దుబాయ్ : ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ఆల్‌రౌండర్ల జాబితా బుధవారం విడుదలైంది. బంగ్లా క్రికెటర్ షకీబుల్ హసన్ 359 పాయింట్లతో ఈ జాబితాలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ప్రపంచకప్ కొద్ది రోజుల్లో ప్రారంభవనుండగా ఓవైపు వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాలతో జరిగిన త్రైపాక్షిక వన్డే సిరీస్ సాధించి జోష్ మీదున్న బంగ్లా టీమ్‌కు.. ఆల్‌రౌండర్ల లిస్టులో షకీబుల్ టాప్‌లో నిలవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసినట్టయింది. ట్రై సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లాడిన షకీబుల్ 140 పరుగులు సాధించి, రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న అఫ్గాన్ ఆటగాడు రషీద్‌ఖాన్ (339)ను రెండో స్థానంలోకి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
ఇక మూడో స్థానంలో అఫ్గాన్ మరో ఆటగాడు మహ్మద్ నభి, పాక్ క్రికెటర్ ఇమామ్ వసీం, న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ నాలుగు ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్దానంలో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్, ఏడో స్థానాన్ని పాక్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ దక్కించుకున్నారు. ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా.. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ ఉన్నారు. టీమిండియా నుంచి టాప్ 10 స్థానాల్లో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇద్దరు చొప్పున టాప్ 10లో నలుగురు చోటు దక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment