పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్‌ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను.
నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు.
మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్‌లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్‌లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది.
అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్‌జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు.
-నీరజ్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment