మొత్తం 11.43 శాతానికి వాటాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంలో ఉన్న ఇన్‌ఫ్రా సంస్థ ఐవీఆర్‌సీఎల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన వాటాను 11.43శాతానికి పెంచుకుంది. వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ (ఎస్‌డీఆర్)లో భాగంగా 2015 జూన్ 25 నుంచి 2016 ఏప్రిల్ 13 మధ్యకాలంలో అదనంగా మరో 7.3 శాతం వాటాలు (సుమారు 3.9 కోట్ల షేర్లు) తీసుకోవడంతో బ్యాంకు వాటా పెరిగింది. ఇప్పటిదాకా ఐసీఐసీఐ బ్యాంకుకు 5.03 శాతం వాటాలు ఉండేవి. గతేడాది ఆఖరు నాటికి కంపెనీ రుణభారం సుమారు రూ. 7,500 కోట్ల మేర ఉంది.
ఐవీఆర్‌సీఎల్‌లో ఆంధ్రా బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ సహా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు 36.97 శాతం వాటాలు ఉన్నాయి. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 0.22% తగ్గి రూ. 4.64 వద్ద ముగిసింది.
ఐవీఆర్‌సీఎల్‌లో వాటా పెంచుకున్న ఐసీఐసీఐ
Published Tue, Apr 19 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement
Advertisement