న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దుమ్మురేపింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు).. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ సత్తా చాటింది.
న్యూజిలాండ్ సిరీస్ (2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) అద్భుతంగా రాణించిన భారత స్టార్ పేసర్, హైదరాబాద్ కా షాన్ మహ్మద్ సిరాజ్ మియా తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించగా.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టారు.
న్యూజిలాండ్ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 360 పరుగులు (209, 40 నాటౌట్, 112), అంతకుముందు శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేసిన (70, 21, 116) గిల్.. కివీస్‌తో సిరీస్‌లో అంతగా రాణించని రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని వెనక్కునెట్టి, ఏకంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, కివీస్‌తో ఆఖరి వన్డేలో శతకం బాదిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్ సారధి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, డికాక్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment