Second position
-
నీరజ్‌కు రెండో స్థానం
దోహా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త సీజన్లో శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లో ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ అయిన నీరజ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 10 మంది పోటీపడిన ఈ ఈవెంట్లో నీరజ్ చివరిదైన ఆరో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.36 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని పొందాడు. జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 88.38 మీటర్లు) తొలి స్థానంలో నిలువగా... పీటర్సన్ (గ్రెనెడా; 86.62 మీటర్లు) మూడో స్థానాన్నికైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్ జేనా 76.31 మీటర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. -
జ్యోతి సురేఖకు రెండో స్థానం
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కొత్త సీజన్లో భాగంగా ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 711 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన అదితి 704 పాయింట్లతో 8వ స్థానంలో, పర్ణీత్ కౌర్ 703 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ స్కోర్లతో కలిపి భారత బృందం 2118 పాయింట్లతో టీమ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు విజయంతో ముగించింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలివీరా (4వ ని.లో), గేబ్రియల్ రోసెన్‌బర్గ్ (16వ ని.లో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. షిల్లాంగ్ జట్టుకు ఫ్రాంగీ బువామ్ (46వ, 87వ ని.లో) రెండు గోల్స్ అందించాడు. 13 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు నిరీ్ణత 24 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 14 మ్యాచ్‌ల్లో నెగ్గిన శ్రీనిధి జట్టు ఆరు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 48 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్లోనూ శ్రీనిధి జట్టు రెండో స్థానంలోనే నిలిచింది. 52 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్‌గా నిలిచిన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ ఇండియన్ సూపర్ లీగ్‌కు అర్హత సాధించింది. -
బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్..ముకేశ్ అంబానీ టాప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్‌లో వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 వివరాలు విడుదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ టిమ్ కుక్, టెస్లా ఎలాన్ మస్‌్కను ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టేశారు. టెన్సెంట్ హూతెంగ్మా తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇదే సూచీలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గతేడాది ఉన్న 8వ స్థానం నుంచి ఈ ఏడాది 5వ స్థానంలోకి వచ్చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా 6వ స్థానం, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 16వ స్థానంలో నిలిచారు. 2023 ర్యాంకుల్లోనూ ముకేశ్ అంబానీ అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉండడం గమనార్హం. డైవర్సిఫైడ్ దిగ్గజ కంపెనీల పరంగా చూస్తే అంతర్జాతీయంగా 2024 సంవత్సరానికి ముకేశ్ అంబానీ మొదటి స్థానంలోఉన్నారు. -
ఫ్లయిట్ అటెండెంట్‌కు ప్రెసిడెంట్ హోదా
టోక్యో: జపాన్‌కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘జపాన్ ఎయిర్ లైన్స్’అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో రెండో అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్‌గా మాజీ మహిళా ఫ్లయిట్ అటెండెంట్‌ను నియమించింది. ఈమె ఏప్రిల్ ఒకటిన ప్రస్తుత ప్రెసిడెంట్ యూజి అకసావ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత చైర్మన్ యోషిహరు స్థానంలో అకసావ చేరుతారు. 1985లో ఫ్లయిట్ అటెండెంట్‌గా సంస్థలో కెరీర్‌ను ప్రారంభించిన మిట్సుకో టొట్టొరీ 2015లో క్యాబిన్ క్రూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తనకు లభించిన ఉద్యోగోన్నతి ఇతర మహిళలు తమ కెరీర్లో పైకెదిగేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మిట్సుకో చెప్పారు. టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో ఇటీవల జపాన్ ఎయిర్ లైన్స్ విమానం చిన్నపాటి కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొన్న ఘటన నేపథ్యంలో మిట్సుకోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాణికుల భద్రత, సేవల విభాగంలోనే తన కెరీర్లో అత్యధిక భాగం గడిపానని చెప్పారు. ఇకపై కూడా భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్–100 విమానయాన సంస్థల్లో ఉన్నత స్థాయి హోదాల్లో కేవలం 12 మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నట్లు ఫ్లయిట్ గ్లోబల్ వెబ్సైట్ 2022లో చేపట్టిన సర్వేలో తేలింది. -
నీరజ్ చోప్రాకు రెండో స్థానం
యుజీన్ (అమెరికా): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాద్లెచ్ జావెలిన్‌ను 84.24 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా అవతరించాడు. గత నెలలో ప్రపంచ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం పంపించాడు. మూడో ప్రయత్నంలో 81.37 మీటర్లు దూరం విసిరిన నీరజ్ నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో 80.74 మీటర్లు, చివరిదైన ఆరో ప్రయత్నంలో 80.90 మీటర్లు విసిరాడు. రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు 12,000 డాలర్లు (రూ. 9 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
నంబర్ వన్ గానే అశ్విన్
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానంలో, జడేజా ఆరో ర్యాంక్‌లో ఉన్నారు. బ్యాట్స్‌మెన్ టాప్-10లో భారత్ నుంచి రహానే (పదో ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో ఆగస్టు 2011 తర్వాత తొలిసారి భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
రెండో స్థానంలోనే భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన భారత వన్డే జట్టు అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం 116 పాయింట్లతో ఉన్న ధోని సేన టాప్‌లో ఉన్న ఆసీస్ కన్నా ఆరు పాయింట్లు వెనుకబడి ఉంది. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (112) ఆ తర్వాత శ్రీలంక (108), కివీస్ (107), ఇంగ్లండ్ (101), పాకిస్తాన్ (95) ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విభాగంలో కోహ్లి నాలుగో స్థానంలోనే ఉండగా ధావన్ 6, కెప్టెన్ ధోని 8వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి ఎవరూ టాప్-10లో లేరు. -
జనారణ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రపంచ నగరాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలో మన హస్తినాపురానికి రెండోస్థానం దక్కింది. పట్టణ జనాభాపై ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదికలో జపాన్‌లోని టోక్యో నగరం మొదటిస్థానంలో నిలువగా ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానాన్ని చైనాలోని షాంఘై ఆక్రమించింది. ఢిల్లీ జనాభా ప్రస్తుతం 2 కోట్ల 50 లక్షలని ఐ.రా.స నివేదిక పేర్కొంది. కేవలం పదిహేనేళ్లలో.. అంటే 1990 నుంచి ఢిల్లీలో జనాభా రెండింతలు పెరిగిందని, 2030 నాటికి కూడా ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత గలిగిన రెండో నగరంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి ఢిల్లీ జనాభా 3 కోట్ల60 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం టోక్యో జనాభా 3.80 కోట్లు. దీంతో ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా టోక్యో గుర్తింపు పొందింది. గతం తో పోలిస్తే టోక్యో జనాభా తగ్గడం మొదలైందని, 2030 నాటికి కూడా టోక్యోనే జనసాంద్రతలో నం బర్వన్ నగరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. టోక్యో జనాభా 2030 నాటికి పదిలక్షల వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. ఐ.రా.స నివేదిక ప్రకారం.. జనసాంద్రత పరంగా ప్రస్తుతం ముంబై ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.2030 నాటికి ముంబై నాలుగో స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం 2.1 కోట్లున్న ముంబై జనాభా 2030 నాటికి 2.8 కోట్లకు చేరుతుంది. జనసాం ద్రతలో మెక్సికన్ సిటీ నాలుగో స్థానంలో, సావ్ పావ్లో ఐదో స్థానంలో ఉన్నాయి. 2050 వరకు భారత్, చైనా, నైజీరియాలలో పట్టణ జనాభా మరింత పెరిగే అవకాశముందని ఐ.రా.స నివేదిక స్పష్టం చేసింది. జనాభా స్థిరీకరణ కోసం వాకథాన్ జెండా ఊపి ప్రారంభించిన ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఢిల్లీలో వాకథాన్ నిర్వహించారు. జనాభా స్థిరీకరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ వాకథాన్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దేశాన్ని సమస్యల నుంచి విముక్తి చేయాలంటే జనాభా స్థిరీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రతి భారతీయుడు తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రజలకు వివరించాల్సి బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. వ్యాక్సిన్లపై గర్భిణులకు అవగాహన కలిగించాలన్నారు. కుటుంబంలోకి ఆడపిల్లలను ఆహ్వానిస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లకు శక్తినిచ్చి, తద్వారా కుటుంబాన్ని.. దేశాన్ని బలంగా మార్చాలన్నారు. -
పేదవిద్యార్ధి ప్రతిభ