కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: 2047 నాటికి భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఇన్‌ఫ్రా, పెట్టుబడులు, నవకల్పనలు, సమ్మిళితత్వం ఉన్నట్లు పెన్సిల్వేనియా యూనివర్సిటీ విద్యార్థులకు వివరించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల కోసం అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆమె వర్సిటీని సందర్శించారు.
‘2047లో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికల్లా సంపన్న దేశంగా ఎదగాలన్నది భారత్ ఆకాంక్ష. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలపై దృష్టి పెడుతోంది‘ అని సీతారామన్ పేర్కొన్నారు. వంతెనలు, పోర్టులు, డిజిటల్ తదితర మౌలిక సదుపాయాల కల్పన కీలకమని, అలాగే వాటిపై పెట్టుబడులు పెట్టడం కూడా ముఖ్యమని ఆమె తెలిపారు. భారత్‌కే పరిమితమైన సమస్యల పరిష్కారానికి వినూత్న ఆవిష్కరణలు అవసరమన్నారు. ఇక ప్రతి విషయంలోనూ అందరూ భాగస్వాములయ్యేలా సమ్మిళితత్వాన్ని సాధించడం కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment