటు పడింది. కాగా గతంలో షకీబ్ రెండుసార్లు బంగ్లా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2009లొ వెస్టిండీస్ పర్యటనలో మొర్తజా గాయపడగా.. షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత 2017లో సారథిగా ముష్ఫికర్ రహీమ్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక మొమినల్ సారథ్యంలో బంగ్లాదేశ్ మూడు టెస్టుల్లో మూడు విజయాలు సాధించగా.. రెండింటిని డ్రా చేసుకుంది. ఏకంగా 12 మ్యాచ్‌లలో పరాజయం చవిచూసింది. కాగా కెప్టెన్సీ భారాన్ని దించుకున్న మొమినల్ ఇకపై బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. చదవండి 👇 Eng Vs NZ 1st Test: మాథ్యూ పాట్స్ అరంగేట్రం.. ఇంగ్లండ్ తరఫున 704వ ఆటగాడిగా! IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! -
ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లను బలి తీసుకున్న బ్రెయిన్ ట్యుమర్
ప్రాణాంతక వ్యాధి బ్రెయిన్ ట్యుమర్ ఒకే రోజు ఇద్దరు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లను బలి తీసుకుంది. ఈ ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం. బంగ్లాదేశ్ తొలి వన్డే జట్టులో సభ్యుడైన సమియుర్ రెహమాన్ (69) బ్రెయిన్ ట్యుమర్ వ్యాధి కారణంగా ఇవాళ (ఏప్రిల్ 19) ఢాకాలోని సిటీ ఆసుపత్రిలో కన్నుమూయగా, ఇదే రోజు బంగ్లా మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మొషారఫ్ హొస్సేన్ (40) అదే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మృతి చెందాడు. ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు కన్నుమూయడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. (సమియుర్ రెహమాన్) రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సమియుర్ బంగ్లాదేశ్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోగా, మొషారఫ్ హొస్సేన్ 2008-16 మధ్యలో 5 వన్డేలు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. సమియుర్ ఆటగాడిగా రిటైర్ అయిన అనంతరం బంగ్లా దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించగా, మొషారఫ్ హొస్సేన్.. బంగ్లా దేశవాళీ టోర్నీల్లో 572 వికెట్లు పడగొట్టి స్టార్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: లక్నోతో మ్యాచ్.. భారీ రికార్డులపై కన్నేసిన దినేశ్ కార్తీక్ -
బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి నిర్ధారణ
ఢాకా: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఇటీవలే జింబాబ్వే పర్యటన నుంచి తిరిగివచ్చిన ఇద్దరు మహిళా క్రికెటర్లు ఒమిక్రాన్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆ దేశ వైద్య మంత్రి జహీద్ మలాకీ శనివారం ప్రకటించారు. కోవిడ్ బారిన పడిన ఆ ఇద్దరు క్రికెటర్లలో స్వల్ప జ్వరం మినహా ఎటువంటి లక్షణాలు లేవని, నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన తెలిపాడు. అలాగే బాధితులతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ కోవిడ్ పరీక్షలు చేసామని, వారందరికీ నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌లో ఇవే తొలి ఒమిక్రాన్ కేసులని ఆయన నిర్ధారించారు. కాగా, గత నెలలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలలో కోవిడ్ కొత్త వేరియంట్(ఒమిక్రాన్) కేసులు వెలుగు చూడడంతో ప్రపంచం మొత్తం మరోసారి అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: Ashes 1st Test: ఆసీస్ చేతిలో భంగపడ్డ రూట్ సేనకు మరో భారీ షాక్.. -
టీమిండియాకు పాకిస్తాన్ అల్టిమేటం
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం రోజున సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో తాము కూడా ఆడేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తామని వస్తున్న వార్తలను వసీమ్ ఖండించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం తాము ఆసియా కప్ నిర్వహించడానికి రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే పాకిస్తాన్లో ఆడాలా, లేదా అనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్లో తీవ్రవాదులను కట్టడిచేశాకనే ఆ దేశంతో క్రికెట్ ఆడతామని భారత్ చెప్పిన విషయం తెలిసిందే. 2020 సెప్టెంబరులో ఆసియా కప్‌ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే టీ20 వరల్డ్ కప్ 2021 భారత్‌లో జరగనుంది. -
ఆ జాబితాలో టీమిండియా నుంచి ఒక్కరూ లేరు..!
దుబాయ్ : ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ఆల్‌రౌండర్ల జాబితా బుధవారం విడుదలైంది. బంగ్లా క్రికెటర్ షకీబుల్ హసన్ 359 పాయింట్లతో ఈ జాబితాలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ప్రపంచకప్ కొద్ది రోజుల్లో ప్రారంభవనుండగా ఓవైపు వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాలతో జరిగిన త్రైపాక్షిక వన్డే సిరీస్ సాధించి జోష్ మీదున్న బంగ్లా టీమ్‌కు.. ఆల్‌రౌండర్ల లిస్టులో షకీబుల్ టాప్‌లో నిలవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసినట్టయింది. ట్రై సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లాడిన షకీబుల్ 140 పరుగులు సాధించి, రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న అఫ్గాన్ ఆటగాడు రషీద్‌ఖాన్ (339)ను రెండో స్థానంలోకి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో అఫ్గాన్ మరో ఆటగాడు మహ్మద్ నభి, పాక్ క్రికెటర్ ఇమామ్ వసీం, న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ నాలుగు ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్దానంలో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్, ఏడో స్థానాన్ని పాక్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ దక్కించుకున్నారు. ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా.. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ ఉన్నారు. టీమిండియా నుంచి టాప్ 10 స్థానాల్లో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇద్దరు చొప్పున టాప్ 10లో నలుగురు చోటు దక్కించుకోవడం విశేషం. -
న్యూజిలాండ్‌లో కాల్పులు
-
న్యూజిలాండ్‌లో కాల్పులు.. బంగ్లా క్రికెటర్ల ఎస్కేప్!
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్, క్రిస్ట్‌చర్చ్ సెంట్రల్ సిటీలోని హగ్లీపార్క్ మజీదులో దుండగులు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. హగ్లీపార్క్‌లో సమీపంలోని రెండు మజీదులపై ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనతో రెండు మజీదులు రక్తసిక్తమయ్యాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు పరుగు పేట్టారని తెలిపింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్ట్‌చర్చ్ సిటీలోని ప్రజలెవరు బయటకు రావద్దని సూచించారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతున్న.. బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బంగ్లాదేశ్ కోచ్ మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్ రహీమ్ ట్వీట్ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని పేర్కొన్నాడు. -
బంగ్లాదేశ్ భారీ స్కోరు..
మిర్పూర్: వెస్టిండీస్‌కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. విండీస్‌తో జరిగిన రెండో టీ20లో బంగ్లా భారీ విజయం సాధించింది. కరేబియన్లను 36 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించిన షకీబ్ బ్యాట్‌తోనూ రాణించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్(60) అర్ధ సెంచరీకి.. షకీబ్ (42; 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్), మహ్మదుల్లా(43; 21 బంతుల్లో 7 ఫోర్లు) మెరుపులు తోడవడంతో బంగ్లా భారీ స్కోరు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. షకీబ్ దెబ్బకు 19.2 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోవ్‌మన్ పావెల్ (50) అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. షకీబ్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రహమాన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. షకీబ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో విండీస్ గెలిచింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ సమం చేసింది. -
మైదానంలో సఫారీ డ్రోన్
అడ్డుకున్న బంగ్లా బోర్డు క్షమాపణ చెప్పిన దక్షిణాఫ్రికా జట్టు ఢాకా: తమ ప్రాక్టీస్ సెషన్లో డ్రోన్‌ను ఉపయోగించిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ మిలిటరీకి గురువారం క్షమాపణలు చెప్పింది. ఏరియల్ వ్యూ నుంచి ఆటగాళ్ల ఫొటోలను, వీడియోలను తీసేందుకు బుధవారం నాటి సెషన్లో ఈ డ్రోన్‌ను ఉపయోగించారు. అయితే జాతీయ భద్రతా చర్యల కింద బంగ్లాలో ఇలాంటివి వాడడం నిషేధం. విషయం తెలిసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు వెంటనే తమ అభ్యంతరాన్ని తెలిపి అడ్డుకున్నారు. ‘జట్టుతో పాటు వచ్చిన ‘బిహైండ్ ది సీన్’ టీవీ సిబ్బంది తమ యూట్యూబ్ చానెల్ కోసం వీడియోలు, సృజనాత్మక ఫొటోల కోసం డ్రోన్‌ను వాడారు. అయితే బంగ్లాదేశ్ గగనతలంపై ఇలాంటి వాటిని నిషేధించిన విషయం మాకు తెలీదు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి వెంటనే దాన్ని ఉపయోగించడం మానేశాం’ అని ప్రొటీస్ టీమ్ మేనేజర్ మొహమ్మద్ మూసజీ తెలిపారు. -
రహానే అవుట్.. రాయుడు ఇన్
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగుతోంది. రహానే, ఉమేష్ యాదవ్, మొహిత్ శర్మ స్థానంలో అంబటి రాయుడు, అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణి జట్టులోకి వచ్చారు. బంగ్లాదేశ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని బంగ్లా టీమ్ పట్టుదలతో ఉంది. మొదటి వన్డేలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ధోని సేన భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
పరుగుల ‘వర్షం’
బంగ్లా బేబీలను భారత ఓపెనర్లు ఆటాడుకున్నారు. వన్డే తరహా ఆటతీరుతో శిఖర్ ధావన్ సంచలన సెంచరీతో చెలరేగితే... విజయ్ తన ‘శైలి’లో ఆకట్టుకున్నాడు. వెరసి... బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ తొలి రోజే పట్టు బిగించింది. వర్షం కారణంగా ఓవర్లు నష్టపోయినా... ఓపెనర్ల పరుగుల వర్షంతో ఆ లోటు తెలియలేదు. రెండో రోజూ ఇదే దూకుడు కొనసాగిస్తే... కొత్త సీజన్‌ను కోహ్లి సేన విజయంతో ప్రారంభించొచ్చు. ఫతుల్లా : ఎంతో మెరుగుపడ్డామని చెప్పుకున్నా...టెస్టుల్లో భారత్ ముందు బంగ్లాదేశ్ బేబీలే అని మరో సారి స్పష్టమైంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మొదటి రోజే భారత్ పట్టు బిగించింది. వర్షం బారిన పడిన ఈ మ్యాచ్ తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (158 బంతుల్లో 150 బ్యాటింగ్; 21 ఫోర్లు), మురళీ విజయ్ (178 బంతుల్లో 89; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా క్రీజ్‌లో నిలిచారు. వాన కారణంగా లంచ్‌కు ముందు మధ్యలో దాదాపు మూడు గంటలకు పైగా ఆట నిలిచిపోయింది. చివర్లో సెషన్‌ను పొడిగించినా కనీసం 34 ఓవర్లు తగ్గాయి. ఆటగాళ్లకంటే టాస్నే ఎక్కువగా నమ్ముకొని బ్యాట్స్‌మన్, పార్ట్‌టైమర్లతో జట్టును నింపేసిన బంగ్లా తగిన ఫలితం అనుభవించింది. రోజంతా ఆడినా కనీసం ఒక వికెట్ తీయలేని బలహీనత మళ్లీ బయటపడింది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ : విజయ్ (బ్యాటింగ్) 89; ధావన్ (బ్యాటింగ్) 150; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 239. బౌలింగ్ : షాహిద్ 12-2-52-0; సర్కార్ 2-0-7-0; షువగత 13-0-47-0; షకీబ్ 9-1-34-0; తైజుల్ 12-0-55-0; జుబేర్ 7-0-41-0; కైస్ 1-0-3-0. ధావన్ దరహాసం! శిఖర్ ధావన్ మరో సారి జట్టులో తన విలువేంటో చూపించాడు. తనకే సాధ్యమైన రీతిలో టెస్టులోనూ వన్డే శైలి ఆటతో చెలరేగి శతకం సాధించాడు. ప్రపంచకప్‌లో బాగా ఆడినా, ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ రాణించినా ఈ టెస్టుకు ముందు తుది జట్టులో ధావన్‌కు స్థానం ఖాయం కాదు. ఆస్ట్రేలియాలో వరుస వైఫల్యాల తర్వాత సిడ్నీ టెస్టుకు దూరమైన అతను, కేఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడంతో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ధావన్ కెరీర్లో ఇది మూడో సెంచరీ. భీకరంగా దూసుకొచ్చిన తొలి టెస్టు సెంచరీ, తర్వాత న్యూజిలాండ్ గడ్డపై చేసిన శతకంతో పోలిస్తే ఇది గొప్ప కాకపోవచ్చు. కానీ దాదాపు సగం ఆట వర్షం కారణంగా కోల్పోయినా... ధావన్ దూకుడు తొలి రోజే భారీ స్కోరుకు బాటలు వేసింది. ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడు స్లిప్‌లోకి వెళ్లిన బంతి కాస్త వేగవంతమైన మైదానం అయితే నేరుగా ఫీల్డర్ చేతిలో పడేదే. అయితే ఇలా అదృష్టం కలిసొచ్చిన ప్రతీసారి అతను చెలరేగిపోయాడు. చూడచక్కని డ్రైవ్‌లు, ఫ్లిక్‌లతో ఏ మాత్రం తడబాటు లేకుండా సునాయాసంగా శిఖర్ పరుగులు రాబట్టాడు. బ్యాక్‌ఫుట్‌పై అతను ఆడిన కొన్ని షాట్లు కనువిందు చేశాయి. 73 పరుగుల వద్ద మరో సారి క్యాచ్ మిస్ అయిన తర్వాత అతని జోరు మరింత పెరిగింది. కొద్ది సేపటికే మిడ్ వికెట్ మీదుగా ఫ్లిక్ ప్లస్ స్వీప్ కలగలిపిన కొత్త తరహా షాట్‌తో సెంచరీ చేరిన తీరు డెరైక్టర్ రవిశాస్త్రిని కూడా అబ్బురపరచినట్లుంది. అందుకే డ్రెస్సింగ్రూమ్నుంచి అదే షాట్‌ను ఆడి చూపించి మరీ ధావన్‌ను అభినందించాడు! శతకం తర్వాత కూడా అతను తన ఏకాగ్రత కోల్పోలేదు. 56 ఓవర్ల ఆటకే 150 మార్క్‌కు చేరితే ...అదే మొత్తం ఆట జరిగితే డబుల్ సెంచరీ కూడా సాధ్యమయ్యేదేమో! అయినా శిఖర్ ముందు మరో అవకాశం ఉంది. రెండో రోజు ఇదే తరహాలో చెలరేగితే కొత్త రికార్డులు ‘గబ్బర్’ ఖాతాలో చేరడం ఖాయం. -సాక్షి క్రీడావిభాగం సెషన్ 1: ఓపెనర్ల శుభారంభం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ టెస్టు ఆడిన జట్టులో ఒకే మార్పు జరిగింది. రాహుల్ స్థానంలో ధావన్‌కు చోటు దక్కగా... ఐదో బౌలర్ కోసం అనూహ్యంగా కోహ్లి... పుజారాను పక్కన పెట్టాడు. భారత జట్టులో ముగ్గురు పేసర్లు ఉండగా, బంగ్లా ఒక పేసర్కే స్థానం కల్పించింది. షాహిద్ వేసిన రెండో ఓవర్లో ధావన్‌కు అదృష్టం కలిసొచ్చింది. బ్యాట్ అంచుకు తగిలిన బంతి స్లిప్‌లో ఫీల్డర్ ముందు పడింది. అయితే ఆ తర్వాత ఎక్కడా తగ్గని శిఖర్ దూసుకుపోయాడు. షువగత ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన అతను, షాహిద్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో వైపు నెమ్మదిగా ఆడిన విజయ్ తన 31వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేకపోయాడు. 73 పరుగుల వద్ద ధావన్‌కు మళ్లీ లైఫ్ లభించింది. తైజుల్ బౌలింగ్‌లో షార్ట్ మిడ్ వికెట్ వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను షువగత వదిలేశాడు. ఆ వెంటనే భారీ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. చాలా సేపటి వరకు తగ్గకపోవడంతో ముందుగానే లంచ్ విరామం ప్రకటించారు. ఓవర్లు: 23.3, పరుగులు: 107; వికెట్లు: 0 సెషన్ 2: వర్షంతో రద్దు వర్షం ఏ మాత్రం తెరిపినివ్వలేదు. ఈ సెషన్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. దాంతో అంపైర్లు టీ బ్రేక్ కూడా ఇచ్చేశారు. సెషన్ 3: అదే దూకుడు ఆట మొదలైన తర్వాత మరోసారి భారత్ పరుగుల వర్షం ఆరంభమైంది. ఏ మాత్రం పస లేని ప్రత్యర్థి బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న ధావన్, విజయ్ ధాటిగా ఆడారు. షాహిద్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన విజయ్ 98 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. వీరిద్దరి ముందు బంగ్లా స్పిన్ ఏ మాత్రం పని చేయలేదు. ఈ క్రమంలో భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. ధావన్, విజయ్ మధ్య 200కు పైగా పార్ట్నర్షిప్ నమోదు కావడం ఇది రెండో సారి. ఆఖరి బంతికి సింగిల్ తీసి ధావన్ 150 స్కోరుకు చేరిన అనంతరం వెలుతురులేమితో ఆటను నిలిపేశారు. ఇన్నింగ్స్‌లో కేవలం 3 మెయిడిన్ ఓవర్లే వేయగలిగిన బంగ్లాదేశ్, ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వకపోవడం విశేషం. ఓవర్లు: 32.3, పరుగులు: 132; వికెట్లు: 0 -
బంగ్లాతో తొలి టెస్టు; భారత్ 239/0
ఫతుల్లా: బంగ్లాదేశ్ తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను నిర్ణీత సమయానికన్నా ముందే ముగించారు. అంతకుముందు వర్షం ఆటంకం కలిగించడంతో దాదాపు మూడు గంటల సేపు ఆట ఆగిపోయింది. వర్షం తగ్గడంతో ఆట తిరిగి కొనసాగించారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ శుభారంభం అందించారు. ధావన్ సెంచరీ, విజయ్ అర్ధ సెంచరీ చేశారు. ధావన్ 150, విజయ్ 89 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్
పాక్‌పై 3-0తో సిరీస్ సొంతం సౌమ్య సర్కార్ సెంచరీ మిర్పూర్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తమ క్రీడా చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ సౌమ్య సర్కార్ సూపర్ సెంచరీ (110 బంతుల్లో 127 నాటౌట్; 13 ఫోర్లు; 6 సిక్సర్లు) సహాయంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ దెబ్బతో పాక్ జట్టు తమ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏడు నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు 49 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ అజహర్ అలీ (112 బంతుల్లో 101; 10 ఫోర్లు) సెంచరీ చేయగా... హరిస్ సోహైల్ (58 బంతుల్లో 52; 1 ఫోర్; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 39.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు సర్కార్, తమీమ్ ఇక్బాల్ (76 బంతుల్లో 64; 8 ఫోర్లు; 1 సిక్స్) తొలి వికెట్‌కు 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత ముష్ఫికర్ (43 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు) అండతో సర్కార్ మూడో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు. -
భళా.. బంగ్లా
16 ఏళ్ల తర్వాత పాక్‌పై విజయం తమీమ్, ముష్ఫికర్ సెంచరీలు మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు 1-0 ఆధిక్యం మిర్పూర్: ఏదో అదృష్టవశాత్తు ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరలేదని, తమ దగ్గర పెద్ద జట్లను ఓడించే సత్తా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులతో ఘన విజయం సాధించింది. షేరేబంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 329 పరుగుల భారీస్కోరు సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లాకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (135 బంతుల్లో 132; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. ముష్ఫికర్ రహీమ్ (77 బంతుల్లో 106; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి శతకం సాధించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో బంగ్లాకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. షకీబ్ (31) రాణించాడు. వహబ్ రియాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన అజ్మల్ 10 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ జట్టు 45.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటయింది. అజహర్ అలీ (72), హారిస్ సోహైల్ (51), రిజ్వాన్ (67) అర్ధసెంచరీలు సాధించినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఏ దశలోనూ పాక్ లక్ష్యం దిశగా సాగలేదు. టాస్కిన్, అరాఫత్ సన్నీ మూడేసి వికెట్లు సాధించారు. బంగ్లాదేశ్ జట్టు పాక్‌పై ఏ ఫార్మాట్లోనైనా గెలవడం ఇది రెండోసారి. 1999 ప్రపంచకప్ తర్వాత మళ్లీ 16 ఏళ్లకు తమ ప్రియమైన శత్రువుపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. -
భారత్-బంగ్లాదేశ్ మూడో వన్డే రద్దు
మిర్పూర్: భారత్-బంగ్లాదేశ్ మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ 34.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అంతకుముందు వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. మూడుసార్లు ఆటకు ఆటంకం కలిగించిన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్ రద్దు చేశారు. రైనా 25, బిన్నీ 25, పూజారా 27 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు తీశాడు. ఆల-అమిన్, తస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోర్తజా, గాజి చెరో వికెట్ దక్కించుకున్నారు. -
13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
మిర్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట జరుగుతుండగా వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి 8.3 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. రాబిన్ ఊతప్ప 5, రహానే 3 పరుగులు చేసి అవుటయ్యారు. అంబటి రాయుడు ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరాడు. పూజారా(3), తివారి(0) క్రీజ్ లో ఉన్నారు. మోర్తజా, ఆల-అమిన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో గెల్చుకుంది. రెండో వన్డేకూ వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. -
బంగ్లాదేశ్ పై రైనా సేన గెలుపు
మీర్పూర్: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రైనా సేన మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. భారత్ కు 26 ఓవర్లలో 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మరో 7 బంతులు మిగులుండగానే రైనా సేన విజయాన్ని అందుకుంది. 24.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(50), అజింక్య రహానే(64) అర్థ సెంచరీలతో రాణించారు. పూజారా డకౌట్ అయ్యాడు. రాయుడు 16, రైనా 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. మోర్తజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. రహానే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
ఫించ్ విజృంభణ, ఆస్ట్రేలియా గెలుపు
మిర్పూర్: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఊరట విజయం లభించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సెమీస్ చేరలేకపోయిన ఆసీస్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 17.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఫించ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. వార్నర్ 48, వైట్ 18, బెయిలీ 11 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. షకీబ్ అల్ హుస్సేన్(66), ముష్ఫికర్ రహీం(47) రాణించారు. ఫించ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ఆఫ్రిది విధ్వంసం; బంగ్లాపై పాక్ గెలుపు
మిర్పూర్: ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో పాకిస్థాన్ ఛేధించిన అత్యధిక లక్ష్యం ఇదే కావడం విశేషం. ఈ విజయంతో పాక్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. డాషింగ్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 18 బంతుల్లోనే 2 ఫోర్లు 6 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. 59 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ అద్భుతంగా ఆడి సెంచరీ కొట్టాడు. షెహజాద్103 పరుగులు చేశారు. మహ్మద్ హఫీజ్(52), ఫావద్ ఆలాం(74) అర్థసెంచరీలతో తమ వంతు పాత్ర పోషించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కేయిస్(59), మమినల్ హక్(51), ముష్పిఖర్ రహీమ్(51) అర్థ సెంచరీలు సాధించారు. షకీబ్ ఆల్ హసన్ 44 పరుగులు చేశాడు. -
పసికూనపై లంకేయుల జయకేతనం
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. క్రికెట్ పసికూనను ఇన్నింగ్స్ 248 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరో రోజు మిగులుండగానే మ్యాచ్ ముగించింది. 35/1 ఓవర్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 250 పరుగులకు ఆలౌటయింది. మొమినల్ హక్ ఒక్కడే(50) అర్థ సెంచరీతో రాణించాడు. లంక బౌలర్లలో పెరీరా 5 వికెట్లు, లక్మాల్ 3 వికెట్లు పడగొట్టారు. ఎరెగ, హిరాత్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 232 పరుగులు చేసింది. లంకేయులు 730/6 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. మహేళ జయవర్ధనే (272 బంతుల్లో 203 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు సిల్వా(139) వితనగే (103 నాటౌట్) సెంచరీలు సాధించడంతో లంక భారీ స్కోరు చేసింది. జయవర్ధనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న చిట్టగ్యాంగ్ లో ప్రారంభమవుతుంది.