ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి దోహా వేదికగా జరిగిన తొలి సిరీస్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మెరిశాడు. ఎనిమిది మంది మేటి
జావెలిన్ త్రోయర్లు పోటీపడిన ఈ మీట్‌లో నీరజ్ చోప్రా బల్లెంను 88.67 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు కూడా అర్హత సాధించాడు. జావెలిన్ ఈవెంట్‌లో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 85.50 మీటర్లు. నీరజ్ ఈ దూరాన్ని తొలి ప్రయత్నంలోనే నమోదు చేశాడు.
ఆ తర్వాత నీరజ్ 86.04 మీటర్లు, 85.47 మీటర్లు, 84.47 మీటర్లు, 86.52 మీటర్లు నమోదు చేశాడు. ఐదో ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ చేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా; 85.88 మీటర్లు) రెండో స్థానంలో... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 88.63 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు. ఇదే మీట్‌లో పురుషుల ట్రిపుల్ జంప్‌లో పోటీపడిన భారత అథ్లెట్ ఎల్డోజ్ పాల్ 15.84 మీటర్ల దూరం దూకి పదో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్‌లో మొత్తం 14 సిరీస్‌లు జరుగుతాయి. అనంతరం సెప్టెంబర్‌లో గ్రాండ్ ఫైనల్‌ను నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment