infra
-
ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజాగా రూ.10,000 కోట్లు సమీకరించింది. ఏడోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకుంది. 15 ఏళ్ల కాలపరిమితిగల వీటికి కూపన్ రేటు 7.23 శాతంకాగా.. రూ.11,500 కోట్లకుపైగా విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. నిజానికి బ్యాంక్ రూ.5,000 కోట్ల విలువైన బాండ్ల జారీకి తెరతీసింది. అధిక బిడ్డింగ్ నమోదైతే మరో రూ.5,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు గ్రీన్‌షూ ఆప్షన్(ఓవర్ అలాట్మెంట్)ను ఎంచుకుంది. వెరసి బాండ్ ఇష్యూకి రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది.ఇదీ చదవండి: లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లుబిడ్ చేసిన సంస్థలలో ప్రావిడెంట్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా తాజా నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఎస్బీఐ జారీ చేసిన బాండ్లకు స్థిరత్వ ఔట్లుక్సహా ఏఏఏ రేటింగ్‌ను పొందింది. వీటి జారీతో దీర్ఘకాలిక బాండ్లపై ఇతర బ్యాంకులు సైతం దృష్టి సారించేందుకు వీలు చిక్కినట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. -
ఇన్ఫ్రా, పెట్టుబడులపై ఫోకస్
వాషింగ్టన్: 2047 నాటికి భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఇన్ఫ్రా, పెట్టుబడులు, నవకల్పనలు, సమ్మిళితత్వం ఉన్నట్లు పెన్సిల్వేనియా యూనివర్సిటీ విద్యార్థులకు వివరించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల కోసం అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆమె వర్సిటీని సందర్శించారు. ‘2047లో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికల్లా సంపన్న దేశంగా ఎదగాలన్నది భారత్ ఆకాంక్ష. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలపై దృష్టి పెడుతోంది‘ అని సీతారామన్ పేర్కొన్నారు. వంతెనలు, పోర్టులు, డిజిటల్ తదితర మౌలిక సదుపాయాల కల్పన కీలకమని, అలాగే వాటిపై పెట్టుబడులు పెట్టడం కూడా ముఖ్యమని ఆమె తెలిపారు. భారత్‌కే పరిమితమైన సమస్యల పరిష్కారానికి వినూత్న ఆవిష్కరణలు అవసరమన్నారు. ఇక ప్రతి విషయంలోనూ అందరూ భాగస్వాములయ్యేలా సమ్మిళితత్వాన్ని సాధించడం కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. -
ఐపీఓ ద్వారా రూ. 5,430 కోట్ల సమీకరణ
ముంబై: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి రూ. 440–463 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 4,180 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ గోస్వామి ఇన్ఫ్రాటెక్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 32 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 600 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 320 కోట్లు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు, మరో రూ. 80 కోట్లు కన్స్ట్రక్షన్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.కంపెనీ ప్రధానంగా ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇవి.. మెరైన్ అండ్ ఇండస్ట్రియల్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైడ్రో, అండర్‌గ్రౌండ్, ఆయిల్ అండ్ గ్యాస్. 2024 జూన్ 30కల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 31,747 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 3,154 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 92 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
Reliance AGM 2024: రిలయన్స్ బొనాంజా
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించారు. సమీప భవిష్యత్‌లో టాప్–30 గ్లోబల్ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఆర్ఐఎల్ గతేడాది ఆర్అండ్డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లను జారీ చేసింది. రిటైల్ జోరు..: గతేడాది రిలయన్స్ రిటైల్ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్‌ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్–5 గ్లోబల్ రిటైలర్‌గా నిలుస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్‌బాస్కెట్‌ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్ ల్యాడర్లలో పెట్టుబడులు ఫ్యాషన్ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి. జియో.. బంపర్ ఆఫర్: 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీరానున్న దీపావళి కానుకగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్, జియో, డిజిటల్ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్ల అందుబాటులోఉన్న క్లౌడ్ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్ అసిస్టెంట్ సేవలను ప్రారంభించింది. రిలయన్స్ డిస్నీ.. వినోదంలో కొత్త శకం డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియో, రిటైల్ తరహాలో మీడియా బిజినెస్ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్ స్ట్రీమింగ్‌తో కంటెంట్ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్ఐఎల్ తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్, పాలీసిలికాన్, గ్లాస్ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్ సౌరశక్తిని విద్యుత్‌గా మార్చనుంది. -
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్, క్రియేటీవ్ హెడ్ అనంత్ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్ వేదికపై అనంత్ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్ఫ్రా, బ్యాడ్ వెదర్, బ్యాడ్ వాటర్. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు. -
ఆరునెలల గరిష్ఠానికి చేరిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల ఖర్చు
సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం సెప్టెంబర్‌లో ఆరునెలల గరిష్ఠాన్ని తాకినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం..సెప్టెంబర్‌లో ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లపై చేసే ఖర్చులు ఆరు నెలల గరిష్టానికి పెరిగాయి. సెంట్రల్ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం సెప్టెంబర్‌లో అసలు వ్యయం కంటే 21.92% ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఇది 19.08%గా ఉంది. దాంతో కేంద్రం అదనంగా రూ.4.5 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్ఫ్రా ప్రాజెక్టులకు చేసే వ్యయం మొత్తం రూ.24.8 లక్షల కోట్లుగా ఉండనుంది. అయితే అవి పూర్తయ్యే సమయం కూడా అంతకు ముందు అంచనా వేసిన 36.96 నెలల నుంచి 38.63 నెలలకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టుతో పోలిస్తే ఆలస్యమవుతున్న ప్రాజెక్టుల సంఖ్య సెప్టెంబర్‌లో 830 నుంచి 823కు తగ్గాయి. కానీ అందులో 58శాతం రెండేళ్లుగా ఆలస్యమవుతున్న వాటి జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో 46 ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు నివేదికలో తెలిపారు. -
ఐపీవోల జోరు
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్ స్పేస్ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో.. కోవర్కింగ్ కార్యాలయ సంస్థ కాంటార్ స్పేస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్ స్పేస్‌లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 55 శాతమే బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్పీజీ టెర్మినల్ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రెండు కంపెనీలు రెడీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లాజిస్టిక్స్ సంస్థ వెస్టర్న్ క్యారియర్స్(ఇండియా) లిమిటెడ్ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్‌కేర్ ఎస్ఎఫ్బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్‌సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్ క్యారియర్స్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్ రాజేంద్ర సేథియా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వాప్కోస్ వెనకడుగు కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్స్ట్రక్షన్ సర్వి సుల పీఎస్‌యూ.. వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
డిజిటల్ ఇన్ఫ్రా సంస్థలకు పర్మిట్లు కేంద్రానికి ట్రాయ్ సిఫార్సు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్ఫ్రా సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా పర్మిట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ కొత్త కేటగిరీ లైసెన్సును డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ (డీసీఐపీ) లైసెన్సుగా వ్యవహరించవచ్చని ట్రాయ్ పేర్కొంది. డీసీఐపీలో కంపెనీలపై లైసెన్స్ రుసుము ఎలాంటి విధించబడదు. (హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే! ) అయితే పర్మిట్ల కోసం రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు, రూ. 15,000 ప్రాసెసింగ్ ఫీజు విధించ వచ్చని తెలిపింది. అయితే డీసీఐపీ కోసం లైసెన్సు ఫీజు విధించవద్దని సూచించింది. దీన్ని స్టాండెలోన్ లైసెన్సుగా కాకుండా ఏకీకృత లైసెన్సు కిందే జారీ చేయొచ్చని ట్రాయ్ తెలిపింది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) -
భారత్‌లో అవకాశాలు అపారం
సిడ్నీ: భారత్‌లో డిజిటల్ ఇన్ఫ్రా, టెలికం, సెమీ కండక్టర్లలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లో అవకాశాల గురించి తెలియజేశారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రా, ఐటీ, ఫిన్‌టెక్, టెలికం, సెమీకండ్టర్, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్, విద్య, ఫార్మా, హెల్త్‌కేర్, వైద్య ఉపకరణాల తయారీ, మైనింగ్, టెక్స్టైల్, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, శుద్ధ ఇంధనాల విషయంలో భారత కంపెనీలతో సహకారం ఇతోధికం చేసుకోవాలని కోరారు. నిబంధనల అమలును సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళతరం చేసినట్టు వివరించారు. హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రైన్‌హార్ట్, ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్య్రూ ఫారెస్ట్, ఆస్ట్రేలియా సూపర్ సీఈవో పౌల్ ష్రోడర్ ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. 2000 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 1.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్‌కు ఆస్ట్రేలియా 13వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
రూ. 2,800 కోట్ల సమీకరణకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రణాళికలు
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్ఫ్రా ఫోకస్’ అవార్డు
సాక్షి, అమరావతి: తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాసిన లేఖలో ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. సెప్టెంబర్ 27న ఢిల్లీలోని హయత్ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్నాథ్ను టైమ్స్ గ్రూప్ ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. సముద్ర వాణిజ్యంపై దృష్టి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.25,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. దీనికి తోడు పోర్టులను అనుసంధానిస్తూ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ, అనంతపురం వద్ద రెండు భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ పేరుతో భారీ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించి రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. కాకినాడ వద్ద బల్క్ డ్రగ్ పార్కు, విశాఖ అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టు ఆథారిత అభివృద్ధి పనులను వివరిస్తూ ఎకనామిక్ టైమ్స్ జాతీయ స్థాయిలో కథనాన్ని ప్రచురించనున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా హార్బర్: మంత్రి అమర్నాథ్ 974 కి.మీ పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకం. సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రానికి, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. -
రండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి!
కోపెన్‌హెగెన్: భారత మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ డెన్మార్క్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్‌కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సెన్తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో ఇప్పటికే 200కు పైగా డెన్మార్క్ కంపెనీలు పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యాపార సులభతర నిర్వహణ చర్యలతో ప్రయోజనం పొందుతున్నట్టు వివరించారు. ‘‘డెన్మార్క్ కంపెనీలు, డెన్మార్క్ పెన్షన్ ఫండ్స్‌కు భారత మౌలికరంగంతోపాటు పర్యావరణ అనుకూల (గ్రీన్) పరిశ్రమల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి’’ అని ప్రకటించారు. అంతకుముందు ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తృతిపై చర్చలు నిర్వహించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తృతి చేసుకోవాలన్న అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. రెన్యువబుల్ ఎనర్జీ, టెర్మినళ్లు, పోర్టుల ఆధునికీకరణ, విస్తరణ, ఆహార శుద్ధి, ఇంజనీరింగ్ రంగాల్లో డెన్మార్క్ పెట్టుబడులకు ఇరువురు నేతలు పిలుపునిచ్చినట్టు ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి👉‘డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం మార్మోగాలి! -
2021–22లో సిమెంటుకు డిమాండ్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు తిరిగి పుంజుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమలో 18–20 శాతం డిమాండ్ వృద్ధికి ఆస్కారం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2018–19, 2019–20 స్థాయికి పరిశ్రమ చేరుతుందని తెలిపింది. ఇక్రా ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌కుతోడు అందుబాటు గృహాలు, మౌలిక రంగం తిరిగి గాడిన పడనుండడం ఈ పెరుగుదలకు కారణం. ఖర్చుల వైపు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆపరేటింగ్ మార్జిన్స్ 20–21 శాతం స్థాయిలో ఉండొచ్చు. 20–22 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కొత్తగా తోడు కానుంది. 2020–21లో ఇది 15–17 మిలియన్ టన్నులు. తూర్పు ప్రాంతం నుంచే 15–17 మిలియన్ టన్నులు జతకూడే అవకాశం ఉంది. ప్లాంట్ల వినియోగం గతేడాది ఉన్న 56 శాతం నుంచి 2021–22లో 64 శాతానికి చేరనుంది. పెట్ కోక్ ధరలు కొన్ని నెలల క్రితం పెరిగాయి. డీజిల్ ధరలూ అధికమవుతున్నాయి. సకాలంలో రబీ నాట్లు పడడం, నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఉత్పదకత మెరుగై.. సెంటిమెంటు సానుకూలం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంటుకు డిమాండ్ ఉంటుందని ఇక్రా ఏవీపీ అనుపమ రెడ్డి తెలిపారు. రియల్టీ, పీఎంఏవై–అర్బన్, ఇన్ఫ్రా రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజ్ సిమెంట్ డిమాండ్‌ను నడిపిస్తుందని వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో 39 వేల గృహాల ఇన్వెంటరీ -
‘అమరరాజా’కు షాక్; 253.61 ఎకరాలు వెనక్కి
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్ఫ్రా టెక్కు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటుకు కేటాయించిన భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరరాజ్ ఇన్ఫ్రా టెక్కు చిత్తూరు జిల్లాలో యాదమరి మండలం మజరా కొత్తపల్లి, బంగారుపాళెం మండలం నేనుగుండ్లపల్లి గ్రామాల పరిధిలో సెజ్ ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని సర్కార్ కేటాయించింది. ఆ సంస్థకు భూకేటాయింపు సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో రెండేళ్లలోగా ఆ భూమిని ఉపయోగించుకోవాలి. కానీ.. సెజ్ ఏర్పాటై పదేళ్లయినా 229.66 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది. ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్ఫ్రా టెక్ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించింది. (రామాయపట్నంపై జపాన్ సంస్థల ఆసక్తి) -
విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!
ముంబై: ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో జరీన్ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎవ్వరిదీ పైసా ఉంచుకోను...క్షమించండి!
ముంబై: ఎస్సెల్ గ్రూప్ తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఎట్టకేలకు పెదవి విప్పారు. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. దీన్నుంచి బైటపడే క్రమంలో కీలకమైన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్)లో వాటాలను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని శక్తులు పడనివ్వడం లేదని ఆరోపించారు. ఇన్ఫ్రా పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్నా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని, వీడియోకాన్‌కి చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు కూడా కలిసి రాలేదని పేర్కొన్నారు. శుక్రవారం రుణదాతలకు రాసిన బహిరంగ లేఖలో సుభాష్ చంద్ర ఈ విషయాలు వెల్లడించారు. తొందరపడితే మీకే నష్టం.. రుణదాతలకు క్షమాపణ చెప్పిన సుభాష్ చంద్ర .. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయ్యే దాకా ఓపిక పట్టాలని కోరారు. అలా కాకుండా తొందరపాటుతనంతో వ్యవహరిస్తే.. రెండు వర్గాలూ నష్టపోక తప్పదని వ్యాఖ్యానించారు. అయితే, మొత్తం అప్పు ఎంత ఉన్నది, ఎగవేతలేమైనా జరిగాయా లాంటి అంశాలు ఆయన ప్రస్తావించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం అనంతరం రుణాల రోలోవర్ కష్టంగా మారిందని, అయితే డిసెంబర్ దాకా చెల్లింపులన్నీ సక్రమంగానే జరపగలిగామని పేర్కొన్నారు. ‘నా ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ ఆశించినట్లుగా పనిచేయలేకపోయాయని నేను భావిస్తున్నాను. ఇందుకుగాను క్షమాపణలు చెబుతున్నాను. ఎవ్వరిదీ ఒక్క పైసా రుణం కూడా ఉంచుకోబోను. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయితే అన్ని రుణాలను తీర్చేయగలుగుతాము. అప్పటిదాకా ఓర్పు వహించండి. కానీ ఆందోళనతో, అరాచకంగా స్పందిస్తే దాని వల్ల మీరూ, మేమూ నష్టపోవాల్సి వస్తుంది‘ అని చంద్ర పేర్కొన్నారు. తప్పులు జరిగాయి.. గతేడాది జూన్ నుంచి సమస్యలు వెన్నాడుతున్నాయని, రుణదాతలు.. షేర్హోల్డర్లకు గుర్తుతెలియని శక్తులు లేఖలు రాస్తూ గందరగోళపరుస్తున్నాయని సుభాష్ చంద్ర చెప్పారు. తన వంతుగా కొన్ని తప్పులు కూడా జరిగాయని ఆయన తెలిపారు. ఎస్సెల్ ఇన్ఫ్రా కారణగా రూ. 4,000–5,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అలాగే 2016 నవంబర్‌లో వీడియోకాన్ డీ2హెచ్ వ్యాపారం కొనుగోలుతో బోలెడంత నష్టపోయామని చెప్పారు. ఇక కుటుంబ వ్యాపార విభజన సమయంలో గ్రూప్ కంపెనీల రుణభారమంతా తమపైనే వేసుకోవడం మరో పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. షేర్లు ఢమాల్... డీమోనిటైజేషన్ తర్వాత భారీ డిపాజిట్లు చేయడంపై ఎస్ఎఫ్ఐవో విచారణ ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో ఎస్సెల్ గ్రూప్ సంస్థల పేర్లున్నాయని వార్తలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. డిష్ టీవీ 33%, జీలెర్న్ 19%, ఎస్సెల్ ప్యాక్ 12% క్షీణించాయి. జీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 14,000 కోట్లు పడిపోయింది. జీ ఎంటర్టైన్మెంట్ 26% క్షీణించి రూ. 319కి పడిపోయింది. -
నవయుగపై వారంలో నివేదిక!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా, ఇంజనీరింగ్, ఐటీతో సహా వివిధ రంగాల్లో విస్తరించిన నవయుగ గ్రూపు కంపెనీల కార్యకలాపాలపై ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్) అధికారులు వారంలోగా నివేదిక రూపొందించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం పోర్టును కూడా ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ... హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒకే చిరునామాపై ఏకంగా 47 కంపెనీల్ని రిజిస్టరు చేసింది. నిజానికి ఒక కంపెనీ రికార్డులు నిర్వహించడానికే బోలెడంత స్థలం కావాలి. అందుకే ఒకే అడ్రస్‌పై 25 కంపెనీలకన్నా ఎక్కువ నమోదై ఉంటే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా కంపెనీల ఆడిట్ రిపోర్ట్లు, ఐటీ రిటర్న్స్, ఇతరత్రా రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్నామని, మరో వారం రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శికి అందజేస్తామని ఆర్ఓసీ వర్గాలు తెలియజేశాయి. ‘‘సోదాలు జరిపిన ఏ కంపెనీ అయినా కార్యకలాపాల నిర్వహణలో అవక తవకలకు పాల్పడినట్లు రుజువైతే బ్యాంక్ ఖాతాలను సీజ్ చేస్తాం. ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకుంటాం. కంపెనీ అధికారులకు జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది’’ అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని ఆర్ఓసీ అధికారి ఒకరు తెలియజేశారు. ఇటీవల ఆర్ఓసీ తన తనిఖీల్లో భాగంగా నవయుగతో పాటు ఒకే చిరునామాపై 114 కంపెనీలు రిజిస్టరు చేసిన ఎస్ఆర్ఎస్ఆర్ అడ్వైజరీ, 30 కంపెనీలున్న కేబీసీ అసోసియేట్స్‌లో కూడా సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. మరికొన్నాళ్లు సోదాలు! ఒకే చిరునామాతో 25కి పైగా కంపెనీలను రిజిస్టర్ చేసి.. కార్యకలాపాలను సరిగా నిర్వహించని సంస్థల్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆర్వోసీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీనిలో భాగంగానే కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని పలు కంపెనీల కార్యాలయాల్లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అధికారుల (ఐసీఎల్ఎస్) బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ‘‘హైదరాబాద్‌లో ఒకే అడ్రస్‌లో 25కు పైగా రిజిస్టరైన కంపెనీలు యాభైకి పైనే ఉన్నాయి. అందుకే తనిఖీలు మరికొన్నాళ్లు సాగుతాయి’’ అని ఓ అధికారి తెలియజేశారు. పంజాబ్ నుంచి ఆర్వోసీకి మెయిల్.. ఈ మధ్య ఆర్వోసీ అధికారులు ఎల్లారెడ్డిగూడలో కేసీఎస్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోదాలు జరిపారు. విశేషం ఏంటంటే అక్కడ షెల్ కంపెనీ ఉందని ఆర్వోసీకి పంజాబ్ నుంచి మెయిల్ వచ్చింది!! కేసీఎస్ సాఫ్ట్వేర్ ఆన్లైన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఒక్కొక్కరి నుంచి రూ.18,200 వసూలు చేస్తున్నట్లు పంజాబ్ నుంచి ఓ బాధితుడు ఆర్వోసీకి మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆర్ఓసీ రికార్డులను పరీక్షిస్తే అసలు కేసీఎస్ పేరిట ఎలాంటి కంపెనీ రిజిస్టరే కాలేదని తెలిసింది. వెంటనే సంబంధిత అడ్రస్‌కు వెళ్లి పర్యవేక్షిస్తే.. అక్కడ కంపెనీయే లేదు. ఆన్‌లైన్‌లోనూ కంపెనీ వెబ్సైట్ షట్‌డౌన్ అయింది. కొంతమంది బాధితులు పేటీఎం నుంచి కూడా నగదును కేసీఎస్కు పంపించినట్లు గుర్తించామని సదరు అధికారి చెప్పారు. కేజీబీ అసోసియేట్ 5 కోట్ల పన్ను.. అశోక్‌నగర్‌లో కేబీజీ అసోసియేట్ అడ్రస్‌లో 30 వరకు కంపెనీలున్నట్లు ఐసీఎల్ఎస్ తనిఖీలో తేలింది. కేజీబీ అసోసియేట్ సెక్రటరీ స్వయంగా తన చిరునామాతోనే ఇతర కంపెనీల కార్యకలాపాలు, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇదే అడ్రస్‌పై 60 కంపెనీలుండేవని.. తొలి దశ తనిఖీల్లో సగం వరకు కంపెనీలను తొలగించగా, ఇపుడు 30 కంపెనీలున్నాయి. తనిఖీల గురించి మీడియాలో వస్తున్న కథనాలను గమనించిన సెక్రటరీ వెంటనే పలు కంపెనీలకు అడ్రస్‌లు మార్పు చేస్తూ మెయిల్స్ పంపించారని, రూ.5 కోట్ల పన్ను బకాయి ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. -
4.5 లక్షల కోట్ల డాలర్లు కావాలి
ముంబై: రాబోయే దశాబ్ద కాలంలో దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన రంగానికి రూ. 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం నిధుల సమీకరణ పెద్ద సమస్య కాబోదని .. కానీ వడ్డీ వ్యయాలే పెద్ద సవాలుగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) వార్షిక సదస్సు తొలి రోజు కార్యక్రమంలో గోయల్ ఈ విషయాలు తెలిపారు. భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను నిర్మించగలిగే సామర్థ్యాలను సాధించేందుకు, అలాగే అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఏఐఐబీ వంటి బహుళపక్ష ఏజెన్సీలు తోడ్పాటు అందించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో జపాన్ ఏజెన్సీ జికాతో పాటు పలు భారీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ నిధులు సమకూర్చిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాధారణంగా అణు విద్యుత్ ప్లాంట్లు, రిఫైనరీలు వంటి భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేటప్పుడు రాజకీయ పక్షాల వ్యతిరేకత రూపంలో సమస్యలు వస్తుండటం వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే, గత కొన్నేళ్లుగా మెరుగైన పాలన, నిర్ణయాత్మక విధానాలతో ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పూర్తిగా సురక్షితమని, ఇప్పటిదాకా కేంద్రంతో పాటు ఏ రాష్ట్రమూ విదేశీ రుణాలను ఎగవేసిన సందర్భం ఒక్కటీ లేదన్నారు. ఇన్ఫ్రాకు నిధులు సులువు కాదు.. ఇన్ఫ్రా రంగానికి నిధుల సమీకరణ అంత సులువు కాదని సింగపూర్ ఆర్థిక సంస్థ డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా ఇన్ఫ్రాకు రుణాలిచ్చే బ్యాంకులకు పరిమితమైన వనరులే ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు బాండ్ మార్కెట్లలోనే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కానీ ప్రాజెక్టుల ప్రారంభ దశలో పెట్టుబడులకు బాండ్ మార్కెట్లు దూరంగా ఉంటాయి కాబట్టి ఆ కోణంలోనూ నిధుల సమీకరణకు సవాళ్లు ఉండగలవని గుప్తా వివరించారు. -
34 సంస్థల్లో వాటాలు అమ్మాలి!
న్యూఢిల్లీ: ఖాయిలాపడిన ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటిదాకా 34 సంస్థలపై సిఫార్సులు చేసినట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఖాయిలా పడిన సంస్థల లాభదాయకత అంశాన్ని పరిశీలించాలంటూ ప్రధాని కార్యాలయం (పీఎంవో) చేసిన సూచనల మేరకు నీతి ఆయోగ్ ఈ సిఫార్సులు చేసింది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా రూ. 46,500 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ.15,000 కోట్లు, పీఎస్‌యూ బీమా కంపెనీల లిస్టింగ్ ద్వారా రూ.11,000 కోట్లు సమీకరించనుంది. బీమా నిధులు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లోకి మళ్లించాలి.. మౌలిక రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడులు మరింతగా రావాలని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అటు బీమా, పెన్షన్ ఫండ్స్ నిధులను కూడా ఇన్ఫ్రా ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ కోసం మళ్లించవచ్చని ఆయన సూచించారు. దీంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమును పూర్తి స్థాయిలో పునఃపరిశీలించాలని కాంత్ పేర్కొన్నారు. తగినన్ని పెట్టుబడులు లేక దేశీ ఇన్ఫ్రా రంగం సుదీర్ఘకాలం సమస్యల్లో కొట్టుమిట్టాడిందని ఆయన చెప్పారు. ‘పెన్షన్, బీమా నిధులను ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించేందుకు అనువైన పరిస్థితులుండాలి. వీజీఎఫ్ స్కీమ్‌ను కూడా పూర్తిస్థాయిలో పునఃసమీక్షించాలి‘ అని కాంత్ తెలిపారు. భారత్ 9–10 శాతం స్థాయిలో వృద్ధి సాధించాలంటే మౌలిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో మెరుగైన ఇన్ఫ్రా ఊతంతోనే వృద్ధి చెందాయని చెప్పారు. మౌలిక రంగానికి రూ. 50 లక్షల కోట్లు కావాలి.. వచ్చే అయిదేళ్లలో 2022 నాటికి దేశీయంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రూ. 50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. మొత్తం ఇన్ఫ్రా పెట్టుబడుల్లో దాదాపు 78 శాతం.. విద్యుత్, రవాణా, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మొదలైనవే ఉండగలవని వివరించింది. 2016, 2017 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా వ్యయాలు చేయడం వల్లే.. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా తగ్గినా.. రాష్ట్రాల ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ప్రభావం పాక్షికంగానే పడిందని క్రిసిల్ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని పేర్కొంది. 2013–17 మధ్య కాలంలో భారత్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడులు రూ. 37 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 5.6 శాతానికి) పెరిగాయని.. అంతకుముందు అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేసిన రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది 56 శాతం అధికమని క్రిసిల్ వివరించింది. -
నదుల అనుసంధానంలో మూడు ప్రాజెక్టులు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నదుల అనుసంధానానికి సంబంధించి స్వల్పకాలంలోనే మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు ఇన్ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) వెల్లడించింది. 2014లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని నర్మదా – క్షిపర – సింహస్థ (ఎన్‌కేఎస్) ప్రాజెక్టును పూర్తి చేశామని, తర్వాత పట్టిసీమ ప్రాజెక్టును, తాజాగా గోదావరి–ఏలేరు నదుల అనుసంధానంతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును పూర్తి చేశామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సుమారు రూ. 1,638 కోట్ల విలువైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది జనవరి 5న శంకుస్థాపన జరగ్గా.. ఆరు నెలల్లోనే అడ్డంకులను అధిగమించి ప్రధానమైన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ విధంగా మూడేళ్ల వ్యవధిలోనే మూడు ప్రాజెక్టులు విజయవంతంగా అందుబాటులోకి తెచ్చామని ఎంఈఐఎల్ వివరించింది. ఆగస్టు 15న పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ఎంఈఐఎల్ చైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్య, సీజీఎం రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
రియల్టీ, ఇన్ఫ్రాకు ఊతం..!
♦ రీట్స్, ఇన్విట్స్ నిబంధనల్లో సెబీ మార్పులు ♦ నిధుల వినియోగం, స్పాన్సర్ల సంఖ్య సడలింపు ♦ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇక 20% పెట్టుబడులు ♦ పోర్ట్‌ఫోలియో మేనేజర్లుగా విదేశీ ఫండ్ మేనేజర్లు... ♦ సెబీ కీలక నిర్ణయాలు; ఐపీఓల్లో ఉద్యోగుల వాటా పెంపు ♦ ఎస్ఎంఎస్, మెయిల్స్‌తో ట్రేడింగ్ టిప్స్‌పై నిషేధం! ముంబై: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ... శుక్రవారం పలు కీలక చర్యలకు దిగింది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగాల్లోకి వ్యాపార సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావటంతో... రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్స్)లో పెట్టుబడుల నిబంధనల్ని మరింత సడలించింది. అలాగే దేశంలో స్థిరపడదామనుకుంటున్న విదేశీ ఫండ్ మేనేజర్లకూ నిబంధనల్ని సడలించి, పోర్టు ఫోలియో మేనేజర్లుగా పనిచేయటానికి వారిని అనుమతించింది. ఇక మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ సలహాదారులకు కళ్లెం వేయటానికి... బల్క్ ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్ ద్వారా ట్రేడింగ్ టిప్స్ అందించటాన్ని నిషేధించాలని ప్రతిపాదించింది. దీంతో పాటు స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి గేమ్స్, పోటీలు, లీగ్‌లు నిర్వహించడానికి కూడా స్వస్తి చెప్పాలని స్పష్టంచేసింది. దీనిపై త్వరలో చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు సెబీ తెలియజేసింది. వీటన్నిటితో పాటు... పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీలు తమ ఉద్యోగులకు మరిన్ని షేర్లు కేటాయించడానికి వీలు కల్పించింది. ఇప్పటిదాకా కంపెనీలు తమ ఉద్యోగులకు రూ.2 లక్షల మేరకు మాత్రమే గరిష్టంగా షేర్లు కేటాయించే వీలుండేది. దీన్ని రూ.5 లక్షలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలివీ... రీట్స్, ఇన్విట్స్ నిబంధనల్ని 2014లోనే సెబీ నోటిఫై చేసింది. దీంతో ఈ ట్రస్ట్‌లు ఏర్పాటు చేయటానికి, వీటిని మార్కెట్లో లిస్ట్ చేయటానికి వీలు కలిగింది. పన్ను మినహాయింపుల వంటివి లేవకపోవటంతో విదేశీ మార్కెట్లలో బాగా ప్రజాదరణ ఉన్న ఈ ట్రస్ట్‌లకు దేశంలో మాత్రం ఆదరణ కరువయింది. ఐఆర్బీ, జీఎంఆర్, ఎంఈపీ ఇన్ఫ్రా కంపెనీలకు ఇన్విట్స్ ఆరంభించటానికి సెబీ గతంలోనే అనుమతులిచ్చింది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం పన్ను రాయితీలు కొన్ని ప్రకటించటంతో నిబంధనల సరళీకరణకు సెబీ నిర్ణయించింది. దీని ప్రకారం... * హోల్డింగ్ కంపెనీ పెట్టి రెండంచెల వ్యవస్థ (ప్రత్యేక కంపెనీలు) ద్వారా రీట్స్, ఇన్విట్స్ పెట్టుబడులు పెట్టొచ్చు. * స్పాన్సర్ చేసేవారి సంఖ్యపై ఇక పరిమితులుండవు. ప్రస్తుతం ముగ్గురు స్పాన్సర్లుండాలనే నిబంధన ఉంది. * ఎస్పీవీల ద్వారా సమీకరించే నిధుల్లో నూటికి నూరు శాతాన్నీ, మిగిలిన నిధుల్లో 90 శాతాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటానికి హోల్డింగ్ కంపెనీకి అనుమతి ఉంటుంది. * నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో రీట్స్ 10 శాతం మాత్రమే పెట్టుబడులు పెట్టాలనే నిబంధన ఉండేది. దీన్ని 20 శాతానికి పెంచారు. * ఇన్విట్స్కు సంబంధించి తప్పనిసరిగా స్పాన్సర్ కలిగి ఉండాల్సిన హోల్డింగ్‌ను 15 శాతానికి కుదించింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలనూ సడలించింది. విదేశీ ఫండ్ మేనేజర్లకు ఊరట...: భారతదేశంలో స్థిరపడాలనుకునే విదేశీ ఫండ్ మేనేజర్లు పోర్టు ఫోలియో మేనేజర్లుగా కొనసాగటానికి అనుమతిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో 1993 నాటి పోర్టుఫోలియో మేనేజర్ల నిబంధనల్ని సెబీ సవరించింది. దీని ప్రకారం... అర్హులైన ఫండ్ మేనేజర్లకు ఎలాంటి నిబంధనలుండాలో, ఎవరు అనర్హులో తెలియజేసింది. ఐపీఓల్లో ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు షేర్లు పబ్లిక్ ఆఫర్ సమయంలో కంపెనీలు వారి ఉద్యోగులకు స్టాఫ్ కోటా కింద అధిక షేర్లను కేటాయించడానికి సెబీ అంగీకరించింది. దీంతో కంపెనీ తన పబ్లిక్ ఆఫర్లో ఒక ఉద్యోగికి రూ.5 లక్షల విలువ వరకు షేర్లకు కేటాయించొచ్చు. ఈ పరిమితి ఇదివరకు రూ.2 లక్షలుగా ఉంది. -
సరైన సమయమనేది ఉండదు!
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అత్యుత్తమమని మ్యూచువల్ ఫండ్ దిగ్గజం డీఎస్పీ బ్లాక్‌రాక్ వైస్ ప్రెసిడెంట్ (ఇన్వెస్ట్మెంట్స్) రోహిత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు సరైన సమయమంటూ ఏదీ ఉండదని, ఒకవేళ ఉన్నా అది ఏ నిపుణుడికీ తెలియదని స్పష్టంగా చెప్పారు. ఇన్ఫ్రా రంగాన్ని తీసుకుంటే స్వల్పకాలిక దృష్టితో కాకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికనే ఇన్వెస్ట్ చేయాలని స్పష్టంచేశారు. బ్యాంకులన్నీ తమ ఎన్పీఏలను ప్రక్షాళన చేస్తున్నాయి కనక బ్యాంకింగ్ రంగం మున్ముందు ఆశావహంగా ఉంటుందని తెలియజేశారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోహిత్ సింఘానియా పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ... డీఎస్పీ బ్లాక్‌రాక్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సింఘానియా ≈ మార్కెట్లలో పెట్టుబడికి సిప్ విధానమే బెస్ట్ ≈ దీర్ఘకాలిక దృష్టితోనైతే ఇన్ఫ్రాలో పెట్టొచ్చు ≈ బ్యాంకింగ్‌పై ఇన్వెస్టర్లు ఆశావ హంగా ఉన్నారు ≈ సిమెంటు, ప్లాస్టిక్స్, సిరామిక్ రంగాలూ మంచివే ≈ ఫండ్స్‌పై జీఎస్టీ ప్రతికూల ప్రభావం ఉండదు ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు రికార్డు స్థాయికి పెరిగాయి. కారణమేంటి? గతంలో లెక్కల్లో కనిపించని డబ్బు పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్‌లోకి ప్రవహించేది. కానీ కొన్నాళ్లుగా రియల్టీ రంగం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. దీంతో అందులో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు అంతగా ఇష్టపడటం లేదు. మరోవంక బంగారమూ తగ్గింది. దీంతో దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులిచ్చే సాధనాల్లో ఇన్వెస్టర్లకు ఈక్విటీలు మాత్రమే మిగిలాయి. గతంలో వంద రూపాయల్లో అరవై రూపాయలు రియల్ ఎస్టేట్‌లోకి, ఇరవై ఈక్విటీ.. ఇరవై పసిడిలోకి పెట్టుబడులుగా వెళ్లగా.. ప్రస్తుతం ఈక్విటీ ల వాటా ఎనభైకి పెరిగింది. ఇక రియల్టీలో పెట్టుబడులకు సంబంధించి ఓ ఇల్లు కొనాలంటే కనీసం ముప్ఫై, నలభై లక్షలు పెట్టాలి. కానీ ఫండ్స్‌లో 500, రూ.1,000 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోంది కనకే నిధులు వస్తున్నాయి. ఇన్వెస్టర్ల సంఖ్య, అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో (సిప్) పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇన్ఫ్రా రంగం బాగా దెబ్బతింది కదా? ఎప్పుడు కోలుకుంటుంది? దీన్లో పెట్టుబడి పెట్టొచ్చా? పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నప్పుడు బాగా లేని కంపెనీలు కూడా బ్రహ్మాండంగా ఉన్నట్లు అనిపిస్తాయి. అలాగే పరిస్థితులు బాగాలేనపుడు మంచి కంపెనీలు కూడా చెడ్డ కంపెనీలుగా కనిపించొచ్చు. కాబట్టి సరైన సంస్థను ఎంచుకోవడంలోనే ఉంటుందంతా. బ్యాలెన్స్ షీట్, కంపెనీ పనితీరు, మేనేజ్మెంట్ మొదలైనవన్నీ చూశాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇన్ఫ్రాలో ఒకటి రెండు సంస్థల పరిస్థితి సరిగ్గా లేనంత మాత్రాన మొత్తం మౌలిక రంగం అంతా కూడా బాగాలేదనటానికి వీల్లేదు. ఇన్ఫ్రాలో పెట్టే పెట్టుబడులు మూణ్నెల్లు, ఆర్నెల్లలో రాబడులివ్వాలంటే అసాధ్యం. కనీసం రెండు మూడేళ్ల వ్యవధైనా ఉండాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మా ఫండ్‌లోకి గణనీయంగానే నిధులొచ్చాయి. భారత్ వృద్ధికి ఇన్ఫ్రా ఎదగడం కీలకమని గుర్తించడం మొదలుపెట్టారు. సానుకూల విషయమేమిటంటే.. పెట్టుబడులు తరలివెళ్లిపోవడం ఆగింది. మరి బ్యాంకింగ్ షేర్లు ఎలా ఉన్నాయి? ఈ మధ్య ప్రభుత్వ బ్యాంకులూ పెరిగాయి కదా? గత రెండు మూడేళ్లుగా ఏం జరుగుతోందో ఒకసారి సమీక్షించుకోవాలి. మొండిబకాయిలకు సంబంధించి గతంతో పోలిస్తే ఇపుడెలా ఉంది? పరిస్థితులేమైనా మెరుగుపడ్డాయా? భవిష్యత్‌లో మరింతగా తగ్గే అవకాశాలున్నాయా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఎన్పీఏలు వేల కోట్ల నుంచి వందల కోట్లలోకి తగ్గుతున్నాయా లేక లక్షల కోట్లలోకి వెడుతున్నాయా అన్నది కూడా చూడాలి. మొండి బకాయిలు అధికంగా ఉన్న రంగాలు కూడా మెరుగుపడటం మొదలుపెడితే ఎకానమీ వృద్ధి చాలా బాగుంటుంది. క్రమంగా మొండిబకాయిల భారం కూడా తగ్గడం మొదలవుతుంది. తద్వారా బ్యాంకింగ్ రంగం సైతం మెరుగుపడగలదు. ఎకానమీకి బ్యాంకింగ్ అనేది వెన్నెముక. ఇది బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఈ ధోరణితోనే బ్యాంకింగ్‌పై మార్కెట్ వర్గాలు ఆశావహ ధోరణి కనపరుస్తున్నాయి. ఇతర రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలంగా ఉన్నవేంటి? ఇపుడు ఏవైతే బెటర్? సిమెంటు, సెరామిక్, ప్లాస్టిక్స్ ఉత్పత్తి తదితర తయారీ రంగ కంపెనీలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. అలాగే గ్యాస్ ధరలు తగ్గుతుండటం, ప్రజల ఇంధన వినియోగ ధోరణులు మారుతుండటం వంటి పరిణామాల దరిమిలా ఆయిల్ అండ్ గ్యాస్, గ్యాస్ పైప్‌లైన్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక వినియోగదారుల అభిరుచులపై ఆధారపడి ఉన్న ఆటోమొబైల్స్ తదితర రంగాలను కూడా పరిశీలించవచ్చు. జీఎస్టీ ప్రభావంతో ఫండ్స్ మరింత ఖరీదవుతాయా? సేవా పన్ను విధించే రంగాలన్నింటిపైనా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) ప్రభావం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌పై మాత్రమే కాదు. ఈక్విటీల్లో కూడా ఎంతో కొంత రాబడి రావాలనే ఇన్వెస్ట్ చేస్తాం. పన్నులు, చార్జీల వంటి వాటి గురించి సందేహిస్తూ పెట్టుబడులను మానేస్తారని నేనైతే అనుకోవటం లేదు. కాబట్టి జీఎస్టీ అమల్లోకి వచ్చినా ఫండ్స్‌లో పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావమేమీ ఉండకపోవచ్చు. మార్కెట్లలో సంస్కరణలు తెస్తున్నారు. ఫెడ్ రేట్లపై ఇంకా అనిశ్చితే ఉంది? ఆర్బీఐకి కొత్త గవర్నరొచ్చారు. ఇవన్నీ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు? స్థూలంగా చూస్తే సంస్కరణలనేవి ఎకానమీ వృద్ధికి సానుకూలమే. అయితే, ఏవైనా సరే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు. దేనికైనా కాస్త సమయం పడుతుంది. జీఎస్టీ అనేది కొన్ని రంగాలకు సానుకూలం కావొచ్చు.. మరికొన్నింటికి ప్రతికూలం కావొ చ్చు. కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. పారదర్శకత పెరుగుతోంది. వ్యవస్థాగతంగా ఇవి సానుకూలాంశాలే. ఇక మార్కెట్లు సాధారణంగానే వివిధ పరిణామాలపై స్పందిస్తుంటాయి. బ్రెగ్జిట్ అనంతరం ఏం జరిగిందో చూశాం. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు, లిక్విడిటీ మొదలైనవన్నీ పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, రాజన్ నిష్ర్కమించడం తదితర పరిణామాల ప్రభావం దేశీ మార్కెట్లపై పెద్దగా ఉండకపోవచ్చు. మార్కెట్లు బాగా పెరిగి ఉన్నాయి. పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా? నిజం చెప్పాలంటే పెట్టుబడులకు సరైన సమయమంటూ ఏదీ ఉండదు. కొనడానికైనా, అమ్మడానికైనా అలాంటి టైమింగ్ ఎవ్వరికీ తెలియదు. కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) లాంటివి మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్కి ఉత్తమమని నేను చెబుతా. మార్కెట్లు ఓ అయిదు శాతం తగ్గగానే కరెక్షన్ వచ్చేస్తోందని, అయిదు శాతం పెరగ్గానే అంతా బాగైపోయిందని అనుకోవడానికి ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. -
ఐవీఆర్‌సీఎల్‌లో వాటా పెంచుకున్న ఐసీఐసీఐ
మొత్తం 11.43 శాతానికి వాటాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంలో ఉన్న ఇన్ఫ్రా సంస్థ ఐవీఆర్‌సీఎల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన వాటాను 11.43శాతానికి పెంచుకుంది. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్)లో భాగంగా 2015 జూన్ 25 నుంచి 2016 ఏప్రిల్ 13 మధ్యకాలంలో అదనంగా మరో 7.3 శాతం వాటాలు (సుమారు 3.9 కోట్ల షేర్లు) తీసుకోవడంతో బ్యాంకు వాటా పెరిగింది. ఇప్పటిదాకా ఐసీఐసీఐ బ్యాంకుకు 5.03 శాతం వాటాలు ఉండేవి. గతేడాది ఆఖరు నాటికి కంపెనీ రుణభారం సుమారు రూ. 7,500 కోట్ల మేర ఉంది. ఐవీఆర్‌సీఎల్‌లో ఆంధ్రా బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ సహా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు 36.97 శాతం వాటాలు ఉన్నాయి. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 0.22% తగ్గి రూ. 4.64 వద్ద ముగిసింది. -
ఇన్ఫ్రాపై దృష్టి పెట్టాలి
ఏఐఐబీ ప్రెసిడెంటుకి ప్రధాని సూచన న్యూఢిల్లీ: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఆసియా దేశాల వృద్ధికి తోడ్పడేలా రైలు..రోడ్డు.. పోర్టుల ద్వారా కనెక్టివిటీని పెంచేలా మౌలిక రంగ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏఐఐబీ ప్రెసిడెంటుగా నియమితులైన జిన్ లికున్‌తో సోమవారం ఆయన భేటీ అయ్యారు. కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బైటపడేసేందుకు ఇన్ఫ్రాను మెరుగుపర్చుకోవడం కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులకు పోటీ పూర్వకంగా ఏర్పాటైన ఏఐఐబీ వచ్చే నెలలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
చకచకా అనుమతులు!
పెట్టుబడులతో తరలిరండి...; అమెరికా టాప్ సీఈఓలతో ప్రధాని మోదీ ♦ భారత్‌లో అపార అవకాశాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి ♦ సంస్కరణల జోరు పెంచాలన్న సీఈఓలు.. ♦ అడ్డంకులు తొలగించాలని స్పష్టీకరణ... న్యూయార్క్ : భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి చకచకా నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా దిగ్గజ కార్పొరేట్లకు హామీనిచ్చారు. ఇక్కడున్న అపారమైన పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందిగా వారిని ఆహ్వానించారు. పెట్టుబడులకు ఇదే సరైన తరుణమని కూడా వారికి సూచించారు. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ మేగజీన్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో తయారీ, ఇన్ఫ్రా రంగాలకు చెందిన 42 మంది దిగ్గజ సీఈఓలు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు భారత్‌లో వ్యాపార నిర్వహణకు ఉన్న అడ్డంకులను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించినట్లు సమాచారం. ఆర్థిక సంస్కరణలు, పాలసీ నిర్ణయాల విషయంలో ప్రస్తుత చర్యల్లో వేగం పెంచాలంటూ సీఈఓలు మోదీని కోరారు. ఈ సీఈఓలు సారథ్యం వహిస్తున్న కంపెనీల మొత్తం విలువ 4.5 లక్షల కోట్ల డాలర్లు కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ డిన్నర్ జరిగింది. సమస్యల ఏకరువు... ప్రధానంగా భారత్‌లో సంక్లిష్టమైన నియంత్రణలు, అరకొర మౌలిక సదుపాయాలు, పన్నుల విధింపులో హేతుబద్దత లోపించడం, ప్రభుత్వ యంత్రాంగం(బ్యూరోక్రసీ)లో గందరగోళం వంటి అంశాలను సీఈఓలో మోదీ దృష్టికి తీసుకొచ్చినట్లు ఫార్చూన్ ఎడిటర్ అలన్ ముర్రే చెప్పారు. విందులో చర్చకు సమన్వయకర్తగా ఆయనే వ్యవహరించారు. వీటికి సత్వరం తగిన పరిష్కారాలను చూపాలని సీఈఓలు సూచించారు. సీఈఓల్లో ఒకరైతే ఏకంగా భారత్‌లో వ్యాపారం చేయడం సులువుకాదంటూ వ్యాఖ్యానించడం విశేషం. అయితే వారి ఆందోళనలపై స్పందించిన మోదీ... వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని హామీనిచ్చారని ముర్రే వెల్లడించారు. ‘ప్రపంచం మాకోసం వేచిచూడదు. మీరు వెలిబుచ్చిన అంశాలన్నీ నాకు కూడా తెలుసు. త్వరలోనే వీటిని పరిష్కరించేందుకు కృషిచేస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. ఒకవైపు చైనాలో ఆర్థిక మందగమనం, 7.5 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలను పలువురు సీఈఓలు ప్రధానికి వెల్లడించినట్లు ముర్రే తెలిపారు. భారత్‌కు ఎఫ్‌డీఐలు పెరిగాయ్... భేటీ తర్వాత భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ... సీఈఓల్లో భారత్‌పట్ల చాలా ఉత్సాహం వ్యక్తమైందని చెప్పారు. కాగా, రౌండ్ టేబుల్ చర్చలో ఒక్కో సీఈఓ వెల్లడించిన అభిప్రాయాలు, వారి భారత్ ప్రణాళికలను మోదీ వినడంతో పాటు సమస్యల పరిష్కారానికి వారి నుంచి సూచనలను కూడా ఆహ్వానించినట్లు స్వరూప్ చెప్పారు. ‘ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే నా తొలి ప్రాధాన్యం, విధానాలను సరళీకరిస్తున్నాం. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు నిర్ణయాల్లో వేగం పెంచడమే మా లక్ష్యం. భారత్‌లో తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా’ అని టాప్ సీఈఓలతో మోదీ పేర్కొన్నారు. రక్షణ, బీమా తదితర పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు గేట్లు తెరిచిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డీఐలు తగ్గుముఖం పట్టగా.. భారత్‌లో మాత్రం 40 శాతం వృద్ధి చెందాయని మోదీ తెలిపారు. డిజిటైజేషన్, 4జీ సేవలపై దృష్టిపెట్టాలి... ప్రధానికి అమెరికా మీడియా-ఎంటర్టైన్మెంట్ దిగ్గజాల సూచన భారత్‌లో 4జీ టెలికం నెట్‌వర్క్‌ను వీలైనంత వేగంగా విస్తరించడం, టెలివిజన్ సేవల డిజిటైజేషన్‌పై మరింత దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి అమెరికా మీడియా-ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ దిగ్గజాలు సూచించారు. మొబైల్ సేవల మౌలికసదుపాయాలను కూడా పటిష్టం చేయాలని వారు పేర్కొన్నారు. భారత్ ఒక అవకాశాల గని అని, అదేవిధంగా సవాళ్లు కూడా అనేకం ఉంటాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పెట్టుబడి ప్రణాళికల్లో ప్రాంతీయ భాషలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మోదీతో భేటీ అయిన మీడియా దిగ్గజాల్లో న్యూస్‌కార్ప్ చైర్మన్ రూపర్ట్ మర్దోక్, సోనీ ఎంటర్టైన్మెంట్ చీఫ్ మైఖేల్ సింటన్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ డేవిడ్ జస్లావ్, ట్వంటీఫస్ట్ సెంచురీ జేమ్స్ మర్దోక్; ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్, న్యూస్‌కార్ప్ సీఈఓ రాబర్ట్ థాంప్సన్, టైమ్‌వార్నర్ సీఈఓ జెఫ్ బ్యూకెస్ తదితరులు ఉన్నారు. ప్రపంచ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఈ సీఈఓలు నేతృత్వం వహిస్తున్న కంపెనీల వాటా 40 శాతంగా అంచనా. ఉత్సాహం, అత్యంత సమర్థతతో కూడిన మోదీ సారథ్యానికి సీఈఓలు కితాబిచ్చారని అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రభుత్వం తలపెట్టిన డిజిటల్ ఇండియా చర్యల ఆసరాతో భారత్‌లో డిజిటల్ విప్లవం పట్ల వారు ఎంతో ఆసక్తితో ఉన్నారని కూడా తెలిపింది. మరోపక్క, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. హాజరైన హేమాహేమీలు... ప్రధానితో డిన్నర్‌కు ప్రపంచ ప్రఖ్యాత, దిగ్గజ కార్పొరేట్ కంపెనీల అధిపతులంతా వరుసకట్టారు. వారిలో ముఖ్యంగా లాక్‌హీడ్ మార్టిన్ చైర్మన్-సీఈఓ మారిలిన్ హ్యూసన్, ఫోర్డ్ ప్రెసిడెంట్-సీఈఓ మార్క్ ఫీల్డ్స్, ఐబీఎం చైర్మన్ గినీ రోమెటీ, పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి, డో కెమికల్స్ చైర్మన్ ఆండ్రూ లివెరిస్ వంటి హేమాహేమీలు ఉన్నారు. సిటీ గ్రూప్ చైర్మన్ మేఖేల్ ఓ నీల్, మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగా, బోయింగ్ ప్రెసిడెంట్ మార్క్ అలెన్, గోల్డ్‌మన్ శాక్స్ అధినేత గ్యారీ కాన్, బ్లాక్‌స్టోన్ ప్రెసిడెంట్ హామిల్టన్. శాన్డిస్క్ సహ వ్యవస్థాపకుడు సంజయ్ మెహరోత్రా తదితరులు కూడా ఉన్నారు. డిన్నర్ తర్వాత టాప్ సీఈఓలతో మోదీ ప్రత్యేకంగా ఫొటో దిగారు.