రహానే అవుట్.. రాయుడు ఇన్ | Ajinkya Rahane dropped, Ambati Rayudu in | Sakshi
Sakshi News home page

రహానే అవుట్.. రాయుడు ఇన్

Published Sun, Jun 21 2015 2:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

రహానే అవుట్.. రాయుడు ఇన్

రహానే అవుట్.. రాయుడు ఇన్

మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగుతోంది.

రహానే, ఉమేష్ యాదవ్, మొహిత్ శర్మ స్థానంలో అంబటి రాయుడు, అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణి జట్టులోకి వచ్చారు. బంగ్లాదేశ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని బంగ్లా టీమ్ పట్టుదలతో ఉంది. మొదటి వన్డేలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ధోని సేన భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement