విదేశీ కంపెనీలకు ఆహ్వానం | Finance Minister invited Austrian companies to invest in India | Sakshi

విదేశీ కంపెనీలకు ఆహ్వానం

Apr 12 2025 2:19 PM | Updated on Apr 12 2025 2:19 PM

Finance Minister invited Austrian companies to invest in India

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటూ ఆస్ట్రియన్‌ కంపెనీలకు తాజాగా ఆహ్వానం పలికారు. నూతన, వర్ధమాన రంగాలలో ఇందుకు పలు అవకాశాలున్నట్లు పేర్కొ న్నారు. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఇండియా– ఆస్ట్రియా బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సందర్భంగా భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవలసిందిగా సూచించారు.

ఆర్థిక పురోభివృద్ధి, సులభతర బిజినెస్‌ నిర్వహణకు  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశం వేగంగా ముందుకెళుతున్నట్లు తెలియజేశారు. వర్ధమాన రంగాలలో పలు అవకాశాలు పుడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్‌ హైడ్రోజెన్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్‌లను ప్రస్తావించారు. ఆసియా, దక్షిణ ప్రపంచానికి భారత్‌ అద్భుతమైన గేట్‌వేగా అభివర్ణించారు.

ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్‌?

ఇండియా–ఆస్ట్రియా ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందని, అత్యధిక అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. భారత్‌లో విస్తరించిన తయారీ, సామర్థ్యాలను ప్రస్తావిస్తూ ఆస్ట్రియన్‌ కంపెనీలు కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. తద్వారా దేశీయంగా లభించే అత్యున్నత ఐటీ, డిజిటల్‌ నైపుణ్యాలను వినియోగించుకోవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement