IVRCL
-
భారీ కుంభకోణం: రూ.4,837 కోట్లు ఎగవేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ బ్యాంకు రుణాల ఎగవేత కుంభకోణం వెలుగుచూసింది. దాదాపు రూ.4,837 కోట్లు రుణంగా పొంది, తిరిగి చెల్లించడంలో విఫలమైందనే ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్.ఐ.ఆర్‌లో ఐవీఆర్సీఎల్ లిమిటెడ్, హైదరాబాద్, కంపెనీ ఎండీ ఇ.సుధీర్‌రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.బలరామిరెడ్డితోపాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులపై నేరపూరిత కుట్ర, నిధుల అక్రమ తరలింపు అభియోగాలను పేర్కొంది. నగరంలోని సంస్థ కార్యాలయంతోపాటు నిందితుల ఇళ్లలో బుధవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. తమకు లోను కావాలంటూ ఐవీఆర్సీఎల్ పలు బ్యాంకులను ఆశ్రయించింది. దీంతో వీరికి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలో ఐడీబీఐ, కెనరా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్, యూనియన్, ఎగ్జిమ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులతో కలిపి కన్సార్షియంగా ఏర్పడ్డాయి. కంపెనీకి పలు దఫాలుగా భారీ రుణం ఇచ్చాయి. కానీ, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఈ క్రమంలో బ్యాంకు ఫోరెన్సిక్ ఆడిట్లో కంపెనీ లావాదేవీల్లో పలు అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో దాదాపు రూ.4,837 కోట్లు నష్టం వాటిల్లిందంటూ ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేస్తోంది. (చదవండి: ‘డీఎల్ఎఫ్’ భూ వ్యవహారంపై కౌంటర్ వేయండి) మహేష్ బ్యాంకు కేసులో తీర్పు రిజర్వు సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత కొన్ని ఓట్లను లెక్కించకుండా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఓట్లు లెక్కిం చి ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బుధవారం వాదనలు వినిపించారు. -
ఆర్‌కామ్ నష్టాలు రూ.30,142 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కారణంగా రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ కంపెనీకి ఈ క్యూ2లో ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. కాగా గత క్యూ2లో రూ.977 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.302 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఆర్‌కామ్ షేర 3.2 శాతం నష్టపోయి రూ.0.59 వద్ద ముగిసింది. ఐవీఆర్సీఎల్... నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.394 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.443 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.245 కోట్ల నుంచి రూ.115 కోట్లకు వచ్చి చేరింది. -
అమ్మకానికి ఐవీఆర్సీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎడాపెడా అప్పులు చేసి... ఆనక తీర్చలేక దివాలా తీసిన మౌలిక రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్... అమ్మకానికి వచ్చింది. దీని కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు బిడ్లు వేయొచ్చంటూ కంపెనీ లిక్విడేటర్ సుతాను సిన్హా కోరారు. దీనికి రిజర్వు ధరను రూ.1,654.47 కోట్లుగా నిర్ణయించారు. అక్టోబరు 4న ఎలక్ట్రానిక్ వేలం ఉంటుందని లిక్విడేటర్‌గా కూడా వ్యవహరిస్తున్న దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) తెలియజేశారు. దివాలాతీసిన ఐవీఆర్‌సీఎల్‌ను గట్టెక్కించేందుకు సరైన పరిష్కారం లభించకపోవడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ఈ ఏడాది జూలై 29న కంపెనీ లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.800 కోట్ల నికర నష్టం ప్రకటించింది. దీంతో సంస్థ మొత్తం నష్టాలు రూ.6,102 కోట్లకు చేరుకున్నాయి. వడ్డీతో కలిసి ఫండ్ ఆధారిత బకాయిలు రూ.9,593 కోట్లు, ఫండేతర బకాయిలు రూ.857 కోట్లు సంస్థ చెల్లించాల్సి ఉంది. ఫస్ట్ గ్లోబల్ ఫైనాన్స్.. ఐవీఆర్సీఎల్ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా ఫస్ట్ గ్లోబల్ ఫైనాన్స్ బిడ్లు వేసి ముందుకొచ్చింది. ఈ ఆఫర్ మొత్తం తక్కువగా ఉండడంతో.. కొత్త ప్రతిపాదనతో ముందుకు రావాలని రుణగ్రహీతలు స్పష్టం చేశారు. దీంతో ఫస్ట్ గ్లోబల్ ఫైనాన్స్ మరో ఆఫర్‌తో ముందుకొచ్చినా రుణదాతల సమ్మతిని పొందలేకపోయింది. దీంతో ఆస్తులను విక్రయించాలంటూ (లిక్విడేషన్) రిసొల్యూషన్ ప్రొఫెషనల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఎన్సీఎల్టీ అందుకు అనుకూలంగా స్పందించి ఉత్తర్వులిచ్చింది. ఐవీఆర్‌సీఎల్‌కు రుణమిచ్చిన ఎస్బీఐ దరఖాస్తు ఆధారంగా ట్రిబ్యునల్ జ్యూడీషియల్ మెంబర్ కె.అనంత పద్మనాభస్వామి లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చారు. కాగా ఐవీఆర్‌సీఎల్‌కు 2009-10 నుంచి కష్టాలు మొదలయ్యాయి. తీసుకున్న అప్పులపై వడ్డీ రేట్లు భారం కావడం, రుణాలు అధికమవడం, చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవడంతో కంపెనీ క్రమంగా కుదేలైంది. -
‘ఐవీఆర్సీఎల్’ దివాలా ప్రక్రియకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: తమ నుంచి తీసుకున్న రూ.604 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ విఫలమైన నేపథ్యంలో ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్పందించింది. ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ దివాలా ప్రక్రియ (సీఐఆర్‌పీ)ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా దివాలా పరిష్కారదారు (ఐఆర్పీ)గా కోల్‌కతాకు చెందిన సుతను సిన్హాను నియమించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యులు విత్తనాల రాజేశ్వరరావు, సాంకేతిక సభ్యులు రవి కుమార్ దురైస్వామిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తన ఉత్తర్వుల్లో ధర్మాసనం ఐవీఆర్‌సీఎల్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌పీకి సహకరించాలని ఆదేశం దివాలా ప్రక్రియ విషయంలో ఐఆర్‌పీకి పూర్తిస్థాయిలో సహకరించాలని ఐవీఆర్‌సీఎల్‌కు ధర్మాసనం తేల్చి చెప్పింది. అన్ని రికార్డులను ఐఆర్‌పీకి అందుబాటులో ఉంచాలంది. అంతేకాక కంపెనీ ఆస్తులను అమ్మడం గాని, అన్యాక్రాంతం చేయడం గాని చేయరాదంది. అంతేకాక తాకట్టు పెట్టిన ఆస్తులు ఏవైనా ఉంటే, ఆ ఆస్తులను అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే దివాలా ప్రక్రియ ప్రారంభం కాగానే ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయాలని ఐఆర్‌పీని ధర్మాసనం ఆదేశించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వెబ్సైట్లో ఉంచడంతో పాటు, పత్రికల్లో సైతం ప్రకటనలు ఇవ్వాలంది. అలాగే ఐవీఆర్సీఎల్ వెబ్సైట్లో కూడా దివాలా ప్రక్రియ గురించి తెలియజేయాలని ఆ సంస్థను ఆదేశించింది. దివాలా ప్రక్రియకు సంబంధించి అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఐఆర్‌పీని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను 180 రోజుల్లో పూర్తి చేయాలంది. అప్పటి లోపు ఇప్పటి వరకు ఏం చేశారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ఐఆర్‌పీకి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 2014, 15 సంవత్సరాల్లో ఎస్బీఐ 6 ఖాతాల కింద ఐవీఆర్సీఎల్ లిమిటెడ్‌కు రూ.898.49 కోట్ల మేర రుణం మంజూరు చేసింది. అయితే ఇందులో కొంత మొత్తం చెల్లించిన ఐవీఆర్సీఎల్, గత ఏడాది అక్టోబర్ నాటికి రూ.604.15 కోట్ల మేర బకాయి పడింది. -
ఐవీఆర్‌సీఎల్‌కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో ఐవీఆర్సీఎల్ నష్టాలు క్రితంతో పోలిస్తే రూ.153 కోట్ల నుంచి రూ.245 కోట్లకు చేరాయి. టర్నోవరు రూ.452 కోట్ల నుంచి రూ.522 కోట్లకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన గాయత్రి లాభం.. గాయత్రి ప్రాజెక్ట్స్ స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు మూడు రెట్లు అధికమై రూ.45 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.440 కోట్ల నుంచి రూ.660 కోట్లకు చేరింది. గాయత్రి షుగర్స్‌కు నష్టం.. జూన్ క్వార్టరులో గాయత్రి షుగర్స్‌కు రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.15 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.132 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పడింది. ఎన్సీఎల్ లాభం రూ.16 కోట్లు.. జూన్ క్వార్టరు స్టాండలోన్ ఫలితాల్లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9 కోట్ల నుంచి రూ.16 కోట్లకు ఎగిసింది. టర్నోవరు రూ.192 కోట్ల నుంచి రూ.227 కోట్లకు చేరింది. సువెన్‌లైఫ్ లాభం రూ.29 కోట్లు.. త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో సువెన్‌లైఫ్ నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు 9% తగ్గి రూ.29 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.137 కోట్ల నుంచి రూ.146 కోట్లకు చేరింది. స్వల్పంగా తగ్గిన గ్రాన్యూల్స్ లాభం.. గ్రాన్యూల్స్ ఇండియా జూన్ క్వార్టరు కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.40 కోట్ల నుంచి రూ.37 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.353 కోట్ల నుంచి రూ.386 కోట్లకు ఎగిసింది. రూ.1 విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 పైసల తొలి మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది. 30 శాతం పెరిగిన పెన్నార్ లాభం.. జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పెన్నార్ ఇండస్ట్రీస్ నికరలాభం క్రితంతో పోలిస్తే 30 శాతం పెరిగి రూ.13 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.338 కోట్ల నుంచి రూ.460 కోట్లకు చేరింది. -
ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టరు?
⇔ వార్తల నేపథ్యంలో 17 శాతం పెరిగిన షేరు ⇔ పన్నులు కట్టకుండా లాభాలు చూపించిన కంపెనీ! సాక్షి, అమరావతి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టర్ దొరికారా? అవుననే చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న బ్యాంకులు వ్యూహాత్మక భాగస్వామికి వాటాలను విక్రయించాలని చూస్తున్నాయని, అందుకోసం అవి తగిన భాగస్వామిని ఎంచుకున్నాయని కూడా మార్కెట్ వర్గాలు చెబుతుండటంతో ఐవీఆర్సీఎల్ షేరు ధర ఒక్కసారిగా ఎగసింది. వార్తల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఐవీఆర్సీఎల్ షేరు ఒక్కసారిగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.4.85 వద్ద క్లోజయింది. దీంతో ఈ వార్తలపై వివరణ ఇవ్వాల్సిందిగా కంపెనీని ఎక్సే్ఛంజీలు కోరాయి. తీసుకున్న అప్పులను తీర్చలేకపోవడంతో బ్యాంకులు తమ రుణాలను ఈక్విటీగా మార్చుకొని 51 శాతం వాటాతో కంపెనీ మేనేజ్మెంట్ను తమ చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యూహాత్మక రుణ వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) కింద బ్యాంకులు ఈ ఏడాది మే25లోగా కనీసం 26 శాతం వాటాను కొత్త ప్రమోటర్లకు విక్రయించాల్సి ఉండగా, ఆ విషయంలో విఫలమయ్యాయి. కంపెనీ వ్యూహాత్మక భాగస్వామిని అన్వేషించే పనిలో ఉన్నామని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కంపెనీలోని కీలక వ్యక్తి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా వ్యూహాత్మక భాగస్వామిగా చేరటానికి ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ పేరును చెప్పలేం. కానీ త్వరలోనే కొత్త ప్రమోటర్‌ను తీసుకొస్తామన్న నమ్మకం ఉంది’’ అని కీలక అధికారి ఒకరు చెప్పారు. లాభాల్లోకి...: మార్చితో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ రూ.686 కోట్ల ఆదాయంపై రూ.626 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికానికి చెల్లించాల్సిన రూ.957 కోట్ల పన్నులు చెల్లించకుండా వాయిదా వేయడమే కంపెనీ లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఈ పన్నులను తదుపరి త్రైమాసికంలో చెల్లించగలమన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2016–17 సంవత్సరానికి కంపెనీ నికర నష్టం రూ.131 కోట్లు కాగా, గత నష్టాలతో కలుపుకొంటే మొత్తం నష్టాలు రూ.2,173 కోట్లకు చేరుకున్నాయి. -
రుణదాతలకు ఐవీఆర్సీఎల్ మరిన్ని షేర్ల కేటాయింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంలో ఉన్న ఇన్ఫ్రా సంస్థ ఐవీఆర్సీఎల్ తాజాగా రుణదాతలకు దాదాపు అయిదు కోట్ల పైచిలుకు షేర్లను కేటాయించింది. 2.9 కోట్ల షేర్లను ఒక్కోటి రూ. 24.39 రేటుకి, 3.06కోట్ల షేర్లను రూ. 8.76 చొప్పున కేటాయించినట్లు తెలిపింది. మార్చి ఆఖరు నాటికి కంపెనీలో ఆర్థిక సంస్థలు/బ్యాంకులకు 53.35 % వాటాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు 8.64 %, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 8.58 % వాటాలు ఉన్నాయి. -
ఐవీఆర్‌సీఎల్‌లో వాటా పెంచుకున్న ఐసీఐసీఐ
మొత్తం 11.43 శాతానికి వాటాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంలో ఉన్న ఇన్ఫ్రా సంస్థ ఐవీఆర్‌సీఎల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన వాటాను 11.43శాతానికి పెంచుకుంది. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్)లో భాగంగా 2015 జూన్ 25 నుంచి 2016 ఏప్రిల్ 13 మధ్యకాలంలో అదనంగా మరో 7.3 శాతం వాటాలు (సుమారు 3.9 కోట్ల షేర్లు) తీసుకోవడంతో బ్యాంకు వాటా పెరిగింది. ఇప్పటిదాకా ఐసీఐసీఐ బ్యాంకుకు 5.03 శాతం వాటాలు ఉండేవి. గతేడాది ఆఖరు నాటికి కంపెనీ రుణభారం సుమారు రూ. 7,500 కోట్ల మేర ఉంది. ఐవీఆర్‌సీఎల్‌లో ఆంధ్రా బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ సహా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు 36.97 శాతం వాటాలు ఉన్నాయి. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 0.22% తగ్గి రూ. 4.64 వద్ద ముగిసింది. -
ఐవీఆర్సీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ భట్టాచార్జినీ కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో గురువారం కుప్పకూలిన ఫ్లైఓవర్ నిర్మాణసంస్థ హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్సీఎల్ అన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 27మంది మృతి చెందగా, గాయపడ్డ అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఎనిమిదిమంది ఐవీఆర్సీఎల్ అధికారులను అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. కాగా ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది. అయితే గడువు పూర్తయినా ఫ్లైఓవర్ పనులు మాత్రం పూర్తి కాలేదు. అయితే ఫ్లైఓవర్ పనుల విషయంలో ఎలాంటి లోపం లేదని ఆ సంస్థ చెబుతోంది. -
కనిష్ట స్థాయికి ఐవీఆర్ సీఎల్ షేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణంలో ఉన్న కోల్‌కతా ఫ్లై ఓవర్ కుప్పకూలటంతో దాని నిర్మాణసంస్థ ఐవీఆర్సీఎల్ షేరు... నేల చూపులు చూస్తోంది. రెండు రోజుల్లో 18 % నష్టపోయి, పదమూడేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. కంపెనీ మేనేజ్మెంట్పై క్రిమినల్ కేసులు నమోదు చేశారన్న వార్తలతో శుక్రవారం ఒక్కరోజే భారీ ట్రేడింగ్ పరిమాణంతో 12 శాతం నష్టపోయి రూ. 5.65 వద్ద ముగిసింది. 2003 తర్వాత షేరు ఈ స్థాయికి పడిపోవడం ఇదే ప్రధమం. నాణ్యతా లోపం లేదు...: నిర్మాణంలో మాత్రం ఎటువంటి నాణ్యతా లోపం లేదని కంపెనీ ప్రతినిధి కె. పాండురంగారావు తెలిపారు. ఫోటోలను బట్టి చూస్తూంటే బాంబు పేళ్లుల్ల వల్ల కూలినట్టుగా కనిపిస్తోందని, దర్యాప్తు పూర్తయితే కానీ ఈ దురదృష్టకర సంఘటనకు గల కారణాలు తెలియవని కంపెనీ న్యాయ సలహాదారు పి.సీత అన్నారు. వంతెన కూలడం విధిరాత అన్నట్లుగా వచ్చిన వార్తలపై యాజమాన్యం మరోసారి వివరణ ఇచ్చింది. ‘‘మా మాటల్లో భావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నిర్మాణంలో ఎలాంటి లోపాలూ లేవని, జరిగిన దుర్ఘటన మా చేతుల్లో లేదు అని చెప్పాం. దీన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుంది’’ అని కంపెనీ వివరించింది. -
ఫ్లైఓవర్ ఘటనలో ఐవీఆర్‌సీఎల్‌కు నోటీసులు
హైదరాబాద్: ఫ్లైఓవర్ కూలిన దుర్ఘటనపై కోల్‌కతా మర్కెట్ రోడ్ పోలీసులు ఐవీఆర్సీఎల్ సంస్థకు నోటీసులిచ్చారు. ఐవీఆర్సీఎల్ సంస్థలో శుక్రవారం పోలీసుల తనిఖీలు చేశారు. ఛైర్మన్ సుధీర్ రెడ్డి సహా ఐదుగురికి సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ సంఘటనపై విచారించేందుకు గురువారం రాత్రి కోల్‌కతానుంచి విచారణ బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను దర్యాప్తులో సాయం చేయాలని కోరారు. దీంతో వారికి రెండు సీసీఎల్ బృందాలను అప్పగించారు. ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది. -
డిజైన్, నాణ్యతలో లోపం లేదు: ఐవీఆర్సీఎల్
తమ డిజైనులో గానీ, నాణ్యత ప్రమాణాలలో గానీ ఎలాంటి లోపం లేదని ఐవీఆర్సీఎల్ వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలో గురువారం కుప్పకూలిన ఫ్లైఓవర్ నిర్మాణసంస్థ హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్సీఎల్ అన్న విషయం తెలిసిందే. దీని గురించి ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఫ్లై ఓవర్ కూలిన విషయం తెలిసి తమకే షాకింగ్‌గా ఉందని, ఇప్పటికే తమ సాంకేతిక నిపుణులు, న్యాయ ప్రతినిధులను కోల్‌కతా పంపామని చెప్పారు. వాళ్లు ఈరోజు పొద్దున్నే విమానంలో వెళ్లారని, అక్కడి ప్రభుత్వంతో పాటు పోలీసులు, అధికారులకు కూడా సహకరించాలని చెప్పామని అన్నారు. ఇక్కడ ఏమీ జరగలేదని, అంతా ఇక్కడే ఉన్నామని తెలిపారు. అవసరమైన వాళ్లను మాత్రం అక్కడకు పంపి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పామన్నారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన 59 పిల్లర్లు, శ్లాబులకు ఎలాంటి సామగ్రి వాడామో దీనికి కూడా అదే వాడామని, కానీ ఇది ఎందుకు కూలిందో అర్థం కావట్లేదని చెప్పారు. దురదృష్టవశాత్తు అది పడిపోయిందని అన్నారు. ఇందులో నాణ్యత లోపం ఏమాత్రం లేదని, ఎందుకు కూలిందన్న విషయాన్ని దర్యాప్తు పూర్తిచేసేవరకు ఎవరూ చెప్పలేమని అన్నారు. తమవైపునుంచి ఎలాంటి లోపం లేదని, ఇప్పటికే 70-80 శాతం పని పూర్తయిందని, మిగిలినది చాలా కొంచెం మాత్రమేనని వివరించారు. కాగా, ఫ్లైఓవర్ కూలిన దుర్ఘటనపై విచారించేందుకు కోల్‌కతా నుంచి విచారణ బృందాలు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను దర్యాప్తులో సాయం చేయాలని కోరారు. దీంతో వారికి రెండు సీసీఎల్ బృందాలను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది. పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటనా స్థలంలో శుక్రవారం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. -
'యాక్ట్ ఆఫ్ గాడ్ వల్లే ఫ్లై ఓవర్ కూలింది..'
కోల్‌కతా: కోల్‌కతాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను చేస్తున్న ఐవీఆర్సీఎల్ కంపెనీ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. హిందీలోని 'ఓ మై గాడ్', తెలుగులో వచ్చిన 'గోపాల గోపాల' చిత్రంలో ఉపయోగించిన 'యాక్ట్ ఆఫ్ గాడ్' పదాన్ని ఐవీఆర్సీఎల్ యాజమాన్యం కూడా ఉపయోగించుకుంది. ప్రమాదానికి తమ తప్పేంలేదని... దానికి కారణం 'యాక్ట్ ఆఫ్ గాడ్' అంటూ కొత్త భాష్యం చెప్పింది. హైదరాబాద్ కు చెందిన ఐవీఆర్సీఎల్ సంస్థ పై మూడు, మరో నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం 2010లోనే పూర్తి కావాల్సి ఉండగా, ఆ సంస్థ గడువును పొడిగిస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావటంతో.. ఐవీఆర్సీఎల్ సంస్థ హడావుడిగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసేందుకు సన్నద్ధమైందని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా కోల్‌కతాలో నిత్యం రద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకుల చేతికి మెజార్టీ వాటా
♦ మూడింట రెండొంతుల షేర్లకు బీమా సంస్థల నుంచి బిడ్లు ♦ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకొని ఐవీఆర్‌సీఎల్‌లో మెజార్టీ వాటాను తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వాటాను తీసుకోవాలని ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) నిర్ణయించినట్లు ఐవీఆర్సీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరును ఎస్డీఆర్ కింద రూ. 8.765 చొప్పున ఈక్విటీగా మార్చుకోనున్నాయి. ప్రస్తుతం కంపెనీ షేరు రూ. 7 వద్ద కదులుతోంది. ఫిబ్రవరి 23న జరిగిన జేఎల్ఎఫ్ సమావేశంలో ఎస్డీఆర్ ప్యాకేజీకి బ్యాంకులు ఆమోదముద్ర వేశాయి. ఇప్పటికే ఈ జేఎల్ఎఫ్కి కంపెనీలో సుమారుగా 49 శాతం వాటా ఉంది. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా రూ. 7,350 కోట్ల రుణానికి సంబంధించి బ్యాంకులు ఇప్పటికే ఈక్విటీగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ రుణ భారం సుమారు రూ. 9,000 కోట్లు దాటినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. బ్యాంకులు మెజార్టీ వాటాను తీసుకున్న తర్వాత కంపెనీని పునర్ వ్యవస్థీకరించి సరైన ధర లభిస్తే వేరే వారికి విక్రయించాలన్నది జేఎల్ఎఫ్ ఆలోచన. -
75% వాటా తీసుకుందాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కి ఇచ్చిన అప్పులు మొత్తాన్ని ఈక్వి టీగా మార్చుకోవాలని బ్యాంకులు నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని బ్యాంకులూ కలసి దాదాపు రూ.7,350 కోట్లను ఐవీఆర్‌సీఎల్‌కు రుణాలుగా ఇచ్చాయి. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చుకోవటం ద్వారా, తమ ఖాతా పుస్తకాల నుంచి ఈ కంపెనీకి సంబంధించి ఎన్పీఏలు ఏమీ లేకుండా చూసుకోవాలని ఈ మధ్యనే జరిగిన సీనియర్ లెండర్స్ సమావేశంలో బ్యాంకులు ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలియవచ్చింది. డిసెంబర్ 19న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బ్యాంకులు దీన్ని ఈక్విటీగా మార్చుకున్నట్లయితే వాటి ఖాతా పుస్తకాల్లో ఇది ఇక ఎన్పీఏగా కనపడదు. దీంతో సాంకేతికంగా ఎన్పీఏలను తగ్గించుకున్నట్లుగా చూపించే అవకాశం ఉంటుంది. నిజానికి ఐవీఆర్‌సీఎల్‌లో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఎస్బీఐ నేతృత్వంలో అప్పులిచ్చిన బ్యాంకులన్నీ కలిసి ఎస్డీఆర్ను అమలు చే యనున్నాయి. తదుపరి కార్యాచరణలో భాగంగా అప్పులు, వడ్డీని ఈక్విటీగా మార్చుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకుల వాటా ఇప్పటికే 49%కి చేరింది. మొత్తం అప్పుల్ని ఈక్విటీగా మార్చుకుంటే ఇది 75% దాటుతుందని అంచనా. ఇదే సమయంలో ప్రమోటర్ల వాటా 8.28% నుంచి 5% దిగువకు పడిపోతుందని అంచనా. కాగా కంపెనీలో మెజారిటీ వాటా బ్యాంకులు చేతికి వెళ్ళినా పాత యాజమాన్యాన్నే కొనసాగిస్తారన్న నమ్మకాన్ని ఐవీఆర్సీఎల్ చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఎస్డీఆర్ అమలుతో కంపెనీ పనితీరు మెరుగవుతుందని, ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కొరత తీరుతుందని చెప్పారు. -
ఐవీఆర్సీఎల్... బ్యాంకుల చేతికే
ఎస్డీఆర్ అమలును ప్రకటించిన జేఎల్ఎఫ్ రిఫరెన్స్ డే నవంబర్ 26 త్వరలో కార్యాచరణ ప్రణాళిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్... ప్రస్తుత యాజమాన్యం చేతుల్లోంచి జారిపోతోంది. భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో యాజమాన్య హక్కుల్ని తీసుకోవాలని రుణాలిచ్చిన బ్యాంకులు నిర్ణయించటంతో ఇప్పటిదాకా ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఐవీఆర్‌సీఎల్‌లో వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణను (ఎస్డీఆర్) అమలు చేస్తున్నట్లు జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 26న జరిగిన సమావేశంలో జేఎల్ఎఫ్ నిర్ణయం తీసుకుందని... ఐవీఆర్సీఎల్ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఎస్డీఆర్ అమలుకు నవంబర్ 26వ తేదీనే రిఫరెన్స్ తేదీగా కూడా నిర్ణయించారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన కంపెనీలు కోలుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ నిర్వహణలో విఫలమైతే ఎస్డీఆర్ పథకం కింద ఆ కంపెనీలో యాజమాన్య (మెజారిటీ) హక్కులను పొందడానికి రుణాలిచ్చిన సంస్థలకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు గతంలోనే ఆర్బీఐ అనుమతులిచ్చింది. ఎసీడీఆర్ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి బ్యాంకులకు 18 నెలల కాలపరిమితి కూడా ఉంటుంది. ఇందులో భాగంగా తొలుత రుణాలిచ్చిన సంస్థలు ఒక జేఎల్ఎఫ్గా ఏర్పడి కంపెనీలో మెజారిటీ వాటా 51 శాతం, అంత కంటే ఎక్కువ వాటాను తీసుకోవచ్చు. లేదా ఇచ్చిన అప్పును పూర్తి ఈక్విటీగా మార్చుకోవచ్చు. ఇలా అప్పును ఈక్విటీగా మార్చుకోవాలంటే మొత్తం రుణ విలువలో 75 శాతం రుణం ఇచ్చిన సంస్థలు... లేదా అప్పులిచ్చిన సంస్థల్లో 60 శాతం ఆమోదించాల్సి ఉంటుంది. నేడో రేపో కార్యాచరణ ప్రణాళిక... ఐవీఆర్సీఎల్ విషయానికి వస్తే బ్యాంకులు మెజారిటీ వాటాను తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ముంబైలో ఎస్బీఐ నేతృత్వంలో జరిగే సీనియర్ లెండర్స్ సమావేశంలో ‘కరెక్టివ్ యాక్షన్ ప్లాన్’ తయారు చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం బ్యాంకుల వద్ద 48% వాటా ఉండటంతో 51% వాటాను తీసుకోవడం ద్వారా కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టాలన్నది బ్యాంకర్ల నిర్ణయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ బోర్డులో బ్యాంకుల నుంచి ఇద్దరు ప్రతినిధులున్నారు. కంపెనీ గాడిలో పడిన తర్వాత కొత్త వారికి వాటాలను విక్రయించడమా? లేక ఈ రంగంలోని నిపుణులతో బ్యాంకులే కంపెనీని నిర్వహించడమా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎస్డీఆర్ అమల్లోకి వస్తే ప్రస్తుతం కంపెనీలో 8.28% వాటా కలిగి ఉన్న ప్రస్తుత ప్రమోటర్లకు కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధాలు ఉండవు. కేవలం ఇన్వెస్టర్లుగానే కొనసాగుతారు. మా దృష్టికి రాలేదు కాగా కంపెనీని కాపాడుకోవటానికి దీన్ని రెండుగా విడదీయాలని ప్రమోటర్లు ప్రతిపాదిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఒకటిరెండు బ్యాంకుల ఉన్నతాధికారులను ‘సాక్షి’ సంప్రదించింది. అయితే ఈ ప్రతిపాదన జేఎల్ఎఫ్ వద్దకు రాలేదని, ఈ వార్తలు కేవలం పేపర్లలోనే చూశామని వారు చెప్పారు. ‘‘అధికారికంగా మాకు ఇలాంటి ప్రతిపాదనలేమీ రాలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదనతో కంపెనీకి మేలు జరుగుతుందంటే జేఎల్ఎఫ్ ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది’’ అని ఓ బ్యాంకు ఉన్నతాధికారి తెలియజేశారు. అప్పులు అధికంగా ఉన్న అసెట్ హోల్డింగ్‌ను విడదీయడం ద్వారా ప్రధాన ఆదాయ వనరైన ఈపీసీ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించడం ద్వారా అప్పులు తగ్గించుకోవాలన్నది ప్రస్తుత ప్రమోటర్ల ఆలోచన. ఈ ప్రతిపాదనను బ్యాంకర్లు ఆమోదిస్తారా లేదా అన్నది వచ్చే రెండు రోజుల్లో తెలుస్తుంది. తాజా వార్తలతో ఒక దశలో 12% పెరిగిన ఐవీఆర్సీఎల్ షేరు లాభాల స్వీకరణతో చివరకు 2.3% పెరిగి రూ. 10.95 వద్ద ముగిసింది. గత 2 రోజుల్లో ఐవీఆర్సీఎల్ 33% పెరగ్గా, నెలన్నరలో సుమారు 100% పెరిగింది. -
ఐవీఆర్సీఎల్ దక్కేదెవరికి?
యాజమాన్య వాటాపై బ్యాంకులు దృష్టి రెండు రోజుల్లో ముంబైలో లెండర్స్ కీలక భేటీ అడ్డుకోవడానికి కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చిన ప్రమోటర్లు అసెట్ కంపెనీని డీమెర్జ్ చేస్తామంటూ సరికొత్త ప్రతిపాదన ఈ వార్తల నేపథ్యంలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకిన షేరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐవీఆర్‌సీఎల్‌లో వాటాల ఆట మొదలయ్యిందా? కంపెనీలో 51 శాతం యాజమాన్య హక్కులు తీసుకునేలా బ్యాంకులు అడుగులు వేస్తుండటంతో దీన్ని అడ్డుకోవడానికి ప్రస్తుత ప్రమోటర్లు పావులు కదుపుతున్నారా? దీనికి మార్కెట్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు గతంలో జీ గ్రూపునకు చెందిన ఎస్సెల్ టేకోవర్ నుంచి కంపెనీని కాపాడుకోవడానికి ప్రమోటర్లు చేసిన ప్రయత్నాలను గుర్తుకు తెస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఐవీఆర్‌సీఎల్‌లో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) కింద యాజమాన్య హక్కులను తీసుకోవడానికి బ్యాంకులు ప్రయత్నిస్తుండటం తెలిసిందే. ప్రస్తుతం కంపెనీలో బ్యాంకులకు 43.88 శాతం ఉండగా, వ్యవస్థాపక ప్రమోటర్ల వాటా 9 శాతం లోపు ఉంది. ప్రమోటర్ల వాటాలో అత్యధిక భాగం తనఖాలో ఉంది. దీంతో నిర్మాణ రంగంలో అపారమైన అనుభవం కలిగిన ఐవీఆర్‌సీఎల్‌ను ప్రస్తుత ప్రమోటర్లు సరిగా నిర్వహించలేకపోతుండటంతో, యాజమాన్య హక్కు తీసుకోవడం ద్వారా కంపెనీని తిరిగి గాడిలో పెట్టాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఇందుకోసం ఎస్బీఐ నేతృత్వంలో ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐవోబీ, కెనరా, ఆంధ్రా బ్యాంక్‌లు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. మెజార్టీ వాటా తీసుకోవటంపై వచ్చే రెండు రోజుల్లో ముంబైలో జరిగే సమావేశంలో బ్యాంకర్లు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఎస్డీఆర్ స్కీం కింద గామన్ ఇండియా, మానెట్ ఇస్పాత్ కంపెనీల్లో 51 శాతం వాటా తీసుకోవడానికి బ్యాంకులు ముందుకొచ్చాయి. అదే విధంగా ఇప్పుడు ఐవీఆర్‌సీఎల్‌లో కూడా మెజార్జీ వాటాను తీసుకోవడానికి బ్యాంకులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రమోటర్ల పైఎత్తులు... యాజమాన్య హక్కులను కాపాడుకోవడానికి వ్యవస్థాపక ప్రమోటర్లు అన్ని అస్త్రాలనూ ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐవీఆర్సీఎల్ డీమెర్జర్ ప్రతిపాదనను బ్యాంకుల ముందుకు తెచ్చారు. ప్రధాన ఆదాయ వనరైన ఈపీసీ వ్యాపారాన్ని అప్పులు భారీగా ఉన్న అసెట్స్ హోల్డింగ్స్ కంపెనీ నుంచి విడదీయాలన్నది ప్రస్తుత ప్రమోటర్ల ఆశ. తద్వారా 2012లో చేసిన తప్పును సరిదిద్దుకొని ఈపీసీ వ్యాపారంపై దృష్టిపెట్టాలనుకుంటున్నారు. ఐవీఆర్సీఎల్ అసెట్స్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్‌ను 2012లో ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రాలో కలిపారు. దీనివల్ల అసెట్స్ కంపెనీకున్న అప్పులన్నీ ఇన్ఫ్రా కంపెనీ మెడకు చుట్టుకొని కొత్త ప్రాజెక్టులను చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రెండింటినీ విడదీసి ప్రధానమైన ఈపీసీ వ్యాపారంపై దృష్టిసారించి, క్రమంగా ఆస్తులను విక్రయించడం ద్వారా అసెట్స్ అండ్ హోల్డింగ్ కంపెనీకున్న అప్పులను తీర్చాలన్నది ప్రస్తుత ప్రమోటర్ల ఆలోచనగా ఉంది. ఇలా చేస్తే బీవోటీ ప్రాజెక్టుల దగ్గర నుంచి కంపెనీకి ఉన్న 1,800 ఎకరాల రియల్ ఎస్టేట్ ఆస్తులు అసెట్స్ అండ్ హోల్డింగ్ కంపెనీకి బదిలీ అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి ఐవీఆర్‌సీఎల్‌కు సుమారు రూ.7,500 కోట్ల అప్పులున్నాయి. కంపెనీ విభజన జరిగితే అసెట్స్ అండ్ హోల్డింగ్ కంపెనీకి అప్పులు రూ.4,500 కోట్ల వరకు వెళతాయి. ఇందులో ఇప్పటికే 3 బీవోటీ ప్రాజెక్టులను విక్రయించడంతో రూ. 1,500 కోట్ల రుణ భారం తగ్గనుంది. కానీ ఈ విక్రయానికి ఇంకా అధికారికంగా ఆమోద ముద్ర పడలేదు. ప్రస్తుతం ఈపీసీ వ్యాపారం నిర్వహణపరంగా లాభాల్లోనే ఉంది. కానీ, ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలపై ఏటా రూ.900 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుండటంతో చేతిలో రూ1,800 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నప్పటికీ.. వాటిని నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమైన ఈపీసీ విభాగానికి రూ. 3,000 కోట్ల వరకు అప్పుల భారం ఉంటుంది. ఇవి ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్‌కు సంబంధించిన రుణాలు కావడంతో పెద్దగా ఇబ్బంది లేదని, కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా ఇబ్బంది ఉండదనేది ప్రమోటర్ల వాదన. కానీ ఈ ప్రతిపాదనలను బ్యాంకర్లు ఆమోదం తెలపాల్సి ఉంది. యాజమాన్య హక్కును కాపాడుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలపై ప్రమోటర్లు కన్సల్టెన్సీలను కూడా నియమించుకున్నట్లు సమాచారం. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించడం ద్వారానైనా డీమెర్జర్‌ను ఆమోదింప చేసుకొని యాజమాన్య హక్కులు కాపాడుకోవాలన్నది వీరి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఎక్స్ఛేంజీలకు పంపిన వివర ణలో.. కంపెనీ బ్యాంకర్లతో అన్ని రకాల అంశాలను చర్చిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సెల్ టేకోవర్ సమయంలో పై చేయి సాధించిన ప్రమోటర్లు ఈ సారి కూడా విజయం సాధిస్తారా లేదా అన్నది రానున్న కొద్ది రోజుల్లో తేలుతుంది. ఈ వార్తల నేపథ్యంలో ఐవీఆర్సీఎల్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ని తాకి రూ. 10.70 వద్ద ముగిసింది. -
యాజమాన్య హక్కుపై బ్యాంకుల చర్చలు
ధ్రువీకరించిన ఐవీఆర్సీఎల్ అధికారిక సమాచారం లేదంటూ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐవీఆర్‌సీఎల్‌లో యాజ మాన్య హక్కులను తీసుకునే అంశమై బ్యాంకులు చర్చిస్తున్నట్లు కంపెనీ సూచనప్రాయంగా తెలి పింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) స్కీం గురించి అప్పులిచ్చిన బ్యాంకులు చర్చించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ దీనిపై అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని (బ్యాంకుల నుంచి) బుధవారం స్టాక్ ఎక్స్ఛేం జీలకు తెలియచేసింది. ఇప్పటికే బ్యాంకులు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ (సీడీఆర్) కింద అప్పులను ఈక్విటీగా మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. వాటాలు చేతికొస్తున్న నేపథ్యంలో యాజమాన్య హక్కులు కూడా ఎస్డీఆర్ స్కీం కింద తీసుకోవటానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయంటూ వస్తున్న వార్తలపై స్టాక్ ఎక్స్ఛేంజీలు కంపెనీని వివరణ అడిగాయి. ‘బ్యాంకర్ల చేతికి ఐవీఆర్సీఎల్’ అనే శీర్షికన ‘సాక్షి’ ఇటీవలే ఈ వార్తను ప్రచురించింది కూడా. ఆరు బ్యాంకులు కలసి సీడీఆర్ కింద అప్పులను ఈక్విటీగా మార్చుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఆరు బ్యాంకుల చేతిలో 32.02 శాతం వాటా ఉంది. మరో కొంత వాటాను ప్రమోటర్ల నుంచి తీసుకోవడం ద్వారా కంపెనీపై పూర్తి యాజమాన్య హక్కును సాధిం చేందుకు ప్రస్తుతం బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ధర కూడా కనిష్ఠ స్థాయి నుంచి బాగా పెరగటంతో స్టాక్ ఎక్స్ఛేంజీ వివరణ అడిగింది. ఎస్డీఆర్ నిబంధనల ప్రకారం 51 శాతం వాటాను రుణ సంస్థలు సాధించుకుంటే కంపెనీకి చెందిన పాత ప్రమోటరు యాజమాన్య హోదా నుంచి వైదొలగాల్సి ఉంటుంది. మరో రుణ సంస్థకు 1.5 కోట్ల షేర్లు జారీ ఇదే సమయంలో బుధవారం మరో రుణ సంస్థకు అప్పు తీర్చడానికి బదులు 1.5 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయడం విశేషం. డిసెంబర్ 1, 2013 నుంచి ఆగస్టు 31, 2015 వరకు ఇంటర్నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలకుగాను షేరు ధర రూ.24.39 కింద మొత్తం 1,50,46,858 షేర్లను జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ప్రస్తుత ప్రమోటర్ల వాటా 8.7 శాతం నుంచి మరింత తగ్గనుంది. అంతేకాకుండా విక్రయానికి పెట్టిన బీవోటీ ప్రాజెక్ట్ తమిళనాడులోని చెంగవల్లి టోల్‌వే ప్రాజెక్టు వాణిజ్యపరంగా బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఎన్ఎస్ఈలో ఐవీఆర్సీఎల్ షేరు ఒకానొక దశలో 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకి చివరకు 17 శాతం లాభంతో రూ. 9.50 వద్ద ముగిసింది. ఈ మధ్యకాలంలో ఎప్పడూ జరగనంతగా రెండు ఎక్స్ఛేంజీల్లో కలిపి రెండు కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. -
బ్యాంకుల చేతికి ఐవీఆర్సీఎల్?
42 శాతానికి చేరిన వాటా; మెజారిటీ దిశగా అడుగులు ► 8.75 శాతానికి తగ్గిన ప్రమోటర్ల వాటా ► కంపెనీ బోర్డులో బ్యాంకుల నుంచి ఇద్దరు పరిశీలకులు ► కన్సార్షియంగా ఏర్పడిన 6 బ్యాంకులు ►నవంబర్‌లోగా రూ. 2,000 కోట్ల ఆస్తుల విక్రయానికి సన్నాహాలు ► కంపెనీ తమ చేతిలోనే ఉంటుందంటున్న యాజమాన్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌లో మెజారిటీ వాటాను దక్కించుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయా? తీసుకున్న రుణాలను తీర్చలేక ఇప్పటికే వడ్డీని ఈక్విటీగా మార్చుకుంటున్న బ్యాంకులు ఇప్పుడు కంపెనీలో 51 శాతం వాటాను తీసుకుని, యాజమాన్య హక్కులు చేజిక్కించుకోవాలనుకుంటున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవన్నీ నిజమేననిపించక మానదు. ఎందుకంటే ఐవీఆర్‌సీఎల్‌కి అప్పులిచ్చిన ఆరు బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి కంపెనీలో యాజమాన్య హక్కు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించినా, సీడీఆర్ ప్యాకేజీ కింద వడ్డీని ఈక్విటీగా మార్చుకున్నా కంపెనీ పనితీరు మెరుగుపడలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బ్యాంకులు యాజమాన్య హక్కులను తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ఎస్బీఐ నేతృత్వంలో ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐవోబీ, కెనరా, ఆంధ్రా బ్యాంక్‌లు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. జూన్ 30 నాటికి ఈ ఆరు బ్యాంకులకూ కలిపి మొత్తంగా 26.81 శాతం వాటా ఉంది. ఈ వాటాకు గాను కంపెనీ బోర్డులో బ్యాంకుల తరఫున ఇప్పటికే ఇద్దరు పరిశీలకులు కూడా ఉన్నారు. భయం లేదు: కంపెనీ వర్గాలు ఆర్బీఐ కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) విధానం కింద రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ రుణాన్ని ఈక్విటీగా మార్చుకోవచ్చు. కనీసం 51% వాటాకు తక్కువ కాకుండా తీసుకుని, కంపెనీలో పూర్తి యాజమాన్య హక్కులను సొంతం చేసుకోవచ్చు. అయితే దీనికి అప్పులిచ్చిన సంస్థల్లో 75%గానీ లేకపోతే ఇచ్చిన అప్పు విలువలో 60% ఇచ్చినవారి నుంచి గానీ మద్దతు పొందాల్సి ఉంది. ఐవీఆర్సీఎల్ విషయంలో ఈ రెండు నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి బ్యాంకులు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీకి ఉన్న ప్రధానమైన రూ.4,900 కోట్ల అప్పులో మెజార్టీ వాటాను ఈక్విటీగా మార్చుకొని బ్యాంకు ఖాతాల నుంచి ఎన్పీఏ మరకను తొలగించుకోవాలని బ్యాంకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను కంపెనీ తోసిపుచ్చుతోంది. ఒకవేళ మెజారిటీ వాటాను బ్యాంకులు తీసుకున్నా కంపెనీని తామే నిర్వహిస్తామన్న ధీమాను కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే కంపెనీ గాడిలో పడుతోందని, వచ్చే 18 నెలల్లో కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుందని చెప్పారాయన. ‘‘కొన్నాళ్లుగా ఆస్తుల్ని విక్రయించి అప్పులు తీరుద్దామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఆ ప్రయత్నాలకు సాంకేతికంగా అడ్డంకులు ఎదురయ్యాయి. నవంబర్‌లోగా ఆస్తుల విక్రయం ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరిస్తాం. దీనివల్ల రూ. 1,500 కోట్ల రుణ భారం తగ్గడమే కాకుండా, రూ.500 కోట్ల ఈక్విటీ సమకూరుతుందని అంచనా వేస్తున్నాం’’ అని చెప్పారాయన. ప్రస్తుతం ఎస్బీఐ బేస్ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గిం చటం వల్ల వడ్డీ భారం నెలకు రూ.2 కోట్లు తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. మార్కెట్ విలువ 380 కోట్లకు! మొత్తం ఐవీఆర్సీఎల్ గ్రూపునకు సుమారుగా రూ. 7,000 కోట్ల రుణాలు ఉంటే అందులో ప్రధానమైన కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ.4,900 కోట్ల వరకు అప్పులున్నాయి. ఈ అప్పుల్లో 75 శాతం వాటా ఈ ఆరు బ్యాంకులదే. ఈ అప్పులకు కంపెనీ వడ్డీలు చెల్లించలేకపోవటంతో కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ కింద కట్టాల్సిన వడ్డీని ఈ బ్యాంకులు ఈక్విటీగా మార్చుకున్నాయి. 2013 నవంబర్ నుంచి కట్టాల్సిన రూ.600 కోట్ల మేర వడ్డీని... షేరు ధర దాదాపు రూ.24 దగ్గర ఉన్నపుడు బ్యాంకులు ఈక్విటీగా మార్చుకున్నాయి. అయితే షేరు ధర వేగంగా పతనమవుతూ ప్రస్తుతం రూ.7.45కు చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా హరించుకుపోయి 380 కోట్లకు పడిపోవటంతో బ్యాంకుల్లో ఆందోళన మొదలయినట్లు సమాచారం. మరోవంక బ్యాంకులకు వడ్డీ కోసం కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో ప్రమోటర్ల వాటా 13.7 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింది. ఈ మిగిలిన వాటాలో కూడా చాలావరకూ ప్రమోటర్లు బ్యాంకుల వద్ద తనఖా పెట్టారు. ఈ ఆరు బ్యాంకులతో కలిపి ఇతర ఆర్థిక సంస్థల చేతిలో 44.53 శాతం వాటా ఉంది. -
ఐవీఆర్సీఎల్ నికరనష్టం 155 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్సీఎల్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 155 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. అయితే గతేడాది ఇదేకాలంలో నమోదుచేసుకున్న రూ. 328 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టాల్ని కంపెనీ తగ్గించుకోగలిగింది. తాజా సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,217 కోట్ల నుంచి రూ. 1,027 కోట్లకు తగ్గింది. 2014-15 పూర్తి సంవత్సరానికి రూ. 3,117 కోట్ల ఆదాయం రూ. 672 కోట్ల నష్టం వచ్చింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన ఏడాదికి రూ. 3,819 కోట్ల ఆదాయంపై రూ. 1,556 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ప్రస్తుతం రూ. 19,244 కోట్ల విలువైన ఆర్డర్లు వున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. -
ఐవీఆర్‌సీఎల్‌కు రూ.405 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇన్ఫ్రా రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కు రూ.405.13 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. వీటిలో ఒడిశా వాటర్ సప్లై, సెవరేజ్ బోర్డ్ నుంచి రూ.295.11 కోట్ల ఆర్డరు దక్కించుకుంది. అలాగే పుణేలో గోద్రెజ్ ప్రాణ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం డ్రీమ్ వరల్డ్ ల్యాండ్‌మార్క్స్ నుంచి రూ.110.02 కోట్ల కాంట్రాక్టు పొందింది. -
నష్టాల బాటలో ఇన్ఫ్రా...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 617... 267... 172... ఇవి క్రికెట్ స్కోర్లు కావు. మూడు నెలల్లో రాష్ట్ర ఇన్ఫ్రా కంపెనీలు మూటకట్టుకున్న కోట్ల నష్టాలు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ల్యాంకో, జీవీకే, ఐవీఆర్సీఎల్ కంపెనీలు శుక్రవారంనాడు వరుసగా ప్రకటించిన నష్టాలివి. ఇంతటి భారీ నష్టాలు రావడానికి కారణం ఈ కంపెనీలు ఈ మూడు నెలల కాలంలో రుణాలపై వరుసగా రూ.744 కోట్లు, రూ.352 కోట్లు, రూ.159 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి రావటమే. దీనికి తోడు జీవీకే, ల్యాంకో ఇన్‌ఫ్రాలు గ్యాస్ కొరతతో విద్యుదుత్పత్తి చేయకపోవటం వల్ల నష్టాలు మరింత పెరిగాయి. ఐవీఆర్సీఎల్ నష్టం రూ. 172 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా ఆదాయంతో పాటు నష్టాలు తగ్గాయి. ఆదాయం రూ. 956 కోట్ల నుంచి రూ. 645 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 178 కోట్ల నుంచి రూ. 172 కోట్లకు తగ్గాయి. 9 నెలల కాలంలో కంపెనీ రూ. 2,090 కోట్ల ఆదాయంపై రూ.517 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ చేతిలో రూ.17,135 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. శుక్రవారం ఐవీఆర్సీఎల్ షేరు స్వల్ప నష్టాలతో రూ.16.65 వద్ద ముగిసింది. మరింత పెరిగిన జీవీకే నష్టాలు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 209 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ నష్టాలు రూ.45 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ.735 కోట్ల నుంచి రూ.792 కోట్లకు పెరిగింది. గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వడ్డీ భారం కారణంగా నష్టాలు భారీగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. జీవీకే వరుసగా 13 త్రైమాసికాల నుంచి నష్టాలను ప్రకటిస్తోంది. ఎయిర్పోర్ట్ విభాగంలో ఆదాయం రూ. 547 కోట్ల నుంచి రూ.602 కోట్లకు చేరింది. శుక్రవారం జీవీకే ఇన్ ఫ్రా షేరు 4% నష్టాలతో రూ. 9.90 వద్ద ముగిసింది. ల్యాంకో నష్టం రూ. 617 కోట్లు క్యూ3లో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ. 617 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి రూ. 530 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,588 కోట్ల నుంచి రూ. 2,253 కోట్లకు తగ్గింది. గ్యాస్ కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయలేకపోవడం, వడ్డీ భారం, కొత్త ప్రాజెక్టుల జారీలో ఆలస్యం వంటివి నష్టాలు పెరగడానికి కారణంగా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ల్యాంకో చేతిలో రూ. 29,464 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. శుక్రవారం ల్యాంకో ఇన్ఫ్రా షేరు 1% నష్టంతో రూ. 6 వద్ద ముగిసింది. -
వచ్చే ఏడాది లాభాల్లోకి
ఐవీఆర్సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి ⇒రెండేళ్లలో రూ.800 కోట్ల నష్టాలు పూడ్చుకుంటాం ⇒మార్చిలోగా రూ. 2,500 కోట్ల రుణభారాన్ని వదుల్చుకుంటాం ⇒బీవోటీలకు దూరం, నీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి ⇒రెండేళ్లలో రూ. 8,000 కోట్ల ఆదాయం లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్ సాధ్యమైనంత తొందరగా అప్పుల భారాన్ని వదిలించుకొని లాభాల పట్టాలు ఎక్కడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా మొత్తం బీవోటీ ప్రాజెక్టులను పూర్తిగా విక్రయించడమే కాకుండా, కొత్త బీవోటీ ప్రాజెక్టులను చేపట్టకుండా ఈపీసీ ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించనున్నట్లు ఐవీఆర్సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మూడు బీవోటీ ప్రాజెక్టులను విక్రయించడం ద్వారా సుమారు రూ. 2,500 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా సుమారు రూ.600-800 కోట్ల మూలధనం చేతికి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ చేతిలో మొత్తం ఎనిమిది బీవోటీ ప్రాజెక్టులు ఉన్నాయని, అందులో మూడు ఈ త్రైమాసికంలోగా, తర్వాతి తొమ్మిది నెలల్లో మిగిలిన ప్రాజెక్టులను విక్రియించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుధీర్ తెలిపారు. ఈ బీవోటీ ప్రాజెక్టులపైన సుమారు రూ. 3,500 కోట్ల రుణం ఉందని, వీటిని విక్రయించడం ద్వారా సుమారు రూ. 300 - 350 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గ్రూపు మొత్తంపై సుమారు రూ. 6,500 కోట్ల రుణ భారం ఉండగా, వడ్డీల కింద గతేడాది రూ. 650 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార ప్రణాళికలను వివరించడానికి సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది కంపెనీ లాభాల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి రూ. 800 కోట్ల పేరుకుపోయిన నష్టాలు ఉన్నాయని, వీటని వదిలించుకోవడానికి మరో రెండు మూడేళ్లు పడుతుందన్నారు. ఈపీసీపైనే దృష్టి బీవోటీ ప్రాజెక్టులకు దూరంగా ఉండి ఈపీసీ కాంట్రాక్టులపైనే దృష్టిసారించనున్నట్లు సుధీర్ తెలిపారు. అందులో అత్యంత అనుభవం ఉన్న నీటిపారుదల విభాగంపైనే అత్యధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ రూ. 18,000 కోట్ల ఆర్డర్లలో 50 శాతం నీటిపారుదల విభాగం నుంచే ఉండగా, ఆదాయంలో 70 శాతం, లాభాల్లో 80 శాతం నుంచే వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించడం, వాటర్‌గ్రిడ్, నూతన రాజధాని నిర్మాణం వంటి అంశాలు కలిసొస్తాయన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం సుమారుగా రూ. 5,000 కోట్లు దాటనుందని, ఇది వచ్చే ఏడాది రూ. 6,500 కోట్లకు, రెండేళ్లలో రూ. 8,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బీవోటీ ప్రాజెక్టులను విక్రయించిన తర్వాత కంపెనీ చేతిలో ఉన్న 1,700 ఎకరాల భూమిని విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ భూమి విలువ సుమారుగా రూ. 3,000 కోట్లుగా ఉంది. రూ. 300 కోట్ల క్విప్ ఇష్యూకి వాటాదారుల అనుమతి ఇప్పటికే లభించిందని, ఈ ఇష్యూ వచ్చే ఏడాది ఉండొచ్చన్నారు. -
నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం తీసుకునే సమయంలో చిన్న కారులో వచ్చి, రుణాన్ని పునర్వ్యవస్థీకరించండని కోరేందుకు ఖరీదైన కారులో వచ్చేవారిపై మమకారం చూపబోమని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సి.విఆర్.రాజేంద్రన్ తేల్చి చెప్పారు. ‘తనఖా ఆస్తులకు సంబంధించిన కాగితాలు మా వద్ద ఉంటాయి. కంపెనీ కష్టాల్లో ఉన్నట్టయితే అవేవీ పనిచేయవు. అన్ని సమయాల్లోనూ వేలం ద్వారానే రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకోవాలన్న భావన మాది కాదు. వ్యాపారంలో నిబద్ధత చూపిన పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం. విశ్వసనీయత చూపండి. తప్పకుండా ఆదుకుంటామంటూ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంగళవారమిక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్(ఎఫ్‌ఎస్‌ఎంఈ) ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవాలన్న ఫెడరేషన్ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ‘భవిష్యత్తులో కంపెనీ గాడిలో పడుతుందనేందుకు బలమైన కారణం చూపండి. బ్యాంకు పరంగా పూర్తి సహకారం ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంచి ప్రతిపాదనతో రండి.. ‘వివిధ వ్యాపార రంగాలకు చెందిన సంఘాలు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలి. అదనపు రుణం, రుణ పునర్వ్యవస్థీకరణ ఇలా సహాయమేదైనా సభ్యుల నుంచి వచ్చే ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేయాలి. మంచి ప్రతిపాదనలనే మా వద్దకు తీసుకురండి’ అని రాజేంద్రన్ పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేయడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. మాంద్యంలోనూ కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన రుణాలపరంగా చూస్తే నిరర్ధక ఆస్తులుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 3 శాతం, కార్పొరేట్లు 7 శాతం ఉంటాయని అన్నారు. గత చరిత్ర చూడండి.. నిరర్ధక ఆస్తులుగా(ఎన్పీఏ) ప్రకటించే ముందు కంపెనీల గత చరిత్ర చూడాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి కోరారు. మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ముడి సరుకుల ధరలు పెరగడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో గంటకు 6 కంపెనీలు మూతపడుతున్నాయని వివరించారు. విద్యుత్ లేనప్పుడు అదనపు రుణమెందుకంటూ బ్యాంకర్లు అంటున్నారని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్ వి.అనిల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ప్రభుత్వ విధానాల్లో లోపాలతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వీబీ శంకర్ అనే పారిశ్రామికవేత్త చెప్పారు. విఫలమైన కంపెనీల కష్టాలకుగల కారణాలను అధ్యయనం చేసి, తగు పరిష్కారం అందించాలని విన్నవించారు. రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు చెల్లించాల్సిన వడ్డీని టెర్మ్ లోన్‌గా మార్చాలని రవి చంద్రమౌళి అనే పారిశ్రామికవేత్త కోరారు. తనఖా పెట్టిన ఆస్తులను తిరిగి విలువ కట్టాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ సలహాదారు ఎమ్వీ రాజేశ్వరరావు సూచించారు. తిరిగి రుణాలిచ్చేందుకై ప్రత్యేక విభాగాన్ని తెరవాలన్నారు. సీఎంకు పెప్సి, క్యాడ్బరీ కావాలి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెప్సి, క్యాడ్బరీ, ఇసుజు వంటి కంపెనీలే కనిపిస్తున్నాయని, చిన్న కంపెనీలను ఆదుకోవాలన్న సృహ లేదని ఏపీకే రెడ్డి విమర్శించారు. రోజుకు 1,400 మంది కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బ్యాంకులు ఎన్పీఏలుగా ప్రకటిస్తూ పోతే కంపెనీలు మిగలవని అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ పిల్లలను పారిశ్రామికవేత్తలు కావాలని కోరుకోవడం లేదని అన్నారు. రుణాలను ఎగ్గొట్టే ఉద్దేశం ఏ పారిశ్రామికవేత్తకూ లేదని వెల్లడించారు. పార్లే వంటి భారతీయ కంపెనీలను ప్రోత్సహించి, అట్టి కంపెనీల్లో మన విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇప్పించాలన్నారు. -
ఐవీఆర్సీఎల్ మరో 2 ప్రాజెక్ట్‌ల అమ్మకం!
హైదరాబాద్: ఇప్పటికే పలు రోడ్ ప్రాజెక్ట్‌లను విక్రయించిన మౌలిక రంగ దిగ్గజం ఐవీఆర్సీఎల్ తాజాగా మరో రెండు ఆస్తుల విక్రయానికి సిద్ధపడుతోంది. వీటిలో ఒకటి చెన్నై డీశాలినేషన్ ప్రాజెక్ట్‌కాగా, పంజాబ్‌లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారుల ప్రాజెక్ట్ మరొకటి. ఈ విషయాలను వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సందర్భంగా కంపెనీ చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి వాటాదారులకు వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా రూ. 1,100 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆమేరకు రుణ భారాన్ని తగ్గించుకోవాలనేది కంపెనీ ప్రణాళిక. కంపెనీకి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ప్రస్తుతం రూ. 6,100 కోట్లమేర రుణాలున్నాయి. ఈ బాటలో ఇప్పటికే మూడు రోడ్ ప్రాజెక్ట్‌లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి సాలెం టోల్ వే కాగా, మిగిలినవి... కుమారపళయం టోల్ వే, చెంగపల్లి టోల్ వే. నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం(బీవోటీ) ప్రాతిపదికన ఏర్పాటు చేసిన వీటిని రూ. 2,200 కోట్లకు అమ్మివేసింది. టాటా గ్రూప్‌నకు చెందిన ట్రిల్ రోడ్స్‌కు విక్రయించింది. కాగా, తుది దశలో ఉన్న మరికొన్ని బీవోటీ ప్రాజెక్ట్‌లపై కంపెనీ దృష్టి పెట్టింది. రానున్న ఆరు నెలల్లో 155 కిలోమీటర్ల ఇండోర్-ఝబువా రోడ్ ప్రాజెక్ట్ పూర్తికానున్నట్లు సుధీర్ తెలిపారు. దీంతోపాటు మహారాష్ట్రలోని బారామతీ-ఫాల్టన్ రోడ్ ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు సైతం త్వరలో మొదలుకానున్నట్లు వివరించారు. రోజుకి 10 కోట్ల లీటర్లు తొలి దశలో కొన్ని రోడ్ ప్రాజెక్ట్‌లను విక్రయించిన ఐవీఆర్సీఎల్ రెండో దశలో భాగంగా మరో రెండు ప్రాజెక్ట్‌లను అమ్మకానికి పెట్టింది. వీటిలో చెన్నై డీశాలినేషన్ ప్లాంట్‌కు రోజుకి 10 కోట్ల లీటర్ల సముద్ర జలాలను శుద్ధి చేయగల సామర్థ్యముంది. 2010లో రూ. 600 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రానున్న 9 నెలల్లో వీటి అమ్మకం పూర్తికాగలదన్న ఆశాభావాన్ని సుధీర్ వ్యక్తం చేశారు. డీశాలినేషన్ ప్లాంట్పట్ల మూడు సంస్థలు ఆసక్తిని చూపుతున్నప్పటికీ అమ్మకం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. ఇక పంజాబ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా రూ. 450 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను తిరిగి పొందగలమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కాగా, గతేడాది(2012-13) కంపెనీ రూ. 3,579 కోట్ల టర్నోవర్‌పై రూ. 102 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇందుకు రూ. 348 కోట్లమేర వడ్డీ తదితర వ్యయాల చెల్లింపు కారణమైంది. వడ్డీ రేట్ల పరిస్థితుల్లో నిలకడ వచ్చేవరకూ కొత్తగా బీవోటీ ప్రాజెక్ట్‌లకు బిడ్డింగ్ చేయబోమని సుధీర్ తెలిపారు. కాగా, బీఎస్ఈలో ఐవీఆర్సీఎల్ షేరు ధర 1.2% నష్టపోయి రూ. 11.80 వద్ద ముగిసింది.