
నంబర్ వన్ గానే అశ్విన్
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానంలో, జడేజా ఆరో ర్యాంక్‌లో ఉన్నారు. బ్యాట్స్‌మెన్ టాప్-10లో భారత్ నుంచి రహానే (పదో ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో ఆగస్టు 2011 తర్వాత తొలిసారి భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.