
అశ్విన్ నంబర్ వన్‌లోనే...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అశ్విన్ జోరు కొనసాగుతోంది. జట్టు ర్యాంకుల్లో భారత్‌దే టాప్ ర్యాంకు కాగా... బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకుల్లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 115 రేటింగ్ పారుుంట్లతో భారత్ టాప్ ర్యాంకులో ఉండగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (111), ఆస్ట్రేలియా (108) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారుు.
ఇటీవల టెస్టు కెరీర్‌లో 200 వికెట్లు పడగొట్టిన అశ్విన్ 900 రేటింగ్ పారుుంట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. స్టెరుున్ (దక్షిణాఫ్రికా, 878) రెండు, అండర్సన్ (ఇంగ్లండ్, 853) మూడో స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా (805) ఏడో ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లోనూ అశ్విన్‌దే టాప్ ర్యాంకు. జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు.