ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన భారత వన్డే జట్టు అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో
దుబాయ్: ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన భారత వన్డే జట్టు అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం 116 పాయింట్లతో ఉన్న ధోని సేన టాప్‌లో ఉన్న ఆసీస్ కన్నా ఆరు పాయింట్లు వెనుకబడి ఉంది. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (112) ఆ తర్వాత శ్రీలంక (108), కివీస్ (107), ఇంగ్లండ్ (101), పాకిస్తాన్ (95) ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విభాగంలో కోహ్లి నాలుగో స్థానంలోనే ఉండగా ధావన్ 6, కెప్టెన్ ధోని 8వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి ఎవరూ టాప్-10లో లేరు.