యుజీన్ (అమెరికా): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాద్లెచ్ జావెలిన్‌ను 84.24 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా అవతరించాడు.
గత నెలలో ప్రపంచ చాంపియన్íÙప్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం పంపించాడు. మూడో ప్రయత్నంలో 81.37 మీటర్లు దూరం విసిరిన నీరజ్ నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో 80.74 మీటర్లు, చివరిదైన ఆరో ప్రయత్నంలో 80.90 మీటర్లు విసిరాడు. రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు 12,000 డాలర్లు (రూ. 9 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment