![VEKA plans to invest Rs 100 crore in next six years](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/VEKA.jpg.webp?itok=VmbVxUnp)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తలుపులు, కిటికీలకి సంబంధించిన యూపీవీసీ ప్రొఫైల్స్ తయారీ సంస్థ వేకా వచ్చే ఆరేళ్లలో కార్యకలాపాల విస్తరణపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ. 16 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్‌సీఎల్–వేకాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసి కంపెనీని టేకోవర్ చేసిన సందర్భంగా వేకా ఏజీ జర్మనీ సీఈవో ఆండ్రియాస్ హార్ట్‌లీఫ్ ఈ విషయాలు తెలిపారు.
జేవీలో వేకాకు గతంలో 50 శాతం వాటాలు ఉండగా, తాజాగా ఎన్‌సీఎల్ నుంచి మరో 50 శాతాన్ని కొనుగోలు చేసింది. టేకోవర్‌తో ప్రస్తుతం ఎన్‌సీఎల్ వేకా చైర్మన్‌గా ఉన్న అశ్విన్ దాట్ల ఇకపై డైరెక్టరుగా కొనసాగనుండగా, ఎండీగా యూఎస్ మూర్తి కొనసాగుతారు. ప్రణాళికల్లో భాగంగా వేకా ప్రధానంగా ఎక్స్‌ట్రూషన్‌పైన, ఎన్‌సీఎల్.. ఫ్యాబ్రికేషన్‌పైనా దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్భంగా అశ్విన్ వివరించారు. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్‌లో 28 లైన్లతో ఒక ఎక్స్‌ట్రూషన్ ప్లాంటు, బెంగళూరులో ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఉన్నట్లు చెప్పారు. కంపెనీ గతేడాది రూ. 442 కోట్ల ఆదాయం ఆర్జించగా, 15 శాతం వార్షిక వృద్ధి అంచనా వేస్తున్నట్లు మూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment