ICC ODI rankings
-
అగ్రస్థానాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్ ప్లేస్‌లో ఉండిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్ రౌఫ్ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్‌పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్ బౌలర్ నసీం షా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (6), మొహమ్మద్ సిరాజ్ (7) టాప్-10లో ఉన్నారు.బ్యాటింగ్ విషయానికొస్తే.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ అఫ్రిది టాప్ ప్లేస్‌కు చేరడంతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పాక్ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్ రజా రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిది హసన్ మీరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న హిట్‌మ్యాన్.. ఓ ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. రోహిత్‌కు కెరీర్లో ఇదే అత్యుత్తమ వన్డే ర్యాంక్. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు సహా 157 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, రోహిత్ రెండో ర్యాంక్‌కు ఎగబాకడంతో ఆ స్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. లంకతో సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోయనా విరాట్ కోహ్లి నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ ఓ స్థానం మెరుగుపర్చుకుని విరాట్‌తో సమానంగా నాలుగో స్థానానికి చేరుకోగా.. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన లంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరగా.. డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, వాన్ డెర్ డస్సెన్ 6, 7, 9, 10 స్థానాల్లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మొహమ్మద్ నబీ, షాహీన్ అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ సిరాజ్ టాప్-10లో ఉన్నారు. వన్డే ఆల్‌రౌండర్ల విభాగంలో మొహమ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్, సికందర్ రజా టాప్-3లో ఉన్నారు. -
ICC Rankings: మూడో స్థానానికి ఎగబాకిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన హిట్‌మ్యాన్ రేటంగ్ పాయింట్లు గణనీయంగా పెంచుకుని నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరాడు. క్రితం వారం ర్యాంకింగ్స్‌లో మూడో ప్లేస్‌లో ఉండిన విరాట్ కోహ్లి ఓ ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 824 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ టెక్టార్, డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, నిస్సంక, డస్సెన్ టాప్ 10లో ఉన్నారు.ఐదు స్థానాలు ఎగబాకిన కుల్దీప్తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరగా.. కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్, మహ్మద్ సిరాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మహ్మద్ నబీ, బుమ్రా, షాహీన్ అఫ్రిది టాప్-10 జాబితాలో ఉన్నారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో మహ్మద్ నబీ టాప్‌లో ఉండగా.. షకీబ్ అల్ హసన్, సికందర్ రజా, అస్సద్ వలా, రషీద్ ఖాన్, గెర్హార్డ్ ఎరాస్మస్, మ్యాక్స్‌వెల్, సాంట్నర్, మెహిది హసన్, జీషన్ మక్సూద్ టాప్-10లో ఉన్నారు. -
మూడో ర్యాంక్‌లో స్మృతి మంధాన (ఫొటోలు)
-
ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్‌లో నిలిచాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. -
నేను అప్పుడు కూడా నంబర్ వన్.. ప్రధాన లక్ష్యం మాత్రం అదే: సిరాజ్
Mohammed Siraj opens up on being No. 1 ranked ODI bowler: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ర్యాంకుల గురించి తను పట్టించుకోనని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటం మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. గతంలో రెండుసార్లు ‘టాప్’నకు చేరి ఆ తర్వాత తన స్థానాన్ని కోల్పోయిన సిరాజ్ ఈ ప్రపంచకప్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో మళ్లీ నంబర్ వన్‌గా అవతరించాడు. మొత్తంగా 709 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిదిని వెనక్కి నెట్టి.. అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ ఐసీసీతో మాట్లాడుతూ.. తన ప్రధాన లక్ష్యం ఏమిటో వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే.. గతంలో కూడా నేను నంబర్ 1గా ఉన్నాను.. ఆ తర్వాత ర్యాంకింగ్స్ విషయంలో ఎత్తుపళ్లాలు. కాబట్టి నంబర్లను నేను ఏమాత్రం పట్టించుకోను. నా ఏకైక లక్ష్యం టీమిండియా వరల్డ్‌కప్ గెలవడంలో నా వంతు సహకారం అందించడమే. బౌలర్‌గా నా ప్రదర్శన వల్ల జట్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. తాజా ఎడిషన్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచిన రోహిత్ సేన లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. బెంగళూరు వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ ప్రథమ స్థానంలో ఉండగా.. కుల్దీప్ యాదవ్ (4వ స్థానం), .జస్ప్రీత్ బుమ్రా (8వ స్థానం), మహ్మద్ షమీ (10వ స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. చదవండి: CWC 2023: టీమిండియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ జట్టులో కీలక మార్పు! కారణమిదే View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సత్తాచాటాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో గిల్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. గిల్ నెంబర్ 1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న గిల్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కినెట్టి అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా గిల్ అదరగొడుతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లకు జ్వరం కారణంగా దూరమైన ఈ యువ ఓపెనర్.. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపాడు. ప్రస్తుతం బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 830 రేటింగ్ పాయింట్లతో గిల్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. 824 రేటింగ్ పాయింట్లతో బాబర్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. గిల్ అరుదైన ఘనత.. వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్‌గా అవతరించిన గిల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లలోనే నెం1 ర్యాంక్‌కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా శుబ్‌మన్ రికార్డులకెక్కాడు. గిల్ కేవలం 41 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డును గిల్ సాధించాడు. కాగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. 2010లో వన్డేల్లో నెం1 బ్యాటర్‌గా నిలిచిన ధోని.. కేవలం 38 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. అదే విధంగా వన్డేల్లో అగ్రపీఠాన్ని అధిరోహించిన నాలుగో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించారు. -
మళ్లీ మనోడే నెంబర్ 1.. షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టిన సిరాజ్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో దుమ్మురేపుతున్న సిరాజ్.. పాక్ స్పీడ్ స్టార్ షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టి నంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సిరాజ్ ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో మూడు వికెట్లతో సిరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా ఓ కీలక వికెట్ సాధించాడు. కాగా హైదరాబాద్ స్టార్ సిరాజ్ నెం1 ర్యాంక్‌కు చేరుకోవడం ఇది మూడో సారి. ప్రస్తుతం బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 709 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (694 పాయింట్లు) ఉన్నాడు. అయితే భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న గిల్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి నెం1 స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు. చదవండి: Ben Stokes: సెంచరీతో అదరగొట్టిన స్టోక్స్.. వరల్డ్‌కప్‌లో ఇదే మొదటిది -
బాబర్ ఆజమ్ ‘శకం’ ముగిసింది.. నయా నంబర్ వన్ శుభ్‌మన్ గిల్
రెండేళ్ల కాలంలో ఎవరు చేయలేని పనిని టీమిండియా యువ కెరటం శుభ్‌మన్ గిల్ చేసి చూపించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను ఎట్టకేలకు కిందికి దించాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్ అగ్రస్థానానికి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 219 పరుగులు చేసిన గిల్.. బాబర్ కంటే ఆరు రేటింగ్ పాయింట్లు (830) అధికంగా సాధించి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సచిన్, ధోని, కోహ్లి తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు చేరిన భారత బ్యాటర్ గిలే కావడం విశేషం. తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. వరల్డ్‌కప్‌లో ప్రదర్శనల కారణంగా తాజా ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారీగా స్థానచలనాలు జరిగాయి. డికాక్ (మూడో స్థానం), శ్రేయస్ (18), ఫకర్ జమాన్ (11), ఇబ్రహీం జద్రాన్ (12) తమతమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఏకంగా నలుగురు భారత బౌలర్లు చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్ సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో గిల్, కోహ్లితో పాటు రోహిత్ శర్మ (ఆరో స్థానం) కూడా ఉన్నాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఎనిమిది విజయాలు సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
World Cup 2023: వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా షాహిన్ అఫ్రిది..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహిన్ షా అఫ్రిది అదరగొట్టాడు. తొలిసారి వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. వన్డే ప్రపంచకప్-2023లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అఫ్రిది.. ఏకంగా 7 స్ధానాలు ఎగబాకి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 673 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి షాహీన్ దూసుకువచ్చాడు. కాగా ఏ ఫార్మాట్లోనైనా నెం.1 ర్యాంక్‌ను చేరుకోవడం అఫ్రిదికి ఇదే మొదటి సారి. వన్డే ప్రపంచకప్-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన అఫ్రిది 16 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వంద వికెట్ల మైలురాయి.. అంతర్జాతీయ వన్డేల్లో మరో అరుదైన ఘనతను అఫ్రిది అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో షాహీన చెలరేగాడు. చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన డికాక్.. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలోనే! -
అగ్రపీఠానికి మరింత చేరువైన గిల్.. దుమ్ములేపిన డికాక్, క్లాసెన్! బాబర్ ఇక..
ICC ODI Batting Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠానికి మరింత చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 823 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కంటే కేవలం ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. డెంగ్యూ జ్వరం కారణంగా కాగా డెంగ్యూ జ్వరం కారణంగా భారత ఓపెనింగ్ బ్యాటర్ వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెరుగైన చికిత్స అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తిరిగి జట్టుతో చేరాడు. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌లో కేవలం 16 పరుగులకే పరిమితమైన శుబ్‌మన్ గిల్.. బంగ్లాదేశ్‌పై అర్ధ శతకం(53) సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 95 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వన్డేల్లో బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకును ఆక్రమించే క్రమంలో మరో ముందడుగు వేశాడు. దుమ్ములేపిన డికాక్, క్లాసెన్ ఇక ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్ దుమ్ములేపారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా వన్డే ప్రపంచకప్-2023లో మూడో సెంచరీ నమోదు చేసిన డికాక్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. ఆరంభం నుంచి అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ బంగ్లాదేశ్‌పై 90 పరుగులు చేసి తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కోహ్లి, రోహిత్ ఇలా ఇక బాబర్ ఆజం(పాకిస్తాన్- 829 పాయింట్లు), శుబ్‌మన్ గిల్(ఇండియా- 823), క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా- 769), హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా- 756)లతో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్(747 పాయింట్లు) టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయి వార్నర్ తర్వాతి ర్యాంకులో నిలిచాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో ర్యాంకు సాధించాడు. చదవండి: రుత్‌రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన కోహ్లి.. రాహుల్ ఏకంగా..
ICC ODI Rankings: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రన్‌మెషీన్.. మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకు సాధించాడు. అదే విధంగా ప్రపంచకప్ మ్యాచ్‌లలో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్, ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ సైతం తమ స్థానాలు మెరుగుపరుచుకున్నారు. ఇక వన్డే వరల్డ్ నంబర్ 1 బ్యాటర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్, ఐర్లాండ్ స్టార్ హ్యారీ టెక్టార్, ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్-5లో కొనసాగుతున్నారు. ఏడు స్థానాలు ఎగబాకి కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ సెంచరీ చేయగా.. కోహ్లి ఆసీస్‌తో మ్యాచ్‌లో 85 పరుగులు సాధించాడు. వీరిద్దరు వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. మరోవైపు.. ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం(140)తో విరుచుకుపడి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు. రాహుల్ ర్యాంకు ఎంతంటే ఇదిలా ఉంటే.. టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ 15 స్థానాలు మెరుగుపరచుకుని.. 19వ ర్యాంకులో నిలిచాడు. సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన భారత్‌ను సిక్సర్‌తో విజయతీరాలకు చేర్చాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మరోవైపు.. గిల్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమై నంబర్ 1గా అవతరించే అవకాశం చేజార్చుకున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. బాబర్ ఆజం(పాకిస్తాన్) 2. శుబ్‌మన్ గిల్(భారత్) 3. రాసీ వాన్ డెర్ డసెన్(సౌతాఫ్రికా) 4. హ్యారీ టెక్టర్(ఐర్లాండ్) 5. డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా). చదవండి: ఈ వరల్డ్‌కప్‌లోనే కోహ్లి.. సచిన్ సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడు! -
వరల్డ్‌కప్‌కు ముందు మొహమ్మద్ సిరాజ్‌కు భంగపాటు
భారత్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ 2023కు ముందు టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు భంగపాటు ఎదురైంది. కొద్ది రోజుల కిందట ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ధారాళంగా పరుగులు (9 ఓవర్లలో 68 పరుగులు) సమర్పించుకున్నందుకు గాను సిరాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 11 పాయింట్లు (680 నుంచి 669) కోల్పోయాడు. తద్వారా అతను ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌తో అగ్రస్థానాన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చింది. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో 8 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన హాజిల్‌వుడ్ అప్పటివరకు తన ఖాతాలో ఉన్న 669 పాయింట్లను నిలబెట్టుకుని సిరాజ్‌తో పాటు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌లో వీరిరువురిలో టాప్ ర్యాంకర్ ఎవరో తేలిపోతుంది. తాజాగా ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడు, నాలుగు స్థానాలు నిలబెట్టుకోగా.. పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది 2 స్థానాలు ఎగబాకి 6వ ప్లేస్‌కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉండిన మిచెల్ స్టార్క్ 2 స్థానాలు కోల్పోయి 8వ స్థానానికి పడిపోయాడు. 11వ ర్యాంక్‌లో ఉండిన మొహమ్మద్ నబీ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకగా.. 10వ ప్లేస్‌లో ఉండిన కుల్దీప్ యాదవ్ 11వ స్థానానికి పడిపోయాడు. ఈ మార్పులు మినహాయించి టాప్-10 వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐర్లాండ్ హ్యారీ టెక్టార్‌తో సమానంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. 5వ స్థానంలో ఉండిన ఇమామ్ ఉల్ హాక్ ఓ స్థానం దిగజారి ఆరుకు పడిపోగా.. గత వారం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉండిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. 10వ స్థానంలో ఉండిన ఫకర్ జమాన్ 11వ ప్లేస్‌కు పడిపోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, శుభ్‌మన్ గిల్, డస్సెన్‌లు టాప్-3 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతుండగా.. విరాట్ 9వ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10 స్థానాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. షకీబ్, నబీ, సికందర్ రజా టాప్-3లో కొనసాగుతున్నారు. -
బాబర్ ఆజమ్‌ను కాపాడిన టీమిండియా మేనేజ్మెంట్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్‌ను టీమిండియా మేనేజ్మెంట్ పరోక్షంగా కాపాడింది. రెండో ర్యాంక్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆసీస్‌తో మూడో వవ్డేలో ఆడకుండా రెస్ట్ ఇచ్చిన భారత క్రికెట్ జట్టు యాజమాన్యం బాబర్ టాప్ ర్యాంక్ కోల్పోకుండా తోడ్పడింది. ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో (74, 104) పరుగుల వరద పారించడంతో తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్ టాప్ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు. గిల్ ప్రస్తుత రేటింగ్ పాయింట్లకు బాబర్ రేటింగ్ పాయింట్లకు మధ్య తేడా కేవలం 10 పాయింట్లు మాత్రమే. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ 857 పాయింట్లు కలిగి ఉంటే.. గిల్ తాజా ప్రదర్శనలతో మరిన్ని పాయింట్లు సాధించి తన కెరీర్ బెస్ట్ అయిన 847 పాయింట్లు సాధించాడు. ఒకవేళ ఆసీస్‌తో మూడో వన్డేలో గిల్ ఆడి ఉంటే, కనీస పరుగులు చేసినా నంబర్ వన్ వన్డే బ్యాటర్ అయ్యుండేవాడు. ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాటర్ హోదాలో అతను వరల్డ్‌కప్ ఎంట్రీ ఇచ్చేవాడు. అయితే టీమిండియా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు. బాబర్ టాప్ వన్డే ర్యాంకర్‌గానే వరల్డ్‌కప్ బరిలో నిలుస్తాడు. అయితే ఈ ముచ్చట బాబర్‌కు ఎన్నో రోజులు నిలబడేలా లేదు. గిల్.. వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినా వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఇదిలా ఉంటే, తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. టాప్ 12 ర్యాంక్‌లు యాధాతథంగా కొనసాగుతున్నాయి. భారత్ నుంచి గిల్, కోహ్లి (9వ ర్యాంక్) టాప్ 10లో ఉండగా.. రోహిత శర్మ 11వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే ఈ విభాగంలో టీమిండియా ఏస్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఆసియా కప్ 2023 ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా టాప్ ర్యాంక్‌కు చేరుకున్న సిరాజ్... ఆ తర్వాత ఆసీస్‌తో జరిగిన రెండు వన్డేలు ఆడనప్పటికీ వన్డే టాప్ ర్యాంక్‌ను కోల్పోలేదు. ఈ విభాగంలో సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్ టాప్ 10లో (10వ ర్యాంక్) ఉన్నాడు. ఇక్కడ కూడా ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే రెండో జట్టుగా
టీమిండియా చరిత్ర సృష్టించింది. టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. వన్డేల్లో మళ్లీ ఆగ్ర పీఠాన్ని అధిరోహించింది. 116 రేటింగ్‌తో పాకిస్తాన్(115)ను వెనక్కి నెట్టి భారత్ టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. కాగా ఇప్పటికే టెస్టు, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ మొదటి స్ధానంలో కొనసాగుతోంది. ఇక మూడు ఫార్మాట్లలో టాప్ ప్లేస్‌లో నిలిచిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీమిండియా సరికొత్త రికార్డు.. అన్ని ఫార్మాట్లలో ఏకకాలంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు 2012 దక్షిణాఫ్రికా ఈ అరుదైన ఘనత సాధించింది. ఇక భారత్ టాప్ ర్యాంక్‌లో ఉండగా.. పాకిస్తాన్(115), ఆస్ట్రేలియా(111) రేటింగ్‌తో వరుసగా రెండు, మూడు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ ఘన విజయం ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో జంపా రెండు వికెట్లు.. కమ్మిన్స్, అబాట్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: U19 World Cup: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే? No. 1 Test team ☑️ No. 1 ODI team ☑️ No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH — BCCI (@BCCI) September 22, 2023 -
సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా..
ICC Men's ODI Bowling Rankings: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. తద్వారా మరోసారి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి దూసుకువచ్చాడు. కాగా శ్రీలంకతో ఆసియా వన్డే కప్ ఫైనల్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక కకావికలం సిరాజ్ దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మియా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కొలంబో మ్యాచ్‌లో మొత్తంగా ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వారించాడు. ఫిట్నెస్ కూడా ముఖ్యమంటూ ట్రైనర్ సూచనలు ఇవ్వడంతో.. అలా సిరాజ్ పేస్ అటాక్‌కు తెరపడింది. లేదంటే.. మరిన్ని వికెట్లు కూల్చేవాడేమో! మొత్తం ఎన్ని వికెట్లంటే? ప్రస్తుతం సిరాజ్ వన్డే వరల్డ్‌కప్-2023కి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగం కానున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్ మొట్టమొదటి సారి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్‌లో సిరాజ్ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ సిరాజ్- ఇండియా- 694 పాయింట్లు 2. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు 3. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్- 677 పాయింట్లు 4. ముజీబ్ ఉర్ రెహమాన్- అఫ్గనిస్తాన్- 657 పాయింట్లు 5. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 655 పాయింట్లు. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
వన్డే ర్యాకింగ్స్లో సత్తాచాటిన గిల్, కిషన్..
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో భారత బ్యాటర్లు శబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్ధానానికి చేరుకున్నాడు. ఇంతకుముందు నాలుగో ర్యాంక్‌లో ఉన్న గిల్.. ఆసియాకప్-2023లో భాగంగా నేపాల్‌పై అద్భుతంగా రాణించడంతో తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. మరోవైపు పాకిస్తాన్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ 12 స్ధానాలు ఎగబాకి 24వ స్ధానానికి చేరుకున్నాడు. కిషన్ పాకిస్తాన్‌పై 82 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టాప్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(882 పాయింట్లు) ఉండగా.. రెండో స్ధానంలో దక్షిణాఫ్రికా స్టార్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కొనసాగుతున్నాడు. టాప్ 10 వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్ జాబితా 1.బాబర్ ఆజం (పాకిస్తాన్) 2.రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా) 3.శుబ్‌మన్ గిల్(భారత్) 4.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్) 5.హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) 6.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 7.ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) 8.క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) 9.స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 10.విరాట్ కోహ్లీ (భారత్) చదవండి: రోహిత్, కోహ్లిలను తీసేయరు కదా! కాబట్టి.. తుది జట్టులో అతడే బెటర్: గంభీర్ -
వన్డేల్లో నెం1 జట్టుగా పాకిస్తాన్.. మరి టీమిండియా?
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ అగ్రస్ధానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్.. మళ్లీ నెం1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. కాగా 118 రేటింగ్‌తో పాక్ -ఆస్ట్రేలియా జట్లు సమం ఉన్నాయి. అయితే పాయిట్లు పరంగా ఆస్ట్రేలియా(2714) కంటే పాకిస్తాన్(2725) ముందంజలో ఉండడంతో అగ్రపీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతుంది. రేటింగ్స్ పరంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్,శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్ నిలిచాయి. సిరీస్ క్లీన్ స్వీప్.. ఇక కొలాంబో వేదికగా జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే.. 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3–0తో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ (37 బంతుల్లో 64) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నవాజ్, అఫ్రిది,అష్రాప్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు -
వన్డే ర్యాంకింగ్స్.. అదరగొట్టిన ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లు తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ 43వ ర్యాంక్, బౌలర్లలో కుల్దీప్ 14వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. విధ్వంసక ఓపెనర్ ఇషాన్ రెండో టెస్టు, మూడు వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ కూడా ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్ మూడు వన్డేలు కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే వన్డే సిరీస్‌లో రెండు, మూడు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి, రోహిత్‌లు ఒక్కో స్థానం కోల్పోయారు. ఇంతకుముందు టాప్ 10లో హిట్‌మ్యాన్ 11వ స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్‌కి పడిపోయారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో గాయంతో వన్డే సిరీస్‌కు దూరమైన మహ్మద్ సిరాజ్ ఒక స్థానం దిగజారి 677 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. 886 పాయింట్లతో బాబర్ ఆజం తొలి స్థానంలో ఉండగా.. వాండర్ డుసెన్ 777 పాయింట్లతో రెండు, 755 పాయింట్లతో ఫఖర్ జమాన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి శుబ్‌మన్ గిల్ 724 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ 705 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. 686 పాయింట్లతో మిచెల్ స్టార్క్, 682 పాయింట్లతో రషీద్ ఖాన్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా!
శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమారీ ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమన్స్ వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి శ్రీలంక క్రికెటర్‌గా ఆటపట్టు రికార్డులకెక్కింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 758 పాయింట్లతో ఆటపట్టు టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(758)ను వెనుక్కి నెట్టింది. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అటపట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో చెలరేగింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 248 పరుగులు అటపట్టు సాధించింది. ఈ అద్బుత ప్రదర్శన ఫలితంగా తన కెరీర్లో తొలిసారి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. జయసూర్య తర్వాత చమారీనే.. ఇక ఓవరాల్‌గా శ్రీలంక మెన్స్, ఉమెన్స్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా కూడా ఆటపట్టు నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ సాధించాడు. సెప్టెంబరు 2002 నుంచి మే 2003 వరకు జయసూర్య నెం1 ర్యాంక్‌లో కొనసాగాడు. అ తర్వాత ఏ ఒక్క శ్రీలంక క్రికెటర్(మెన్స్ అండ్ ఉమన్స్) టాప్ ర్యాంక్‌ను సాధించలేకపోయారు. తాజాగా అటపట్టు 20 ఏళ్ల తర్వాత అగ్రస్ధానానికి చేరుకుని రికార్డులకెక్కింది. ఇక తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ రు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. శ్రీలంక సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో సోఫీ డివైన్ 137 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. చదవండి: Harbhajan Singh: ప్రపంచంలో టాప్ 5 బెస్ట్ ప్లేయర్స్ వీరే.. కోహ్లి, రోహిత్‌కు నో ఛాన్స్! -
భారీ జంప్ కొట్టిన మార్క్రమ్.. కెరీర్ బెస్ట్ సాధించిన శుభ్‌మన్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఇటీవలే నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ శతకం (175) బాదిన మార్క్రమ్.. ఏకంగా 13 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ స్థానానికి ఎగబాకాడు. అలాగే ఆల్‌రౌండర్స్ విభాగంలో 16 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి చేరాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో రెండో వన్డేలోనూ అర్ధసెంచరీతో (51 నాటౌట్) రాణించిన మార్క్రమ్.. దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ చేజిక్కించుకోవడంతో పాటు సఫారీ టీమ్ వన్డే వరల్డ్‌కప్-2023కు నేరుగా అర్హత సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 41వ స్థానానికి చేరిన మార్క్రమ్.. వన్డేలతో పాటు టీ20లు, టెస్ట్‌ల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇక ఈ వారం ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. టీమిండియా యువకెరటం శుభ్‌మన్ గిల్ఓ స్థానం మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ నాలుగో ర్యాంక్ సాధించగా.. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ ఏకంగా 5 స్థానాలు జంప్ చేసి 10 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. నెదార్లండ్స్తో సిరీస్‌లో ఓ ఫైఫర్‌తో పాటు 8 వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ సిసండ మగాలా ఏకంగా 35 స్థానాలు ఎగబాకి 165 ర్యాంక్‌కు చేరుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, గిల్, వార్నర్, కోహ్లి, డికాక్, రోహిత్, స్టీవ్ స్మిత్, ఫకర్ జామన్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్డ్, సిరాజ్, స్టార్క్, మ్యాట్ హెన్రీ, రషీద్ ఖాన్, జంపా, షాహీన్ అఫ్రిది, ముజీబ్ రెహ్మాన్, షకీబ్ 2 నుంచి 10 ప్లేస్ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ టాప్‌లో కొనసాగుతుండగా.. నబీ, రషీద్ ఖాన్ టాప్-3లో ఉన్నారు. -
కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..?
న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దుమ్మురేపింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు).. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ సత్తా చాటింది. న్యూజిలాండ్ సిరీస్ (2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) అద్భుతంగా రాణించిన భారత స్టార్ పేసర్, హైదరాబాద్ కా షాన్ మహ్మద్ సిరాజ్ మియా తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించగా.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టారు. న్యూజిలాండ్ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 360 పరుగులు (209, 40 నాటౌట్, 112), అంతకుముందు శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేసిన (70, 21, 116) గిల్.. కివీస్‌తో సిరీస్‌లో అంతగా రాణించని రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని వెనక్కునెట్టి, ఏకంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, కివీస్‌తో ఆఖరి వన్డేలో శతకం బాదిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్ సారధి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, డికాక్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన సిరాజ్.. ఏకంగా టాప్ ప్లేస్ కైవసం
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు) టీమ్ ర్యాంకింగ్స్‌లో.. ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా, బౌలింగ్ విభాగంలో భారత స్టార్ పేసర్, హైదరాబాద్ కా షాన్ మహ్మద్ సిరాజ్ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. 🚨 There's a new World No.1 in town 🚨 India's pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men's ODI Bowler Rankings 🔥 More 👇 — ICC (@ICC) January 25, 2023 న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. టీమిండియా తరఫున బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్ ర్యాంక్ సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు, కివీస్‌తో సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. మొత్తం 729 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సిరాజ్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ (727) ఉన్నాడు. హేజిల్‌వుడ్‌కు సిరాజ్‌కు కేవలం 2 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. వీరిద్దరి తర్వాత ట్రెంట్ బౌల్ట్ (708), మిచెల్ స్టార్క్ (665), రషీద్ ఖాన్ (659) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. కివీస్‌తో రెండో వన్డేలో అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మరో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సైతం తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. షమీ.. 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. దాదాపు మూడేళ్ల తర్వాత గతేడాది (2022) ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. ఏడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా రాణించాడు. రీఎంట్రీ తర్వాత సిరాజ్ 21 వన్డేల్లో ఏకంగా 37 వికెట్లు నేలకూల్చాడు. ఈ ప్రదర్శన ఆధారంగా సిరాజ్‌కు 2022 ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో కూడా చోటు లభించింది. కొత్త బంతిలో ఇరు వైపుల స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగిన సిరాజ్.. గతకొంత కాలంగా అన్ని విభాగాల్లో రాటుదేలాడు. కెరీర్ ఆరంభంలో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, టాపార్డర్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టలేడు అనే అపవాదు సిరాజ్‌పై ఉండేది. అయితే గత ఏడాది కాలంలో సిరాజ్ తన లోపాలను సరిచేసుకుని పేసు గుర్రం బుమ్రాను సైతం మరిపించేలా రాటుదేలాడు. ప్రస్తుతం సిరాజ్ కొత్త బంతిని అద్భుతంగా ఇరువైపులా స్వింగ్ చేయడంతో పాటు, ఆరంభ ఓవర్లు, మిడిల్ ఓవర్లలో అన్న తేడా లేకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. గత 10 వన్డేల్లో సిరాజ్ ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక్క వికెట్ తీశాడు. అలాగే పవర్ ప్లేల్లో మెయిడిన్ ఓవర్లు సంధించడంలోనూ సిరాజ్ రికార్డులు నెలాకొల్పాడు. -
IND VS NZ 3rd ODI: నంబర్ వన్ జట్టుగా అవతరించిన టీమిండియా
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలుపు అనంతరం.. స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో కివీస్‌ను ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకుండా ఊడ్చేసిన రోహిత్ సేన మరో అరుదైన గౌరవం కూడా దక్కించుకుంది. టీమిండియా.. తాజా ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడో స్థానంలో ఉండిన టీమిండియా.. టాప్ ప్లేస్‌లో ఉండిన ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠానికి చేరుకుంది. The new No.1 team in the @MRFWorldwide ICC Men's ODI Team Rankings 🤩 More 👉 https://t.co/sye7IF4Y6f pic.twitter.com/hZq89ZPO31 — ICC (@ICC) January 24, 2023 3 వన్డేల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో, తాజాగా ముగిసిన ఆఖరి మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్‌కు చేరుకునేందుకు మరో 4 మ్యాచ్‌ల దూరంలో (4 టెస్ట్‌లు) ఉంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ✅ A dominant win in a series decider✅ A record win at home✅ Strong comeback after multiple setbacksIndia's journey to the top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings had a bit of everything 👀https://t.co/f9qr0P1xIb— ICC (@ICC) January 24, 2023 అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఓపెనర్ డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది (41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్). హెన్రీ నికోల్స్ (42), మిచెల్ సాంట్నర్ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
'కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'
ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్- నవంబర్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి ముందు టీమిండియా వరుసగా వన్డే సిరీస్‌లు ఆడుతూ విజయాలు దక్కించుకుంటూ వస్తుంది. ఇప్పటికే లంకతో వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలోనూ కివీస్‌ను టీమిండియా ఓడించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలచే సువర్ణావకాశం లభించనుంది. ఈ విషయం ఇప్పటికే ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. ''మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడిస్తే వన్డేల్లో నెంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకోనుంది'' అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, టీమిండియాలు 113 రేటింగ్ పాయింట్లతో ఉన్నప్పటికి మ్యాచ్‌లు, పాయింట్ల ఆధారంగా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ టీమిండియా న్యూజిలాండ్‌ను మూడో వన్డేల్లో ఓడిస్తే రెండు రేటింగ్ పాయింట్లతో మొత్తంగా 115 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు ఇది మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. ఒకవేళ టీమిండియా కివీస్‌తో మూడో వన్డేలో ఓడినా రెండో స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది. మరి మంగళవారం ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో టీమిండియా గెలిచి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ICC confirms if India beat New Zealand in the 3rd ODI, India will be number 1 in ranking. — Johns. (@CricCrazyJohns) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా!